సీసాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం?
1. జియోగ్రఫీ అనే మాట ఏ భాషాపదం?
1) లాటిన్ 2) ఫ్రెంచ్
3) గ్రీకు 4) అరబిక్
2. భూగోళశాస్త్రం సర్వశాస్త్రాలకు సంశ్లేషణం అని, మాతృక అని పేర్కొన్న శాస్త్రజ్ఞుడు?
1) పాట్రిక్ గెడెజ్
2) ఇమ్మాన్యుయేల్ కాంట్
3) కోపెన్ 4) థారన్త్వైట్
3. భూగోళశాసా్త్రన్ని చరిత్రకు ఆధారమని చెప్పిన జర్మన్ తత్వవేత్త?
1) కోపెన్
2) ఇమ్మాన్యుయేల్ కాంట్
3) పాట్రిక్గెడెజ్
4) థారన్త్వైట్
4. మానవ జాతులు, లక్షణాల విస్తరణ గురించి వివరించే శాస్త్రం?
1) సాంఘిక భూగోళశాస్త్రం
2) భూగర్భశాస్త్రం
3) మానవశాస్త్రం 4) జీవశాస్త్రం
5. యూరప్ ఖండంలో భూగోళశాసా్త్రనికి ఆద్యులు?
1) పోర్చుగీసు
2) ఇంగ్లండ్ దేశస్థులు
3) గ్రీస్ దేశస్థులు
4) ఫ్రాన్స్ దేశస్థులు
6. భూమి గోళాకారంగా ఉందనీ అది ఆకాశంలో గోళాకారంగా ఉన్న నక్షత్ర మండలం మధ్య భాగంలో వేలాడుతున్నదని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
1) హోమర్
2) ఎనక్సిమాండర్
3) ఇమ్మాన్యుయేల్ కాంట్
4) థారన్త్వైట్
7. భూగోళ సంబంధమైన విషయాలకు మొట్టమొదటిసారిగా శాస్త్ర రూపాన్నిచ్చిన శాస్త్రవేత్త?
1) హోమర్
2) ఇమ్మాన్యుయేల్ కాంట్
3) అరిస్టాటిల్ 4) ఎనక్సిమాండర్
8. భూమి గోళాకారంగా ఉందని ప్రప్రథమంగా నిరూపించిన పాశ్చాత్య శాస్త్రజ్ఞుడు?
1) అరిస్టాటిల్ 2) ఎనక్సిమాండర్
3) ఇమ్మాన్యుయేల్ కాంట్
4) హోమర్
9. అక్షాంశ-రేఖాంశాలను ఆధారం చేసుకుని మానచిత్ర రచనకు అధిక ప్రాధాన్యతనిచ్చిన శాస్త్రజ్ఞుడు?
1) అరిస్టాటిల్ 2) హోమర్
3) స్ట్రాబో 4) టాలమీ
10. క్రిస్టఫర్ కొలంబస్ ఏదేశ నావికుడు?
1) పోర్చుగీసు 2) ఇటలీ
3) స్పెయిన్ 4) ఫ్రాన్స్
11. దక్షిణ అమెరికా-దక్షిణ భాగాన్ని చుట్టిన నావికుడు?
1) ఫెర్డినాండ్ మాజిలాన్
2) జూఆన్ సెబాస్టియన్
3) వాస్కోడిగామా
4) కొలంబస్
12. ప్రథమ భూప్రదక్షిణం చేసిన నావికుడు?
1) ఫెర్డినాండ్ మాజిలాన్
2) జూ ఆన్ సెబాస్టియన్
3) వాస్కోడిగామా 4) కొలంబస్
13. భూగోళశాస్త్రంలో వాతావరణ సిద్ధాంతానికి ప్రాముఖ్యతనిచ్చిన శాస్త్రజ్ఞులు?
1) ఫ్రెడరిక్ రాట్జెల్ 2) మాంటెస్క్యూ
3) పై ఇద్దరూ 4) ఎవరూ కాదు
14. పరిసరాలను అధిగమించడానికి మానవుడికి శక్తి ఉందనే సిద్ధాంతాన్ని ఏమంటారు?
1) పాసిబిలిజం 2) డిటర్మినిజం
3) కార్యకరణ సిద్ధాంతం
4) ఏదీకాదు
15. ఉష్ణోగ్రతను ఆధారం చేసుకుని శాస్త్రజ్ఞులు భూమిని ఎన్ని శీతోష్ణ మండలాలుగా విభజించారు?
1) 4 2) 3 3) 5 4) 6
16. భూమి సూర్యుని చుట్టూ తిరిగే దీర్ఘ వృత్తాకార మార్గానికి గల పేరు?
1) అక్షం 2) కక్ష్య
3) వ్యాసం 4) ఏదీకాదు
17. భూమి కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎంతకాలం పడుతుంది?
1) రెండు సంవత్సరాలు
2) మూడు సంవత్సరాలు
3) ఒక సంవత్సరం
4) నాలుగు సంవత్సరాలు
18. అక్షాంశ, రేఖాంశాల ఉపయోగాలను గురించి తెలిపే శాస్త్రం?
1) ప్రాంతీయ భూగోళశాస్త్రం
2) రాజకీయ భూగోళశాస్త్రం
3) ఆర్థిక భూగోళశాస్త్రం
4) గణిత భూగోళశాస్త్రం
19. రుతువులు ఏవిధంగా ఏర్పడుతున్నాయి?
1) భూభ్రమణం
2) భూపరిభ్రమణం లేదా అక్షనతి
3) 1, 2 4) ఏదీకాదు
20. కింది వాటిలో స్వయం ప్రకాశక శక్తి కలిగినవి?
1) గ్రహాలు 2) నక్షత్రాలు
3) ఉపగ్రహాలు 4) ఉల్కలు
21. పి.ఎస్. తరంగాలు రికార్డ్ చేయబడని ప్రాంతం?
1) షాడోప్రాంతం 2) ఫోకస్ ప్రాంతం
3) ఎపి సెంటర్ 4) డార్క్జోన్
22. సూర్యగోళం (మండుతున్న వాయుగోళం) భూమి కంటే ఎన్నిరెట్లు పెద్దది?
1) 107 రెట్లు 2) 108 రెట్లు
3) 109 రెట్లు 4) 110 రెట్లు
23. భూమి గురుత్వాకర్షణ బలం కంటే సూర్యుని గురుత్వాకర్షణ బలం ఎన్ని రెట్లు అధికం?
1) 26 రెట్లు 2) 27 రెట్లు
3) 29 రెట్లు 4) 28 రెట్లు
24. నవగ్రహాల్లో పెద్దది?
1) గురుడు 2) శుక్రుడు
3) కుజుడు 4) బుధుడు
25. నవగ్రహాల్లో చిన్నది?
1) నెప్ట్యూన్ 2) ఫ్లూటో
3) యురేనస్ 4) బుధుడు
26. సూర్యుడి నుంచి దూరాన్ని బట్టి చూస్తే భూమి క్రమసంఖ్య ఎంత?
1) 2 2) 4 3) 5 4) 3
27. భూమి సూర్యుడికి ఎన్ని మైళ్ల దూరంలో ఉంది?
1) 8 కోట్ల మైళ్లు
2) 9 కోట్ల 30 వేల మైళ్లు
3) 10 కోట్ల మైళ్లు
4) 10 కోట్ల 30 వేల మైళ్లు
28. భూమి చుట్టూ చంద్రుడు తిరిగిరావడానికి పట్టే సమయం?
1) 27 1/2 రోజులు
2) 28 1/2 రోజులు
3) 29 1/2 రోజులు
4) 30 1/2 రోజులు
29. భూమి చుట్టుకొలత సుమారు?
1) 23,000 మైళ్లు
2) 24,000 మైళ్లు
3) 26,000 మైళ్లు
4) 25,000 మైళ్లు
30. ఉత్తర, దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో భూమి చుట్టూ ఉన్న వృత్తానికి ఏమని పేరు?
1) అక్షాంశం 2) మకర రేఖ
3) భూమధ్య రేఖ 4) కర్కట రేఖ
31. 23 1/2….0 దక్షిణ అక్షాంశాన్ని ఏమంటారు?
1) మకర రేఖ 2) కర్కట రేఖ
3) భూమధ్య రేఖ
4) ఆర్కిటిక్ వలయ రేఖ
32. 66 1/20 ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారు?
1) అంటార్కిటిక్ వలయ రేఖ
2) కర్కట రేఖ
3) ఆర్కిటిక్ వలయ రేఖ
4) మకర రేఖ
33. 66 1/2 దక్షిణ అక్షాంశాన్ని ఏమంటారు?
1) అంటార్కిటిక్ వలయ రేఖ
2) ఆర్కిటిక్ వలయ రేఖ
3) కర్కట రేఖ 4) మకర రేఖ
34. సాధారణమైన నదీ వ్యవస్థ ఏది?
1) త్రెభాజ్య 2) డెంట్రిటిక్
3) ట్రెల్లిస్ 4) అపకేంద్రీయ
35. 00 రేఖాంశం ఏ నగరం మీదుగా పోతుంది?
1) లండన్ 2) న్యూయార్క్
3) ప్యారిస్ 4) అలహాబాద్
36. తూర్పు పశ్చిమ రేఖాంశంగా ఏ రేఖాంశాన్ని గుర్తించారు?
1) 1700 రేఖాంశం
2) 1750 రేఖాంశం
3) 1800 రేఖాంశం
4) 1850 రేఖాంశం
37. గ్రీనిచ్ రేఖాంశానికి 1800 తూర్పు రేఖాంశానికి ఉన్న మధ్యభాగాన్ని ఏమంటారు?
1) పూర్వార్ధగోళం 2) పశ్చిమార్ధగోళం
3) ఉత్తరార్ధగోళం 4) దక్షిణార్ధగోళం
38. వృక్ష జాలాలను ఆధారంగా చేసుకుని భూమిని ఎన్ని శీతోష్ణ మండలాలుగా విభజించారు?
1) 3 2) 4 3) 5 4) 6
39. భూమధ్య రేఖ వద్ద భూవ్యాసం?
1) 7926.0 మైళ్లు 2) 7900.0 మైళ్లు
3) 7800.0 మైళ్లు 4) 7902.0 మైళ్లు
40. ఉత్తర, దక్షిణ ధ్రువాల మధ్య భూమి వ్యాసం?
1) 7926.0 మైళ్లు 2) 7900.0 మైళ్లు
3) 7800.0 మైళ్లు 4) 7902.0 మైళ్లు
41. భూమి అంతర్భాగం సాద్రత అన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటానికి కారణం?
1) అధిక పీడనం
2) అధిక ఉష్ణోగ్రత
3) గురుత్వాకర్షణం
4) అధిక లోహాలను కలిగిఉండటం
42. బంగ్లాదేశ్‌కు భారతదేశంలోని సరిహద్దు రాష్ట్రాలు?
1) పశ్చిమబెంగాల్, అసోం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయా
2) త్రిపుర, అసోం, మేఘాలయా, పశ్చిమబెంగాల్
3) మిజోరం, పశ్చిమబెంగాల్, త్రిపుర, అసోం
4) పశ్చిమబెంగాల్, సిక్కిం, ఒడిశా, త్రిపుర
43. ఉత్తర అమెరికాలోని ఫింగర్ లేక్స్‌గా పేరుగాంచిన సుపీరియర్, మిచిగాన్ అంటారియో మొదలైన సరస్సులు దేని ప్రభావం వల్ల ఆవిర్భవించాయి?
1) నదీ ప్రవాహం
2) పవనాల క్రమక్షయం
3) అంతర్భూజాలం
4) హిమానీనదాలు
44. ఖండాతర్గత మైదానాలకు ఉదాహరణ?
1) అమెరికాలోని మధ్య మైదానాలు
2) గంగానదీ మైదానం
3) నార్వేలో పశ్చిమ మైదానం
4) నైలునదీ మైదానం
45. కింది వాటిలో వేడి నీటి బుగ్గలకు ప్రసిద్ధి చెందినది ఏది?
1) కజిరంగా నేషనల్ పార్కు
2) ఎల్లోస్టోన్ నేషనల్ పార్కు
3) నార్వే నేషనల్ పార్కు
4) స్వీడన్ నేషనల్ పార్కు
46. ఒకోస్క్ సముద్ర ప్రవాహం ఏ తీరాన్ని తాకుతుంది?
1) అలస్కా
2) కామ్చట్కా ద్వీపకల్పం
3) ఎల్లో సముద్రం
4) హొక్కాడియా ద్వీపం
47. థర్మల్ ఉష్ణమాపకం ఏవిధంగా పెరుగుతుంది?
1) 20-30 సి/100 మీ
2) 50-60 సి/100 మీ
3) 10-20 సి/100 మీ
4) 4.0-50 సి/100 మీ
48. పశ్చిమ ఐరోపాలో ఏ సముద్ర ప్రవాహం వల్ల ఎక్కువ వర్షపాతం కలుగుతుంది?
1) లాబ్రడార్ ప్రవాహం
2) గల్ఫ్ ప్రవాహం
3) హంబోర్డ్ ప్రవాహం
4) ఒయాషివో ప్రవాహం
49. కాలిఫోర్నియాలోని మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతం దేని ఉత్పత్తికి ప్రసిద్ధి?
1) మాంగనీస్ 2) క్రోమియం
3) సల్ఫర్ 4) పెట్రోలియం
50. జపాన్ తీరం మీదుగా ప్రవహించే కురోషివో ప్రవాహం?
1) ఉష్ణ ప్రవాహం 2) శీతల ప్రవాహం
3) అతిశీతల ప్రవాహం
4) అగ్ని పర్వత సంబంధ ప్రవాహం
51. బ్రెజిల్‌లోని ప్రధానమైన పారిశ్రామిక నగరం?
1) సావ్పౌలో 2) సిరాకస్
3) సాంటియాగో 4) బొగోటా
52. ఆస్ట్రేలియాకు ఉత్తరంగా ఉన్న ద్వీపం?
1) మడగాస్కర్ 2) న్యూగినీ ద్వీపం
3) పవురా 4) న్యూజిలాండ్
53. ఆస్ట్రేలియాకు ఉత్తరంగా ఉన్న న్యూగినీ ద్వీపం ఏ జలసంధి వల్ల వేరవుతుంది?
1) బాస్ 2) జీబ్రాల్టర్
3) టోరస్ 4) బేరింగ్
54. ఆస్ట్రేలియాలోని ప్రధాన నది ఏది?
1) డార్లింగ్ మురేనది 2) ఓబ్నది
3) నైలునది 4) జైర్నది
55. ముర్రేనది ఏ నగర సమీపంగా దక్షిణ మహాసముద్రంలో కలుస్తున్నది?
1) కాన్బెరా 2) అడిలైడ్
3) పెర్త్ 4) సిడ్నీ
56. ఆస్ట్రేలియాలోని గోధుమ పంటకు అనుకూలమైన తృణ భూములను ఏమని పిలుస్తారు?
1) స్టెప్పీలు 2) సవానా
3) డౌన్లు 4) పంపాలు
57. ప్రపంచంలో అత్యధికంగా ఉన్నిని ఉత్పత్తి చేస్తున్న దేశం?
1) ఆస్ట్రేలియా 2) దక్షిణ అమెరికా
3) చైనా 4) భారతదేశం
58. మాంసం ఎగుమతిలో ప్రధానమైన దేశం?
1) డెన్మార్క్ 2) అర్జెంటీనా
3) అమెరికా 4) ఆస్ట్రేలియా
59. టోక్యో ఏ నది ఒడ్డున ఉంది?
1) నిప్పల్ 2) సుమిదా
3) టోయో 4) సకూరా
60. ప్రపంచంలో అత్యధికంగా సీసాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశం?
1) ఆస్ట్రేలియా 2) అమెరికా
3) దక్షిణ ఆఫ్రికా 4) భారతదేశం
61. ఆఫ్రికాలోని అతిపెద్ద ప్రధాన ఎడారి?
1) గోబీ 2) థార్
3) సహారా 4) కలహారి
62. ప్రపంచంలో అతిపొడవైన నది ఏది?
1) అమెజాన్ 2) నైలు
3) మురే-డార్లింగ్ 4) హోయాంగ్హో
63. దక్షిణ అమెరికాలో ఎక్కువ భాగం ఆక్రమించింది?
1) అడవులు 2) పీఠభూమి
3) మైదానం 4) నదులు
64. న్యూస్‌ప్రింట్ ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం?
1) కెనడా 2) నార్వే
3) ఫిన్లాండ్ 4) డెన్మార్క్
65. ప్రపంచ గోధుమ ఉత్పత్తుల్లో అమెరికా వాటా ఎంత?
1) 25 శాతం 2) 30 శాతం
3) 20 శాతం 4) 15 శాతం
సమాధానాలు
1. 3 2. 1 3. 2 4. 3 5. 3 6. 2 7. 3 8. 1 9. 4 10. 2 11. 1 12. 2 13. 3 14. 1 15. 2 16. 2 17. 3 18. 4 19. 2 20. 2 21. 1 22. 3 23. 4 24. 1 25. 2 26. 4 27. 2 28. 3 29. 4 30. 3 31. 1 32. 3 33. 1 34. 2 35. 1 36. 3 37. 1 38. 4 39. 1 40. 2 41. 4 42. 2 43. 4 44. 1 45. 2 46. 2 47. 1 48. 2 49. 4 50. 1 51. 1 52. 2 53. 3 54. 1 55. 2 56. 3 57. 1 58. 2 59. 2 60. 1 61. 3 62. 2 63. 1 64. 1 65. 3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు