కేసీఆర్ ప్రధాని అయితే దేశం బాగు పడుతుంది..
డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెలంగాణ సాధన కోసం కేసీఆర్ నడుంబిగించారు. రాష్ట్ర అవిర్భావానికి ముందు చర్చలు మొదలుకొని.. ఆవిర్భావం తర్వాత అన్ని కమిటీల్లో కేసీఆర్ ఆశీస్సులతో స్థానం సంపాదించి వారి మార్గదర్శకంలో పనిచేసే అవకాశం నాకు దక్కింది. ఉద్యమ నాయకుడిగా కదిలిన కేసీఆర్ వెంట నడుస్తూ నాటి నుంచి నేటి వరకు ఒక సైనికుడిలా ముందుకు సాగాను. టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా తూర్పు అధ్యక్షుడిగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్చార్జిగా, హైదరాబాద్ నగర కో ఆర్డినేటర్‌గా, టీఆర్ఎస్లో అత్యంత కీలక నిర్ణయాత్మక పరిగణించే పార్టీ కార్యనిర్వాహక సభ్యుడిగా, పొలిట్‌బ్యూరో ప్రత్యేక ఆహ్వానితుడిగా రాష్ట్ర కార్యవర్గంలో చాలా బాధ్యతలు నిర్వహించే అవకాశం కలిగింది.
సీఎం కేసీఆర్ ఆలోచనా విధానం, లోతైన విషయ పరిజ్ఞానం, పట్టుదల, అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్న కార్యదక్షతను స్వయంగా చూశాను. కొట్లాడి తెచ్చిన తెలంగాణను ఎట్టా నిలబెట్టారో. . దేశాన్ని కూడా అట్లా నిలబెట్టాలే అన్ని ప్రజలే అంటున్నారంటే ఈ దేశానికి కేసీఆర్ ప్రధాని కావాలని స్పష్టమవుతున్నది. కేసీఆర్ ప్రధాని అయితే దేశం బాగు పడుతుంది. తెలంగాణ వలె దేశం అన్ని రంగాల్లో ముందుంటుంది. సీఎం కేసీఆర్ ఒక విజన్ ఉన్న నేత. తాను ఏ పని మొదలు పెట్టినా ముందుగా ఆ పనిపై పూర్తిస్థాయిలో విషయ పరిజ్ఞానంతో ముందుకెళ్తారు. సాధ్యాసాధ్యాలను పూర్తిగా అధ్యాయనం చేశాకే కార్యరంగంలోకి దూకుతారు. ఏదైనా అనుకుంటే సాధించే వరకు విశ్రమించరు. అపర చాణక్యుడిలా ముందుండి వ్యూహాలు పన్ని విజయం సాధిస్తారు.
– మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సర్దార్ పుట్టం పురుషోత్తంరావు
- Tags
- CM KCR
- Prime Minister
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు