వ్యవసాయం నీటిపారుదల సౌకర్యాలు
కుతుబ్‌షాహీ సుల్తానులు, వారి అధికారులు రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లో వ్యవసాయాన్ని పోత్సహించారు. తెలంగాణ ప్రాంతంలో పాత చెరువులకు, మరమ్మతులు చేయించారు. కొత్త బావులను, చెరువులను నిర్మించి కాకతీయుల కాలం నాటి చెరువులకు ఊపిరి పోశారు. ఇబ్రహీం కులీ కుతుబ్‌షాహీ కాలంలో అనేక కొత్త జలాశయాలు, చెరువులు నిర్మించబడ్డాయి. వీటిలో హుస్సేన్‌సాగర్, బుద్వేల్, ఇబ్రహీంపట్నం చెరువు మొదలైనవి ప్రసిద్ధమైనవి. గోల్కొండ కోటలోని నీటి అవసరాల కోసం కోటకు 5 కి.మీ. దూరంలో దుర్గ్ వద్ద ఒక జలాశయాన్ని నిర్మించారు. కుతుబ్‌షాహీలు గ్రామస్థాయి నుంచి తరఫ్ స్థాయి వరకు అన్ని స్థాయిల్లో చెరువుల పరిరక్షణకు అధికారులను, ఉద్యోగులను నియమించారు. దేవాలయాలు, మసీదులు, గ్రామసభలు కూడా చెరువుల నిర్మాణానికి, పునరుద్ధరణలో క్రియాశీలక ప్రాత నిర్వహించేవి.
వర్తక వ్యాపారాలు
వర్తక వ్యాపారాలు పెద్ద ఎత్తున జరిగేవి మేలు రకం గుర్రాలను పోర్చుగీసువారి నుంచి దిగుమతి చేసుకునేవారు. మచిలీపట్నం నుంచి మేలు వస్ర్తాలను ఎగుమతి చేసేవారు. విదేశీ వ్యాపారం సముద్రంపై ఓడల్లో జరిగేది.
మోటుపల్లి, నరసాపురం, మచిలీపట్నం విదేశీ వ్యాపారానికి ముఖ్యకేంద్రాలుగా ఉండేవి. పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీశైలం, శ్రీకూర్మం, వరంగల్, శ్రీకాళహస్తి ఉదయగిరి పెద్ద వర్తక కేంద్రాలుగా ఎదిగాయి. పెరికలు వస్తు సామగ్రి రవాణాలో కీలకపాత్ర నిర్వహించేవారు.
పరిశ్రమలు
సమకాలీన తెలుగు రచనలు, కుతుబ్‌షాహీల ఫర్మానాల్లో గోల్కొండ రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు గురించి ప్రస్తావించాయి. వజ్రాలు, నేత, కలంకారీ అద్దకం, తివాచీ, నౌక నిర్మాణం, సురేకారం, ఇనుము-ఉక్కు మొదలైన పరిశ్రమల గురించి పేర్కొన్నాయి. ఈ పరిశ్రమల్లో పనిచేసే వారు వ్యవసాయరంగంతో పోలిస్తే చాలా తక్కువ మందికే ఉద్యోగావకాశాలు కల్పించారు.
వజ్రాల గనులు
గోల్కొండ గనుల్లో తవ్వి, శుద్ధిచేసిన వజ్రాలకు భారతదేశంలోనేకాక యావత్ ప్రపంచంలోనే విశేష గుర్తింపు ఉంది. కుతుబ్‌షాహీల రాజ్యంలో కృష్ణానదీతీరాన ఉన్న కొల్లూర్, కర్నూల్లోని రామళ్ళకోట వజ్రాలగని మేలు రకం వజ్రాలకు నిలయాలు. ఈ రెండు గనులు కుతుబ్‌షాహీల రాజ్యస్థాపనకు ముందే ఉన్నాయి. కోహినూర్ వజ్రం కొల్లూర్ గనిలో దొరికింది. వజ్రపుగనుల నుంచి లక్షల పగోడాల్లో ఆదాయం సుల్తాన్‌కు వచ్చేది.
నేత పరిశ్రమ
గోల్కొండ రాజ్యంలో నేసిన వస్ర్తాలకు ఐరోపా మార్కెట్లలో మంచి గిరాకీ ఉండేది. ఆనాటి నేత కార్మికులు స్థానిక అవసరాలను తీర్చడమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకు సరఫరా చేసేవారు. నేతపనివారి నుంచి కాంట్రాక్టర్లు వస్ర్తాలను ముందుగానే అడ్వాన్సు చెల్లించి నేయించుకునేవారు. మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకొని అధిక లాభాలు ఆర్జించేవారు. అద్దకపు వస్ర్తాలను చిట్జ్, చిత్రాలు ముద్రించిన వస్ర్తాలను పింటాడో అనేవారు.
గోదావరి నదీ తీరంలోని నర్సాపురం, భీమునిపట్నం, పులికాట్, మచిలీపట్నం నౌక నిర్మాణ కేంద్రాలుగా ఉండేవి. మేలురకం కర్ర, ఇనుము పెద్దసైజు ఓడల నిర్మాణంలో ఎక్కువగా వాడేవారు.
గోల్కొండ రాజ్యంలోని మందుగుండు సామగ్రిలో ఉపయోగించే సురేకారం పరిశ్రమ ముఖ్యమైంది.
సాహిత్య కృషి
కుతుబ్‌షాహీల కాలంలో తెలుగు భాషను ఆదరించారు. తెలుగు కవులను పోషిం చారు. అద్దంకి గంగాధర కవి తన ‘తపతీ సంవవణోపాఖ్యానాన్ని’ సుల్తాన్‌కు అంకితం ఇచ్చాడు. పొన్నగంటి తెలగనాచార్యున్ని అమీన్‌ఖాన్ ఆదరించాడు. అతని యయాతి చరిత్రను అమీన్‌ఖాన్‌కు అంకితమిచ్చాడు. మహమ్మద్ కులీకుతుబ్‌షా ఆస్థాన కవి గణేష పండితుడు. అంతేకాక సారంగ తమ్మయ్య వంటివారిని ఆదరించారు. క్షేత్రయ్య కూడా వేయికి పైగా పదకీర్తనలు పాడాడు.
కళలు వాస్తు శిల్పం
కుతుబ్‌షాహీ సుల్తానులు గొప్ప వాస్తు కళాభిమానులు. వీరి సమకాలీన మొఘల్ చక్రవర్తులు లాగా తమ రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో అద్భుతమైన నిర్మాణాలు చేశారు.
వాటిలో కోటలు, దవాఖానాలు, మసీదులు, చెరువులు సరాయిలు మొదలైనవి ఉన్నాయి.
వీరి నిర్మాణాల్లో ముఖ్యమైనవి
చార్మినార్ (1590-91
దారుషిఫా (1995)
గోల్కొండ కోట
పురానాపూల్ (1578)
హుస్సేన్ సాగర్ (1502)
మక్కామసీదు (1614-1693)
కుతుబ్‌షాహీల సమాధులు
హయత్‌నగర్ మసీదు (1626)
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు