పాకిస్థాన్‌లో రాజకీయ, ఆర్థిక సంక్షోభం
పాకిస్థాన్ 2022 ఏప్రిల్ రెండో వారం నుంచి తీవ్రమైన రాజకీయ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. వాస్తవానికి పాకిస్థాన్ రాజకీయాలు మొదటి నుంచి అస్థిరమైనవిగానే ఉంటున్నాయి. అయినా గతంలో ఎన్నడూ లేనివిధంగా అక్కడ ఆర్థిక, రాజకీయ సంక్షోభం నడుస్తుంది.
2022 ఏప్రిల్ 11న పాకిస్థాన్ పార్లమెంట్లో ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం వీగిపోవడంతో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధికారం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంతకుముందు మార్చి 8న అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏప్రిల్ 10న రాజకీయాలు అత్యంత నాటకీయంగా నడిచాయి.
ఏప్రిల్ 11న ఇమ్రాన్ ఖాన్‌ను పదవి నుంచి తొలగించిన అనంతరం కొత్త ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. అయితే అంతకుముందు నుంచి దేశం ఆర్థికంగా, రాజకీయంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నందున షరీఫ్ ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయాలు తీసుకోలేక పాలన, ఆర్థిక వ్యవస్థ దాదాపుగా స్తంభించిపో-యాయి.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభం
రాజకీయ సంక్షోభంతో పాటు మరోపక్క పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దిగజారిపోతోంది. ఆ దేశ కరెన్సీ రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే దారుణంగా పడిపోతుంది. స్టాక్ మార్కెట్లు కూడా రోజురోజుకూ క్షీణిస్తున్నాయి.
వాస్తవానికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్థిక మాంద్యం దిశగా నడుస్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోవడం వల్ల అవి మాంద్యంలో పడే ప్రమాదం పెరుగుతోంది. అసలే ఆర్థిక మూలాలు బలహీనంగా ఉన్న దేశాల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
పాకిస్థాన్‌లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు భారీగా తగ్గిపోవడం, చైనా ఇచ్చిన రుణాల ఊబిలో కూరుకుపోవడం మొదలైన వాటి వల్ల కొత్తగా రుణాలు ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి విముఖత చూపుతోంది.
పాకిస్థాన్ ప్రపంచంలో తేయాకును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం. 2021-22లో 600 మిలియన్ డాలర్లకంటే ఎక్కువ విలువైన తేయాకును దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దిగుమతులు తగ్గించాలనే లక్ష్యంతో ప్రజలు తేయాకు వినియోగం తగ్గించాలని, రోజుకు రెండు కప్పులకు మించి ఎక్కువ టీ తాగవద్దు అని ఆ దేశ ఆర్థిక మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
అంతేకాకుండా వ్యాపారస్తులు సాయ ంత్రం ఎనిమిది గంటల తరువాత తప్పక దుకాణాలను మూసివేసి విద్యుత్‌ను ఆదా చేయాలని కోరారు. దిగుమతి చేసుకునే వస్తువులన్నింటి వినియోగాన్ని బాగా తగ్గించాలని ప్రజలను ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే అత్యవసరం కాని వస్తువులు, విలాస వస్తువులు మొదలైన వాటి దిగుమతులు బాగా నియంత్రించింది.
పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 47 బిలియన్ డాలర్ల బడ్జెట్ ప్రకటించింది. తద్వారా అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆరు బిలియన్ డాలర్ల రుణాలను పునరుద్ధరిస్తుందని ఆశిస్తుంది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి 2019లో విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించడానికి ఒక రుణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే తర్వాత సబ్సిడీల భారం వల్ల పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్న కారణంగా ఆ రుణ కార్యక్రమాన్ని నిలిపివేసింది.
తాజాగా ఆ రుణాల పునరుద్ధరణ కోసం పాకిస్థాన్ ఆ సంస్థను పదేపదే వేడుకుంటోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి పాకిస్థాన్‌కు కొత్త రుణాలు ఇవ్వకపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే ప్రమాదం ఉంది.
ఆర్థిక సాయం చేసిన సౌదీ అరేబియా
2022 ఏప్రిల్ నెలాఖరులో పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడిన సమయంలో సౌదీ అరేబియా ఈ దేశానికి 8 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించడానికి, దాన్ని సంక్షోభం నుంచి బయట పడేయడానికి అంగీకరించింది.
పాకిస్థాన్‌కు నూతన ప్రధానమంత్రి అయిన షెహబాజ్ షరీఫ్ ఇటీవల సౌదీ అరేబియా పాలకుడు మహ్మద్ బిన్ సల్మాన్‌తో సమావేశం జరిపిన తరువాత సౌదీ ఈ సాయం చేయడానికి అంగీకరించింది.
ప్రాక్టీస్ బిట్స్
1. షాంఘై సహకార సంస్థ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ 20వ సమావేశం ఎక్కడ నిర్వహించింది?
1) బాకు 2) నూర్-సుల్తాన్
3) బిష్కెక్ 4) అప్గాబాత్
2. భారతదేశంలో జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?
1) 27 నవంబర్ 2) 26 నవంబర్
3) 25 నవంబర్ 4) 24 నవంబర్
3. కొలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2021గా ఏ పదాన్ని ఎంచుకుంది?
1) మెటా 2) వాక్స్
3) క్రిప్టో 4) ఎన్ఎఫ్టీ
4. రాష్ట్రంలో సైబర్ తెహ్సిల్స్ను సృష్టించే ప్రతిపాదనకు 2021 నవంబర్‌లో
ఏ రాష్ట్రం ఆమోదం తెలిపింది?
1) బీహార్ 2) ఉత్తరప్రదేశ్
3) మధ్యప్రదేశ్ 4) ఒడిశా
5. ఉడాన్ పథకం ద్వారా ప్రాంతీయ వైమానిక కనెక్టివిటీని ప్రోత్సహించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది?
1) ఇబిబో 2) ఐఆర్సీటీసీ
3) యాత్ర 4) మేక్ మై ట్రిప్
6. భారతదేశంలో ప్రస్తుతం ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది మహిళలు ఉన్నారు?
1) 1,010 2) 1,020
3) 1,030 4) 1,040
విజేత కాంపిటీషన్స్, బతుకమ్మకుంట, హైదరాబాద్
జవాబులు
1.2, 2.1 , 3.4, 4.3 , 5.4, 6.2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?