క్రీడారాణులు
కెనడా టీనేజర్ సమర్ మెకంతాష్ (15) ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచింది. మహిళల 200 మీటర్ల బటర్‌ఫ్లైలో పసిడి సాధించిన మెకంతాష్ 2011 తర్వాత ఈ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నెగ్గిన 15 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు స్విమ్మర్‌గా రికార్డు సృష్టించింది. ఈ పోటీల్లో ఆమెకిదే
తొలి స్వర్ణం.
- 2022 నవంబర్ 21న ఖతార్ వేదికగా ఆరంభంకానున్న ఫిఫా ప్రపంచకప్‌కు ముగ్గురు మహిళా రిఫరీలు ఎంపికయ్యారు. యోషిమి మయాషితా (జపాన్), స్టెఫానీ ఫ్రాపార్ట్ (ఫ్రాన్స్), సలీమా మకాన్సంగా (రువాండా) ఈ మెగా టోర్నీలో రిఫరీలుగా బాధ్యతలు చేపట్టే సువర్ణావకాశాన్ని సంపాదించారు. ఫిఫాలో మొత్తం 36 మంది మహిళా రిఫరీలు ఉండగా, వీరికే ఈ ఛాన్స్ దక్కింది. ప్రపంచకప్ మహిళా రిఫరీలను ఎంపిక చేయడం చరిత్రలో ఇదే తొలిసారి.
తెలుగు తేజం
- వెన్నం జ్యోతి సురేఖ ఆర్చరీ ప్రపంచకప్ మిక్స్డ్ టీమ్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్ మూడో అంచె పోటీల్లో అద్భుత ప్రదర్శనతో రెండు పతకాలు సాధించింది. అభిషేక్ వర్మతో కలిసి కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో పసిడి నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్ పోటీల్లో ఈ విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారత జోడీగా సురేఖ-అభిషేక్ రికార్డుల్లోకెక్కారు. వ్యక్తిగత విభాగంలో రజతం నెగ్గింది. ప్రపంచకప్ వ్యక్తిగత విభాగంలో ఆమెకు ఇదే తొలి పతకం.
- భారత్ స్టార్ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్స్ వాల్ట్ విభాగంలో కాంస్యం గెలిచిన ప్రణతి, ఈ పోటీల చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన ఏకైక భారత జిమ్నాస్ట్‌గా నిలిచింది. ఆమె 2019 ఆసియా చాంపియన్‌షిప్స్‌లోనూ కంచు పతకం నెగ్గింది. ఆమె కాకుండా గతంలో ఆశిష్ కుమార్ (2006), దీపా కర్మాకర్ (2015) మాత్రమే భారత్ నుంచి ఈ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యాలు సొంతం చేసుకున్నారు.
- భారత మహిళల క్రికెట్ వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. 23 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతూ అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు 2022 జూన్ 8న ప్రకటించింది.
మిథాలీ సారథ్యంలోని భారత జట్టు వరుసగా నాలుగు ఆసియా కప్ టైటిళ్లు సాధించింది. 2005-06, 2006-07, 2008, 2012లో టీమ్ ఇండియా విజేతగా నిలిచింది. - 2014లో ఇంగ్లండ్‌లో భారత్‌కు తొలిటెస్ట్ సిరీస్ విజయాన్ని అందించింది.
- మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ మిథాలీ రాజ్. ఆమె 232 వన్డేల్లో 7805 పరుగులు సాధించింది. 89 టీ 20 మ్యాచ్‌లు కూడా ఆడింది. కేవలం 12 టెస్టులే ఆడినా, ఓ డబుల్ సెంచరీ చేసింది. ఈ ఘనత సాధించిన ఏకైక భారత మహిళా క్రికెటర్ మిథాలీనే.
- ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు మిథాలీ పేరిట ఉంది. 2014-16, 17 ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో ఆమె 17 మ్యాచ్‌ల్లో 535 పరుగులు చేసింది.
- మహిళల క్రికెట్ అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆమె సొంతం. టెస్టుల్లో, వన్డేల్లో, టీ 20ల్లో కలిపి 10868 పరుగులు సాధించింది.అవార్డులు- 2003 అర్జున, 2015 పద్మశ్రీ, 2017 విజెన్డ్ మహిళా క్రికెటర్, 2021 ఖేల్త్న్ర
కజికిస్థాన్ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా తన ‘గ్రాండ్’ కలను సాకారం చేసుకుంది. 2022 జూలై 9న ఫైనల్లో 17వ సీడ్ రిబాకినా 3-6, 6-2, 6-2, తేడాతో మూడో సీడ్ జెబెర్ (ట్యూనీసియా) పై విజయం సాధించింది.
1. గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి కజికిస్థాన్ ప్లేయర్‌గా రిబాకినా చరిత్ర సృష్టించింది. 2011 (21 ఏళ్ల వయసులో క్విటోవా) తరువాత వింబుల్డన్ గెలిచిన అతి పిన్న వయసు క్రీడాకారిణిగా ఆమె నిలిచింది.
2. 1975లో ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టిన తరువాత వింబుల్డన్ గెలిచిన రెండో ఎక్కువ ర్యాంకు (23) క్రీడాకారిణి రిబాకినా. 2007లో అప్పటి 31వ ర్యాంకర్ వీనస్ టైటిల్ నెగ్గింది.
- ప్రపంచ నంబర్‌వన్, పోలెండ్ అమ్మాయి ఇగా స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుపొందింది. 2022 జూన్ 4న జరిగిన ఫైనల్లో 6-1, 6-3తో అమెరికా అమ్మాయి కోకో గాఫ్‌పై విజయం సాధించింది.
- ఆస్ట్రేలియా టెన్నిస్ తార యాష్లే బార్టీ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. 2022 జనవరి 29న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో బార్టీ 6-3, 7-6, (7/2)తో 27వ సీడ్ డానియెల్ కొలిన్స్ (అమెరికా)పై విజయం సాధించింది. దీంతో 44 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన ఆసీస్ క్రీడాకారిణిగా యాష్లే బార్టీ గుర్తింపు పొందింది. 1978లో చివరిసారి ఆస్ట్రేలియా తరఫున ఈ టైటిల్ గెలిచిన ప్లేయర్‌గా క్రిస్టినా ఒనీల్ నిలిచింది.
- ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్లూఎఫ్) అథ్లెట్ల కమిషన్ సభ్యురాలిగా భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు నియమితురాలైంది. సింధూతో పాటు ఐరిస్ వాంగ్ (యూఎస్ఏ), రాబిన్ (నెదర్లాండ్స్), గ్రేసియా (ఇండోనేషియా), కిమ్ (కొరియా), జెంగ్ సీ వీ (చైనా) సభ్యులుగా నియమితులయ్యారు. వీరంతా 2025 వరకు ఈ కమిషన్‌లో ఉంటారు.
స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ విజేత
- భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. ప్రపంచ 11వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయిలాండ్)తో జరిగిన ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21-16, 21-8తో గెలిచింది.
- తెలంగాణ యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో కొత్త రికార్డు నమోదు చేసింది. 2022 జూన్ 8న జరిగిన 800 మీటర్ల ఫ్రీైస్టెల్ స్విమ్మింగ్‌లో వ్రితి అగర్వాల్ లక్ష్యాన్ని 9:24.32 సెకన్లలో అందుకొని ఖేలో ఇండియా క్రీడలల్లో కొత్త రికార్డు నమోదు చేసి పసిడి అందుకుంది. గత రికార్డు (9:26.19 సె.) ఖుషి (కర్ణాటక) పేరు మీద ఉంది.
- హర్మన్ ప్రీత్ కౌర్ జట్టు మహిళల టీ 20 ఛాలెంజ్‌ను గెలుచుకుంది. 2022 మే 28న జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు నాలుగు పరుగుల తేడాతో దీప్తి శర్మ టీమ్‌పై నెగ్గి టైటిల్‌ను చేజిక్కించుకుంది. నాలుగు సార్లు మహిళల టీ20 చాలెంజ్ టోర్నీ జరుగగా హర్మన్ టీమ్ గెలవడం ఇది మూడోసారి.
- తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ చాంపియన్ షిప్లో ‘స్వర్ణ’ చరిత్ర లిఖించింది. 52 కేజీల ఫ్లయివెయిట్ కేటగిరీలో జగజ్జేతగా నిలిచింది. ఇస్తాంబుల్‌లో 2022 మే 19న హోరాహోరీగా సాగిన 52 కేజీల విభాగం ఫైనల్లో నిఖత్ 5-0తో జిట్పాంగ్ జటామస్ (థాయ్‌లాండ్)ను ఓడించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో తెలుగు రాష్ర్టాల నుంచి ఈ పతకం గెలిచిన తొలి బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. మొత్తం మీద ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో పసిడి గెలిచిన అయిదో భారత బాక్సర్‌గా నిఖత్ నిలిచింది.
- చైనా రాజధాని నగరం బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్ 2022 ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు జరిగాయి. 2008 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన నేషనల్ స్టేడియంలోనే ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీంతో ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ రెండింటినీ నిర్వహించిన తొలి నగరంగా బీజింగ్ ఘనత సాధించింది. ఈ క్రీడల్లో 90 దేశాల నుంచి దాదాపు మూడు వేల మంది అథ్లెట్లు పాల్గొన్నారు. 7 క్రీడల్లో 90 దేశాల నుంచి దాదాపు మూడు వేల మంది అథ్లెట్లు పాల్గొన్నారు. 7 క్రీడల్లో మొత్తం 109 విభాగాల్లో పోటీలు జరిగాయి. వింటర్ ఒలింపిక్స్‌లో తొలి పసిడి పతకాన్ని నార్వే సొంతం చేసుకుంది. మహిళల స్కైథాన్ క్రాస్‌కంట్రీ రేసులో థ్రెస్ జోహాగ్ స్వర్ణం కైవసం చేసుకుంది.
- అంతర్జాతీయ పారాలింపిక్స్ కమిటీ అవార్డుల్లో 2021 ఉత్తమ అరంగేట్ర క్రీడాకారిణిగా షూటర్ అవని లేఖరా అవార్డు సాధించింది.
- భారత దిగ్గజ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్‌ను ప్రతిష్ఠా త్మక పురస్కారం వరించింది. ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) వార్షిక అవార్డుల్లో భాగంగా ఆమెకు ఉత్తమ మహిళ పురస్కారం-2021 లభించింది. దీంతో డబ్ల్యూఏ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలిగా అంజు బాబీ జార్జ్ నిలిచింది. మరోవైపు టోక్యో ఒలింపిక్ చాంపియన్లు ఎలైన్ థాంప్సన్ హెరా (జమైకా), వోర్హోమ్ ఈ ఏడాది ప్రపంచ ఉత్తమ అథ్లెట్లుగా అవార్డులు అందుకున్నారు.
మహిళల డే/నైట్ టెస్టులో శతకం చేసిన తొలి భారత బ్యాటర్‌గా మంధాన రికార్డ్
- భారత ఓపెనర్ స్మృతి మంధాన(127) ‘పింక్ బాల్’ టెస్టులో చరిత్ర సృష్టించింది. భారత్ ఆడిన తొలి డే/నైట్ టెస్టులో శతకం చేసిన తొలి భారత మహిళా బ్యాటర్‌గా రికార్డు నమోదు చేసింది. అంతే కాకుండా టెస్టులో తన మొదటి సెంచరీని ఖాతాలో వేసుకున్న ఆమె ఆస్ట్రేలియా గడ్డపై ఆ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గానూ నిలిచింది.
- ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన విదేశీ మహిళా క్రికెటర్‌గా స్మృతి గుర్తింపు పొందింది. గతంలో ఈ రికార్డు మోలీ హైడ్ (124 నాటౌట్-ఇంగ్లండ్; 1949లో) పేరిట ఉండేది.
విజేత కాంపిటీషన్స్ బతుకమ్మకుంట, హైదరాబాద్
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?