‘దయ్యాల నగరం’ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
జాగ్రఫీ
1. అండమాన్‌లో సెల్యూలర్ కారాగారం ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1896 2) 1885
3) 1889 4) 1905
2. భారతదేశ స్థలాకృతి చిత్రాలను ఎవరు తయారు చేస్తారు?
1) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
2) ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా
3) సర్వే ఆఫ్ ఇండియా
4) జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా
3. భారతదేశంలో సూర్యోదయాన్ని ప్రప్రథమంగా ఎక్కడ చూస్తాం?
1) తమిళనాడులోని కన్యాకుమారిలో
2) ఒడిశా గోపాలపురం
3) అరుణాచల్ ప్రదేశ్‌లోని డాంగ్‌లో
4) ఆంధ్రప్రదేశ్‌లోని పులికాట్ సరస్సు
4. సతత హరిత, శృంగాకారపు అడవులకు ప్రసిద్ధి చెందిన హిమాలయాలు?
1) హిమాచల్ హిమాలయాలు
2) హిమాద్రి హిమాలయాలు
3) శివాలిక్ హిమాలయాలు
4) పుర్వాంచల్ హిమాలయాలు
5. జతపరచండి.
1. కశ్మీర్ హిమాలయాలు ఎ. పొడవైన హిమాని నదులకు ప్రసిద్ధి
2. పంజాబ్ హిమాలయాలు బి. ప్రకృతి సౌందర్యానికి, పండ్లతోటలకు ప్రసిద్ధి
3. కుమయున్ హిమాలయాలు సి. మతపరమైన కేంద్రాలకు, సరస్సులకు ప్రసిద్ధి
4. నేపాల్ హిమాలయాలు డి. ఎత్తయిన శిఖరాలకు ప్రసిద్ధి
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి 4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
6. హిమాలయాలు ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడ్డాయి?
1) అవక్షేప శిలలు 2) అగ్ని శిలలు
3) రూపాంతర శిలలు
4) ఏవీకాదు
7. అత్యధిక లాగూన్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
1) కొంకన్ తీరం
2) మలబార్ తీరం
3) కోరమండల్ తీరం
4) వంగ తీరం
8. ఆరావళి పర్వతాల చుట్టూ విస్తరించి ఉన్నపీఠభూమి?
1) కతియావార్ పీఠభూమి
2) బోరట్ పీఠభూమి
3) బుందేల్‌ఖండ్ పీఠభూమి
4) భగల్ఖండ్ పీఠభూమి
9. జతపరచండి.
1. జీలం నది ఎ. వెరినాగ్ (జమ్ముకశ్మీర్)
2. చీనాబ్ నది బి. బియాస్ కుండ్ (హిమాచల్‌ప్రదేశ్)
3. రావి నది సి. బారాలాప్చాలా (హిమాచల్‌ప్రదేశ్)
4. బియాస్ నది డి. రోహతంగ్ కనుమ (హిమాచల్‌ప్రదేశ్)
1) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ 2) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ 4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
10. సింధూనదికి ఎడమవైపు ఉపనదుల్లో అత్యధిక నీటిని కలిగి ఉండేది?
1) రావి 2) బియాస్
3) సట్లెజ్ 4) చీనాబ్
11. లూని, బానీ నదులు ఏ రకమైనవి?
1) ద్వీపకల్ప నదులు
2) హిమాని నదులు
3) అంతర్ భూభాగ నదులు
4) హిమాలయ నదులు
12. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత, 25 శాతం జనాభాను కల్గిన ప్రాంతం ఏది?
1) టండ్రా ప్రాంతం
2) రుతుపవన మండలం
3) ఉష్ణమండల ఎడారులు
4) భూమధ్యరేఖ మండలం
13. జతపరచండి.
1. పెట్రోలియంకు ప్రసిద్ధి ఎ. బ్రెజిల్
2. ఇనుము ఉత్పత్తిలో ప్రసిద్ధి బి. వెనెజులా
3. రాగి నిక్షేపాలు సి. జమైకా
4. బాక్సైట్ డి. కటంగా
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి 4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
14. ప్రపంచ ధాన్యాగారాలు (ప్రపంచ రొట్టెల గంప) అని కింది వాటిలో ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
1) సమశీతల గడ్డి భూములు
2) ఉష్ణమండల గడ్డి భూములు
3) రుతుపవన మండలం
4) మధ్యధరా మండలం
15. బాల్బాబ్, బాటిల్ వృక్షాలు ఎక్కువగా ఏ ఖండంలో పెరుగుతాయి?
1) ఆఫ్రికా ఖండం 2) ఐరోపా ఖండం
3) దక్షిణ అమెరికా 4) ఉత్తర అమెరికా
16. జతపరచండి.
1. ఆస్ట్రేలియాలో గోధుమ క్షేత్రాలు ఎ. కాంజీలు
2. ఆస్ట్రేలియాలో గొర్రెల పెంపక క్షేత్రాలు బి. విస్టార్షియన్లు
3. అర్జెంటీనాలో గొర్రెల పెంపక క్షేత్రాలు సి. స్టేషన్లు
4. చిలీలో వ్యవసాయ క్షేత్రాలు డి. హాసియెండా
1) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి 2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి 4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
17. ప్రపంచంలో అత్యధిక పశువులు ముఖ్యంగా గేదెలను ఎక్కువగా కలిగిన దేశం?
1) అమెరికా 2) బ్రెజిల్
3) ఆఫ్రికా 4) ఇండియా
18. తక్లమకాన్ ఎడారి ఏ దేశంలో ఉన్నది?
1) మంగోలియా 2) మయన్మార్
3) చైనా 4) ఇరాన్
19. భారతదేశంలో ఏ ప్రాంతంలో జీవమున్న ‘వేళ్ల వంతెనలు’ చూడగలము?
1) కేరళ 2) మేఘాలయ
3) కర్ణాటక 4) త్రిపుర
20. భారతదేశం కరవు దేనితో ముడిపడి ఉంది?
1) రుతుపవనాలు 2) వరదలు
3) ఎడారి 4) జనాభా
21. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది?
1) కొలంబో 2) సింగపూర్
3) టోక్యో 4) హొనొలులు
22. కడెం నది పరీవాహక ప్రాంతం ఏ జిల్లాలో లేదు?
1) ఆదిలాబాద్ 2) నిర్మల్
3) కుమ్రంభీం 4) మంచిర్యాల
23. జతపరచండి.
1. కార్డమమ్ పర్వతాలు ఎ. చైనా
2. కున్లున్ పర్వతాలు బి. ఆప్గానిస్థాన్
3. హిందూకుష్ పర్వతాలు సి. ట్రాన్స్ హిమాలయ మండలం
4. టియన్ షాన్ పర్వతాలు డి. భారతదేశం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి 4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
24. జనాభాపరంగా ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద దేశం ఏది?
1) అల్జీరియా 2) దక్షిణాఫ్రికా
3) కెన్యా 4) నైజీరియా
25. ‘దయ్యాల నగరం’ అని ఈ ప్రాంతాన్ని పిలుస్తారు?
1) అరికా 2) సావోపాల్
3) శాంటియగో 4) మెక్సికన్ సిటీ
26. దక్షిణ అమెరికా ఖండంలో పత్తి అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
1) బ్రెజిల్ 2) అర్జెంటీనా
3) బొలీవియా 4) చిలీ
27. బ్రెజిల్‌లోని కాఫీ పండే ఎస్టేట్లను ఏమని పిలుస్తారు?
1) గుయానో 2) ఫజెండాలు
3) పంపాలు 4) ఏదీకాదు
28. ప్రపంచంలో అతిపెద్దదైన ‘నయాగరా’ జలపాతం ఏ రెండు సరస్సుల మధ్యన ఉంది?
1) ఇరీ, ఒట్టావా
2) ఒట్టావా, ఒంటారియా
3) ఇరీ, ఒంటారియా
4) హార్న్, ఇరీ
29. జతపర్చండి
1) మాంచెస్టర్ ఆఫ్ ఇటలీ ఎ. టూలిన్
2) డెట్రాయిట్ ఆఫ్ ఇటలీ బి. గ్రీన్లాండ్
3) ఈఫిల్ టవర్ గల నగరం సి. పారిస్
4) ప్రపంచంలోని అతిపెద్ద దీవి డి. మిలాన్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
30. ముర్రే, డార్లింగ్, లాబిలున్ నదులు ఏ ఖండంలో ఉన్నాయి?
1) ఉత్తర అమెరికా 2) ఆఫ్రికా
3) ఆసియా 4) ఆస్ట్రేలియా
31. ప్రపంచంలోని జలగర్భంలో గల అతిపెద్ద ప్రవాళభిత్తిక ‘గ్రేట్ బారియర్ రీఫ్’ ఎక్కడ ఉంది?
1) ఆస్ట్రేలియా 2) ఆఫ్రికా
3) యూరప్ 4) ఉత్తర అమెరికా
32. కింది వాటిలో సరికానిది ఏది?
1) న్యూ సౌత్ వేల్స్లో మెరీనా జాతికి చెందిన గొర్రెలను ఎక్కువగా పెంచుతారు
2) క్వీన్స్‌లాండ్‌లో పాడి పశువులు ఎక్కువగా పెంచుతారు
3) సిడ్నీ, మెల్బోర్న్ నగరాలు ప్రపంచంలో ప్రధాన ఉన్ని మార్కెట్ కేంద్రాలు
4) భారత్, ఆస్ట్రేలియా నుంచి గోధుమలను దిగుమతి చేసుకునే దేశం
33. ఉష్ణ మండల తుఫానులు- వాటిని పిలిచే పేరుకు సంబంధించి కింది జతలలో సరైనవి ఏవి?
ఎ) అట్లాంటిక్, ఈశాన్య పసిఫిక్- హరికేన్
బి) వాయవ్య పసిఫిక్- టైపూన్
సి) దక్షిణ పసిఫిక్, హిందూ మహాసముద్రం- తుఫాన్
1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే
3) ఎ, సి మాత్రమే 4) ఎ, బి, సి
34. కింది వాటిలో ఆనకట్టల ప్రతికూల ప్రభావం ఏది?
1) నీటిపారుదల
2) వాటర్ లాగింగ్
3) వరద నియంత్రణ
4) ఏదీకాదు
35. కింది జాతీయ పార్కులను వాటి సంబంధిత రాష్ర్టాలతో జతచేయండి
జాతీయ పార్క్ రాష్ట్రం ఎ. బందీపూర్
జాతీయ పార్క్ i. అసోం
బి. గిర్ అటవీ
జాతీయ పార్క్ ii. గుజరాత్
సి. జిమ్ కార్బెట్
జాతీయ పార్క్ iii. కర్ణాటక
డి. మానస్
జాతీయ పార్క్ iv. ఉత్తరాఖండ్
1) ఎ-iii, బి-ii, సి-iv, డి-i
2) ఎ-iii, బి-iv, సి-i, డి-ii
3) ఎ-ii, బి-i, సి-iv, డి-iii
4) ఎ-iv, బి-iii, సి-i, డి-ii
36. సూర్యున్ని అధ్యయనం చేసిన మొదటి ఇండియన్ మిషన్ ?
1) కొరోనా-1 2) సన్ ఎల్-1
3) ఆదిత్య-ఎల్ 1 4) సన్ ఎర్త్-1
37. ఎర్త్ అవర్‌ను ఎవరు నిర్వహిస్తారు?
1) వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్
2) ఐక్యరాజ్యసమితి పర్యావరణ పథకం
3) ప్రపంచ బ్యాంక్
4) యునెస్కో
38. ప్రపంచంలోని అత్యంత పొడవైన అగ్ని పర్వత గొలుసు ఏ ఖండంలో ఉంది?
1) ఐరోపా 2) ఆస్ట్రేలియా
3) అమెరికా 4) ఆసియా
39. ఆవరణ వ్యవస్థకు ప్రధాన ఇంధనం ఏది?
1) చంద్రుడు 2) సూర్యుడు
3) అంగారకుడు 4) ధరిత్రి
40. ఆరావళి పర్వతం ఒక ?
1) కలశ పర్వతం 2) అగ్ని పర్వతం
3) ఖండ పర్వతాలు
4) పరిశిష్ట పర్వతం
41. భారతదేశంలో బొగ్గు గనులకు పుట్టినిల్లు అయిన రాణిగంజ్ బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది?
1) పశ్చిమబెంగాల్ 2) ఒడిశా
3) జార్ఖండ్ 4) అసోం
42. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ గనులు వేటికి సంబంధించినవి?
1) యురేనియం 2) మాంగనీస్
3) ఇనుము 4) కాపర్
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్ ,9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు