అంఫన్ తుఫాన్ ఎప్పుడు సంభవించింది?
2) బంగాళాఖాతపు శాఖ (Bay of Bengal branch)
-బంగాళాఖాతపు శాఖ మొట్టమొదట మయన్మార్‌లో ప్రవేశించినప్పటికీ అక్కడగల అరకన్యెమా పర్వతాలు అడ్డుకోవడంవల్ల వెనుదిరిగి భారత ఉపఖండం వైపునకు ప్రయాణిస్తుంది.
-ఇది రెండు ఉప శాఖలుగా విడిపోతుంది.
1) మొదటిది బంగ్లాదేశ్ మీదుగా ఉత్తరంగా ప్రయాణిస్తూ గారో, ఖాసియా, జయంతియా కొండలను దాటి అసోం లోయలోకి, మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లోకి విస్తరిస్తుంది. ఇక్కడగల ఖాసి కొండల వాలులోగల మాసిన్రామ్, చిరపుంజిలు ప్రపంచంలోనే మొదటి, రెండో అత్యధిక వార్షిక వర్షపాతాన్ని పొందుతున్నాయి.
-మాసిన్రామ్ (1187 మీ.), చిరపుంజి (1143 మీ.)లలో వర్షపాతం కురవడానికి కారణం అవి ఖాసి కొండల పవనాభిముఖ దిశలో (Wind ward side) ఉండటం.
-అయితే మాసిన్రామ్కు కేవలం 60 కి.మీ. దూరంలో ఉన్న షిల్లాంగ్‌లో 50 సెం.మీ. వర్షం మాత్రమే సంభవించడానికి కారణం అది ఖాసి కొండల పరాన్ముఖ దిశలో (Leeward side) ఉండటం
2) రెండో శాఖ ఉత్తర భారత మైదానాల్లో గల అల్పపీడనం వైపునకు ఆకర్షించబడి బెంగాల్ మీదుగా హిమాలయ పర్వత పాదాల వెంబడి ప్రయాణిస్తుంది.
-ఈ శాఖ ఆగ్నేయ దిశ నుంచి బెంగాల్లోకి ప్రవేశిస్తుంది. చోటానాగపూర్ వద్ద నర్మదా లోయగుండా వచ్చిన శాఖను, పంజాబ్‌లోని లుథియానా ప్రాంతం వద్ద ఆరావళి పర్వత శాఖను కలుపుకొని కశ్మీర్ వరకు విస్తరిస్తాయి.
-ఈ సమయంలో కోరమండల్ తీరం (తమిళనాడు), దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం పొడిగా ఉంటాయి.
– నైరుతి రుతుపవనాలు జూలై 15 నాటికి దేశమంతటా విస్తరిస్తాయి.
-కన్యాకుమారి నుంచి ఉత్తరం వెళ్లేకొద్ది నికరంగా రుతుపవనాలు ఉండే సమయం తగ్గుతుంది.
-గంగా మైదానంలో తూర్పు నుంచి పడమర వరకు వెళ్తున్న కొద్ది వర్షపాతం తగ్గుతుంది.
– దేశంలో ఉత్తర కొనలో, పశ్చిమ భాగాల్లో వర్షపాతం తక్కువ.
4) ఈశాన్య రుతుపవనాలు (North-East Monsoon Season)
-దీనిని తిరోగమన రుతుపవనాలు (Retreating Monsoon) అని, సందికాలపు రుతువు (The transition Season) అని కూడా పిలుస్తారు.
ఉష్ణోగ్రత: సూర్యుడు అక్టోబర్ నెల కల్లా భూమధ్యరేఖను దాటి దక్షిణార్ధ గోళంలోకి ప్రవేశిస్తాడు. ఉష్ణోగ్రతలు క్రమేణా తగ్గడం ప్రారంభమవుతుంది.
– ఉత్తరాదిన 25 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. నవంబర్ నెల కల్లా ఇంకా తక్కువై శీతాకాలం ప్రారంభ సూచనలు కనిపిస్తాయి.
-అక్టోబర్ నెల ప్రారంభంలో ఆకాశం మేఘరహితంగా ఉండటం, గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతాయి. ఈ పరిణామాన్ని అక్టోబర్ వేడిమి (October Heat) అంటారు.
-పీడనం, పవనాలు: నైరుతి రుతుపవన కాలంలో ఉత్తర భారతదేశ మైదానాల్లో ఏర్పడిన రుతుపవన ద్రోణి (Monsoon Trough) క్రమేణా అంతరించిపోతుంది.
-ఇదే సమయానికి హిందూ మహాసముద్రంలో ITCZ (అంతర అయనరేఖ అభిసరణ ప్రాంతం) కేంద్రీకరించబడుతుంది.
-ఈ విధంగా పీడన మేఖలలు వ్యతిక్రమించడంవల్ల అక్టోబర్ 1 నాటికి ఉత్తర భారతదేశ మైదానాల నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం జరుగుతుంది.
-ఈశాన్య దిశ నుంచి వ్యాపార పవనాలు (Trade Winds) వీయడం ప్రారంభమవుతుంది. ఇవి శుష్క భూ పవనాలు. వీటినే ‘ఈశాన్య రుతుపవనాలు’ లేదా ‘తిరోగమన రుతు పవనాలు’ అంటారు.
-సెప్టెంబర్ 15న ఈశాన్య భారతదేశం నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రాంభమవుతాయి.
వర్షపాతం: మొత్తం సంవత్సర వర్షపాతంలో 13 శాతం ఈ రుతువులోనే కురుస్తుంది. ప్రధానంగా కోరమండల్ తీరంలో (తమిళనాడు) వర్షం కురుస్తుంది.
-బంగాళాఖాతం గుండా ప్రయాణించినప్పుడు సేకరించిన తేమను తమిళనాడు తీర ప్రాంతాలకు వర్షం రూపంలో అందిస్తుంది.
-కర్ణాటక, కేరళ, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలు కూడా వర్షాన్ని పొందుతాయి.
-కోరమండల్ తీరం 43 సెం.మీ., కోస్తాంధ్ర 33 శాతం, రాయలసీమ 21 సెం.మీ.ల వర్షాన్ని పొందుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా నెల్లూరులో సంభవిస్తుంది.
ఉష్ణమండల చక్రవాతాలు (Tropical Cyclones)
– ఇవి సాధారణంగా 8 డిగ్రీల అక్షాంశం నుంచి 25 డిగ్రీల అక్షాంశాల మధ్య ఏర్పుడుతాయి. వీటిని బంగాళాఖాతంలో ‘తుఫాన్లు’ అని, ఆస్ట్రేలియా తీరంలో ‘విల్లీ విల్లీ’ అని, జపాన్ తీరంలో ‘టైపూన్లు’ అని, ఫిలిప్పీన్స్‌లో ‘బాగియా’ అని, అరేబియన్ సముద్రంలో ‘హరికేన్లు’ అని పిలుస్తారు. ఇవి ఏర్పడటానికి కావాల్సిన అనుకూలతలు
ఎ) 27 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను నమోదు చేసే విశాలమైన సముద్ర భాగాలు, ఈ ఉష్ణోగ్రతలు 60-70 మీటర్ల లోతు వరకు ఉండాలి.
బి) ద్రవీభవన గుప్తోష్ణం (Latent Heat of Condensation) అందుబాటులో ఉండాలి.
సి) సర్పిలాకారపు భ్రమణానికి కొరియాలిస్ ప్రభావం
డి) తీరానికి తరలించడానికి తూర్పు పవనాలు, 5 కి.మీ. ఎత్తువరకు సరిపడినంతగా వాతావరణంలో తేమ కావాలి.
-ఒక అల్పపీడనంలోని గాలి వేగం 62 కి.మీ.కు చేరుకొంటే ‘తుఫాన్’ అది పిలుస్తారు.
1 నాట్ -> 1852 కి.మీ.లు
1 కి.మీ. -> 0.54 నాట్స్
-భారతదేశ తీరాన్ని రెండు పర్యాయాలు సూపర్ సైక్లోన్ తాకింది. అవి 1999లో ఏర్పడిన ఒడిశా సూపర్ సైక్లోన్, 2020లో ఏర్పడిన ‘అంఫన్’ తుఫాన్.
-తుఫాన్లు ప్రధానంగా అండమాన్ సముద్రంలో ఏర్పడి కృష్ణా, గోదావరి, మహానది, కావేరి డెల్టా ప్రాంతాలను తాకుతుంటాయి.
– అత్యధిక సైక్లోన్ ప్రభావిత రాష్ట్రాలు- ఒడిశా, ఆంధ్రప్రదేశ్
– ఉష్ణమండల చక్రవాతాలకు సైక్లోన్ అని పేరు పెట్టింది హెన్రీ పెడింగ్టన్
– సైక్లోన్ అనే పదానికి అర్థం The Coils of snake.
-వర్షపాత విస్తరణ: భారతదేశ వార్షిక సగటు వర్షపాతం- 118.7 సెం.మీ.
– రుతువులవారీగా- 1) శీతాకాలం- 2 శాతం వర్షపాతం, ఇది చక్రవాత వర్షపాత రకం
2) 10 శాతం వర్షపాతం, ఇది సంవాహన రకం వర్షపాతం
3) నైరుతి రుతుపవన కాలం- 75 శాతం వర్షపాతం, ఇది పర్వతీయ వర్షపాతం
4) ఈశాన్య రుతుపవన కాలం- 13 శాతం వర్షపాతం, ఇది చక్రవాత వర్షపాతం
– అత్యధిక వర్షపాతం నమోదయ్యే నెల జూలై, మొత్తం వార్షిక వర్షపాతంలో 24.2 శాతం నమోదవుతుంది. ఆగస్టులో 21.2 శాతం, సెప్టెంబర్‌లో 14.2 శాతం, అలాగే జూన్‌లో 13.8 శాతం వర్షపాతం నమోదవుతాయి.
-అత్యల్ప వర్షపాతం డిసెంబర్, జనవరి నెలల్లో నమోదవుతుంది.
వర్షపాత ప్రాంతీయ విస్తరణ
1) అధిక వర్షపాత ప్రాంతాలు (Areas of High Rainfall)
– 200 సెం.మీ.ల కంటే అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు తిరువనంతపురం నుంచి ముంబై వరకు గల పశ్చిమ తీరం, పశ్చిమ కనుమల పశ్చిమ భాగం, మణిపూర్ మినహా మొత్తం ఈశాన్య రాష్ట్రాలు.
2) సాధారణ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు (Areas of Medium Rainfall)
– 100-200 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు- ఖాందేశ్ మైదానాలు, పశ్చిమ కనుమల ఉపరితల భాగం, మణిపూర్, కచార్ లోయ, కోరమండల్ తీరం, కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతం, ఉపహిమాలయాల వెంట గల ఉత్తర భారతదేశ మైదానాలు, చోటానాగపూర్ పీఠభూమి, ఛత్తీస్‌గఢ్ మైదానాలు, ఉత్కల్ తీరం, బెంగాల్, అమర్‌కంఠక్ పీఠభూమి.
3) తక్కువ వర్షపాతం పడే ప్రాంతాలు (Areas of Low Rainfall)
– 50-100 సెం.మీ. వర్షపాతం పడే ప్రాంతాలు- దక్కన్ పీఠభూమి, గుజరాత్, మాల్వా పీఠభూమి, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్ముకశ్మీర్
4) అత్యల్ప వర్షపాత ప్రాంతాలు (Areas of Inadequate Rainfall)
– 50 సెం.మీ. కంటే తక్కువ వర్షపాతం ప్రాంతాలు- దక్కన్ పీఠభూమి అంతర్భాగం, పశ్చిమ రాజస్థాన్, లఢఖ్ ప్రాంతం.
దేశంలోని వర్షాచ్ఛాయ ప్రాంతాలు (Rainshadow Regions)
-సముద్ర ప్రభావిత గాలుల వల్ల పవనాభిముఖ ప్రాంతాల్లో (Windward Side) వర్షం పడుతుంది.
-వర్షం పడని పరాభిముఖ ప్రాంతాన్ని (Leeard side) వర్షాచ్ఛాయ ప్రాంతం అంటారు.
– పర్వతాల నుంచి గాలులు కిందికి దిగే ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడం, ఫలితంగా సాపేక్ష ఆర్ధత తగ్గడంవల్ల వాతావరణం స్థిరత్వం పొందుతుంది. వర్షాచ్ఛాయ ప్రాంతాలు ఏర్పడుతాయి.
-పశ్చిమ కనుమల తూర్పువైపున గల దక్కన్ పీఠభూమి భాగాలు, విదర్భ, ఉత్తర కర్ణాటక, అహ్మద్‌నగర్, షోలాపూర్, పుణె, అనంతపురం, బళ్లారి వర్షాచ్ఛాయ ప్రాంతాల్లో ఉన్నాయి.
-టిబెట్ పీఠభూమి కూడా హిమాలయ పర్వతాల ఉత్తరం వైపున వర్షాచ్ఛాయ ప్రాంతంలో ఉంది.
-గారో, ఖాసి, జయంతియా కొండల ఉత్తరం వాలులు కూడా వర్షాచ్ఛాయ ప్రాంతాల్లో ఉన్నాయి.
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు