‘కిమ్లిక్కా’ పౌరసత్వ సిద్ధాంతం దేనిపై ఆధారపడింది? (పాలిటీ)
1. ఏక కేంద్రక వ్యవస్థను గురించి వర్ణించే స్టేట్మెంట్లను గుర్తించండి?
1) ప్రాదేశిక విభాగానికి కేంద్ర ప్రభుత్వంతో సమ హోదా ఉంటుంది
2) ప్రాదేశిక విభాగాలు, కేంద్ర ప్రభుత్వానికి ఆధీన ఏజెన్సీలుగా ఉంటాయి
3) రాష్ట్రాల హక్కులతో జాతీయ సమైక్యతను కాపాతుంది
4) ప్రభుత్వ విధులను ఒకే వ్యక్తి చేతిలో ఉంచుతుంది
2. (ఏ) నిశ్చితవాక్యం : లిఖిత రాజ్యాంగాలు దృఢమైనవి
(ఆర్) హేతువు : దృఢ రాజ్యాంగాలు సవరణ నిమిత్తం, ప్రత్యేక విధానాన్ని నిర్ణయిస్తాయి
1) (ఏ), (ఆర్)లు రెండూ విడివిడిగా వాస్తవాలే, (ఏ) కి (ఆర్) సరైన వివరణ
2) (ఏ), (ఆర్)లు రెండూ విడివిడిగా వాస్తవాలే, (ఏ) కి (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఏ) వాస్తవం (ఆర్) అవాస్తవం
4) (ఏ) వాస్తవం (ఆర్) వాస్తవం
3. (ఏ): భారత రాజ్యాంగం ఏక పౌరసత్వాన్ని ప్రసాదిస్తుంది.
(ఆర్): భారతదేశంలో భిన్నత్వం దృష్టిలో ఉంచుకొని జతీయ సమైక్యత, సమగ్రత కోసం మనదేశం ఏక పౌరసత్వాన్ని అనుసరిస్తుంది
1) (ఏ)కు (ఆర్) సరైన సవరణ
2) (ఏ)కు (ఆర్) సరైన సవరణ కాదు
3) (ఏ) మాత్రమే సరైనది
4) (ఆర్) మాత్రమే సరైనది
4. రాజ్యాంగం కుల వ్యవస్థను గుర్తించకపోవడానికి కారణమేమిటి?
1) భారతదేశం లౌకిక రాజ్యం
2) ఇది అసమానతలకు దారి తీస్తుంది కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకం
3) అస్పృశ్యతకు దారి తీస్తుంది
4) పైవన్నీ
5. ప్రపంచంలోనే మొదటిసారి స్త్రీలకు ఓటు హక్కును కల్పించిన దేశం?
1) ఐర్లాండ్ 2) ఇండియా 3) న్యూజిలాండ్ 4) అమెరికా
6. భారతదేశ పౌరసత్వం ఎప్పుడు కోల్పోతారు?
1) ఒక వ్యక్తి ఒక విదేశీ పౌరసత్వాన్ని ఆర్జించినప్పుడు
2) ఆ వ్యక్తి పౌరసత్వాన్ని వదులుకున్నప్పుడు
3) కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం తీసేసినప్పుడు
4) పై అన్ని సందర్భాల్లో
7. ఏ దేశంలో 1971లో మాత్రమే స్త్రీలకు ఓటు హక్కు లభించింది?
1) ఆస్ట్రేలియా 2) న్యూజిలాండ్
3) మెక్సికో 4) స్విట్జర్లాండ్
8. భారత రాజ్యాంగంలో మౌలిక లక్షణాలను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది?
1) గోలక్‌నాథ్ కేసు, 1967
2) కేశవానంద భారతి కేసు, 1973
3) ఏకే గోపాలన్ కేసు, 1950
4) చంపకం దొరైరాజన్ కేసు, 1951
9. భారత పౌరుడు అవ్వాలంటే అవసరంలేని నిబంధన?
1) పుట్టుక 2) వూర్వీకులు
3) ఆస్తిని ఆర్జించటం 4) సాధారణీకరణ
10. సరైన స్టేట్మెంట్ను గుర్తించండి?
1) రూల్ ఆఫ్ లా రాజ్యాంగానికి ప్రాథమిక అంశం. ఇది 368వ ఆర్టికల్ ప్రకారం సవరించడానికి వీలులేదు
2) రూల్ ఆఫ్ లా రాజ్యాంగానికి ప్రాధమిక అంశం. ఇది 368వ ఆర్టికల్ ప్రకారం సవరించవచ్చు
3) భారత రాజ్యాంగ ముఖ్య అంశంగా ‘రూల్ ఆఫ్ లా’ ఉన్నది. 4) పైవన్ని
11. భారతదేశ పౌరసత్వం పొందడం, కొల్పో-వడం గురించి వూర్తి వివరాలు ఎందులో పేర్కొన్నారు?
1) భారత స్వాతంత్య్ర చట్టం- 1947
2) తాత్కాలిక ప్రభుత్వ చట్టం- 1946
3) భారత పార్లమెంటు చట్టం- 1955
4) రాజ్యాగంలోని 7వ భాగం
12. కింది దేశాల్లో ఏక పౌరసత్వం ఉన్న దేశం ఏది?
1) యూఎస్ఏ
2) ఆస్ట్రేలియా
3) వూర్వపు యూఎస్ఎస్ఆర్
4) ఏదీకాదు
13. భారతీయ పౌరు ఏ ఇతర దేశంలోనైనా సహజంగా పౌరసత్వం పొందితే తన భారతీయ పౌరసత్వాన్ని కోల్పోతాడా?
1) అవును 2) కాదు
3) తెలియజేస్తే
4) ఆ వ్యక్తి తన పౌరసత్వాన్ని వదులుకోదలిస్తే
14. ద్వంద్వ పౌరసత్వం కలిగిన దేశం?
1) భారతదేశం 2) ఇంగ్లాండ్
3) యూఎస్ఏ 4) జపాన్
15. ఏకకేంద్ర లక్షణం కానిది?
1) లిఖిత రాజ్యాంగం
2) అదృఢ రాజ్యాంగం
3) సమగ్ర న్యాయవ్యవస్థ
4) ఏక పౌరసత్వం
16. భారత పౌరసత్వ చట్టం-1986 ప్రకారం ఏ పద్ధతి ద్వారా ఒక వ్యక్తి ఇండియా పౌరసత్వం పొందుతాడు?
1. పుట్టుకతో 2. వారసత్వం ద్వారా
3. నమోదుతో 4. జాతీయతతో
5. భూభాగంతో సంబంధంలేకుండా
1) 1, 2, 3, 4, 5 2) 1, 2
3) 1, 2, 3, 5 4) 3, 4,5
17. యూనివర్సల్ పౌరసత్వం అనే భావన బలపరిచే అంశం?
1) వ్యక్తులందరి హక్కులకు గుర్తింపు
2) పౌరులందరి హక్కులకు గుర్తింపు
3) అందరికీ సాధారణ హక్కులుండి మైనారిటీలకు ప్రత్యేక హక్కులు ఉండటం
4) ప్రపంచంలో ఏక పౌరసత్వం
18. భారత పౌరసత్వం పొందటానికి ఒక వ్యక్తి కనీసం ఎంత కాలం ఇక్కడ నివసించాలి?
1) 3 సంవత్సరాలు 2) 5 సంవత్సరాలు
3) 7 సంవత్సరాలు 4) 10 సంవత్సరాలు
19. భారత రాజ్యాంగం…
1) ఏక పౌరసత్వాన్ని కల్పిస్తుంది
2) ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పిస్తుంది
3) పౌరసత్వం గురించి ఎలాంటి అంశాలను పేర్కొనలేదు
4) బహుళ పౌరసత్వ కల్పన
20. భారత ప్రభుత్వం భారత పౌరులకు ద్వంద్వ పౌరసత్వాన్ని ఎలాంటి పరిస్థితిల్లో కల్పిస్తుంది?
1) భారతదేశంతో సంబంధం కలిగి ఉన్న దేశాల్లో నివసించే వారికి
2) గల్ఫ్ ప్రాంతంలో మాత్రమే
3) కేవలం కొన్ని దేశాల్లో మాత్రమే
4) అన్ని విదేశాలకు
21. మన రాజ్యాంగంలో ఉన్న ఏకకేంద్ర లక్షణాలకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి
ఎ. ఏక పౌరసత్వం బి. ద్వంద్వ పౌరసత్వం
సి. రాష్ట్రపతి పాలన ఉండదు
డి. ఏక రాజ్యాంగం
ఇ. అత్యవసర పరిస్థితి అధికారాలు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, డి, ఇ 4) సి, డి, ఇ
22. ‘కిమ్లిక్కా’ పౌరసత్వ సిద్ధాంతం దేనిపై ఆధారపడింది?
1) సాంస్కృతిక పరవ్యత్యాస హక్కులు
2) ఒకే వ్యక్తికి ఒకే ఓటు సిద్ధాంతం
3) మైనారిటీలకు ఓటింగ్ విషయంలో ప్రత్యేక వెసులుబాటు
4) ఉమ్మడి పౌరసత్వ సూత్రం
23. సార్వత్రిక యోజన ఓటుహక్కు ఉన్న దేశంలో దేన్ని నియోజకగణం (ఎలక్టోరేట్) అంటారు?
1) రాష్ట్రంలోని మొత్తం పౌరుల జనాభా
2) స్త్రీలు, పిల్లలు తప్ప రాష్ట్రంలోని మొత్తం జనాభా
3) రాష్ట్రంలోని వయోజనుల మొత్తం జనాభా
4) పిచ్చివాళ్లు, నేరగాళ్లు తప్ప, రాష్ట్రంలోని మొత్తం వయోజనులు
24. ‘లౌకిక తత్వం’ భారత రాజ్యాంగ మౌలిక లక్షణంగా సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది?
1) ఎస్ఆర్ బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా
2) భరత్ కుమార్ Vs కేరళ రాష్ట్రం
3) ఉన్నికృష్ణన్ Vs ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
4) కేశవానంద భారతి Vs కేరళ రాష్ట్రం
25. రాజ్యాంగ మౌలిక లక్షణము కానిది ?
1) సమాఖ్య 2) లౌకిక వాదం
3) న్యాయసమీక్షాధికారం
4) న్యాయస్థాన క్రియాశీలత
26. భారత రాజ్యాంగ లక్షణం కానిది?
1) న్యాయ వ్యవస్థకు స్వేచ్ఛ
2) న్యాయ వ్యవస్థ ఆధిపత్యం
3) అధికారాల ఏర్పాటు
4) అధికారాల విభజన
27. దృఢమైన రాజ్యాంగం అంటే?
1) అలిఖిత రాజ్యాంగం
2) సవరణను అనుమతించని రాజ్యాంగం
3) 3/4 మెజారిటీతో సవరించవలసినది
4) సాధారణ శాసన నిర్మాణానికి భిన్నమైన ప్రత్యేక కార్యవిధానం
28. భారత పౌరసత్వం సంపాదించటం, రద్దు చేయటం వంటి అంశాలు గల పౌరసత్వ చట్టం ఎలా ఆమోదించారు?
1) భారత పార్లమెంట్ 1955లో
2) భారత పార్లమెంట్ 1950లో
3) బ్రిటీష్ పార్లమెంట్ 1948 ఆగష్టు
4) ఏదీకాదు
29. ఒకే చర్యలో సార్వత్రిక వయోజన ఓటుహక్కును ప్రవేశపెట్టిన దేశం ఏది?
1) యూకే 2) భారత్
3) యూఎస్ఏ 4) ఆస్ట్రేలియా
30. ఓటుహక్కుకు ప్రాతిపదికగా విద్యార్హతలు ఉండాలని పేర్కొన్నవారు?
1) జే బెంథమ్ 2) జేఎస్ మిల్
3) టీ హెచ్ గ్రీన్ 4) ఈ బార్కర్
31. భారత రాజ్యాంగం ప్రకారం 26 నవంబర్ 1949 నుంచి తక్షణమే అమలులోకి వచ్చినవి ?
1. పౌరసత్వం 2. అత్యవసర పరిస్థితులు
3. ఎన్నికలు 4. సమాఖ్య విధానం
1) 1 2) 2,3
3) 1, 4 4) 1,3
32. పౌరసత్వం ఎప్పు రద్దు కాదు?
1) అత్యవసర పరిస్థితి ఉన్నప్పు
2) యుద్ధ సమయంలో
3) ఎన్నికల సమయంలో
4) ఏ పరిస్థితుల్లోనైనా రద్దు చేయవచ్చు
33. భారతీయ పౌరసత్వం పొందడానికి అర్హులు ఎవరు?
1) భారతదేశంలో నివసించేవారు
2) భారతదేశంలో జన్మించినవారు
3) పాకిస్థాన్ నుంచి శరణార్థిగా వచ్చిన వారు
4) పై అందరూ
34. భారత రాజ్యాంగంలోని ప్రకరణల్లో దేశ పౌరసత్వానికి సంబంధించిన ప్రకరణలు ఏవి?
1) ప్రకరణలు 333-337
2) ప్రకరణలు 17-20
3) ప్రకరణలు 5-11
4) ప్రకరణలు 1-4
35. భారత పౌరసత్వం పొందటానికి తప్పుగా ఉన్న షరతులను గుర్తించండి
1) పుట్టుకతో పౌరసత్వం
2) వారసత్వ పౌరసత్వం
3) ఆస్తి సంపాదన ద్వారా వచ్చే పౌరసత్వం
4) సహజ పౌరసత్వం
36. భారత పౌరసత్వం ఎన్ని విధాలుగా సంపాదించవచ్చు?
1) వూర్వీకుల నుంచి
2) సాధారణీకరణ ద్వారా
3) నమోదుచేసుకోవడం ద్వారా
4) పైవన్నీ
37. (ఏ) అనే వ్యక్తి 1920లో నాసిక్‌లో పుట్టా. పై చదువులకోసం చికాగో వెళ్లా. అతను అక్కడ అమెరికా అమ్మాయి అయిన (బి)ని పెళ్లి చేసుకున్నా. 1945లో బోస్టన్‌లో వారిద్దరికీ ఒక కొకు (సి) పుట్టా. వారందరూ భారతదేశంలో స్థిరపడదామనే ఉద్దేశంతో 1946లో పుణె వచ్చారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకూ, ఆ తరువాత వారు ఇక్కడే ఉన్నారు. (సి)కి భారతదేశ పౌరసత్వం లభించింది. దీనికి కారణం?
1) అతను 1947 సంవత్సరానికి ముందే అమెరికాలో పుట్టడం
2) అతను భారతదేశంలో స్థిరపడటం, తల్లిదంల్ల్రో ఒకరు భారతీయులు కావడం
3) అతను 1946లో భారతదేశానికి వచ్చి, రాజ్యాంగం ప్రారంభమయ్యే వరకూ ఇక్కడే ఉండటం
4) విదేశీయురాలైనప్పటికీ అతని తల్లి (బి) కూడా రాజ్యాంగం అమల్లోకి రాకముందే భారతదేశానికి రావడం
38. సామ్యవాద సిద్ధాంతం దేన్ని ప్రతిబింబించదు?
1) ఉత్పత్తి సాధనాల మీద రాజ్య నియంత్రణ
2) సామాజిక ఆవశ్యకత మీద ఆధారపడ్డ ఉత్పత్తి
3) సామాజిక సేవా ధ్యేయం
4) స్వేచ్ఛాయుతమైన బహిరంగ పోటీ
39. పౌరసత్వం పొందటానికి షరతులు రూపొందించే అధికారం ఎవరికి ఉంది?
1) ఎలక్షన్ కమిషన్ 2) పార్లమెంట్
3) రాష్ట్రపతి 4) పార్లమెంట్, రాష్ట్ర శాసన సమానత్వం
40. భారత రాజ్యాంగం ఏ పౌరసత్వాన్ని కలిగిస్తుంది?
1) ఏక పౌరసత్వం 2) బహుళ పౌరసత్వం
3) ద్వంద్వ పౌరసత్వం 4) ఏదీకాదు
41. ఏ రాజ్యాంగ సవరణ పౌరుని ప్రాథమిక రక్షణ సార్వభౌమాధికారం, సమగ్రత రక్షిం-చడం అని పేర్కొంది?
1) 14వ 2) 16వ 3) 24వ 4) 39వ
42. భారత పౌరులు కానివారికి కూడా లభించే హక్కు?
1) ఉద్యోగాల్లో సమాన హక్కు
2) విద్యా సాంస్కృతిక హక్కు
3) స్వేచ్ఛగా సమావేశమయ్యే హక్కు
4) వ్యక్తిగత స్వేచ్ఛ
43. రాజ్యాంగ నిబంధనల్లో 1949- నవంబరు 26, నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ. పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు
బి. ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు
సి. తాత్కాలిక పార్లమెంట్‌కు సంబంధించిన నిబంధనలు
డి. ప్రాథమిక హక్కులు
1) ఎ, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) బి, డి
44. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యానికి చెందిన విశిష్ట లక్షణాలు?
1) లిఖిత రాజ్యాంగం – సర్వశక్తిమంతమైన శాసన వ్యవస్థ
2) మెజారిటీ పాలన – పౌర స్వేచ్ఛలు
3) సమాఖ్యవాదం – అధికారాల దత్తత
4) ప్రాథమిక హక్కుల మీద ఆదేశిక సూత్రాల ప్రాబల్యం
జవాబులు
1.2 2.1 3.1 4.4 5.3 6.4 7.4 8.2 9.3 10.1 11.3 12.4 13.1 14.3 15.1 16.3 17.4 18.2 19.1 20.3 21.3 22.1 23.4 24.2 25.4 26.2 27.4 28.1 29.2 30.2 31.4 32.2 33.4 34.3 35.3 36.4 37.2 38.4 39.2 40.1 41.2 42.4 43.3 44.1
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు