టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
టీఎస్ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఉదయం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్‌లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులవగా, అగ్రికల్చర్లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి వెల్లడించారు. ఎంసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
మొదటి విడుత షెడ్యూల్..
ఆగస్టు 21 నుంచి 29 వరకు ఆన్ లైన్ స్లాట్ బుకింగ్
ఆగస్టు 23 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన
ఈనెల 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు
సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు
రెండో విడుత షెడ్యూల్..
సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్ లు
సెప్టెంబరు 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు
అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
మూడో విడుత షెడ్యూల్..
అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్
అక్టోబరు 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన
అక్టోబరు 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ
ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను జులై 18 నుంచి 21 వరకు నిర్వహించారు. మొత్తం 1,72,243 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 1,56,860 మంది హాజరయ్యారు. వీరిలో 1,26,140 మంది ఉత్తీర్ణత (80.41 శాతం) సాధించారు. అదేవిధంగా అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌కు 94,476 మంది దరఖాస్తు చేసుకోగా, 80,575 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 71,180 మంది (88.34 శాతం) అర్హత సాధించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు