భారత అటవీ నివేదిక-2021
-నివేదిక పేరు- ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్ఆర్)
-విడుదల చేసేది- ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (పర్యావరణ, అటవీ అండ్ పర్యావరణ మార్పుల మంత్రిత్వ శాఖ).
ఎడిషన్- 17
– తొలి ఎడిషన్- 1987 (ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి)
-డేటా పీరియడ్- 2019-20
-ఉపగ్రహం- రిసోర్సెస్ శాట్-2
ప్రపంచంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల దేశాలు
1) రష్యా 2) బ్రెజిల్
3) కెనడా 4) యూఎస్ఏ
5) చైనా 6) ఆస్ట్రేలియా
7) డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో
8) ఇండోనేషియా 9) పెరూ
10) భారత దేశం
– 2010-20 మధ్య అత్యధిక వార్షిక నికర అటవీ పెరుగుదల గల దేశాలు-
1) చైనా 2) ఆస్ట్రేలియా
3) భారత దేశం 4) చిలీ
-l దేశంలో మొత్తం కార్బన్ స్టాక్- 7204 మిలియన్ టన్నులు
-దేశంలో మొత్తం టైగర్ రిజర్వ్‌లు- 52 (అత్యధికం- మధ్యప్రదేశ్, మహారాష్ట్ర- 6 చొప్పున)
-దేశంలో టైగర్ రిజర్వ్‌ల విస్తీర్ణం- 74,710 చ.కి.మీ.
-దేశంలో మొత్తం పర్వత జిల్లాలు (Hill Districts)- 140 (అత్యధికం- జమ్ముకశ్మీర్-22, అరుణాచల్ ప్రదేశ్-16)
ముఖ్యాంశాలు
-మొత్తం అటవీ విస్తీర్ణం (Total Forest Area)- 24.62 శాతం (Forest+Tree )
-అటవీయేతర భూమి- 76.87 శాతం
-మొత్తం ఫారెస్ట్ కవర్ (Foresr Cover)- 21.71 శాతం
ఫారెస్ట్ ఏరియా/రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా
-ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా అటవీ భూమిగా చూపిన దానిని ఫారెస్ట్ ఏరియా లేదా రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అని అంటారు. దీనికి చట్టబద్ధత (Legal Status) ఉంటుంది.
ఫారెస్ట్ కవర్ (Forest Cover)
– నిర్దిష్ట భూభాగంలోని చెట్ల శాతాన్ని ఫారెస్ట్ కవర్ అని అంటారు. లేదా ఒక హెక్టార్ కంటే ఎక్కువ విస్తీర్ణంగల భూభాగంలో 10 శాతం కంటే ఎక్కువ చెట్ల సాంద్రత ఉంది. దానిని ఫారెస్ట్ కవర్ అని అంటారు.
అటవీ విస్తీర్ణం – విభజన
-అత్యంత దట్టమైన అడవి (Very Dense)- 99,779 చ.కి.మీ.- 3.04 శాతం
– మాధ్యమిక దట్టమైన అడవి (Moderate Dense)- 3,06,890 చ.కి.మీ. – 9.33 శాతం
-ఓపెన్ ఫారెస్ట్ (OF) – 3,07,120 చ.కి.మీ.- 9.34 శాతం
– మొత్తం ఫారెస్ట్ కవర్ – 7,13,789 చ.కి.మీ.- 21.71 శాతం
– ట్రీ కవర్ (చెట్లు)- 95,748 చ.కి.మీ.
– 2.91 శాతం
మొత్తం ఫారెస్ట్ ఏరియా
– 8,09,537 చ.కి.మీ.- 24.62 శాతం
l పొదలు (Scrubs)- 46,539 చ.కి.మీ. – 1.42 శాతం
ప్రత్యేకతలు
– టైగర్ రిజర్వ్, టైగర్ కారిడార్స్, గిర్ ఫారెస్ట్‌లలో తొలిసారి ఫారెస్ట్ కవర్‌ను అంచనా వేశారు.
– అత్యధిక అటవీ పెరుగుదల కనిపించిన టైగర్ రిజర్వ్- బక్సా (పశ్చిమ బెంగాల్), అన్నామలై (తమిళనాడు), ఇంద్రావతి (ఛత్తీస్‌గఢ్), కవ్వాల్ (తెలంగాణ), భద్ర (కర్ణాటక), సుందర్బన్స్ (పశ్చిమ బెంగాల్)
-అత్యధిక ఫారెస్ట్ కవర్ (97 శాతం) కలిగిన టైగర్ రిజర్వ్- పక్కే టైగర్ రిజర్వ్ (అరుణాచల్ ప్రదేశ్)
దేశంలో మొత్తం అటవీ భూమి: 8,09,537 చ.కి.మీ.- 24.62 శాతం
-అత్యధిక అటవీ విస్తీర్ణంగల రాష్ట్రాలు (ఫారెస్ట్ + ట్రీ కవర్)
1) మధ్యప్రదేశ్ (94,689 చ.కి.మీ.)
2) మహారాష్ట్ర (61,952 చ.కి.మీ.)
3) ఒడిశా (61,204 చ.కి.మీ.)
4) ఛత్తీస్‌గఢ్ (59,816 చ.కి.మీ.)
5) అరుణాచల్ ప్రదేశ్ (51,540 చ.కి.మీ.)
ఫారెస్ట్ కవర్ అత్యధికంగా గల రాష్ట్రాలు
1) మధ్యప్రదేశ్ (77,493 చ.కి.మీ.)
2) అరుణాచల్‌ప్రదేశ్
3) ఛత్తీస్‌గఢ్
4) ఒడిశా
5) మహారాష్ట్ర
శాతం పరంగా అత్యధిక ఫారెస్ట్ కవర్ గల రాష్ట్రాలు
1) మిజోరం (84.53 శాతం)
2) అరుణాచల్‌ప్రదేశ్ (79.33 శాతం)
3) మేఘాలయ (76 శాతం)
4) మణిపూర్ (74.34 శాతం)
5) నాగాలాండ్ (73.90 శాతం)
2019-21 మధ్య అత్యధిక అటవీ పెరుగుదల గల రాష్ట్రాలు
1) ఆంధ్రప్రదేశ్ (647 చ.కి.మీ.)
2) తెలంగాణ (638 చ.కి.మీ.)
3) ఒడిశా (537 చ.కి.మీ.)
4) కర్ణాటక (155 చ.కి.మీ.)
2019-21మధ్య భారీగా అటవీ విస్తీర్ణం తగ్గిపోయిన రాష్ట్రాలు
1) అరుణాచల్‌ప్రదేశ్ (-257 చ.కి.మీ.)
2) మణిపూర్ (-249 చ.కి.మీ.)
3) నాగాలాండ్ (-235 చ.కి.మీ.)
4) మిజోరం (-186 చ.కి.మీ.)
2019-21 మధ్య దేశంలో పెరిగిన అటవీ విస్తీర్ణం- 2261 చ.కి.మీ.- ఫారెస్ట్ కవర్ 1540 చ.కి.మీ. + ట్రీ కవర్ 721 చ.కి.మీ.
-దేశంలో 33 శాతం కంటే అధికంగా అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు/యూటీలు- 17
-తమ భౌగోళిక విస్తీర్ణంలో 75 శాతం మించి అటవీ భూమి గల రాష్ట్రాలు/యూటీలు- 5 (1. లక్షద్వీప్, 2. మిజోరం, 3. అండమాన్ నికోబార్ దీవులు, 4. అరుణాచల్ ప్రదేశ్, 5. మేఘాలయ)
ట్రీ కవర్ అత్యధికంగా గల రాష్ట్రాలు
1) మహారాష్ట్ర (12,108 చ.కి.మీ.)
2) రాజస్థాన్ (8733 చ.కి.మీ.)
3) మధ్యప్రదేశ్ (8054 చ.కి.మీ.)
4) కర్ణాటక (7494 చ.కి.మీ.)
5) ఉత్తరప్రదేశ్ (7421 చ.కి.మీ.)
శాతం పరంగా ట్రీ కవర్ అత్యధికం గల రాష్ట్రాలు/యూటీలు
1) చండీగఢ్ (13.16 శాతం)
2) ఢిల్లీ (9.91 శాతం)
3) కేరళ (7.26 శాతం)
4) గోవా (6.59 శాతం)
ట్రీ అవుట్‌సైడ్ ఫారెస్ట్ అత్యధిక విస్తీర్ణం గల రాష్ట్రాలు
1) మహారాష్ట్ర (26,866 చ.కి.మీ.)
2) ఒడిశా (24,474 చ.కి.మీ.)
3) కర్ణాటక (23,676 చ.కి.మీ.)
వెదురు అరణ్యాలు అత్యధికంగా గల రాష్ట్రాలు
1) మధ్యప్రదేశ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) మహారాష్ట్ర
దేశంలో మడ అడవులు గల రాష్ట్రాలు/ యూటీలు – 9+3 = 12
1) ఆంధప్రదేశ్- 405 చ.కి.మీ.
2) గోవా- 27 చ.కి.మీ.
3) గుజరాత్- 1175 చ.కి.మీ.
4) కర్ణాటక- 13 చ.కి.మీ.
5) కేరళ- 9 చ.కి.మీ.
6) మహారాష్ట్ర- 324 చ.కి.మీ.
7) ఒడిశా- 259 చ.కి.మీ.
8) తమిళనాడు- 45 చ.కి.మీ.
9) పశ్చిమ బంగ- 2114 చ.కి.మీ.
10) అండమాన్ నికోబార్ దీవులు- 616 చ.కి.మీ.
11) దమన్ దీవ్ అండ్ దాద్రానగర్ హవేలీ- 3 చ.కి.మీ.
12) పుదుచ్చేరి- 2 చ.కి.మీ.
అత్యధికంగా మడ అడవులు గల రాష్ట్రాలు
1) పశ్చిమ బంగ (2114 చ.కి.మీ.)
2) గుజరాత్ (1175 చ.కి.మీ.)
-యూటీ- అండమాన్ నికోబార్ దీవులు (616 చ.కి.మీ.)
ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవులు గల జిల్లాలు- 6 (తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం). అత్యధికం తూర్పు గోదావరి (187.8 చ.కి.మీ.), అత్యల్పం పశ్చిమ గోదావరి (0 చ.కి.మీ.)
-దేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం- 4992 చ.కి.మీ.
ఇతర అంశాలు
– దేశంలో మొత్తం అడవుల్లో 35.46 శాతం కార్చిచ్చు ప్రమాదంలో ఉన్నాయి.
– 2030 నాటికి 45-64 శాతం అడవుల వాతావరణ మార్పులకు గురికానున్నాయి. దీనిలో
-అత్యంత ప్రభావం చెందేది- లడఖ్
-2019తో పోలిస్తే దేశంలో 79.4 మిలియన్ టన్నుల కార్బన్ స్టాక్ దేశంలో పెరిగింది.
-2019తో పోలిస్తే దేశంలో 17 చ.కి.మీ. మడ అడవులు పెరిగాయి.
-దేశంలో దట్టమైన అడవులు (VDF), ఓపెన్ ఫారెస్ట్ లలో పెరుగుదల కనిపించగా, మధ్యస్థ అడవుల్లో తగ్గుదల కనిపించింది.
అతి తక్కువ అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు
1) గోవా- 1271 చ.కి.మీ.
2) హర్యానా- 1559 చ.కి.మీ.
3) పంజాబ్- 3084 చ.కి.మీ.
4) సిక్కిం- 5841 చ.కి.మీ.
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో శాతం పరంగా అతి తక్కువ అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు
1) హర్యానా- 3.53 శాతం
2) పంజాబ్- 6.12 శాతం
3) ఉత్తరప్రదేశ్- 7.22 శాతం
4) బీహార్- 7.90 శాతం
కేంద్ర పాలిత ప్రాంతాలు
1) జమ్ముకశ్మీర్- 20.199 చ.కి.మీ.
2) అండమాన్ నికోబార్ దీవులు- 7171 చ.కి.మీ.
3) లడఖ్- 7 చ.కి.మీ.
4) దాద్రానగర్ హవేలీ అండ్ దమన్ దీవ్- 214 చ.కి.మీ.
5) ఢిల్లీ- 103 చ.కి.మీ.
6) చండీఘర్- 35 చ.కి.మీ.
7) పుదుచ్చేరి- 13 చ.కి.మీ.
8) లక్షద్వీప్- 0 చ.కి.మీ.
శాతం పరంగా
1) అండమాన్ నికోబార్ దీవులు- 86.93 శాతం
2) జమ్ముకశ్మీర్- 36.98 శాతం
3) దాద్రానగర్ హవేలీ అండ్ దమన్ దీవి- 35.55 శాతం
4) చండీఘర్- 30.70 శాతం
l తెలంగాణ- 27,688 చ.కి.మీ. (24.70 శాతం)
l ఆంధ్రప్రదేశ్- 37,258 చ.కి.మీ. (22.86 శాతం)
ఫారెస్ట్ కవర్
l ఆంధ్రప్రదేశ్- 29,784 చ.కి.మీ. (18.28 శాతం)
l తెలంగాణ- 21,124 చ.కి.మీ. (18.93 శాతం)
పులుల గణన-2020
దేశంలోని మొత్తం పులులు- 2967 (2018), 2226 (2014 నాటికి)
రాష్ట్రాలు/జోన్ల వారీగా పులుల సంఖ్య
– శివాలిక్-గంగా మైదానం- 646
– మధ్య భారతదేశం+తూర్పు కనుమలు- 1033
– పశ్చిమ కనుమలు- 981
– పూర్వాంచల్ హిమాలయాలు+బ్రహ్మపుత్ర నదీలోయ- 219
– ఉత్తరాఖండ్- 442
-ఉత్తరప్రదేశ్- 173
– బీహార్- 31
– రాజస్థాన్- 69
-అరుణాచల్ ప్రదేశ్- 29
-అసోం- 190
– మధ్యప్రదేశ్- 526
-మహారాష్ట్ర- 312
-ఛత్తీస్‌గఢ్- 19
-జారండ్- 5
– ఒడిశా- 28
-తెలంగాణ- 26
-ఆంధ్రప్రదేశ్- 48
-గోవా- 3
-కర్ణాటక- 524
– కేరళ- 190
-తమిళనాడు- 264
సంవత్సరాలవారీగా పులుల పెరుగుదల
-2006- 1411
-2010- 1706
-2014- 2226
– 2018- 2967
ఇతర ముఖ్యాంశాలు
– ప్రపంచ పులుల వాటాలో భారతదేశ వాటా- 70 శాతం
-ప్రపంచంలో అత్యధిక పులుల కలిగిన దేశం- భారత్
– దేశంలోని మొత్తం టైగర్ రిజర్వ్ లు- 50
– దేశంలో ప్రతి 4 ఏండ్లకోసారి పులుల గణన జరుగుతుంది.
-దేశవ్యాప్తంగా పులుల సంఖ్యను లెక్కించే సంస్థ- నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ)
-2018-19 పులుల గణన 76,651 పులుల ఫొటోలను తీసి గిన్నిస్ రికార్డు సాధించింది.
-141 వేర్వేరు ప్రాంతాలు
-26,838 ప్రదేశాలు
– 1,21,337 చ.కి.మీ. విస్తీర్ణం
-3,48,58,623 ఫొటోలు
– 76,651 పులుల ఫొటోలు, 51,777 చిరుతలు+ఇతర జంతువుల ఫొటోలు
-పులి కూనలు- 2461
పీ శ్రీరామ్‌చంద్ర
గ్రూప్స్ మెంటార్
హైదరాబాద్
8008356825
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు