దేహంలో యూరియాను సంశ్లేషించే భాగం?
జీవశాస్త్రం
1. జలగ విసర్జకావయవాలు ఏవి?
1) వృక్కాలు
2) మాల్ఫీజియన్ నాళికలు
3) మొప్పలు
4) మూత్రపిండాలు
2. కింది వాటిని జతపరచండి.
ఎ. కీటకాలు 1. పక్షులు
బి. మంచినీటి చేపలు 2, మాల్ఫీజియన్
నాళికలు
సి. వానపాము 3. అమ్మోనోటెలిక్
డి. యూరికోటెలిక్ 4. వృక్కాలు
5. హరిత గ్రంథులు
1) ఎ-2, బి-3, సి-5, డి-1
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-1, బి-4, సి-3, డి-2
4) ఎ-2, బి-3, సి-4, డి-1
3. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) ప్రతిసారి డయాలసిస్ 3-6 గంటల సమయం తీసుకుంటుంది
2) మూత్రపిండాలు పనిచేయని వారికి దీర్ఘకాల పరిష్కారం మూత్రపిండ మార్పిడి
3) బాగా పనిచేస్తున్న మూత్రపిండాలను వారి దగ్గరి బంధువు నుంచి తీసి అమరుస్తారు
4) అసంక్రామ్యత వ్యవస్థ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా ఉండటానికి రోగికి సంబంధం లేని వ్యక్తుల నుంచి మూత్రపిండం తీసుకోవాలి
4. కింది వాటిలో విసర్జక అవయవం ఏది?
1) కాలేయం 2) గుండె
3) మూత్రపిండం 4) ఉదరం (పొట్ట)
5. మూత్రపిండాలు సక్రమంగా పనిచేయాలంటే?
1) నత్రజని మలినాలు అధికంగా ఉండాలి
2) రక్తంలో లవణాలు అధికంగా ఉండాలి
3) రక్తపోటు సాధారణ స్థాయిలో ఉండాలి
4) హృద్రోగాలు లేకుండా ఉండాలి
6. మానవదేహంలో ద్రవాలు, వాటిలోని అయాన్ల గాఢతలను అదుపులో ఉంచేది?
1) ప్లీహం 2) మెదడు
3) ఊపిరితిత్తులు 4) మూత్రపిండం
7. కింది రక్తనాళాల్లో దేనిలో మలిన రహిత రక్తం ఉంటుంది?
1) వృక్క ధమని 2) పుపుస ధమని
3) హార్థిక సిర 4) వృక్క సిర
8. జీవుల్లో ఏర్పడే వ్యర్థ పదార్థాలను జతపరచండి.
1. నత్రజని సంబంధ వ్యర్థాలు ఎ. బైలురూబిన్, బైలువర్డిన్, యూరోక్రోమ్
2. నత్రజని లేని వ్యర్థాలు బి. కార్బన్ డై ఆక్సైడ్, ఎక్కువగా ఉన్న నీరు
3. రసాయన వ్యర్థాలు సి. అమ్మోనియా, యూరియా,యూరికామ్లం, క్రియాటిన్
4. వర్ణక వ్యర్థాలు డి. ఆక్సాలిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం
5. ఇతర వ్యర్థాలు ఇ. సోడియం, కాల్షియం, మెగ్నీషియం,
క్లోరిన్, హార్మోన్లు, విటమిన్లు
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి, 5-ఇ 2) 1-సి, 2-డి, 3-ఇ, 4-ఎ, 5-బి
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఇ, 5-బి 4) 1-సి, 2-ఎ, 3-డి, 4-ఇ, 5-బి
9. మూత్రపిండంలోని ఏ భాగంలో గుచ్ఛగాలనం జరుగుతుంది?
1) వృక్క నాళిక 2) హెన్లీ శిక్యం
3) వృక్క ద్రోణి
4) మాల్ఫీజియన్ దేహం
10. కింది అంశాలు అధ్యయనం చేసి సరికాని వాటిని గుర్తించండి.
ఎ. మానవుడిలో మూత్రపిండాలు యూరియాను సంశ్లేషించి విసర్జిస్తాయి
బి. కీటకాలు వృక్కాల ద్వారా విసర్జిస్తాయి
సి. వానపాము, జలగలో మాల్ఫీజియన్ నాళికలు ముఖ్య విసర్జకావయవాలు
డి. బల్లపరుపు పురుగులు జ్వాలా కణాలతో విసర్జిస్తాయి
1) ఎ-బి-సి 2) బి-సి-డి
3) డి-సి-ఎ 4) ఎ-బి
11. సరైన వాక్యాన్ని గుర్తించండి.
1) మానవుడు రోజుకు దాదాపు 1.60 నుంచి 1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు
2) మూత్రంలో నీటి శాతం 96 శాతం
3) మూత్రం pH-6.0 ఉండి మొదట ఆమ్లయుతంగా తర్వాత క్షారయుతంగా మారుతుంది
4) పైవన్నీ సరైనవే
12. కింది వాటిని జతపరచండి.
1. హైలస్ ఎ. రక్తకేశ నాళికాగుచ్ఛం
2. గ్లోమరులస్ బి. భౌమన్స్ గుళికలో ఉపకళా కణజాలం
3. యూరోక్రోమ్ సి. కృత్రిమ మూత్ర పిండం
4. పోటోసైట్లు డి. మూత్రపిండ నాభి
5. డయాలసిస్ ఇ. మూత్రం రంగుకు కారణమైన పదార్థం
1) 1-డి, 2-బి, 3-ఎ, 4-ఇ, 5-సి
2) 1-డి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-సి
3) 1-డి, 2-ఇ, 3-బి, 4-ఎ, 5-సి
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి, 5-ఇ
13. పీయూష గ్రంథి నుంచి వాసోప్రెసిన్ హార్మోన్ స్రావం తగ్గితే కలిగే వ్యాధి?
1) మధుమేహం
2) డయాబెటిస్ మెల్లిటస్
3) డయాబెటిస్ ఇన్సిపిడస్
4) రక్తపోటు
14. సరైన వరుస క్రమాన్ని గుర్తించండి.
1) వరణాత్మక పునఃశోషణ- నాళికాస్రావం- గుచ్ఛగాలనం- అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం
2) గుచ్ఛగాలనం- వరణాత్మక పునఃశోషణం- నాళికా స్రావం- అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం
3) అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం- నాళికా స్రావం- వరణాత్మక పునఃశోషణం- గుచ్ఛగాలనం
4) గుచ్ఛ గాలనం- నాళికాస్రావం- వరణాత్మక పునఃశోషణం- అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం
15. రాజు మూత్రపిండాన్ని గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
1) వెన్నెముకకు ఇరువైపులా చివరి ఉరఃకశేరుకం, మూడో కటి కశేరుకం మధ్యలో తిరో ఆంత్ర వేష్టన త్వచంతో కప్పబడి శరీర కుడ్యానికి అంటుకొని ఉంటుంది
2) కుడివైపు మూత్రపిండం ఎడమవైపు దానికన్నా కొద్దిగా కిందికి ఉంటుంది
3) మూత్రపిండాలు 10 సెంటీమీటర్ల పొడవు 5-6 సెంటీమీటర్ల వెడల్పు 4 సెంటీమీటర్ల మందంతో ఉంటాయి
4) మూత్రపిండం వెలుపలి వైపు పుటాకరంగా లోపలివైపు కుంభాకారంగా ఉంటుంది
1) 1, 2 2) 3, 4
3) 4 4) 3, 4
16. కింది వాటిని జతపరచండి.
1. మూత్రం ద్వారా రక్తం ఎ. డయాబెటిస్ ఇన్సిపిడస్
2. మూత్రం ద్వారా గ్లూకోజ్ బి. అల్బుమిన్యూరియా
3. అధిక మూత్రం ఉత్పత్తి సి. హెమటూరియా
4. మూత్రం ద్వారా ప్రొటీన్లు డి. డయాబిటిస్ మెల్లిటస్
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి 2) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి 4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
17. ప్రతిపాదన (ఎ): ఇఖైనోడర్మ్లలో జలప్రసరణ వ్యవస్థ విసర్జనలో తోడ్పడుతుంది
కారణం(ఆర్): ఇఖైనోడర్మ్లలో విసర్జక వ్యవస్థ ఉండదు
1) ఎ, ఆర్లు రెండూ సరైనవే. ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ రెండూ సరైనవే కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ, సరైనది కాదు కానీ ఆర్ సరైనది
4) ఎ సరైనది కానీ ఆర్ సరైనది కాదు
18. మంచినీటి చేపలు విసర్జించే పదార్థం ఏది?
1) యూరియా 2) అమ్మోనియా
3) యూరిక్ ఆమ్లం 4) క్రియాటిన్
19. మూత్రపిండాల విధి ఏది?
1) దేహం నుంచి విష పదార్థాలను తొలగించడం
2) రక్తానికి కొత్త పదార్థాలను మిశ్రితం చేయడం
3) రక్తప్రసరణను సులభతరం చేయడం
4) శ్వాసక్రియలో తోడ్పడటం
20. డయాలసిస్‌ను ఏ అవయవ జబ్బుల చికిత్సకు వినియోగిస్తారు?
1) ఊపిరితిత్తులు 2) గుండె
3) కాలేయం 4) మూత్రపిండాలు
21. కింది వాటిని జతపరచండి.
1. అమీబా, పారామీషియం ఎ. హరిత గ్రంథులు/స్పర్శ గ్రంథులు
2. ప్లనేరియా బి. నెఫ్రీడియా
3. వానపాము సి. సంకోచ రిక్తికలు
4. రొయ్య, పీత డి. జ్వాలా కణాలు
1) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి 2) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ 4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
22. గ్లూకోజ్ లేని మూత్రం ఏ వ్యాధి లక్షణం?
1) అతిమూత్ర వ్యాధి
2) మధుమేహ వ్యాధి
3) ఆల్కాజ్రనూరియా
4) ESRD
23. డయాలసిస్‌లో ఉపయోగించే పదార్థాలు/ వస్తువులు?
1) హెపారిన్ 2) సెల్లోఫిన్
3) డయలైజర్ 4) పైవన్నీ
24. రొయ్య విసర్జకావయవాలు?
1) మాల్ఫీజియన్ నాళికలు
2) కోక్సల్ గ్రంథులు
3) హరిత గ్రంథులు
4) మూత్రపిండాలు
25. కీటకాలు ఏ సమూహానికి చెందుతాయి?
1) అమైనోటెలిక్ జీవులు
2) యూరియోటెలిక్ జీవులు
3) అనెలిడా వర్గపు జంతువులు
4) యూరికోటెలిక్ జంతువులు
26. దేహంలో యూరియాను సంశ్లేషించే భాగం?
1) మూత్రపిండం 2) గుండె
3) కాలేయం 4) క్లోమం
27. సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1. 40 సంవత్సరాలు దాటిన తర్వాత దాదాపు అందరిలోనూ 10 శాతం నెఫ్రాన్ల క్రియాశీలత తగ్గుతుంది
2. నెఫ్రాన్ వడగట్టిన మూత్రంలో 75 శాతం నీరు సమీపస్థ సంవళిత భాగంలోనే పునఃశోషణ చెందుతుంది
3. హెన్లీ శిక్యం ప్రాంతంలో ఉన్న మూత్రం నుంచి 10 శాతం నీరు ద్రవాభిసరణ దాన్ని ఆవరించి ఉన్న కణజాలంలో శోషించబడుతుంది
4. బాహ్య రక్త కేశనాళికలోకి మూత్రం నుంచి వ్యర్థ పదార్థాలు స్రవించబడుతాయి
1) 1, 2 2) 3, 4
3) 2, 3 4) 4
28. ప్రాథమిక మూత్రం అంటే ఏమిటి?
1) గుచ్ఛగాలనం ద్వారా ఏర్పడిన మూత్రం
2) నాళికాస్రావం తర్వాత ఏర్పడిన మూత్రం
3) మూత్రనాళంలో ప్రవహించే మూత్రం
4) పైవేవీ కాదు
29. మానవ దేహంలో ఆర్నిథిన్ వలయం జరిగే భాగం?
1) కాలేయం 2) ప్లీహం
3) మెదడు 4) మూత్రపిండాలు
30. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) భౌమన్స్గుళిక లోపలి కుడ్యంలోని పాదకణాలు అనే ప్రత్యేక కణాలు కేశనాళికను చుట్టి ఉంటాయి
2) పాదకణాలు గాలన చీలికలు లేదా చీలిక రంధ్రాలు అనే సూక్ష్మాంతరాలను ఏర్పరుస్తాయి
3) కేశనాళికల అంతరస్తర కణాలను అనేక సుషిరాలు లేదా రంధ్రాలుంటాయి
4) రక్తనాళికా గుచ్ఛం, భౌమన్ గుళికను కలిపి మాల్ఫీజియన్ దేహం అంటారు
1) 1, 3 2) 2, 3
3) 1, 2, 3, 4 4) 1, 4
31. కృత్రిమంగా రక్తాన్ని వడకట్టే ప్రక్రియను ఏమంటారు?
1) హీమో డయాలసిస్
2) ఎక్సిక్రియేషన్స్
3) ఆస్మాసిస్ 4) ఎపాపిరేషన్
32. వ్యర్థ పదార్థాలు ఎప్పటికప్పుడు శరీరం నుంచి బయటకు విడుదల కాకుంటే జరిగే పరిణామం?
1) శరీర ద్రవాల్లో సమతుల్యత లోపిస్తుంది
2) వ్యర్థాల వల్ల జీవికి ఎటువంటి నష్టం కలగదు
3) వ్యర్థాల వల్ల జీవికి నష్టం కలుగుతుంది
4) 1, 3
33. మానవుడు మూత్రం ద్వారా విసర్జించే విటమిన్?
1) ఎ 2) బి 3) డి 4) ఇ
34. మూత్రపిండాలే కాకుండా మానవుడిలో విసర్జనకు తోడ్పడే నిర్మాణాలు?
1) స్రావ గ్రంథులు
2) స్వేద గ్రంథులు
3) అవటు గ్రంథి 4) అధివృక్క గ్రంథులు
35. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి.
1) మానవుడు, కప్ప- యూరియా- యూరియోటెలిక్ జీవులు
2) కీటకాలు, సరీసృపాలు, పక్షులు- యూరిక్ ఆమ్లం- యూరికోటెలిక్ జీవులు
3) అమీబా, చేపలు, రొయ్యలు- అమ్మోనియా- అమ్మోనోటెలిక్ జీవులు
4) పీత, నత్త, మృదులాస్థి చేపలు- యూరిక్ ఆమ్లం- యూరికోటెలిక్ జీవులు
36. పక్షులు విసర్జించే ముఖ్య పదార్థం?
1) అమ్మోనియా 2) యూరియా
3) యూరిక్ ఆమ్లం 4) క్రియాటిన్
37. కింది వాటిని జతపరచండి.
1. అన్ని సకశేరుకాలు ఎ.కోక్సల్ గ్రంథులు
2. మొలస్కా బి. మాల్ఫీజియన్ నాళికలు
3. కీటకాలు సి. మూత్రపిండాలు
4. తేలు డి. మెటానెఫ్రీడియా
1) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
- Tags
- human body
- kidney
- liver
- nipuna
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు