ఎస్ఐ ప్రిలిమ్స్ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు గడువు ఆగస్టు 15
ఈ నెల 7వ తేదీన నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ కీ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాస్ రావు ప్రకటన విడుదల చేశారు. ఎస్ఐ ప్రిలిమ్స్ ప్రాథమిక కీ కోసం www.tslprb.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. ప్రాథమిక కీపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 15న సాయంత్రం 5 గంటలకు వరకు బోర్డుకు తెలియజేయాలని సూచించారు.
అభ్యంతరం ఉన్న ఒక్కో ప్రశ్నకు వేర్వేరుగా వెబ్సైట్లో సూచించిన విధానంలోని టెంప్లేట్స్ ఫార్మెట్లో ఆన్లైన్లోనే పంపాలని సూచించారు. తమ అభ్యంతరాన్ని ధ్రువీకరించేందుకు సరైన పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను పీడీఎఫ్ లేదా జేపీఈజీ ఫార్మెట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. అసంపూర్తి సమచారంతో పంపే అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోజాలమని పేర్కొన్నారు. అదే విధంగా మ్యానువల్‌గా పంపే అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకోమని, కేవలం ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలని పేర్కొన్నారు. కాగా, వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 554 ఎస్సై పోస్టులకుగాను రాష్ట్రవ్యాప్తంగా 2,25,759 మంది అభ్యర్థులు ఈ నెల 7న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు హాజరైన విషయం తెలిసిందే.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?