Chicken hearted fellow
కానిస్టేబుల్ పరీక్షలో అర్థశాస్ర్తానికి సంబంధించి చాలా వరకు ప్రాథమిక అంశాలపైనే ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు, ప్రణాళికలు, బడ్జెట్, బ్యాంకింగ్ వ్యవస్థ, దారిద్య్ర రేఖ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పన్నులు, ఎగుమతులు, దిగుమతులు, ప్రభుత్వం చేపట్టిన వివిధ పేదరిక, నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాలు, ముఖ్యంగా భారతదేశ ప్రణాళికల అధ్యయనం చాలా కీలకమైనవి.
పోలీస్ కానిస్టేబుల్ రాతపరీక్షలో ఇంగ్లీష్ విభాగం నుంచి 15 నుంచి 25 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటిలో Spelling Test, Synonyms, Antonyms, Idiom/Phrases, One word substitutes, Articles, Parts of Speech, Tense, Degree of Comparison, Comprehension మొదలైన అంశాలకు సంబంధించిన ప్రశ్నలను ఇస్తున్నారు. వీటిలో ప్రశ్నల క్లిష్టత ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుంది.
గతంలో వచ్చిన ప్రశ్నలు:
1. Choose the correctly spelt word from the fowling. (1)
1) achivement 2) acheicment
3) achievment 4) achevement
8 Synonyms: సినానిమ్స్కు సంబంధించిన ప్రశ్నలు తప్పనిసరిగా వస్తున్నాయి. ఇచ్చిన పదానికి దగ్గరి అర్థం వచ్చే జవాబును గుర్తించాలి.
8 Antonyms: వ్యతిరేక పదాలు.
నోట్: సినానిమ్స్, ఆంటోనిమ్స్కు సంబంధిం చి వర్డ్ బ్యాంక్‌ను తయారు చేసుకోవాలి. అంటే ఒకే పదానికి సంబంధించి సమానార్థం, వ్యతిరేకార్థం ఒకేచోట రాసుకొని నోట్స్ తయారుచేసుకుంటే ప్రిపరేషన్ సులభమవుతుంది.
Choose the opposite word for the given words:
1. Brare (2)
1) worse 2) afraid
3) destroy 4) clean
2. Domestic (1)
1) foreign 2) problem
3) comfort 4) fear
3. Guilty (4)
1) punishment 2) enemy
3) ignore 4) innocent
Choose the closest meaning of the given words:
1. Agony (4)
1) collect 2) care
3) mad 4) pain
– Idioms and Phrases and one word substitutes: భాషపై పట్టు, సందర్భోచితంగా పదాల ప్రయోగం మొదలైన అంశాలను పరీక్షించడానికి ఈ విభాగాన్ని పొందుపరిచారు. జాతీయాలు, ఏకపద ప్ర యోగం మొదలైన అంశాలను సులభంగా సాధించాలంటే Idiomsకి సంబంధించిన పూ ర్తి అవగాహన ఉండాలి. అంటే వాటి అర్థం, వాడే సందర్భం వంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
1. To get rid of (2)
1) To get hod of
2) To be free from
3) To get owenrship of
4) To get a present
– Parts of Speech: భాషాభాగాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రశ్ని స్తున్నారు. ముఖ్యంగా వెర్బ్స్, ప్రిపోజిషన్స్, అడ్జెక్టివ్స్, కన్జెక్షన్స్పై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.
– Articles: వీటికి సంబంధించి కూడా పూర్తి అవగాహనతో ఉండాలి.
Definite article – the
Indefinite artice – a, an
Omission of article – no article మొదలైన సందర్భాలకు సంబంధించిన అన్ని అంశాలను పూర్తిగా చదవాలి.
– టెన్సెస్, డిగ్రీ ఆఫ్ కంపారిజన్ విభాగాలకు చెందిన అంశాలపై కూడా ప్రశ్నలు ఇస్తా రు. అయితే ప్రత్యేకంగా కాకుండా పైఅంశాలన్నింటినీ పొందుపరిచే విధంగా ఒకే విభాగంలో Choose the most effective word or appropriate word అని ప్రశ్నిస్తున్నారు.
– Comprehension of Pass-ages: Comprehend అంటే under- stand or grasp mentally అని అర్థం. Comprehenseion passageను అభ్యర్థి సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఇస్తారు. ప్యాసేజ్ను ఎక్కువసార్లు చదవడం ద్వారా ప్యాసేజ్లో ఉన్న ముఖ్యవిషయాలను అర్థం చేసుకొని, కింద ఇచ్చిన ప్రశ్నలకు సొంత వాక్యాల్లో జవాబులు రాయాలి.
చాలెంజింగ్ కెరీర్‌ను ఎంచుకునే యువతకు ముందు వరసలో ఉండేది పోలీస్ ఉద్యోగం. పోలీస్ ఉద్యోగం చేయాలంటే ధైర్యంతో పాటు ప్రజలకు సేవ చేయాలనే భావన ఉండాలి. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే ఉద్యోగాల్లో పోలీస్ ఉద్యోగం ముఖ్యమైంది. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మొదటగా వచ్చేది కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ వంటి పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ అని తెలుస్తోంది.
ఇప్పటి వరకు పోలీస్ పోస్టుల ఎంపిక విధానంలో ముందుగా శారీరక సామర్థ్యాన్ని పరీక్షించే ఫిజికల్ టెస్ట్ నిర్వహించి ఆ తర్వాత రాత పరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేసేవారు.
అయితే ఇప్పడు ఇందులో కొన్ని మార్పులు చేశారు. ముందుగా రాత పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభ కనబర్చిన వారికే ఫిజికల్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించారు. అంటే శారీరక సామర్థ్యానికి ప్రాముఖ్యత తగ్గిం చి మేథాశక్తికి, ఆలోచనా విధానానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టమవుతుంది. ఇదే విషయాన్ని ఇటీవల డీజీపీ అనురాగ్‌శర్మ సూచనప్రాయంగా తెలిపారు.
ఎంపిక విధానం
కానిస్టేబుల్ : ఇప్పటి వరకు పాటిస్తున్న విధానాలు
1) శారీరక సామర్థ్య పరీక్ష,
2) రాత పరీక్ష
శారీరక సామర్థ్య పరీక్ష
ఇందులో 5 కి.మీ పరుగు, 100 మీ. పరుగు, 800 మీటర్ల పరుగు, హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌ఫుట్ త్రో ఉంటాయి.
– 5 కి.మీ పరగు -25 నిమిషాలు (పురుషులు)
– 2.5 కి.మీ పరుగు-25 నిమిషాలు (మహిళలకు)
(ఇందులో మార్పులు చేసే అవకాశం ఉంది)
ఈవెంట్స్
– 100 మీటర్ల పరుగు-15 సెకండ్లు
– లాంగ్‌జంప్-3.8 మీటర్లు
– హైజంప్ – 1.20 మీటర్లు
– షాట్‌ఫుట్ త్రో-5.60 మీటర్ల దూరం విసరాలి.
– 800 మీటర్ల పరుగు -170 సెకండ్లు
వీటిలో లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌ఫుట్ త్రో అంశాల్లో మార్పులు లేకుండా అలాగే ఉండే అవకాశం ఉంది.
రాత పరీక్ష
ఇందులో 200 మార్కులకు 200 ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. సమయం 3 గంటలు. ఇందులో భారతదేశ చరిత్ర, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్, కరెంట్ ఎఫైర్స్, అర్థమెటిక్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ విభాగాలపై ప్రశ్నలు ఉంటాయి. ఈ రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
గమనించవలసిన అంశాలు
– అర్థమెటిక్, రీజనింగ్‌లో ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రాక్టీస్ ఒక్కటే మార్గం.
– షార్ట్‌కట్స్ నేర్చుకుంటే సమయం వృథా కాకుండా ఉంటుంది. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఈ విభాగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
– జనరల్ స్టడీస్‌కు సొంతంగా నోట్స్ రాసుకోవాలి. టేబుల్స్ తయారు చేసుకోవాలి. వీలైనన్ని ఎక్కువ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి.
– సిలబస్ సంపూర్ణంగా అవగాహన చేసుకొని ప్రణాళికాబద్ధంగా ప్రిపేరైతే విజయం సాధించవచ్చు.
– కరెంట్ అఫైర్స్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. గత ఆరు నెలల సంఘటనల వివరాలను క్షుణ్ణంగా చదవాలి. స్టాక్ జీకే పై దృష్టి సారించాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?