2020 చివరినాటికి ప్రపంచదేశాల రుణభారం ఎంత?
1. సుప్రీంకోర్టు తదుపరి న్యాయమూర్తిగా ఎవరు నియామకం కానున్నారు?
ఎ)డీవై చంద్ర చూడ్
బి) సంజయ్ కిషన్ కౌల్
సి) అబ్దుల్ నజీర్
డి) యూ. యూ. లలిత్
2. భారత్ సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి ఏ సంవత్సరం టార్గెట్‌గా పెట్టుకున్నారు?
ఎ) 2050 బి) 2030
సి) 2040 డి) 2070
3. ఇటీవల భారత్ రక్షణరంగ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించి ప్రచండ్ అనే పేరుతో తేలికపాటి యుద్ధవిమానాన్ని ఎవరు తయారు చేశారు?
ఎ) ఇస్రో బి) డీఆర్డీవో
సి) హాల్ డి) బార్క్
4. ఇటీవల ప్రపంచలోని ఏ దేశం..భారత్‌లో పర్యటించే ముందు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ పౌరులను హెచ్చరించింది?
ఎ) జపాన్ బి) అమెరికా
సి) చైనా డి) బ్రిటన్
5. WHO లో అమెరికా ప్రతినిధిగా భారత సంతతికి చెందిన ఎవరు నియమితులయ్యారు?
ఎ) టీఎస్ తిరుమూర్తి బి) పంకజ్‌శర్మ
సి) వివేక్‌మూర్తి
డి) టీఎస్ సుబ్రమణ్యం
6. ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ అనే తీవ్రవాద కార్యకలాపాల సంస్థ నిషేధానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఎవరి నేతృత్వంలో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది?
ఎ) జస్టిస్ దినేశ్‌కుమార్
బి) జస్టిస్ రోహిణి
సి) జస్టిస్ ఫాతిమాబీ
డి) జస్టిస్ రామచంద్ర
7. 2022 సంవత్సరానికి సంబంధించి రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని గెలుపొందిన విజేతలు కరోలిన్ బెర్టోజీ, బారీ షార్ప్లెస్, మోర్టెన్ మెల్డల్ ఏ దేశానికి చెందినవారు?
ఎ) బ్రిటన్, అమెరికా, డెన్మార్క్
బి) అమెరికా, బ్రిటన్, డెన్మార్క్
సి) అమెరికా, జపాన్, ఫ్రాన్స్
డి) అమెరికా, అమెరికా, డెన్మార్క్
8. 2022 సంవత్సరానికి సంబంధించి నోబెల్ సాహిత్య పురస్కార విజేత అన్నీ ఎర్నాక్స్ ఏ దేశానికి చెందిన రచయిత్రి?
ఎ) ఫ్రాన్స్ బి) అమెరికా
సి) జపాన్ డి) బ్రిటన్
9. సతీష్‌చంద్ర శర్మ ఇటీవల ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు?
ఎ) పంజాబ్ బి) ఢిల్లీ
సి) గోవా డి) హర్యానా
10. దేశంలో 2028 సంవత్సరం నాటికి పర్యాటక రంగ ఆదాయం ఎన్ని వేల కోట్ల డాలర్లకు పెరగనుందని అంచనా వేశారు?
ఎ) 5070 కోట్ల డాలర్లు
బి) 5090 కోట్ల డాలర్లు
సి) 5080 కోట్ల డాలర్లు
డి) 5060 కోట్ల డాలర్లు
11. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎన్ని దేశాలకు రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది?
ఎ) 75 బి) 90 సి) 80 డి) 100
12. భారత్‌లో 5జీ సేవలను అందించేందుకు బీఎస్ఎన్ఎల్ ఏ సంవత్సరం టార్గెట్‌గా నిర్దేశించుకుంది?
ఎ) 2025 బి) 2023
సి) 2024 డి) 2026
13. 2021-22 ఆర్బీఐ నివేదిక ప్రకారం దేశంలో ఉచిత పథకాల అమల్లో అత్యధికంగా ద్రవ్యలోటు కలిగిన రాష్ర్టాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
ఎ) బీహార్ బి) జార్ఖండ్
సి) ఆంధ్రప్రదేశ్ డి) తెలంగాణ
14. 2021-22 సంవత్సరానికి సంబంధించి భారత మొత్తం దిగుమతుల విలువ ఎంత?
ఎ) రూ. 48.79 లక్షల కోట్లు
బి) రూ. 47.69 లక్షల కోట్లు
సి) రూ. 47.79 లక్షల కోట్లు
డి) రూ. 46.67 లక్షల కోట్లు
15. దేశంలో జాతీయ బాలల సంరక్షణ విద్యను అధికంగా ప్రోత్సహిస్తున్న రాష్ట్రం ఏది?
ఎ) కేరళ బి) తమిళనాడు
సి) పంజాబ్ డి) కర్ణాటక
16. 2022 సంవత్సరానికి సంబంధించి నోబెల్ వైద్యశాస్త్ర పురస్కార విజేత స్వాంటెపాబో ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త?
ఎ) డెన్మార్క్ బి) స్వీడన్
సి) ఆస్ట్రేలియా డి) అమెరికా
17. 2022 సెప్టెంబర్ 8న దేశవ్యాప్తంగా 14,000 పాఠశాలల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకం పేరు?
ఎ) పీఎం గతిశక్తియోజన
బి) పీఎం గరీబ్ కల్యాణ్ యోజన
సి) పీఎం శ్రీయోజన
డి) పీఎం మాతృవందన యోజన
18. 2022 సంవత్సరానికి సంబంధించి భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారం పొందిన విజేతలు అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాజర్, ఆంటోని జైలింగర్ శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు?
ఎ) ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రియా
బి) ఫ్రాన్స్, అమెరికా, జపాన్
సి) అమెరికా, బ్రిటన్, చైనా
డి) అమెరికా, ఫ్రాన్స్, రష్యా
19. 2025 సంవత్సరం నాటికి భారత్ ఎన్ని వేలకోట్ల విలువ కలిగిన రక్షణ ఉత్పత్తులను సరఫరా చేయనుంది?
ఎ) రూ. 40,000 కోట్లు
బి) రూ. 38,000 కోట్లు
సి) రూ. 50,000 కోట్లు
డి) రూ. 60,000 కోట్లు
20. ప్రస్తుతం మనదేశంలో 2000 కోట్ల డాలర్లుగా ఉన్న విమాన ప్రయాణాల మార్కెట్ విలువ ఏ సంవత్సరం నాటికి రెట్టింపు కానుంది?
ఎ) 2026 బి) 2025
సి) 2027 డి) 2029
21. 2022లో మనదేశం ఏయే దేశాలకు బ్రహ్మోస్, తేజస్ యుద్ధ విమానాలను సరఫరా చేసింది?
ఎ) ఫిలిప్పీన్స్, మలేషియా
బి) మలేషియా, థాయిలాండ్
సి) ఫిలిప్పీన్స్, నేపాల్
డి) మలేషియా, సింగపూర్
22. ప్రపంచవ్యాప్తంగా నోబెల్ అవార్డును రెండుసార్లు గెలుపొందిన విజేతలు ఎంత మంది?
ఎ) ముగ్గురు బి) నలుగురు
సి) అయిదుగురు డి) ఆరుగురు
23. అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా ఎప్పుడు నిర్వహిస్తారు?
ఎ) సెప్టెంబర్ 16 బి) సెప్టెంబర్ 8
సి) సెప్టెంబర్ 27 డి) సెప్టెంబర్ 21
24. ఇప్పటివరకు (1901-2022) ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది మహిళలు నోబెల్ సాహిత్య పురస్కారాన్ని గెలిచారు?
ఎ) 16 మంది బి) 17 మంది
సి) 19 మంది డి) 18 మంది
25. 2020 సంవత్సరంలో 3200 కోట్ల డాలర్లుగా ఉన్న భారతీయ హోటల్ పరిశ్రమ విలువ ఏ సంవత్సరం నాటికి 5200కోట్ల డాలర్లకు చేరనుందని అంచనా?
ఎ) 2027 బి) 2025
సి) 2030 డి) 2035
26. ప్రపంచ మానవ హక్కుల సంస్థల్లో ఒకటైన మెమోరియల్ సంస్థ వ్యవస్థాపకుని తండ్రి సఖరోవ్ ఏ దేశానికి చెందినవాడు?
ఎ) ఉక్రెయిన్ బి) రష్యా
సి) అమెరికా డి) చైనా
27. ప్రవాస భారతీయులు ఇక్కడి బంధుమిత్రులకు ఆన్లైన్లో సులువుగా నగదు బదిలీ కోసం ‘స్మార్ట్‌వైర్’ అనే సదుపాయాన్ని ఏ బ్యాంకు ప్రవేశపెట్టింది?
ఎ) ఎస్బీఐ బి) ఐసీఐసీఐ
సి) హెచ్డీఎఫ్సీ డి) బీవోబీ
28. ఇటీవల కేంద్రప్రభుత్వం ఏ బ్యాంక్‌ను ప్రైవేటీకరణ చేయబోతున్నట్లు ప్రకటించింది?
ఎ) ఐడీబీఐ బి) కెనరా బ్యాంక్
సి) యూకో బ్యాంక్ డి) బీవోఎమ్
29. డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం 2021 సంవత్సరానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు?
ఎ) 15 లక్షలు బి) 12 లక్షలు
సి) 10 లక్షలు డి) 18 లక్షలు
30. ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘ ఆర్థికమాంద్యం ఏ సంవత్సరానికి రానుందని ప్రముఖ ఆర్థికవేత్త నూరియల్ రూబీ హెచ్చరించారు?
ఎ) 2023 బి) 2025
సి) 2027 డి) 2030
31. ప్రపంచబ్యాంక్, యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచ నిరక్షరాస్యుల్లో ఎంత శాతం మంది భారత్‌లో ఉన్నారు?
ఎ) 40 శాతం బి) 34 శాతం
సి) 50 శాతం డి) 36 శాతం
32. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవారికి మరణశిక్షను విధిస్తున్నాయి?
ఎ) 30 బి) 40 సి) 35 డి) 25
33. ప్రముఖ లాన్సెట్ పత్రిక నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం మనదేశంలో సగటున ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రకటించింది?
ఎ) 1,50,000 బి) 2,00,000
సి) 2,50,000 డి) 3,00,000
34. యునెస్కో నివేదిక ప్రకారం భారత్‌లో ఎంత శాతం మంది చిన్నారులు స్కూల్స్‌కి వెళ్లనివారు?
ఎ) 30 శాతం బి) 35 శాతం
సి) 40 శాతం డి) 25 శాతం
35. 2020 చివరినాటికి ప్రపంచదేశాల రుణ భారం ఎంత?
ఎ) 226 లక్షల కోట్ల డాలర్లు
బి) 216 లక్షల కోట్ల డాలర్లు
సి) 316 లక్షల కోట్ల డాలర్లు
డి) 230 లక్షల కోట్ల డాలర్లు
36. ప్రపం2023గా విజ్ఞానశాస్త్ర నోబెల్ సాధనలో ఏ దేశం ముందు వరుసలో నిలిచింది?
ఎ) అమెరికా బి) ఫ్రాన్స్
సి) జపాన్ డి) బ్రిటన్
- దేశంలో తొలి సంపూర్ణ సౌరవిద్యుత్ వినియోగ గ్రామంగా గుజరాత్‌లోని ఏ గ్రామం ఎంపిక అయ్యింది? – మొఢేరా గ్రామం
- ప్రపంచ వ్యాప్తంగా సౌరవిద్యుత్ వ్యవస్థ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంస్థ పేరు-ISA (ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్) ఈ సంస్థను భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా 2015లో ప్రారంభించాయి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం- గుర్గావ్(హర్యానా). ప్రస్తుత ఐఎస్ఎ డైరెక్టర్ జనరల్- అజయ్ మాధూర్.
- ISA సభ్యదేశాల సంఖ్య-109. (109వ దేశం ఉక్రెయిన్)
- ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ రైళ్ల సదుపాయాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం- జర్మనీ
- ప్రపంచ వ్యాప్తంగా శూన్య కర్బన ఉద్గారాల ప్రక్రియకు సంబంధించి ప్రపంచ దేశాలు 2050కి టార్గెట్‌గా నిర్ణయించగా భారత్ మాత్రం 2070కి టార్గెట్‌గా పెట్టుకుంది.
- 2021సంవత్సరానికి సంబంధించి యూఎన్వో ప్రపంచంలో అత్యంత ఎక్కువ వాయు కాలుష్య నగరంగా రాజస్థాన్‌లోని బెవాడీని ప్రకటించింది.
- ఎన్ని వందల కోట్ల రూపాయలతో మహాకాళేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు? -రూ. 856 కోట్లు
- ఈ ఆలయం దేశంలోని 12 జ్యోతిర్లంగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కి 200కిలోమీటర్లు దూరంలో ఉంది.
- భారత్‌లో టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? భువనేశ్వర్
- ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని అక్టోబర్ 10న నిర్వహిస్తారు.
- ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా WHO ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 45కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. మనదేశం మొత్తం జనాభాలో 7.5శాతం జనాభా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత WHO డైరెక్టర్ జనరల్-టెడ్రోస్ అధనామ్. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి- మన్సుక్ మాండవియా
- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ఏప్రిల్ 7ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానం
- తెలంగాణ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఆరోగ్య రంగం పనితీరుపై నీతిఆయోగ్ (నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా) విడుదల చేసిన ఆరోగ్య సూచీలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో కేరళ మొదటి స్థానం దక్కించుకుంది. 2019-20 ఏడాదిలో వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించి రాష్ర్టాల ర్యాంకులను నీతి ఆయోగ్ వెల్లడించింది. ఆరోగ్య సూచీలో అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరుతో తెలంగాణ మూడో స్థానం, ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ సూచీలో ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో నిలిచింది.
- ప్రమాద బీమా మరో ఏడాది పొడిగింపు
- రాష్ట్రంలోని రవాణా, రవాణేతర, ఆటోడ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు రూ.5లక్షల ప్రమాద బీమా సామాజిక భద్రత పథకాన్ని మరో ఏడాది ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు కార్మికశాఖ ఉత్తర్వు లు జారీచేసింది. రాష్ట్రంలో ఆటోడ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5లక్షలు ప్రమాద బీమా పథకాన్ని 2015లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ పథకం గడువు పొడిగిస్తూ వస్తుంది. 2022 మార్చి 31తో ముగిసిన పథకాన్ని మరో ఏడాది పాటు అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
రెగ్యులర్ కోర్టులుగా 38 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
- రాష్ట్రంలో 38 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను శాశ్వత రెగ్యులర్ కోర్టులుగా మార్పు చేస్తూ న్యాయశాఖ నిర్ణయం తీసుకుంది. వీటిలో 22 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అదనపు జిల్లా, సెషన్ జడ్జి కోర్టులుగా, 16 సీనియర్ సివిల్ జడ్జి కోర్టులుగా మారుస్తూ న్యాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
సమాధానాలు
1-ఎ, 2-బి, 3-సి, 4-బి, 5-సి, 6-ఎ, 7-డి, 8-ఎ, 9-బి, 10-బి, 11-ఎ, 12-బి, 13-బి, 14-సి, 15-డి, 16-బి, 17-3, 18-సి, 19-బి, 20-సి, 21-ఎ, 22-బి, 23-డి, 24-బి, 25-ఎ, 26-బి, 27-బి, 28-ఎ, 29-సి, 30-ఎ, 31-బి, 32-సి, 33-సి, 34-ఎ, 35-ఎ, 36-ఎ,
సత్యనారాయణసీనియర్ ఫాకల్టీటాపర్స్ ఇన్స్టిట్యూట్ మేడిపల్లి, హైదరాబాద్
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?