బీఆర్ఎస్ ఆవిర్భావం.. చరిత్రాత్మకం దేశ ప్రయోజనాల కోసమే…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలందరికీ సుపరిపాలనను అందించేందుకు టీఆర్ఎస్కు బీఆర్ఎస్గా పదోన్నతి లభించింది. పూర్తిగా దేశ ప్రయోజనాల కోసం ప్రజాభీష్టం మేరకు బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగింది. దేశంలోని ఎన్నో రాష్ర్టాలలో సీఎం కేసీఆర్ పర్యటించి ప్రజల అభిప్రాయలను తెలుసుకున్న అనంతరం…ఆయా రాష్ర్టాల నేతలందరి హృదయపూర్వక ఆహ్వానంతో జాతీయ రాజకీయాల్లోకి ఉద్యమ నేత అడుగు పెట్టారు. సీఎం కేసీఆర్ అనతి కాలంలోనే దేశ్ కీ నేతగా గుర్తింపు పొందటం తథ్యం.
– అరెకపూడి గాంధీ, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే
దేశ రాజకీయాల్లో పెను మార్పులు
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసర వస్తువుల ధరలతో పాటు పెట్రోలు, డీజీల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. మత విద్వేషాలు పెరిగి అశాంతి నెలకొంది. దేశంలో సుస్థిర పాలన అందించాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం.
– దానం నాగేందర్, ఎమ్మెల్యే ఖైరతాబాద్
దేశ వనరులపై అవగాహన ఉంది
సీఎం కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశిస్తూ బీఆర్ఎస్ను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి దేశంలోని అన్ని రాష్ర్టాలకు దిక్సూచీగా మారింది. సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా ప్రజలకు సేవలు చేయాలంటే జాతీయ పార్టీ ఏర్పాటుతోనే సాధ్యం. దేశంపై, వనరులపై పూర్తి అవగాహన, విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడాన్ని తెలంగాణ పౌరుడిగా గర్విస్తున్నా. జాతీయ పార్టీలో సామాన్య పౌరుడిగా నా వంతు పాత్రను నెరవేరుస్తాం.
– దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్
దేశం సస్యశ్యామలమవుతుంది
విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన ముందుచూపుతో ఎన్నో అభివృద్ధి పథకాలు రూపొందించి అమలు పరుస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి పథకాలే దేశంలో అమలు చేయాలంటే సీఎం కేసీఆర్ ప్రకటించిన కొత్త పార్టీతోనే సాధ్యమవుతుంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ప్రకటించిన ఈ పార్టీతో దేశాభివృద్ధి ముఖచిత్రమే మారిపోవడానికి ఎంతో ఆస్కారం ఉంది. దేశంలోని అన్ని రాష్ర్టాలు సస్యశ్యామలంగా మారుతాయి.
– ప్రొఫెసర్ రవీందర్, వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ
క్రియాశీలకంగా బీఆర్ఎస్
పట్టువదలని విక్రమార్కుడిలా ఉద్యమించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. ఉద్యమ స్ఫూర్తితోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అత్యంత వేగంగా అమలు చేసి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీని చుట్టుపక్క రాష్ర్టాల ప్రజలు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి.. భవిష్యత్తులో బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తుంది.
– దానకర్ణాచారి, (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం)
లౌకికతను కాపాడుకోవాలంటే కేసీఆర్ రావాలి
రాజ్యాంగ విలువలు, లౌకికత్వాన్ని కాపాడుకోవాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. గంగా.. జమునా తెహజీబ్ సంస్కృతిని అపహస్యం చేసే అరాచక శక్తుల నుంచి పరిరక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత గుర్తెరిగే.. సీఎం కేసీఆర్ ముందడుగు వేశారు. ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ర్టాన్ని వేగంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు అదే స్ఫూర్తితోనే దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఆహ్వానించదగిన పరిణామం. ఈ వయస్సులోనూ సాహసమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌కు విజయం తప్పక సిద్ధిస్తుంది. కేసీఆర్ సంకల్పబలంతో ముందుకెళ్తున్నారు. ఏ శక్తీ ఆయనను అడ్డుకోలేదు. నూతన పార్టీకి దసరా విజయోత్సవ శుభాకాంక్షలు.
-ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్, వీసీ, శాతవాహన వర్సిటీ
రైతులు.. తెలంగాణవైపు చూస్తున్నారు
రైతులు, దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. ఇదే తరహా పాలన అందించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. దేశ రాజకీయ చరిత్రనే మార్చగల సత్తా కేసీఆర్‌కే ఉందని ప్రజలు భావిస్తున్నరు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశం నూతన పంథాలో ముందుకు వెళ్తుందనే నమ్మకం అన్ని వర్గాల్లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ దేశంలో కొత్త చరిత్రను సృష్టించబోతుంది.
– ముఠా గోపాల్, ముషీరాబాద్ ఎమ్మెల్యే
దేశాన్ని అభివృద్ధిపథంలో…
తెలంగాణ రాష్ట్ర సమితిను భారత రాష్ట్ర సమితిగా సీఎం కేసీఆర్ ప్రకటించడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. దేశంలో సకల వనరులు ఉన్నప్పటికీ వాటిని సరైన రీతిలో ఉపయోగించుకునే నాయకుడే లేడు. ఇది కేసీఆర్‌తో సాధ్యమవుతుంది. దేశంలో ఉన్న నీటి వనరులు, సహజ సంపదను ఉపయోగించుకొని దేశాన్ని అభివృద్థిపథంలో నడిపే శక్తి కేసీఆర్‌కు ఉంది. బీఆర్ఎస్ను బలంగా స్వాగతిస్తున్నాను.
– కాలేరు వెంకటేశ్, అంబర్‌పేట ఎమ్మెల్యే
రాజకీయాల్లో బీఆర్ఎస్ ఓ సంచలనం
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ అడుగు పెడుతుండటంతో దేశం దశ మారుతుంది. టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మారి జాతీయ రాజకీయాల్లో ఓ సంచలనం సృష్టించబోతుంది. దేశంలో నదుల అనుసంధానం, నిరంతర విద్యుత్, సాగు, తాగునీటి వ్యవస్థ, ఉచిత విద్య, వైద్యం అందించే దిశగా కృషి చేస్తాడనడంలో సందేహం లేదు. కేసీఆర్ ప్రధాని అయితే దేశవ్యాప్తంగా రైతులకు రైతుబంధు, రైతు బీమా అందుతాయని, పెట్టుబడికి ఇబ్బందులు ఉండవు. రైతులు అభివృద్ధి చెందినట్లయితే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది.
– జి. సాయన్న, ఎమ్మెల్యే, సికింద్రాబాద్ , కంటోన్మెంట్
దేశమంతా తెలంగాణ మోడల్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒంటెద్దు పోకడలతో దేశ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. బీజేపీ అరాచకాలను అడ్డుకోవడంలో మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. అందుకే దేశం కోసం కేసీఆర్ నడుం కట్టారు. ఆర్థికంగా, సామాజికంగా, అంతర్జాతీయంగా భారతదేశం పేరు గొప్పగా మారుమోగాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యం. తెలంగాణ మోడల్‌ను భారతదేశమంతా అమలు చేయాలి. భరతమాత ఆశీర్వాదంతో విజయవంతంగా గమ్యాన్ని ముద్దాడుతారు.
– వై.సతీష్ రెడ్డి , చైర్మన్,టీఎస్-రెడో
ఎర్రకోటపై జెండా ఎగరేయాలి
రాష్ట్రంలో అమలైన పథకాలు దేశంలో ఎక్కడా పేదలకు అందడం లేదు. తెలంగాణ తరహాలో దేశాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని స్థాపించారు. ఎర్రకోటపై తెలంగాణ బిడ్డ కేసీఆర్ జాతీయ జెండాను ఎగరేస్తారు. దసరా రోజున పెట్టిన బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ దేశ రాజకీయాలను శాసించడం ఖాయం.
– మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే
ఆ ఆలోచనలు దేశానికి అవసరం
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికి రోల్ మోడల్‌గా నిలిపారు. ఈ తెలంగాణ మోడల్, కేసీఆర్ ఆలోచనలు దేశానికి అవసరం. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో హామీలు తప్ప ఆచరణ లేదు. అన్ని రంగాలలో దేశాన్ని దివాళా తీయించారు. ప్రపంచ దేశాల ముందు దేశ ప్రతిష్ట మంటగలిపారు. దేశ ప్రజల ఆశీస్సులతో బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంతో కొత్త చరిత్ర సృష్టిస్తుంది.
– కుర్మయ్యగారి నవీన్‌కుమార్, ఎమ్మెల్సీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?