కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మోడల్ టెస్ట్ -2022
156. కింది వాటిలో సరికానిది గుర్తించండి
1. చర్మం స్పర్శా జ్ఞానేంద్రియం, అనుబంధ విసర్జనావయవంగా పనిచేస్తుంది
2. స్పర్శకు టార్టెల్ రాసిస్టర్స్ చర్మంలో కలవు
3. పీడనాన్ని గుర్తించడానికి పానీనియన్ కార్పోసెల్స్ చర్మంలో కలవు
4. ఉష్ణోగ్రతను, బాధను గుర్తించడానికి నాసీ సెప్టారులు కలవు
1) 1, 2 2) 3, 4
3) 3 4) ఏవీకావు
157. ప్రతిపాదన(ఎ) – కుటుంబ నియంత్రణ కోసం పురుషుల్లో చేసే శస్త్ర చికిత్సను వేసెక్టమి అంటారు
కారణం(ఆర్)- ఈ శస్త్ర చికిత్సలో శుక్రనాళాలను కత్తిరించి వాటి రెండు చివరలను గట్టిగా ముడివేస్తారు.
1) (ఎ), (ఆర్) సరైనవి, (ఎ)కి (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) సరైనవి, కానీ (ఎ)కి (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సరైనది, కానీ (ఆర్) కాదు
4) (ఎ) సరైనది కాదు, కానీ (ఆర్) సరైనది
158. కిందివాటిలో సరైనది ఏది?
1. ట్రిపనోసామా గాంబియన్సీ వ్యాధికారకం వల్ల అతి నిద్రవ్యాధి కలుగుతుంది
2. బ్లాక్ సిక్నెస్ వ్యాధి కారకం లీష్మానియా డోనోవాని
1) 1 2) 2 3) 1, 2 4) ఏవీకావు
159. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ. గింకో బైలోబా ఒక సజీవ శిలాజ మొక్క. ఇది ఇండియా హిమాలయ ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది
బి. టాక్సస్ అనే వివృత బీజ మొక్క కాండం నుంచి ‘టాక్సాల్’ అనే యాంటీ క్యాన్సర్ పదార్థం లభిస్తుంది
సి. సైకస్ను ‘సాగోఫామ్’ అంటారు. దీని ఎండు విత్తనాలను కాల్చుకొని తింటారు
1) ఎ, బి 2) బి, సి
3) బి 4) ఎ, బి, సి
160. బఠానీ మొక్కల్లో గింజ రంగు, కాయపై తొక్క రంగుకు సంబంధించి బహిర్గత, అంతర్గత లక్షణాలు వరుసగా
1) పసుపు, ఆకుపచ్చ, ఆకుపచ్చ, పసుపు
2) ఆకుపచ్చ, పసుపు, పసుపు, ఆకుపచ్చ
3) ఆకుపచ్చ, పసుపు, ఆకుపచ్చ, పసుపు
4) పసుపు, ఆకుపచ్చ, పసుపు, ఆకుపచ్చ
161. కింది వాటిలో సరైన వాక్యాలేవి?
1.కోబాల్ట్- 60 నుంచి ఉత్పత్తి అయిన గామా కిరణాలను ఉపయోగించి రేడియోథెరపీ చేస్తారు
2. ఎక్కువరోజులు నిల్వచేయడానికి కూరగాయలను, విత్తనాలను క్రిమిరహితం చేయడానికి గామా కిరణాలను ఉపయోగిస్తారు
3. మెదడులోని కణుతులను గుర్తించడానికి, థైరాయిడ్ చికిత్సలో అయోడిన్-131ను ఉపయోగిస్తారు
4. రేడియోధార్మిక సోడియం-24ను ఉపయోగించి రక్త సరఫరాలో కలిగే అడ్డంకులను అధ్యయనం చేస్తారు
5. శిలల వయస్సు నిర్ధారణకు యురేనియం డేటింగ్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు
1) 1, 2 2) 1, 3, 4
3) 1, 2, 3, 4 4) అన్నీ
162. జతపరచండి
ఎ. గోబర్ గ్యాస్, సీఎన్జీ 1. మీథేన్
బి. ఎల్పీజీ 2. బ్యుటేన్
సి. వాటర్ గ్యాస్ 3. ఎసిటలీన్+ ఆక్సిజన్
డి. గ్యాస్ వెల్డింగ్ 4. కార్బన్ మోనాక్సైడ్+హైడ్రోజన్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-1, బి-2, సి-4, డి-3
163. ఏ మిశ్రమాలతో గాజును తయారు చేస్తారు?
ఎ. సోడియం సిలికేట్
బి. కాల్షియం సిలికేట్ సి. సిలికా
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
164. నిశ్చితం(ఎ)- డిటర్జెంట్లు కఠిన జలంలో నురగనిస్తాయి
కారణం(ఆర్)- డిటర్జెంట్లు Ca2+, Mg2+ అయాన్లలో అవక్షేపాన్ని ఏర్పరచవు
1) (ఎ), (ఆర్) రెండూ సరైనవి, (ఎ)కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ సరైనవి, కానీ (ఎ)కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సరైనది, కానీ (ఆర్) సరైనది కాదు
4) (ఎ) సరైనది కాదు, కానీ (ఆర్) సరైనది
165. జతపరచండి
ఎ. బేకలైట్ 1. ఫినాల్+ఫార్మాల్డిహైడ్
బి. ఫోమ్ 2. యూరియా+ఫార్మాల్డిహైడ్
సి. రేయాన్ 3. సెల్యూలోజ్
డి. కాప్రోలాక్టమ్ 4. నైలాన్-6, 6
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-2, బి-1, సి-3, డి-4
166. లోహాలకు సంబంధించి సరైన వాక్యం
1. లోహబంధాన్ని స్వేచ్ఛా ఎలక్టాన్ సిద్ధాంతం వివరిస్తుంది
2. తాంతవత, అఘాత వర్ధనీయత
3. అయానిక సమ్మేళనాలను, క్షారాలను ఏర్పరుస్తాయి
4. తళతళా మెరుస్తాయి
1) 1, 2 2) 1, 2, 3
3) 2, 3 4) అన్నీ
167. ఎల్పీజీ వంటి ఇంధన వాయువులు గాలిలో మండి విడుదలచేసే హరిత గృహ వాయువులు
1. కార్బన్ మోనాక్సైడ్
2. కార్బన్ డై ఆక్సైడ్ 3. నీటి ఆవిరి
1) 2 2) 2, 3 3) 1, 2 4) అన్నీ
168. కింది వాటిలో క్షార గుణం గల ద్రావణాలు
1. నిమ్మరసం
2. బట్టల సోడా ద్రావణం
3. వెనిగర్
4. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా
5. కాఫీ
1) 1, 3, 5 2) 2, 5
3) 4, 5 4) 2, 4
169. VSPER సిద్ధాంతానికి సంబంధించిన వ్యక్తులు?
1. సిట్జివిక్ 2. పావెల్
3. గిలెప్సీ 4. నైహామ్
1) 1, 2 2) 2, 3
3) 3, 4 4) 1, 2, 3, 4
170. జతపరచండి
ఎ. లోథర్ మేయర్ 1. పరమాణు భారం
బి. మెండలీఫ్ 2. పరమాణు పరిమాణం
సి. మోస్లీ 3. పరమాణు సంఖ్య
డి. త్రిక సిద్ధాంతం 4. థామ్సన్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-5
3) ఎ-2, బి-1, సి-3, డి-5
4) ఎ-2, బి-3, సి-2, డి-4
171. కింది వాక్యాలను పరిశీలించి సరైన వాక్యాలను గుర్తించండి
ఎ. రూర్కెలా స్టీలు ప్లాంటు జర్మనీ సహాయంతో స్థాపించబడింది
బి. దుర్గాపూర్ స్టీలు ప్లాంటు యు.ఎస్.ఎస్.ఆర్. సహాయంతో స్థాపించబడింది
సి. స్టీలు అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1974లో స్థాపించబడింది
డి. భిలాయ్ స్టీలు ప్లాంటు 1973లో స్థాపించబడింది
1) బి 2) డి
3) ఎ, సి 4) బి, డి
172. ఉత్తరం నుంచి దక్షిణానికి సింధూ నది ఉపనదుల సరైన క్రమాన్ని ఎంపిక చేయండి
ఎ. జీలం బి. సట్లెజ్
సి. చీనాబ్ డి. రావి
1) ఎ, సి, డి, బి 2) ఎ, డి, బి, సి
3) బి, ఎ, సి, డి 4) సి, ఎ, డి, బి
173. భారత్, మయన్మార్ల సంయుక్త ‘కాలదాన్ మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్’లో ఏ రవాణా సౌకర్యాలు ఉన్నాయి?
ఎ. రోడ్డు బి. రైల్వే
సి. నౌకాయానం
డి. అంతర్గత నీటి రవాణా
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
174. హిమాలయ పర్వతాలు ఏ ఐదు దేశాల్లో వ్యాపించి ఉన్నాయి?
1) భూటాన్, ఇండియా, నేపాల్, చైనా, పాకిస్థాన్
2) భూటాన్, ఇండియా, అఫ్గానిస్థాన్, చైనా, పాకిస్థాన్
3) భూటాన్, ఇండియా, నేపాల్, ఇండోనేషియా, పాకిస్థాన్
4) ఆస్ట్రేలియా, ఇండియా, నేపాల్, చైనా, పాకిస్తాన్
175. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతదేశం వివిధ రంగాల్లో విజయాలు సాధించింది. వీటికి విప్లవాలుగా నామకరణం చేశారు. విప్లవాలను సంబంధిత రంగాల్లో జతపరచండి
ఎ. వెండి విప్లవం 1. నూనె విత్తనాల ఉత్పత్తి
బి. పసుపుపచ్చ విప్లవం 2. మత్స్య సంపద
సి. నీలి విప్లవం 3. బంగాళాదుంపల ఉత్పత్తి
డి. గుండ్రటి విప్లవం 4. గుడ్ల ఉత్పత్తి
1) ఎ-3, బి-2, సి-1, డి-4
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-4, బి-1, సి-1, డి-3
176. కింది వాటిని జతపరచండి
1. హేమంత రుతువు ఎ. మే-జూన్
2. గ్రీష్మ రుతువు బి. సెప్టెంబర్- అక్టోబర్
3. శిశిర రుతువు సి. నవంబర్- డిసెంబర్
4. శరత్ రుతువు డి. జనవరి-ఫిబ్రవరి
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
177. సరైన దాన్ని గుర్తించండి
ప్రతిపాదన (ఎ) – ఎడారుల్లో పెరిగే మొక్కలకు ఆకులు ఉండవు
కారణం (ఆర్) – ఈ మార్పు బాష్పోత్సేకాన్ని నిరోధించేందుకు ఉపకరిస్తుంది
1) (ఎ), (ఆర్) సరైనవే, (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) సరైనవే, (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కానీ (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు కానీ (ఆర్) నిజం
178. సరైనదాన్ని గుర్తించండి
ప్రతిపాదన (ఎ) – భారతదేశం నుంచి ప్రవహించే నదుల్లో గోదావరి పొడవైనది
కారణం (ఆర్) – గంగానది భరతదేశంలో సుమారు 2415 కి.మీ. దూరం ప్రవహిస్తుంది
1) (ఎ), (ఆర్) సరైనవే, (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) సరైనవే, (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కానీ (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు కానీ (ఆర్) నిజం
179. కింది వాటిని జతపరచండి
1. రుద్రమాత ఎ. పంజాబ్, హర్యానా
2. త్రివేణి బి. రాజస్థాన్
3. బనాస్ సి. బీహార్
4. సర్హింద్ డి. గుజరాత్
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
180. కింది వాటిని జతపరచండి
1. స్థానబద్ధ మృత్తికలు ఎ. పీట్ మృత్తికలు
2. జోనల్ మృత్తికలు బి. నల్లరేగడి మృత్తికలు
3. ఇంట్రాజోనల్ మృత్తికలు సి. ఎర మృత్తికలు
4. అజోనల్ మృత్తికలు డి. ఒండ్రు మృత్తికలు
1) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
181. జతపరచండి
1. ఉత్తరాయణం ఎ. డిసెంబర్ 23 నుంచి జూన్ 21 మధ్యకాలం
2. దక్షిణాయణం బి. జూన్ 22 నుంచి డిసెంబర్ 22 మధ్య కాలం
3. మార్చి 21 సి. వసంతకాలం విషవత్తు
4. సెప్టెంబర్ 23 డి. శరద్కాల విషవత్తు
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ 2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
182. జతపరచండి
1. ఏంజెల్ జలపాతం ఎ. దక్షిణాఫ్రికా
2. రుగెలా జలపాతం బి. వెనెజులా
3. విక్టోరియా జలపాతం సి. భారతదేశం
4. జెర్సోప్పా జలపాతం డి. ఆఫ్రికా
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి 2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
183. సరైనది గుర్తించండి
ఎ : బసాల్ట్ శిలలు విచ్ఛిన్నం చెందడం వల్ల ‘నల్లరేగడి’ నేలలు ఏర్పడును
ఆర్ : నల్లరేగడి నేలలో నల్లని రంగుకు కారణం ఇనుము, మెగ్నీషియం ఆక్సైడ్
1) (ఎ)కు (ఆర్) సరైనది 2) (ఎ)కు (ఆర్) సరైనది కాదు
3) (ఎ) మాత్రమే సరైనది 4) (ఆర్) మాత్రమే సరైనది
184. జతపరచండి
1. గ్రేట్ డివైడింగ్ రేంజ్ ఎ. ఖండ పర్వతం
2. డ్రాకెన్స్ బర్గ్ రేంజ్ బి. అగ్ని పర్వతం
3. అపలేచియన్ పర్వతాలు సి. ముడత పర్వతం
4. రైనర్ పర్వతాలు డి. అవశిష్ట పర్వతం
1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి 2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-బి 4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సమాధానాలు
156.4 157.1 158.3 159.3 160.1 161.4 162.4 163.3 164.1 165.1 166.4 167.2 168.4 169.4 170.3 171.3 172.1 173.2 174.1 175.4 176.2 177.1 178.4 179.4 180.2 181.3 182.1 183.2
184.1
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?