ఆవరణ సమతుల్యతే పర్యావరణ పరిరక్షణ
ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న ప్రధాన సమస్యల్లో పర్యావరణం ఒకటి. ప్రకృతి సహజత్వానికి కలిగించే ఎలాంటి హాని అయినా కాలుష్యమే అవుతుంది. శరవేగంగా అభివృద్ధి వైపుగా దూసుకుపోతున్న నగరాలు ఈ పర్యావరణ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. పర్యావరణ పరిరక్షణ దిశగా అనేక అంతర్జాతీయ ఒప్పందాలు జరిగాయి. వాటిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు అనేక చర్యలు చేపట్టింది. ఆ వివరాలను తెలుసుకుందాం.
కాలుష్యం
– భూమిపై ఉన్న అన్ని జీవులకు గాలి, నీరు, నేల ఆధారం. ప్రకృతి మన అవసరాలను తీరుస్తుంది. వనరులు భూమిపై నివసించే అందరివి ఏ ఒక్కరికీ సంబంధించినవి కాదు. వాటిని పొదుపుగా వాడుతూ ముందు తరాలకు అందించాలి. వనరులను పరిరక్షించాలి. అప్పుడే అవరణ వ్యవస్థలో సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.
– మనచుట్టూ ఉన్న భౌతిక, జీవ పరిసరాలను పర్యావరణం అంటారు. వివిధ రకాల జీవులు, నిర్జీవులు, సంఘటనలు, ప్రాకృతమైన ప్రభావాల మధ్య మనం నివసిస్తున్నాం.
పర్యావరణంలో మానవుడే కేంద్ర బిందువు. ఇతర జీవుల లాగానే మానవులు పర్యావ రణంపై ఆదారపడి లక్షల సంవత్సరాల నుంచి జీవిస్తున్నాడు. నిప్పును కనుక్కోవడం, రాతి పనిముట్ల తయారీ కాలం నుంచి పర్యావరణంపై తన ప్రభావాన్ని చూపించడం మొదలు పెట్టాడు. జనాభా పెరుగుదల వల్ల పర్యావరణంపై మాన వుల ప్రభావం ఎక్కువైంది. మానవాభివృద్ధి క్రమంలో అనుసరించిన విధానాల వల్ల సమస్యలు తలెత్తి పర్యా వరణ కాలుష్యానికి దారితీశాయి. ప్రకృతి సరిపడినన్ని వనరులను మానవులకు ప్రసాదించింది. అయితే అవ సరానికి మించి వాడటం వల్ల వనరులు క్షీణించి పోతున్నాయి. జనాభా పెరుగుదల, అడవుల నరికివేత, భూగర్బజలాల అధిక వినియోగం వల్ల మన గ్రామాలు ఎడారులుగా మారడం, కరువు కాటకాలు రావడం ఇవ న్నీమన జీవన పద్ధతిలో మార్పుల వల్ల సమతుల్యత దెబ్బతిని పర్యావరణ మార్పులు సంభవిస్తున్నా యి.
– శరవేగంగా అభివృద్ధిచెందుతున్న ప్రాంతాలు, పట్టణీకరణవైపు దూసుకుపోతున్న ప్రాంతాలు ఎదుర్కొనే సమస్యల్లో పర్యావరణ కాలుష్యం ప్రధానమైంది.
-అధిక జీడీపీ కలిగిన ప్రాంతాల్లో అధికంగా పర్యావరణ కాలుష్యం ఉండటం వల్ల జీవన నాణ్యతను కోల్పో తున్నారు. వివిధ రకాలుగా పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. వాటిని అరికట్టినప్పుడు మాత్రమే మానవ మనుగడ సాగుతుంది. తెలంగాణ పర్యావరణ సమస్యలు అప్పుడప్పుడు అక్కడక్కడ తలెత్తుతున్నాయి.
-ముఖ్యంగా హైదారాబాద్ నగరంలో ఈ సమస్యలు అధికంగా ఉన్నాయి. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది.
– తెలంగాణ రాష్ట్ర పర్యావరణ బోర్డు (టీపీసీబీ) వాయు, నీటి, ధ్వని కాలుష్యాల ను నియంత్రించడానికి పర్యావరణ చట్టాలను అమలుచేస్తున్నది.
-దీనిలో వ్యర్థ పదార్థాల నిర్వహణ కాలుష్యాన్ని అరికట్టడానికి అనేక చర్చలు చేపడుతుంది. వ్యర్థపదార్థాలను రవాణా చేసే ట్రక్కులను (జీపీఎస్‌ను) వ్యర్థాలను శుభ్రపరిచే సౌకర్యాల వరకు అనుసరించడం జరుగుతుంది.
-దేశంలోని వాయుకాలుష్యం కంటే తెలంగాణలోని వాయు కాలుష్యం తక్కువ
– ‘వైకల్యం- సర్దుబాటు చేసిన జీవిత సంవత్సరాలు’ రేటు (1 లక్షజనాభాకు) జాతీయ సగటు 3,469తో పోలిస్తే తెలంగాణలో 2,710 ఉంది. అంటే లక్ష జనాభాలో 759 మంది తక్కువ మంది మరణాలు, వ్యాధులతో బాధ పడుతున్నారు.
-రాష్ట్రంలో 29 మురుగునీటి శుద్ధి కర్మాగారాలు (ఎస్టీపీ) పని చేస్తున్నాయి. మొత్తం రోజుకు 885.5 మిలియన్ లీటర్ల సామర్థ్యం (MLD) నుంచి 735.8 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తుంది.
-2016 నుండి 2020-21 వరకు అన్ని సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన బయోమెడికల్ వేస్ట్‌లో 100 శాతం భస్మీకరణం లేదా ఆటోక్లేవ్ ద్వారా శుద్ధి చేస్తున్నారు.
పర్యావరణ వ్యవస్థ సేవలు- జీవనోపాధి
-మానవులకు పర్యావరణ వ్యవస్థలు అందించే ప్రత్యక్ష లేదా పరోక్ష సానుకూల ప్రయోజనాలు. కార్బన్ నిల్వ, పోషకాల సైక్లింగ్, నీరు, గాలి శుద్ధీకరణ, వన్యప్రాణుల ఆవాసాల నిర్వహణ అడవులు అందించే ప్రధాన పర్యావరణ ప్రయోజనాలు.
-అడవుల నుంచి మరొక ప్రధాన పర్యావరణ వ్యవస్థ కలప, ఆహారం, ఔషధం, ఇంధనం, బయోప్రొడక్ట్ల వంటి వస్తువులను అందించడం. కలప, కలపేతర అటవీ ఉత్పత్తులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను సృష్టిస్తాయి. తెలంగాణలోని అటవీ ఉత్పత్తుల్లో కలప, వెదురు, కట్టెలు, బొగ్గు, బీడి ఆకులు ఉన్నాయి.
-2021-22లో అటవీ, లాగింగ్ ఉపరంగం రూ. 1944 కోట్లు ప్రాథమిక రంగం ద్వారా 1.77 శాతం స్థూల విలువ జోడించబడింది.
కాలుష్య నియంత్రణ
గాలి నాణ్యత
-ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అనేది వాయు కాలుష్యం మిశ్రమ కొలత. వాయు కాలుష్య కారకాల పరిసర ఏకాగ్రత విలువలు, వాటి సంభావ్య ఆరోగ్య ప్రభావాల ఆధారంగా గాలి స్వచ్ఛత సూచికను పరిశీలించినట్లయితే కింది విధంగా ఉంటుంది.
0-50 గుడ్ (మంచిది)
50-100 సంతృప్తికరం
100-200 మోస్తరు
200-300 నాణ్యతలేని
300- 400 బాగా నాణ్యత లేని
400-500 ప్రమాదకరమైన
> 500 అతి ప్రమాదకరమైన
– రాష్ట్రంలోని ఏ మానిటరింగ్ స్టేషన్ కూడా 2016-2021 మధ్య మితం కంటే అధ్వానంగా కాలుష్యస్థాయిని (100-200) నమోదు చేయలేదు. గాలి నాణ్యత కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (సీఎస్పీసీబీ) 2025-26 నాటికి 10 మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే పర్టిక్యులేట్ మ్యాటర్‌ను 30 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
-నిరంతర పరిసర వాయు నాణ్యత పర్యవేక్షణ స్టేషన్ల సంఖ్యను 5 నుంచి 13కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీఎస్‌పీసీబీ, టీఎస్ఏఐఆర్లు కలిపి మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశ పెట్టింది. దీని ద్వారా ప్రజలు రాష్ట్రంలోని, నగరాల్లో వాయు కాలుష్యానికి సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.
నీటి నాణ్యత
-తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 244 స్టేషన్లను ఉపయోగించి రాష్ట్రంలోని నీటి వనరుల్లో నేషనల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ కింద నీటి నాణ్యతను పర్యవేక్షిస్తుంది. హైదరాబాద్‌లో స్సేన్ సాగర్ లేక్, ఫతేనగర్‌లో రెండు రియల్ టై వాటర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ మొత్తం 6,850 కిలో లీటర్ల సామర్థ్యం తో 4 సాధారణ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి.
ఘన వ్యర్థాల నిర్వహణ
-సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హైదరాబాద్ సహకారంతో టీఎస్‌పీసీబీ బీపీఎస్ ఆధారిత ఆటోమేటిక్ ఎఫ్లూయెంట్ ట్యాంకర్ ట్రాకింగ్ రిపోర్టింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది.
– తెలంగాణలో 5 రకాల వ్యర్థాల నుంచి శక్తిని ఉత్పత్తి చేసే ప్లాంట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 35.6 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు, 19.8 మెగావాట్ల సామర్థ్యంతో ఒకటి ఉన్నాయి.
బయో మెడికల్ వేస్ట్
– హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో రోజుకు 6,275 టన్నుల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు.
ఇ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ
– రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే 100 శాతం బయో మెడికల్ వ్యర్థాలను దహనం లేదా ఆటోక్లేవ్ ద్వారా శుద్ధి చేసేలా ప్రభుత్వం నిర్ధాస్తుంది. బయో మెడికల్ వ్యర్థాలను సేకరించడం, సురక్షితంగా పారవేయడం కోసం టీఎస్టీఎస్బీ తెలంగాణ రాష్ట్రంలో 11 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్‌ను అనుమతించింది.
-ఎండ్ ఆఫ్ లైఫ్ ఉత్పత్తులను వేరు చేయడం, సరైన మార్గాల్లోకి మార్చడం ద్వారా ఇ వ్యర్థాలను నిర్వహించడంలో క్రియాశీల పాత్ర పోషించే అవగాహన సమాజాన్ని రూపొందించాలని పాలసీ భావిస్తుంది.
-రాబోయే పారిశ్రామిక పార్కులు, క్లస్టర్లు, ఎస్టేట్లలో ఇ వ్యర్థాలను విడదీయడానికి లేదా రీసైక్లింగ్ చేయడానికి ప్రభుత్వం పారిశ్రామిక స్థలం లేదా షెడ్‌ను కేటాయించింది.
-తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), స్కిల్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ జాబ్స్ ద్వారా ఇ-వేస్ట్ వర్కర్లకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తారు.
ఇతర కాలుష్యాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు
-హైదరాబాద్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ దుండిగల్‌కు ప్రమాదకర వ్యర్థాలను తరలించే 54 వాహనాలు, ప్రమాదకర వ్యర్థాల ప్రాసెసింగ్ ఫెసిలిటీ అయిన జీఈపీఐల్ 11 వాహనాలు జీపీఎస్ ట్రాకింగ్ అమర్చి ఉన్నాయి.
-జీడిమెట్ల, ఫతుల్లగూడలో 500 టి.పి.డి సామర్థ్యంతో రెండు నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయి
ప్రాక్టిస్ బిట్లు
1. రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రెడేషన్(REED) కార్య క్రమాన్ని మొదట ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2007 బి) 2009
సి) 2014 డి) 2005
2. క్యోటో ప్రొటోకాల్ మొదటిసారిగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
ఎ) 2005 మార్చి 28
బి) 2007 ఫిబ్రవరి 24
సి) 2005 ఫిబ్రవరి 16
డి) 2010 జూలై 15
3. ప్రపంచ వ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం
ఎ) బాస్ కన్వెన్షన్ బి) స్టాక్‌హోం కన్వెన్షన్
సి) రామ్సర్ కన్వెన్షన్ డి) బెర్న కన్వెన్షన్
4. యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ (యూఎన్సీఎస్డీ) ఎప్పుడు ఏర్పాటైంది?
ఎ) 1992 బి) 1998
సి) 2004 డి) 2005
5. భారత జీవ వైవిధ్య చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
ఎ) 2002 బి) 2004
సి) 2006 డి) 2008
6. డీడీటీ దుష్ప్రభావాలను వివరిస్తూ సైలెంట్ స్ప్రింగ్ గ్రంథాన్ని ఎవరు రాశారు?
ఎ) రాచెల్ కార్పన్ బి) అల్డోలియోపోల్డ్
బి) బెంజిమన్ ఫ్రాంక్లిన్
డి) పై ఎవరూ కాదు
7. భారత్‌లో పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
ఎ) 1980 బి) 1986
సి) 1992 డి) 1996
8. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
ఎ) ఫిబ్రవరి 2 బి) డిసెంబర్ 21
సి) మార్చి 21 డి) నవంబర్ 2
9) ఓజోన్ పొర రక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం?
ఎ) క్యోటో ప్రొటోకాల్ బి) బేసల్ కన్వెన్షన్
సి) స్టాక్‌హోం డిక్లరేషన్
డి) మాంట్రియల్ ప్రొటోకాల్
10) యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లెమేట్ చేంజ్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది
ఎ) 1994 మార్చి 2 బి) 1994 మే 24
సి) 1996 జనవరి 16 డి) 1999 జూన్ 27
సమాధానాలు
సమాధానాలు
1-డి 2-సి 3-సి 4-ఎ
5-ఎ 6-ఎ 7-బి 8-ఎ
9-డి 10-ఎ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు