గాలితో నిండిన ఎముకలు.. చెవులుగా మారిన చర్మం!
జంతువుల్లో చలనాలు
(LOCOMOTION IN ANIMALS)
జంతువులు వివిధ రకాల శరీర భాగాలను ఉపయోగించి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చలిస్తాయి. జంతువులు మనుగడ, ఆహార సేకరణ, ఆవాసం ఏర్పర్చుకోవడం, ప్రత్యుత్పత్తి కోసం చలనం చూపుతాయి. జంతువుల శరీర నిర్మాణం, ఆకారం, పరిమాణాన్ని బట్టి వాటిలో వివిధ రకాలైన చలనాలు ఉంటాయి.
మానవుడు
– మానవ శరీరంలోని కదలికలు చర్మం కింద ఉన్న భాగాల ద్వారా జరుగుతాయి. వాటిని ప్రత్యక్షంగా చూడకపోయినా కదలికలను గమనించవచ్చు.
-మన శరీరంలోని అవయవాల కదలికలన్నీ కండరాలు, ఎముకలు, కీళ్ల మీద ఆధారపడి ఉంటాయి.
-శరీరంలోని చర్మం కింద కదులుతున్న భాగాలను కండరాలు అంటారు.
నోట్: శరీరంలో ఉండే కదలికలకు కారణం కండరాలు. అవి 639 వరకు ఉంటాయి.
– కండరాలు ఎప్పుడూ జతలుగా పనిచేస్తాయి.
# ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక కండరం వైపు లాగుతుంది. ఎముక వ్యతిరేక దిశలో కదలడానికి జతలో రెండో కండరం సంకోచిస్తుంది. అప్పుడు మొదటి కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఈ విధంగా ఎముకలు కదిలించడంలో కండరాలు జతలుగా పని చేస్తాయి.
నోట్: కండరాన్ని ఎముకతో కలిపే నిర్మాణం- టెండాన్
మానవుల ప్రవర్తన
-మానవులు కూడా ఇతర జంతువుల వలే ప్రవర్తనను కలిగి ఉంటారు. కానీ మానవుల ప్రవర్తన ఇతర జంతువుల కన్నా సంక్లిష్టంగా ఉంటుంది. దీనికి కారణం మాన వులు ఇతర జంతువుల కన్నా తెలివైనవారు. ఆలోచించగల శక్తి కలిగినవారు.
-జంతువుల ప్రవర్తన కంటే మానవుల ప్రవర్తన అధ్యయనం చేయడం కష్టం.
– మానవులకు వాళ్ల గురించి వాళ్లకు బాగా తెలుసు.
-మానవులు సహజాత ప్రవృత్తిని కలిగి ఉంటారు.
-కానీ మనం మన ప్రవర్తనను ప్రయత్నించి సహజాత ప్రవృత్తిని అధిగమించగలుగతాం.
ఉదా: బాగా ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే భోజనం చేయాలని అనిపిస్తుంది. కానీ మర్యాద కోసం అందరూ కూర్చున్న తర్వాతే భోజనం చేయడం మొదలుపెడతాం. కానీ జంతువులు తమకు ఆహారం దొరకగానే వెంటనే తింటాయి.
-కనురెప్పలు టపటపలాడించడం, నమలటం, ఉచ్ఛాస, నిశ్వాసాలు, బరువు ఎత్తడం, బొటనవేలు కదిలించడం వంటివి కండరాల కదలికలకు ఉదాహరణలు.
చేపలు
చేప శరీరం పడవ ఆకారంలో ఉండి నీటిలో సులభంగా ఈదడానికి వీలుగా ఉంటుంది.
-చేప అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది.
-చేప ఈదేటప్పుడు శరీరంలో ముందుభాగంలోని కండరం ఒక వైపు కదిలితే తోక దానికి వ్యతిరేకంగా కదులుతుంది. దీని వల్ల ఏర్పడే కుదుపు చేప శరీరాన్ని ముందుకు తోస్తుంది.
-ఈ విధమైన క్రమబద్ధమైన కుదుపుతో శరీరాన్ని ముందుకు తోస్తూ ఈదుతుంది.
– చేప తోక కూడా చలనంలో సహాయపడుతుంది.
నోట్: చేపల్లో చలనాంగాలు: వాజాలు+తోక (దిక్కులు మార్చడానికి సహాయపడతాయి)
పక్షులు
-పక్షులు గాలిలో ఎగరడంతో పాటు, నేలమీద కూడా నడుస్తాయి.
– పక్షి శరీరం గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటుంది.
– పక్షి ఎముకలు తేలికగా, బోలుగా, రెక్క ఎముకలు గాలితో నిండి ఉంటాయి.
– వెనుక జత కాళ్ల ఎముకలు నడవడానికి, గాలిని వెనుకకు తోయడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి.
-ముందు జత కాళ్లు గాలితో నిండిన ఎముకలు కలిగి రెక్కలుగా మారి పైకి, కిందికి ఊపుతూ ఎగరడానికి ఉపయోగపడతాయి.
పాములు
– పాములో పొడవైన వెన్నెముక, చాలా కండరాలు ఉంటాయి.
-పాము చలించేటప్పుడు దాని శరీరం అనేక వంపులు తిరుగుతూ ప్రయాణిస్తుంది.
– ప్రతి వంపు భూమిపై ఒత్తిడిని కలిగించి శరీరాన్ని ముందుకు తోస్తుంది. ఈ విధంగా పాము వేగంగా చలిస్తుంది.
-పాములు నేల మీద పాకడమే కాకుండా ఇతర అనుకూలనాల ద్వారా కూడా చలిస్తాయి.
-జంతువుల్లో చెవులు చేసే పనిని పాముల్లో చర్మం చేస్తుంది. పాముల చర్మంలో ఘ్రాణ గ్రాహకాలు ఉంటాయి. వాటి ద్వారా అలజడులను గ్రహిస్తాయి.
జంతువు చలనానికి ఉపయోగపడే శరీర భాగం జంతువు చలించే విధానం
ఆవు కాళ్లు నడవడం, గెంతడం
మనిషి కాళ్లు, చేతులు నడక, పరిగెత్తడం
పాము వెన్నుపూసలు నేలపై పాకడం, ఈదడం
పక్షి రెక్కలు గాలిలో ఎగరడం
కీటకాలు రెక్కలు గాలిలో ఎగరడం
చేపలు కండరాలు, వాజాలు, తోక నీటిలో ఈదడం
అదనపు సమాచారం
#నత్తల్లో కండరంతో నిర్మితమైన పాదం ఉంటుంది. ఇది దృఢమైన కండరంతో నిర్మితమై ఉంటుంది. ఇది అలలాగా కదలడం వల్ల నత్త నెమ్మదిగా చలిస్తుంది.
#నత్త జంతువులన్నింటిలో నెమ్మదిగా కదిలే జీవి. ఇది సెకనుకు 0.013 నుంచి 0. 028 మీటర్ల వేగంతో చలిస్తుంది.
# చీమలు రసాయన గ్రాహకాల సహాయంతో కీళ్లు కలిగిన కాళ్లతో చలిస్తాయి.
# మానవ శరీరంలో 206 ఎముకలు, 230 కీళ్లు, 639 కండరాలు ఉంటాయి. ఇవన్నీ చలనంలో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ సహాయపడతాయి.
# అప్పుడే పుట్టిన శిశువు శరీరంలో 300 ఎముకలు ఉంటాయి.
#చిరుతపులి వేగంగా పరిగెత్తగలిగే జంతువు. ఇది గంటకు 97 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది.
# ప్రపంచంలో సుమారు 2700 జాతుల పాములు నివసిస్తున్నాయి.
# పక్షుల్లో అతి చిన్నది హమ్మింగ్ బర్డ్ # దీని పొడవు 5.7 సెంటీమీటర్లు.
# పక్షుల్లోకెల్లా మగ ఆస్ట్రిచ్ బరువైనది.
# దీని బరువు 345 పౌండ్లు (156 కిలోలు).
# మానవ శరీరంలో అతిపొడవైన ఎముక ఫీమర్. ఇది తొడ భాగంలో ఉంటుంది.
# మానవుడి శరీరంలో అతిచిన్న ఎముక స్టేపిస్. ఇది చెవిలో ఉంటుంది.
# ఆరోగ్యవంతమైన మానవుడి గుండె జీవితకాలంలో 205 మిలియన్ల సార్లు కొట్టుకుంటుంది.
# మానవుడి గుండె నిమిషానికి 5-30 లీటర్ల రక్తాన్ని పంపు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
# మానవుడి శరీరంలో నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులు అని అమెరికాలోని మిన్నెసోటా సైన్స్ మ్యూజియం పేర్కొన్నది.
# మానవుడి పురెలో నిజానికి 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తుంది. దీన్ని క్రేనియం అంటారు.
# వెన్నుపాము, మోచేయి దగ్గర జారుడు కీలు ఉంటుంది.
# ఉభయ చరాల జీవిత చరిత్రలో గుడ్డు, లార్వా, ప్రౌఢ జీవి అనే మూడు దశలుంటాయి.
# స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే తిరిగి పూర్వ స్థితికి వస్తాయి. వీటిలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ.
#జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా ఏడు ఎముకలు ఉంటాయి.
ప్రాక్టీస్ బిట్స్
1. కింది వాటిని జతపరచండి.
ఎ. మానవ శరీరంలో ఉండే 1. 639 ఎముకల సంఖ్య
బి. మానవ శరీరంలో ఉండే 2. 206 కండరాల సంఖ్య
సి. మానవ వెన్నెముకలో ఉండే 3. 33 వెన్నుపూసల సంఖ్య
డి. పురెలో ఉండే 4. 26 ఎముకల సంఖ్య
ఇ. వయోజనుల్లో ఉండే 5. 22 వెన్నుపూసల సంఖ్య
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-ఇ, 5-డి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
3) 1-ఇ, 2-బి, 3-సి, 4-బి, 5-ఎ
2. జిరాఫీ మెడలో ఉండే వెన్నుపూసల సంఖ్య ఎంత?
1) 7 2) 8 3) 6 4) 33
3. బోలుగా ఉండే ఎముకలు కలిగిన జీవి?
1) చేప 2) కప్ప
3) పావురం 4) పాము
4. వెన్నెముక చలనావయవంగా ఏ జీవిలో ఉపయోగపడుతుంది?
1) చేప 2) పాము
3) పక్షి 4) తిమింగలం
5. కింది వాటిని జతపరచండి.
1. పురెలోని కీలు ఎ. బొంగరపు కీలు
2. మెడలోని కీలు బి. కదలని కీలు
3. భుజం, సి. మడత బందు కీలు కటి వలయం
4. మోచేయి, డి. బంతి గిన్నె కీలు
మోకాళ్ల వద్ద ఉండే కీలు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-బి, 2-సి, 3-డి, 4-సి
6. మానవ శరీరంలో నీటిపై తేలే అవయవం ఏది?
1) గుండె 2) ఊపిరితిత్తులు
3) మెదడు 4) చర్మం
7. మృదులాస్థి ఉండే భాగం ఏది?
1) చెవి 2) ముక్కు
3) వెన్నుపూసలు 4) పైవన్నీ
8. మానవుడి గుండె నిమిషానికి ఎన్ని లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది?
1) 5-10 లీటర్లు 2) 10-15 లీటర్లు
3) 15-30 లీటర్లు 4) 20-30 లీటర్లు
9. ఆరోగ్యవంతుడైన మానవుడి గుండె జీవితకాలంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?
1) 2.5 బిలియన్లు 2) 3 బిలియన్లు
3) 4.5 బిలియన్లు 4) 6 బిలియన్లు
10. రెండు ఎముకలను కలపడానికి తోడ్పడే దారాల వంటి కండర తంతువుల నిర్మాణాలను ఏమంటారు?
1) టెండాన్ 2) లిగమెంట్
3) ఫీమర్ 4) టిబియా
11. ప్రపంచంలో నివసించే పాముల జాతులు సుమారుగా..
1) 1700 2) 2700
3) 3700 4) 4700
12. సెకనుకు నత్త ఎంత వేగంతో పరిగెడుతుంది?
1) 0.013- 0.028 మీటర్లు
2) 0.015- 0.030 మీటర్లు
3) 0.017- 0.029 మీటర్లు
4) 0.019- 0.032 మీటర్లు
13. చిరుత పులి గంటకు ఎంత వేగంతో పరిగెడుతుంది?
1) 67 కిలోమీటర్లు 2) 77 కిలోమీటర్లు
3) 87 కిలోమీటర్లు 4) 97 కిలోమీటర్లు
14. దృఢమైన కండరంతో నిర్మితమైన పాదం కలిగిన జీవి ఏది?
1) చేప 2) పాము
3) నత్త 4) పావురం
15. అతిచిన్న పక్షి ఏది?
1) చిలుక 2) పిచ్చుక
3) హమ్మింగ్ బర్డ్ 4) గద్ద
16. రసాయన గ్రాహకాలతో చలించే జీవులు?
1) తేలు 2) చీమలు
3) పాములు 4) కప్పలు
17. శరీరంలోని ముందు భాగంలో ఉండే కండరాలు ఒకవైపు కదిలితే, తోకలో కండరాలు వేరొక వైపు కదులుతాయి. అలా కదిలే జంతువు ఏది?
1) పాము 2) చేప
3) కప్ప 4) తొండ
18. మృదులాస్థి ఉండే ప్రదేశం ఏది?
1) చెవి, ముక్కు 2) వెన్నుపూసలు
3) పక్కటెముకలు, స్టెర్నం మధ్య
4) పైవన్నీ
19. భుజం నుంచి మెడ వరకు ఉండే రెండు ఎముకల్లో పై ఎముకను ఏమంటారు?
1) జత్రుక 2) రెక్క ఎముక
3) భుజాస్థులు 4) ఉరోమేఖల
20. ఉరఃపంజరంలో ఉండేవి?
1) గుండె 2) ఊపిరితిత్తులు
3) గుండె, ఊపిరితిత్తులు
4) జీర్ణాశయం
సమాధానాలు
1. 1 2. 1 3. 3 4. 2 5. 4 6. 2 7. 4 8. 3 9. 1 10. 2 11. 2 12. 1 13. 4 14. 3 15. 3 16. 2
17. 2 18. 4 19. 1 20. 3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు