ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్
# సీఎస్ఈలో 21% సీట్లు మన దగ్గరే
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఎంసెట్ తొలి విడత వెబ్ కౌన్సెలింగ్ ఆదివారం ప్రారంభమైంది. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్ జరుగనున్నది. ఈ నెల 29 వరకు స్లాట్ బుకింగ్, ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. ఈ నెల 23 నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. కాగా, బీటెక్‌లో అత్యంత డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) సీట్లు తెలంగాణలోనే అధికంగా ఉన్నాయి. జాతీయంగా 3,627 కాలేజీలుంటే వీటిల్లో అన్ని బ్రాంచిలు కలిపి 13.26 లక్షల సీట్లున్నాయి. వీటిలో 1.11 లక్షల సీట్లు తెలంగాణలో ఉండగా, వీటిలో 55 వేల సీట్లు సీఎస్ఈ బ్రాంచివే ఉన్నాయి. జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాలు కలిపి సీఎస్ఈ సీట్లు 2.7 లక్షలకుపైగా ఉన్నాయి. వీటిలో 21 శాతం సీట్లు ఇక్కడే ఉన్నాయి. ఇంజినీరింగ్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటం, మరికొన్ని కాలేజీలు కోర్సుల మార్పిడికి దరఖాస్తులు సమర్పించడంతో సీఎస్ఈ సీట్ల సంఖ్య మన దగ్గర ఇంకా పెరిగే అవకాశం ఉన్నది.
- Tags
- counselling
- cse
- TS EAMCET
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు