పోటీపరీక్షల ప్రత్యేకం – జాగ్రఫీ
సూర్యున్ని అధ్యయనం చేసిన మొదటి ఇండియన్ మిషన్?
‘విశ్వాంతరాళ ధూళి’ అంటే ఏమిటి?
1) చంద్రునిపై కనిపించే పదార్థం
2) సూర్యునివల్ల జనించిన ధూళి
3) రోదసీ నిండా వ్యాపించి ఉన్న చిన్న చిన్న పదార్థపు ముక్కలు
4) నక్షత్ర రాసుల్లో కనిపించే ధూళి
2. విశ్వం గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు?
1) కాస్మాలజీ 2) ఆస్ట్రానమీ
3) స్పేస్ 4) జియాలజీ
3. జతపరచండి?
1. బ్లూ ప్లానెట్ ఎ. శుక్రుడు
2. మార్నింగ్ స్టార్ బి. భూమి
3. రెడ్ స్టార్ సి. అంగారకుడు
4. ఆరెంజ్ ప్లానెట్ డి. యురేనస్
5. గ్రీన్ ప్లానెట్ ఇ. శని
1) 1-బి, 2-ఎ, 3-సి,4-డి, 5-ఇ,
2) 1-బి, 2-ఎ, 3-సి,4-డి,5-ఇ,
3) 1-డి, 2-ఇ, 3-ఎ,4-బి,5-సి,
4) 1-సి, 2-ఎ, 3-బి,4-ఇ, 5-,డి
4. ఏ రెండు గ్రహాల మధ్య గ్రహ శకలాలు కలవు?
1) నెప్ట్యూన్-ఫ్లూటో
2) భూమి- అంగారకుడు
3) అంగారకుడు-యురేనస్
4) అంగారకుడు-బృహస్పతి
5. మనం ఎల్లప్పుడూ ఎందుకు చంద్రుని
ఒకే ముఖాన్ని చూస్తూ ఉంటాం?
1) ఎందుకంటే అది భూమికన్నా చిన్నది
2) అది దాని ఇరుసుపై భూమికి వ్యతిరేక దిశలో పరిభ్రమిస్తుంది
3) అది భూమి చుట్టూ భ్రమించటానికి
తన ఇరుసుపై తన చుట్టూ తాను
పరిభ్రమించటానికి పట్టేకాలం
సమానం కాబట్టి
4) భూమి సూర్యుని చుట్టూ ఎంతవేగంగా తిరుగుతుందో, అది కూడా
భూమి చుట్టూ అంతే వేగంగా తిరుగుతుంది
6. ఎర్రని మచ్చలు గల గ్రహం ఏది?
1) అంగారకుడు 2) శుక్రుడు
3) బృహస్పతి 4) యురేనస్
7. ఏ గ్రహం లోపల హైడ్రోజన్ వాయువులు
రసాయనిక మార్పు చెంది ఆరెంజ్
రంగుగా మారుతుంది?
1) అంగారకుడు 2) బృహస్పతి
3) శని 4) యురేనస్
8. జతపరచండి?
1. సూర్యుడి వ్యాసం ఎ. 15,00,00,000 కి.మీ
2. భూమి వ్యాసం బి. 3,84,399 కి.మీ
3.చంద్రుడి వ్యాసం సి. 13,92,000 కి.మీ
4.సూర్యుడు, భూమికి మధ్య దూరం డి. 12,756 కి.మీ
5. చంద్రుడు, భూమికి మధ్య దూరం ఇ. 3, 474 కి.మీ
1) 1-బి, 2-ఎ, 3-సి,4-డి
2) 1-ఎ, 2-సి, 3-బి,4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి,4-సి
4) 1-బి, 2-డి, 3-ఎ,4-సి
9. బ్రిటాన్ ఏ గ్రహ ఉపగ్రహం?
1) వరుణుడు 2) శని
3) ఇంద్రుడు 4) అంగారకుడు
10. సూర్యాస్తమయం, సూర్యోదయం
సమయంలో సూర్యునిలోని ఏ భాగం
ఎర్రని వలయంగా కనిపిస్తుంది?
1) క్రోమోస్పియర్ 2) ఫొటోస్పియర్
3) కరోనా 4) కేంద్రం
11. జతపరచండి?
1. గురు (బృహస్పతి) ఎ. శుక్రుడు
2. శనిగ్రహం బి. గెలీలియో
3. వరుణుడు సి. హర్షల్
4. ఇంద్రుడు డి. నక్షత్ర గ్రహం
1) 1-డి, 2-బి, 3-ఎ,4-సి
2) 1-బి, 2-డి, 3-సి,4-ఎ
3) 1-డి, 2-బి, 3-సి,4-ఎ
4) 1-డి, 2-సి, 3-బి,4-ఎ
12. వేగుచుక్క అని ఏ గ్రహాన్ని అంటారు?
1) బుధుడు 2) శుక్రుడు
3) భూమి 4) కుజుడు
13. జతపరచండి?
1. కుజ గ్రహం ఎ. రూలర్ ఆఫ్ గాడ్స్ అండ్ హెవెన్
2. గురుగ్రహం బి. గాడ్ ఆఫ్ వార్
3. ఇంద్రుడు సి. గాడ్ ఆఫ్ అండర్ వరల్డ్
4. యముడు డి. గాడ్ ఆఫ్ సీ
1) 1-బి, 2-ఎ, 3-సి,4-డి
2) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి,4-సి
4) 1-బి, 2-డి, 3-ఎ,4-సి
14. ఏ గ్రహం అత్యధిక రేడియో ధార్మికత కలిగిన తరంగాలను విడుదల చేస్తుంది?
1) గురుగ్రహం 2) బుధ గ్రహం
3) కుజ గ్రహం 4) శుక్ర గ్రహం
15.15.ఒకే రోజు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు అధిక గల గ్రహం?
1) బుధుడు 2) శుక్రుడు
3) గురుగ్రహం 4) కుజ గ్రహం
16. జతపరచండి?
1. పరిహేళి ఎ. భూమికి చంద్రునికి అత్యంత దూరంగా ఉండే స్థితి
2. పెరిజి బి. భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్న దూరం
3. అపహేళి సి. భూమి చంద్రునికి అత్యంత దగ్గరగా ఉండే స్థితి
4. అపోజీ డి. భూమి సూర్యునికి అత్యంత దూరంగా ఉన్న దూరం
1) 1-బి, 2-సి, 3-ఎ,4-డి 2) 1-సి, 2-బి, 3-డి,4-ఎ
3) 1-బి, 2-సి, 3-డి,4-ఎ 4) 1-ఉ, 2-బి, 3-సి,4-డి
17. బాహ్య గ్రహాల (వాయు గ్రహాలు)లో లేని గ్రహం ఏది?
1) గురుడు 2) శని
3) వరుణుడు 4) కుజుడు
18. చంద్రునిలోని కొంత భాగం మాత్రమే చూడగలుగుతున్నాం. దీనికి కారణం ఏమిటి?
1) చంద్రుని భ్రమణం, పరిభ్రమణం ఒకే సమయంలో జరుగుతున్నందు వల్ల
2) చంద్రుని భ్రమణం, పరిభ్రమణం వేర్వేరు సమయంలో జరుగుతున్నందు వల్ల
3) పై రెండూ 4) ఏదీకాదు
19. జతపరచండి?
1. శూన్యప్రదేశాలు ఎ. షూటింగ్ స్టార్స్
2. ఉల్కలు బి. గెలాక్సీలు, విహారికల మధ్య ఖాళీ ప్రదేశాలు
3. తోక చుక్కలు సి. సౌర బాంధవులు, అతిథి గ్రహాలు
4. అస్టరాయిడ్స్ డి. కుజ, గురు గ్రహాల మధ్యన ఉండే చిన్న చిన్న శిలా శకలాలు
1) 1-ఎ, 2-బి, 3-సి,4-డి 2) 1-బి, 2-ఎ, 3-డి,4-సి
3) 1-ఎ, 2-బి, 3-డి,4-సి 4) 1-బి, 2-ఎ, 3-సి,4-డి
20. జతపరచండి?
1. చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎ. 8.2 నిమిషాలు
2. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం బి. 1.3 సెకన్లు
3. భూభ్రమణం(భూమి తనచుట్టూ తాను తిరగడం) సి. 23గంటల 56 నిమిషాలు
1) 1-బి, 2-ఎ, 3-సి 2) 1-సి, 2-ఎ, 3-బి
3) 1-ఎ, 2-సి, 3-బి 4) 1-బి, 2-సి, 3-ఎ
21. టైటాన్ ఏ గ్రహం ఉపగ్రహం?
1) ఇంద్రుడు 2) కుజుడు
3) వరుణుడు 4) శని
22. అంతర్ గ్రహాల (శిల గ్రహాలు)లో లేని గ్రహం ఏది?
1) బుధుడు 2) శుక్రుడు
3) కుజుడు 4) గురుడు
23. శుక్రగ్రహానికి సంబంధించి కింది వాటిలో ఏది అసత్యం?
1) రాత్రి మొత్తం దీన్ని చూడవచ్చు
2) సూర్యచంద్రుల తర్వాత ఆకాశంలో అతిప్రకాశవంతంగా కనిపిస్తుంది
3) దీని భ్రమణం, పరిభ్రమణం వ్యతిరేక దిశల్లో ఉంటుంది
4) ఉపరితల ఉష్ణోగ్రత 450 డిగ్రీల సెల్సియస్
24. సౌర కుటుంబంలో పరిభ్రమణ కాలం కన్నా ఆత్మభ్రమణ కాలం ఎక్కువ గల గ్రహం ఏది?
1) శుక్రుడు 2) బృహస్పతి
3) శని 4) యురేనస్
25.డైనోసార్స్ భూమిపై నశించడానికి కారణం?
1) తోకచుక్కలు 2) ఉల్కాపాతాలు
3) ఉల్కలు 4) ఏదీకాదు
26. జతపరచండి?
1. సూర్యగ్రహణం ఎ. సూర్యునికి, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు
2. చంద్ర గ్రహణం బి. సూర్యునికి, చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు
3. భూభ్రమణం సి. రాత్రి, పగలు
4. భూపరిభ్రమణం డి. పగలు, రాత్రి కాల వ్యత్యాసాలు
1) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
2) 1-సి, 2-బి, 3-డి,4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-సి,4-డి
4) 1-ఎ, 2-బి, 3-డి,4-సి
27. ఏ గ్రహం హిందూ పురాణాల ప్రకారం క్రూరమైన గ్రహంగా పిలుస్తారు?
1) శుక్రగ్రహం 2) శనిగ్రహం
3) యురేనస్ 4) నెఫ్ట్యూన్
28. ‘ ఒలంపస్’ అత్యంత ఎత్తయిన శిఖరం ఏ గ్రహంపైన ఉంది?
1) కుజుడు 2) గురుడు
3) బుధుడు 4) శుక్రుడు
29. భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహం స్థానాన్ని కింది కక్ష్య నుంచి పై కక్ష్యకు పెంచినప్పుడు దాని కక్ష్య వేగం?
1) పెరుగుతుంది 2) మారదు
3) తగ్గుతుంది
4) రెండు రెట్టు పెరుగుతుంది
30. జతపరచండి?
గ్రహం సూర్యుడి చుట్టూ పరిభ్రమణ కాలం
1. భూమి ఎ. 29.5 ఏండ్లు
2. శుక్రుడు బి. 12 ఏండ్లు
3. కుజుడు సి. 365 రోజులు
4. బృహస్పతి డి. 687 రోజులు
5. శని ఇ. 225 రోజులు
1) 1-సి, 2-ఇ, 3-డి,4-ఎ, 5-బి
2) 1-సి, 2-ఇ, 3-డి,4-బి,5-ఎ
3) 1-సి, 2-ఇ, 3-బి,4-ఎ,5-డి
4) 1-సి, 2-ఇ, 3-బి,4-డి, 5-ఎ
31. ల్యాప్ సెడెడ్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
1) వరుణుడు 2) ఇంద్రుడు
3) కుజుడు 4) గురుడు
32. అతి చల్లని గ్రహం?
1) కుజుడు 2) వరుణుడు
3) గురుడు 4) ఇంద్రుడు
33. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
ఎ. హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది
బి. సూర్యుడి కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 20 సెకన్ల సమయం పడుతుంది
సి. చంద్రుడి కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం 1.3 సెకన్లు
డి. షూమేకర్ లెవీ-9 అనే తోకచుక్క శని గ్రహాన్ని ఢీకొట్టింది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ 4) డి
34. సూర్యున్ని అధ్యయనం చేసిన మొదటి ఇండియన్ మిషన్?
1) కరోనా-1 2) సన్-ఎల్- 1
3) ఆదిత్య-ఎల్ -1 4) సన్ఎర్త్-1
35. సూర్యునికి గల అతి బాహ్య వలయ పొరను ఏమని వ్యవహరిస్తారు?
1) స్ట్రాటోస్పియర్ 2) ఫొటోస్పియర్
3) కరోనా 4) క్రోమోస్పియర్
36. సూర్యునిలోని తక్కువ ఉష్ణోగ్రత తక్కువ కాంతి కలిగిన ప్రాంతాలను ఏమంటారు?
1) ప్లాజర్స్ 2) సన్ స్పాట్స్
3) పై రెండూ 4) ఏదీకాదు
37. సౌరకుటుంబంలో భూమి సూర్యుని నుంచి ఎన్నో గ్రహం?
1) మొదటిది 2) రెండోది
3) మూడోది 4) ఐదవది
38. సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమించడానికి శని గ్రహానికి ఎంతకాలం పడుతుంది?
1) ఒక సంవత్సరం
2) 12 సంవత్సరాలు
3) 248 సంవత్సరాలు
4) 29 సంవత్సరాలు
39. అరుణగ్రహం అని దేన్ని అంటారు?
1) వరుణుడు 2) బృహస్పతి
3) కుజుడు 4) శని
40. అతి ఎక్కువ సంఖ్యలో సహజ ఉపగ్రహాలు గల గ్రహం?
1) భూమి 2) శుక్రుడు
3) బృహస్పతి 4) శని
41. తూర్పు నుంచి పడమరకు ఆత్మభ్రమణం చేసే గ్రహం/గ్రహాలు?
1) యురేనస్ 2) శుక్రుడు
3) నెఫ్ట్యూన్ 4) 1, 2
42. గ్రహాల సూత్రాలను సిద్ధాంతీకరించింది?
1) కెప్లర్ 2) న్యూటన్
3) గెలీలియో 4) కోపర్నికస్
43. సూర్యుడు?
1) ఒక చిన్న నక్షత్రం
2) మధ్యపరిణామం గల ఒక నక్షత్రం
3) నక్షత్రం కాదు 4) ఒక పెద్ద నక్షత్రం
44.జతపరచండి?
1. భూకేంద్ర సిద్ధాంతం ఎ. క్లాడియస్ టాలమి
2. సూర్యకేంద్రక సిద్ధాంతం బి. అబ్బె జార్జి యస్ లియేటర్
3. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం సి. నికోలస్ కోపర్నికస్
4. డోలన సిద్ధాంతం డి. అలెన్ శాండెన్
1) 1-బి, 2-ఎ, 3-సి,4-డి 2) 1-ఎ, 2-సి, 3-బి,4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి,4-సి 4) 1-బి, 2-డి, 3-ఎ,4-సి
-టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
- Tags
- indian mission
- sun
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు