కళింగను జయించిన శాతవాహన రాజు ఎవరు? ( చరిత్ర)
1. శాతవాహనుల నాణెం ఏది?
1) నిష్కటంక
2) కుశనము, పధకపతక
3) మాడ, పద్మటంక
4) మాషకాలు, దీనారాలు
2. శాతవాహనుల కాలంనాటి కోట ఎక్కడ బయల్పడింది?
1) ధూళికట్ట 2) ఫణిగిరి
2) గాజులబండ 4) పెదబంకూరు
3. శాతవాహనుల కాలానికి చెందిన అజంతా గుహలేవి?
1) 1, 2 గుహలు 2) 31, 32 గుహలు
3) 910 గుహలు 4) 14, 16 గుహలు
4. శాతవాహనుల కాలంనాటి రేవులను గురించి తెలిపినది?
1) టాలమీ 2) ప్లీనీ
3) జప్టిన్ 4) పెరిప్లస్
5. దక్షిణ దేశపు మార్గాలను ఎవరి గ్రంథం తెలుపుతుంది?
1) కౌటిల్యుడు 2) మెగస్తనీస్
3) హెరిడోటస్ 4) హెలియోడోరస్
6. శాతవాహనులు ఆంధ్రులని చెప్పినవారు?
1) బార్నెట్ రాప్సన్
2) పులాస్కర్, జోగేల్కర్
3) భండార్కర్, గోపాలచారి
4) శ్రీనివాస అయ్యంగార్, మిరాషి
7. మొదటి శాతకర్ణి బిరుదు ఏది?
1) దక్షిణ పథేశ్వర 2) దక్షిణాపథపతి
3) దక్షిణేశ్వర 4) దక్షిణాధిపతి
8. తిసముద్రాధీశ్వర అనే బిరుదు ఎవరిది?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి
2) గౌతమీ పుత్ర శాతకర్ణి
3) మూడో పులోమావి
4) కుంతల శాతకర్ణి
9. త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు ఏ గ్రంథంలో పేర్కొనబడింది?
1) కాదంబరి 2) హర్ష చరిత్ర
3) దశకుమార చరిత్ర 4) కథాసరిత్సాగరం
10. నేరస్థులను చెట్లకు ఉరి తీసేవారని తెలుపుతున్న గ్రంథం ఏది?
1) బృహత్కథ 2) బృహత్కథామంజరి
3) గాథాసప్తశతి 4) లీలావతి కావ్యం
11. శాతవాహనుల కాలంలో సిద్ధ సైన్యం ఉండే స్థానాన్ని ఏమనేవారు?
1) స్కందవరం 2) కటకం
3) సైనిక శిబిరం 4) కటి వలయం
12. ధరణికోట నుంచి ఉజ్జయినికి పోయే మార్గంలో ఏ ప్రదేశం ఉండేది?
1) కోటిలింగాల 2) బోధన్
3) ప్రతిష్టాన్ 4) సోపార
13. విదేశాల నుంచి భారతదేశం వేటిని దిగుమతి చేసుకునేది?
1) సుర్మ బంగారం 2) మణులు
3) ముత్యాలు 4) వైర్యాలు
14. కసరుల వృత్తి ఏమిటి?
1) కమ్మరం 2) వండ్రంగం
3) మేదర పని 4) కంచుపని
15. వైధికమత ఆరాధన విధానం ఏది?
1) యజ్ఞాలు చేయడం
2) విగ్రహాలను పూజించడం
3) వ్రతాలు చేయడం
4) తపస్సు చేయడం
16. కృష్ణలీలను ప్రస్తావించిన గ్రంథం ఏది?
1) కథాసరిత్సాగరం
2) బృహత్కథ
3) గాథాసప్తశతి
4) బృహత్కథామంజరి
17. బోరుబుదుర్ శిల్పానికి ఇది నమూనా?
1) గొలి 2) ఘంటశాల
3) బొజ్జన్నకొండ 4) తొట్లకొండ
18. పల్లవబొగ్గ నుంచి శ్రీలంక అనూరాధపుర స్థూప ఆవిష్కరణకు హాజరైనదెవరు?
1) మహాదేవస్థవిరుడు 2) మహాదేవభిక్షు
3) బుద్ధఘణుడు 4) బుద్ధపాలితుడు
19. శాతవాహన యుగంలో ఆంధ్ర దేశంలో బౌద్ధమతాన్ని ప్రచారం చేసినవారు?
ఎ) చంద్రముఖనాథుడు బి) దాగృగుబు
సి) ధర్మనంది డి) ధర్మకీర్తి
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) సి, డి
20. ధుపాడు బౌద్ధ క్షేత్రం ఏ జిల్లాలో ఉంది?
1) గుంటూరు 2) కృష్ణా
3) గోదావరి 4) ప్రకాశం
21. పట్టిక పాలక అంటే?
1) భూమిని కొలిచే అధికారి
2) భూమి రికార్డులను భద్రపరిచే అధికారి
3) భూమిని దానం చేసినప్పుడు నిబంధన లను రూపొందించే అధికారి
4) భూమిశిస్తును నిర్ణయించే అధికారి
22. శాతవాహనుల కాలంలో పరిపాలనలో సలహాలు ఇచ్చుటకు పౌరసభలు ఉన్నాయని తెలిపే గ్రంథం?
1) కౌటిల్యుని అర్థశాస్త్రం
2) బృహత్కథ
3) గథాసప్తశతి 4) లీలావతి కావ్యం
23. శాతవాహన ఉత్తర సరిహద్దులపై దండ యాత్రలు చేసిన వారు ఎవరు?
1) ఇండోగ్రీకులు 2) కుషాణులు
3) శకులు 4) పార్థియన్లు
24. మొదటి శాతకర్ణికి సమకాలికుడైన మగధ చక్రవర్తి ఎవరు?
1) పుష్యమిత్ర శుంగుడు 2) అగ్నిమిత్ర
3) పుణ్యమిత్ర 4) యశోధర
25. శుంగుల రెండవ రాజధాని విదిశను ఆక్రమించిన శాతవాహనుల రాజు ఎవరు?
1) మొదటి శాతకర్ణి 2) రెండవ శాతకర్ణి
3) మొదటి పులోమావి
4) గౌతమీపుత్ర శాతకర్ణి
26. మొదటి శాతకర్ణికి సమకాలికుడైన కలింగరాజు ఎవరు?
1) ఖారవేలుడు 2) సిరిసద
3) అశోకసద 4) శివమకసద
27. కళింగను జయించిన శాతవాహన రాజు ఎవరు?
1) మొదటి శాతకర్ణి 2) రెండవ శాతకర్ణి
3) యజ్ఞశ్రీ శాతకర్ణి 4) సుందర శాతకర్ణి
28. నాసిక్ శాసనంలో పేరున్న విజయపురి నాసిక్ శాసనంలోని విజయపురి పేరు ఏమిటి?
1) చక్రగిరి 2) మహేంద్రగిరి
3) సిరిగిరి 4) మలయగిరి
129. మగధను జయించిన శాతవాహన రాజు ఎవరు?
1) మొదటి పులోమావి
2) రెండో పులోమావి
3) మూడో పులోమావి
4) విజయశ్రీ
30. అయోధ్యలో దొరికిన నాణేలు ఎవరివి?
1) పులోమావి 2) స్వాతి కర్ణ
3) గౌరకృష్ణ 4) లంబోదర
31. ఛత్తీస్‌గఢ్‌లో దొరికిన నాణెం ఎవరిది?
1) అపీలకుడు 2) శివశ్రీ
3) మేఘస్వాతి 3) శివస్వాతి
32. ఆంధ్ర దేశం ఎవరి కాలంలో శాతవాహన సామ్రాజ్యంలో భాగమైంది?
1) మొదటి శాతకర్ణి 2) రెండో శాతకర్ణి
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4) రెండో పులోమావి
33. ఆంధ్ర దేశంలో లభించిన మొదటి శాసనం ఎవరి కాలం నాటిది?
1) మొదటి పులోమావి
2) రెండో పులోమావి
3) శివశ్రీ శాతకర్ణి
4) యజ్ఞశ్రీ శాతకర్ణి
34. రుద్ర దాముడు ఎవరి సమకాలికుడు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) రెండో పులోమావి
3) శివశ్రీ శాతకర్ణి
4) యజ్ఞశ్రీ శాతకర్ణి
35. గౌతమీ బాలశ్రీ ఎవరు తొలిపించిన గుహను చూసి ప్రేరణ పొంది తాను నాసిక్‌లో గుహను తొలిపించింది?
ఎ) కృష్ణుడు బి) నహపాణుడు
సి) దక్షమిత్ర డి) రుషభదత్తుడు
1) ఎ, డి 2) బి, సి 3) ఎ, సి 4) సి, డి
36. శాతవాహనుల కాలంనాటి నాణేల పేర్లు ఏ శాసనం వల్ల తెలుస్తున్నవి?
1) నానాఘాట్ శాసనం
2) చినగంజాం శాసనం
3) రుషభదత్తుని నాసిక్ శాసనం
4) పులోమావి కార్లే శాసనం
37. గౌతమీపుత్ర శాతకర్ణి మాళ్వ నాణేల మీద ఉన్న చిహ్నం?
1) ఏనుగు 2) చైత్యం
3) రుషభం 4) ఉజ్జయినీ చిహ్నం
38. విజయపురి పట్టణం నిర్మించినట్లు తెలిపే శాసనం?
1) శాంత మూలుని రెంటాల శాసనం
2) ఎహూవల శాంతమూలుని నాగార్జున కొండ శాసనం
3) విజయశ్రీ నాగార్జున కొండ శాసనం
4) రుద్ర పురుషదత్తుని నాగార్జున కొండ శాసనం
39. శాతవాహనుల కాలంలో వృత్తి భేదాలు, కులభేదాలు లేవని తెలిపే శాసనం?
1) అమరావతిలోని రెండవ పులోమావి శాసనం
2) నాగార్జున కొండ శాసనం
3) ధిమిక శాసనం
4) చేజర్ల శాసనం
40. అమరావతి స్థూపానికి పూర్ణకుంభ ఫలకాన్ని సమర్పించిన వారు?
1) ధిమిక 2) ఉజ్జయిని యాత్రికుడు
3) పులోమావి 4) బోధిసిరి
41. బ్రాహ్మణులు తమ కుమార్తెలను శాతవాహనులకిచ్చి వివాహం చేయడం ఎవరి కాలం నుంచి ప్రారంభించారు?
1) శివస్వాతి 2) చకోరస్వాతి
3) గౌతమీపుత్ర శాతకర్ణి 4) పులోమావి
42. శాతవాహనులను వివాహమాడిన మొదటి బ్రాహ్మణ స్త్రీ ఎవరు?
1) గౌతమీ బాలశ్రీ 2) రుద్ర భట్టారిక
3) బోధిసిరి 4) దమ్మదిన్నె
43. వైష్ణవ మతం ఏ శాతవాహన రాజుల కాలంలో దక్షిణ దేశం వచ్చింది?
1) సిముఖుడు 2) మొదటి శాతకర్ణి
3) శాతవాహనుడు 4) కృష్ణుడు
44. శాతవాహనులు ఎంత శిస్తు వసూలు చేసేవారు?
1) 1/4వ వంతు 2) 1/8వ వంతు
3) 1/6వ వంతు 4) 1/3వ వంతు
45. ఆచార్య నాగర్జునుడు ఎవరి సమకాలికుడు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) శివశ్రీ శాతకర్ణి
3) విజయశ్రీ శాతకర్ణి
4) యజ్ఞశ్రీ శాతకర్ణి
46. శాతవాహనుల సామ్రాజ్యంలో ప్రసిద్ధి చెందిన రేవు పట్టణం ఏది?
1) బరుకచ్చ 2) సోపార
3) కళ్యాణి 4)చౌల్
47. విదేశీ నాట్యకత్తెలు ఏ రేవులో దిగేవారు?
1) మసుల 2) మోటుపల్లి
3) కళ్యాణి 4) బరుకచ్చ
48. సుఖప్రదమైన వాహనం కలిగిన వారు శాతవాహనులని పేర్కొన్న గ్రంథం ఏది?
1) అభిజ్ఞాన చింతామాణి
2) గాథా సప్తశతి
3) బృహత్కథ
4) వాత్సాయనుని కామసూత్రాలు
49. మ్యాకదోని శాసనంలో పేర్కొన్న సేనాధిపతి ఎవరు?
1) స్కందనాగుడు 2) రెమ్మణక
3) స్కంద విశాఖుడు
4) మూడో పులోమావి
50. ధాన్యకటక మహాచైత్యానికి శిలా ప్రాకారాన్ని నిర్మించిన దెవరు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) నాగార్జునుడు
3) యజ్ఞశ్రీ శాతకర్ణి
4) పులోమావి
51. ఒకే ప్రాకారంలో మూడు నాలుగు విహారాలు ఉండి అధ్యయనానికి ఉపయోగిస్తే ఆ నిర్మాణాన్ని ఏమంటారు?
1) ఆరామం 2) సంఘారామం
3) ఘటిక 4) విహార
52. వైష్ణవ చిహ్నాలు ఏ శాతవాహన రాజు శాసనంపై ఉన్నాయి?
1) కృష్ణుడు 2) గౌతమీపుత్రుడు
3) నాగానిక 4) బాలశ్రీ
53. శాతవాహన పదానికి అపభ్రంశ రూపం ఏది?
1) శాలివాహన 2) సాతవాహన
3) సాతకర్ణి 4) శాతకర్ణి
54. ది గైడ్ టుజాగ్రఫీ గ్రంథకర్త ఎవరు?
1) ప్లీనీ 2) టాలమీ
3) ప్లూటార్క్ 4) హెరిడోటస్
55. భిక్షురాజు అని ఎవరికి పేరు?
1) శివస్వాతి 2) విజయశ్రీ
3) మూడో పులోమావి
4) ఖారవేలుడు
56. హాతిగుంఫా శాసనం ఎవరిని గురించి తెలుపుతుంది?
1) కుదెపెనసిరి 2) అశోక సద
3) ఖారవేలుడు 4) శివశ్రీ శాతకర్ణి
57. హార్మిక కింది ఏ కట్టడంలో భాగం?
1) దేవాలయం 2) జైన మఠం
3) బౌద్ధ మఠం 4) బౌద్ధ స్థూపం
58. అమరావతి స్థూప రక్షిత జంతువు ఏది?
1) పులి, పులి రక్షిత ద్వారాలు
2) సింహం
3) అశ్వం అశ్వ రక్షిత ద్వారాలు
4) గజం, గజ రక్షిత ద్వారాలు
59. శాతవాహనుల కాలం నాటి ఏకైక రాతి గుహాలయం?
1) శంఖరం 2) బొజ్జన్నకొండ
3) భావికొండ 4) గుంటుపల్లి
60. అజంతా గుహల్లోని 10వ గుహలో ఉన్న చిత్రం ఏది?
1) శ్వేత గజం 2) నల్లరాణులు
3) ధ్యానబుద్దుడు 4) బోధిసత్వుడు
61. శాతవాహనుల కాలంనాటి శివాలయాలు ఏ ప్రదేశంలో బయల్పడ్డాయి?
1) అమరావతి 2) వీరాపురం
3) సాతాని కోట 4) ప్రతిష్ఠానపురం
62. గుడిమల్లం దేవాలయ గోపురం ఏ విధంగా నిర్మించారు?
1) మహాబలిపురంలోని ధర్మరాజు రథంపైన గోపుర ఆకారం
2) మహాబలిపురంలోని భూమిని రథంపైన గోపురం రీతిలో
3) చేజర్లలోని గజపృష్టాకార గోపురం వలె
4) పంచరామాలయాల దేవాలయం గోపురం ఆకారం
63. పురాణ పురుషుల ప్రస్తావన ఏ శాసనంలో ఉన్నది?
1) నానాఘాట్ 2) జున్నార్
3) నాసిక్ 4) కార్లే
64. అమరావతి స్థూపాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు?
1) క్రీ.శ. 1830 2) క్రీ.శ. 1867
3) క్రీ.శ. 1887 4) క్రీ.శ. 1888
65. అమరావతి స్థూప వేదిక ఎత్తు ఎంత ఉన్నది?
1) 1 మీటరు 2) 1. 1/4 మీటరు
3) 1. 1/9 మీటరు 4) 1. 3/4 మీటరు
జవాబులు
1-1 2-4 3-3 4-4 5-1 6-1 7-2 8-1 9-2 10-3 11-2 12-4 13-1 14-4 15-1 16-3 17-3 18-1 19-3 20-4
21-3 22-3 23-3 24-1 25-1 26-1 27-2 28-1 29-1 30-1 31-1 32-3 33-2 34-2 35-1
36-3 37-4 38-3 39-3 40-1 41-1 42-1 43-2 44-3 45-4 46-1 47-4 48-1 49-1 50-2
51-2 52-2 53-1 54-2 55-4 56-3 57-4 58-2 59-4 60-1 61-2 62-3 63-3 64-3 65-3
విజేత కాంపీటీషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు