హైదరాబాద్‌లో ఉన్న అంతరిక్ష పరిశోధన సంస్థ?
అంతరిక్ష రంగం
అక్టోబర్ 28 తరువాయి
27. భారత సమాచార ఉపగ్రహాల శ్రేణిలో మొదటి తరం ఇన్శాట్ శ్రేణి ఉపగ్రహాలను రూపొందించడంలో సహకరించిన దేశం?
1) రష్యా 2) అమెరికా
3) ఇజ్రాయెల్ 4) చైనా
28. భారతదేశ సమాచార ఉపగ్రహాల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న సంస్థలు?
ఎ. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్
బి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్
సి. ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్
డి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
29. భారత్‌లో రిమోట్ సెన్సింగ్ కార్యక్రమాల శకం ఏ ఉపగ్రహ ప్రయోగంతో ప్రారంభమైంది?
1) భాస్కర 1 2) భాస్కర 2
3) ఆర్యభట్ట 4) ఐఆర్ఎస్-1ఎ
30. (ఎ) – అంగారకుడి నుంచి సేకరించిన సమాచారం MOM స్పేస్‌క్రాఫ్ట్ నుంచి భూమికి చేరడానికి 24 నిమిషాల సమయం పడుతుంది(ఆర్)- అంగారకుడికి, భూమికి మధ్య గల దూరం 22 కోట్ల కిలోమీటర్లు
1) (ఎ), (ఆర్) సత్యం. (ఎ)కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) సత్యం. (ఎ)కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సత్యం, (ఆర్) అసత్యం
4) (ఎ), (ఆర్) అసత్యం
31. భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అరుణ గ్రహయాత్ర(MOM)కు సంబంధించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
ఎ. ఈ మిషన్ కోసం భారత్ జీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహకనౌకను వినియోగించింది
బి. ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను నవంబర్ 5, 2013న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు
సి. అంగారకుడి నుంచి సేకరించిన సమాచారం ఈ స్పేస్‌క్రాఫ్ట్ నుంచి భూమికి చేరడానికి 12 నిమిషాల సమయం పడుతుంది
డి. ఈ ప్రయోగంతో అంగారక గ్రహాన్ని చేరిన మొదటి ఆసియా దేశంగానూ, ప్రపంచవ్యాప్తంగా నాలుగవ దేశంగానూ భారత్ నిలిచింది
1) ఎ, బి, సి, 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
32. GSLV వాహక నౌకల్లో మూడో దశలో కీలకమైన క్రయోజెనిక్ ఇంజిన్ రూపొందించడానికి క్రయోజెనిక్ అప్పర్స్టేజ్ ప్రాజెక్ట్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1990 2) 1992
3) 1994 4) 1996
33. ఆస్ట్రోశాట్ మిషన్ శాస్త్రీయ లక్ష్యం కానిది?
1) న్యూట్రాన్ నక్షత్రాల చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రాలను అధ్యయనం చేయడం
2) ఆకాశంలో ప్రకాశవంతమైన నూతన x-కిరణాల మూలాలను కనుగొనడం
3) ఏకకాలంలో బహుళ తరంగదైర్ఘ్యాల ఆధారంగా పలు ఖగోళ వస్తువులను పరిశీలించడం
4) సూర్యుని నుంచి వెలువడే కాస్మిక్ కిరణాల అధ్యయనం
34. కింది వాహక నౌకలను వాటి ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలతో జతపరచండి.
ఎ. SLV 1. Chandrayaan-2
బి. ASLV 2. RS-D2
సి. PSLV 3. SROSS-C2
డి. GSLV 4. GSAT-12
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-2, బి-4, సి-3, డి-1
35. ఆస్ట్రోశాట్ ఉపగ్రహానికి సంబంధించిన పేలోడ్ కానిది?
1) స్కానింగ్ స్కై మానిటర్
2) కాడ్మియం జింక్ టెల్యూరైడ్ ఇమేజర్
3) లైమన్ ఆల్ఫా ఫొటో మీటర్
4) సాఫ్ట్ ఎక్స్ రే టెలిస్కోప్
36. మానవ సహిత చంద్రయాత్ర గగన్‌యాన్‌కు సంబంధించి కింది వాటిలో సరికానిది గుర్తించండి.
1) భారతదేశపు మొదటి మానవసహిత అంతరిక్ష కార్యక్రమం గగన్‌యాన్
2) గగన్‌యాన్ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందు వ్యోమమిత్ర అనే మిషన్‌ను చేపట్టడానికి ఇస్రో ప్రయత్నిస్తుంది
3) వ్యోమమిత్రలో భాగంగా ఒక ఆండ్రాయిడ్‌ను గగన్‌యాన్ యాత్రలో భాగం చేయనున్నారు
4) గగన్‌యాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కర్ణాటకలోని చల్లకేరేలో human space flight centreను ఏర్పాటు చేశారు
37. భారత సమాచార ఉపగ్రహాలను ప్రయోగించగల GSLV వాహకనౌకలోని మూడో దశలో ఉపయోగించే ఇంధనం?
1) HTPB 2) UDMH
3) LOX 4) LOH
38. పీఎస్ఎల్వీలోని వివిధ రకాలను వాటి ద్వారా ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహాలతో జతపరచండి.
ఎ. PSLV-DL 1. RISAT-2B
బి. PSLV-QL 2. Microsat-R
సి. PSLV-XL 3. EMISAT
డి. PSLV-CA 4.CARTOSAT-3
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-4, బి-3, సి-4, డి-2
39. అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాలను స్వదేశీయంగా ప్రయోగించడానికి భారతదేశం జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్టును ప్రారంభించిన సంవత్సరం?
1) 1991 2) 1990
3) 1989 4) 1988
40. అంతర్జాతీయంగా ట్రాన్స్‌పాండర్ ప్రమాణాలను రూపొందించే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ సంస్థ ఏ దేశానికి చెందినది?
1) రష్యా 2) అమెరికా
3) సౌదీ అరేబియా 4) జపాన్
41. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ వ్యవస్థలోని ఉపగ్రహం కానిది?
1) సరళ్ 2) కల్పనా1
3) ఎడ్యుశాట్ 4) స్కాట్ శాట్1
42. ఇస్రో జవనాశ్వంగా పిలిచే PSLV వాహక నౌకలోని దశలను వాటిలో ఉపయోగించే ఇంధనం ఆధారంగా జతపరచండి.
ఎ. మొదటి దశ 1. LOX
బి. రెండవ దశ 2. MMH
సి. మూడవ దశ 3. UDMH
డి. నాల్గవ దశ 4. HTPB
5. LOH
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-4, బి-3, సి-4, డి-2
43. PSLVలోని రెండో దశకు సంబంధించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
ఎ. ఈ దశలో స్వదేశీయంగా రూపొందించబడిన వికాస్ ఇంజిన్‌ను ఉపయోగిస్తారు
బి. ఇది అమెరికాకు చెందిన వైకింగ్ రాకెట్‌ను పోలి ఉంటుంది
సి. దీన్ని ఇస్రో అభివృద్ధి పరిచిన నాల్గవ, ఐదవ తరం వాహక నౌకలోనూ వినియోగిస్తున్నారు
డి. ఉపగ్రహం చుట్టూ ఉండే హీట్ షీల్డ్ వాహక నౌక నుంచి రెండో దశలోనే విడిపోతుంది
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
44. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించి కింది వాక్యాల్లో సరికానిది?
ఎ. 2023 నాటికి శుక్రగ్రహ యాత్రను చేపట్టడానికి ఇస్రో ప్రణాళికలు రచిస్తుంది
బి. మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష కార్యక్రమం గగన్‌యాన్‌ను 2022 నాటికి చేపట్టనున్నారు
సి. 2024 నాటికి రెండవ అంగారక యాత్రను చేపట్టనున్నారు
డి. 2022 నాటికి చంద్రయాన్ 3 యాత్రను చేపట్టనున్నారు
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
45. GSLV mark 3 వాహక నౌకకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి.
ఎ. ఈ వాహక నౌక 4 టన్నుల బరువున్న ఉపగ్రహాలను GTOలోకి, 10 టన్నుల బరువున్న ఉపగ్రహాలను LEOలోకి ప్రవేశపెట్టగలదు
బి. ఈ నౌక బరువు 640 టన్నులు కాగా ఎత్తు 43.43 మీటర్లు
సి. ఈ నౌకకు సరిపోలే చైనా నౌక ఫాల్కన్-9
డి. GSLV mark 3 ప్రయోగాత్మక కార్యక్రమంగా CARE మిషన్ చేపట్టింది
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
46. భారత్ ప్రయోగించిన విద్యార్థి ఉపగ్రహం కానిది?
1) స్వయం 2) సత్యభామశాట్
3) కలాంశాట్ 4) ఎడ్యుశాట్
47. Scramjet engine అంటే?
1) యుద్ధ విమానాలకు అమర్చే ఇంజిన్
2) ఆధునిక Air Breathing Propulsion System
3) విద్యార్థి ఉపగ్రహాల ప్రయోగానికి ఉపయోగించే ఇంజిన్
4) ఆదిత్య మిషన్ కోసం రూపొందించిన ఇంజిన్
48. ఇస్రో చేపట్టిన అంతరిక్ష కార్యక్రమాలను వాటిని చేపట్టిన సంవత్సరాల ఆధారంగా జతపరచండి.
ఎ. RLV-TD 1. 2022
బి. BHASKARA 2. 2016
సి. LVM-3 3. 2014
డి. NISAR 4. 1979
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
49. నానో శాటిలైట్ల అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న 8 వారాల శిక్షణ కార్యక్రమం పేరు?
1) ఉన్నతి 2) యువికా
3) ఇస్రో సైబర్ స్పేస్ కాంపిటీషన్
4) COSPAR
50. భారత అంతరిక్ష రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సంస్థలను వాటి ప్రధాన కార్యాలయాలతో జతపరచండి.
ఎ. సెమీకండక్టర్ ల్యాబొరేటరీ 1. తిరువనంతపురం
బి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2. గాదంకి
సి. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం 3. బెంగళూరు
డి. నేషనల్ అట్మాస్పియరిక్
రిసెర్చ్ ల్యాబొరేటరీ 4. మొహాలి
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-2, బి-3, సి-4, డి-1
51. విక్రమ్‌సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది?
1) తిరువనంతపురం 2) కర్ణాటక
3) బెంగళూరు 4) హైదరాబాద్
52. హైదరాబాద్‌లో ఉన్న అంతరిక్ష పరిశోధనా సంస్థ?
1) ఇస్రో శాటిలైట్ సెంటర్
2) లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టం సెంటర్
3) నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ
4) నేషనల్ అప్లికేషన్ సెంటర్
53. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నియంత్రణలో ఉన్న యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏ పనులను పర్యవేక్షిస్తుంది?
1) ఉపగ్రహాల నిర్మాణం
2) ఇస్రో వాణిజ్య కార్యకలాపాలు
3) ఉపగ్రహాల ప్రయోగం
4) క్రయోజెనిక్ ఇంజిన్ తయారీ
54. జియో స్టేషనరీ ఉపగ్రహాలను భూమికి ఎంత ఎత్తు కక్ష్యలో ఉంచుతారు?
1) 360 కి.మీ 2) 3600 కి.మీ.
3) 3,60,000 కి.మీ.4) 36,000 కి,మీ.
55. 12 సెప్టెంబర్, 2002న ఇస్రో ప్రయోగించిన భారతదేశ మొట్టమొదటి వాతావరణ
పరిశీలన ఉపగ్రహం?
1) కల్పన-1 2) ఓషన్ శాట్-1
3) ఆర్యభట్ట 4) మెంటర్ శాట్
56. GSLV రాకెట్లో మూడవ దశలో ఉంచే ఇంజిన్?
1) ఘన ఇంధన ఇంజిన్
2) పెట్రో ఇంజిన్
3) గ్యాస్‌తో నడిచే ఇంజిన్
4) క్రయోజనిక్ ఇంజిన్
57. క్రయోజెనిక్ ఇంజిన్‌లో ఇంధనంగా ఉపయోగపడేది?
1) ద్రవ ఆక్సిజన్
2) ద్రవ హైడ్రోజన్
3) ఘనరూప గ్యాస్ పెల్ల్లెట్స్
4) సహజవాయువు
58. భారతదేశ మొదటి ఉపగ్రహం అయిన ఆర్యభట్టను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తేదీ?
1) 19 ఏప్రిల్ 1975
2) 21 నవంబర్ 1976
3) 20 డిసెంబర్ 1975
4) 26 అక్టోబర్ 1978
59. 1993 సెప్టెంబర్ 23న ఇస్రో ప్రయోగించిన ఏ పోలార్ శాటిలైట్ లాంచింగ్ నౌక విఫలం అయింది?
1) PSLV-CL 2) PSLV-F1
3) PSLV-D1 4) PSLV-G1
60. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో
ఉపగ్రహాల సహాయంతో తీసిన చిత్రాలను
ఏ పేరుతో పిలుస్తున్నారు?
1) గగన్ 2) భువన్
3) ఎర్త్ గ్రాఫిక్స్ 4) ఎర్త్ పిక్చర్స్
61. చంద్రుని ఉపరితలాన్ని పరిశీలించడానికి ఇస్రో చంద్రయాన్-1 ఉపగ్రహాన్ని ఏ వాహక నౌక ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టింది?
1) PSLV-C10
2) PSLV-C9
3) PSLV-C12
4) PSLV-C11
62. చంద్రయాన్-1ప్రయోగంలో ఏ పరికరం ఆర్బిటార్ నుంచి వెలువడి చంద్రునిపైకి చేరి సమాచారం పంపడం జరిగింది?
1) మూన్ ఇంపాక్ట్ ప్రోబ్
2) లూనార్ లేజర్ రేంజింగ్ ఇన్స్ట్రుమెంట్
3) టెర్రెయిన్ మ్యాపింగ్ కెమెరా
4) హైపర్ సెక్ట్రల్ ఇమేజర్
63. PSLV-C18 ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మేగాట్రాపిక్స్ ఉపగ్రహం దేనికి ఉద్దేశించినది?
1) మేఘాలను పరిశీలించడానికి
2) ఉష్ణ మండల వాతావరణ పరిశీలనకు
3) సముద్ర వాతావరణ పరిశీలనకు
4) వర్షపాతం లెక్కించడానికి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు