SI Prelims Grand Test Paper-2022 (6)
182. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి
ఎ. మృత్తిక పైపొరలు పొరలుగా కొట్టుకుపోవడాన్ని పట క్రమక్షయం అంటారు
బి. అవనాళిక క్రమక్షయం వల్ల సాగు భూమిలో సన్నని, పొడవైన గుంతలను రావైన్స్ అని పిలుస్తారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) పైవేవికావు
183. మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది?
1) మధ్యప్రదేశ్ 2) రాజస్థాన్
3) ఉత్తరప్రదేశ్ 4) హిమాచల్ ప్రదేశ్
184. కింది జతలను పరిశీలించండి
పరిశ్రమ/ప్రాజెక్టు రాష్ట్రం/ప్రదేశం
ఎ. భారతదేశంలో పట్టు పరిశ్రమకు ప్రసిద్ధి 1. కర్ణాటక
బి. భారతదేశంలో ఆధునిక వస్త్ర పరిశ్రమకు ఆది 2. సూరత్
సి. భారతదేశంలో అత్యధిక ముడి మైకాఉత్పత్తి రాష్ట్రం 3. ఆంధ్రప్రదేశ్
డి. భారతదేశంలో మొట్టమొదటి జనపనారకర్మాగారంప్రారంభమైన ప్రదేశం 4. రిష్రా
1) ఎ, బి, సి 2) సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
185. పాపనాశనం జల విద్యుత్ పథకం ఏ నది మీద ఉంది?
1) కావేరి 2) తామ్రపర్ణి
3) నోమర్ 4) కొడయార్
186. కింది వ్యాఖ్యలను పరిశీలించండి
ఎ. భారత ప్రభుత్వం 2017 సంవత్సరాన్ని ‘చిరుధాన్యాల జాతీయ సంవత్సరం’గా ఆమోదించింది
బి. పూర్వ-హరిత విప్లవ శకంలో, 1965-66లో 36.90 మిలియన్ హెక్టార్లలో చిరుధాన్యాలను సాగుచేశారు
సి. భారతదేశంలో తక్కువ సారవంతమైన భూమి, పర్వతాలు, గిరిజన, వర్షపు ప్రాంతాల్లో చిరుధాన్యాలను ఎక్కువగా సాగు చేస్తారు
1) ఎ, సి 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, బి, సి
187. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రణాళికా సంఘం ఏ లక్షణం దృష్ట్యా వెనుకబడిన దేశాన్ని నిర్వచించింది?
1) మానవ వనరుల అనుపయోగిత లేదా అల్ప ఉపయోగితా, శోధింపబడని సహజ వనరులు కలిసి ఉండటం
2) పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు కలిసి ఉండటం
3) అవస్థాపనా సౌకర్యాలు అధికంగా అభివృద్ధి చెంది ఉండటం, పేదరికం, నిరుద్యోగిత కలిసి ఉండటం
4) అల్ప ఎగుమతులు, అధిక దిగుమతులు కలిసి ఉండటం
188. జాతీయాదాయ విశ్లేషణలో భాగంగా వైయుక్తిక ఆదాయంలో ఇమిడి ఉండే అంశాలు ?
ఎ. ప్రత్యక్ష పన్నులు బి. పరోక్ష పన్నులు
సి. తరుగుదల డి. బదిలీ చెల్లింపులు
ఇ. ఎగుమతులు, దిగుమతులు
ఎఫ్ . మధ్యంతర వస్తువులు
1) ఎ, బి, సి 2) బి, డి, ఇ
3) ఎ, డి 4) ఎ, సి, ఇ, ఎఫ్
189. అర్థశాస్త్రంలో 1998 నోబెల్ పురస్కారాన్ని భారతీయ ఆర్థికవేత్త ఆచార్య అమర్త్యసేన్ కు బహూకరించారు. కింది గ్రంథాల్లో అమర్త్యసేన్ రచించిన ఏవి?
ఎ. ది ఐడియా ఆఫ్ జస్టిస్
బి. ఎ స్సేస్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ సమ్ రెమినిసేన్సెస్
సి. ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్
డి. త కంట్రీ ఆఫ్ ఫస్ట్బోయిస్ : అండ్ అదర్ ఎ స్సేస్
ఇ. వేస్ట్ ఆఫ్ ఏ నేషన్ : గ్రోత్ అండ్ గార్బేజ్ ఇన్ ఇండియా
1) ఎ, బి, డి, ఇ 2) ఎ, సి, డి
3) సి, ఇ 4) బి, సి, ఇ
190. కింది వాక్యాలను పరిశీలించండి
ఎ. భారతదేశ పరిధిలో వాణిజ్య బ్యాంకుల నుంచి భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకునే అప్పుపై చెల్లించే రేటును ‘రెపో రేటు’ అంటారు
బి. వాణిజ్య బ్యాంకులకు ఏమైనా నిధుల కొరత ఏర్పడినప్పుడు రిజర్వు బ్యాంక్ ఇచ్చే అప్పుపై విధించే వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల చొప్పున వరుసగా 6.25%, 6.5%కు పెంచింది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) సి
191. కింది వాటిని వరుసక్రమంలో అమర్చండి
ఎ. ఎనిమిది సూత్రాల పథకం
బి. ముల్కి రూల్స్‌పై సుప్రీం కోర్టు తీర్పు
సి. ఆర్టికల్ 371డికు 32వ రాజ్యాంగ సవరణ
డి. ఆరు సూత్రాల పథకం
1) ఎ, సి, డి, బి 2) ఎ, బి, డి, సి
3) డి, ఎ, సి, బి 4) బి, సి, ఎ, డి
192. కింది వాటిని జతపరచండి
సంస్థ అధ్యక్షులు
ఎ. భావ సమైక్యత ప్రజా సంఘటన 1. అచ్యుత రెడ్డి
బి. తెలంగాణ ప్రజా సమితి 2. శ్రీమతి ఈశ్వరీబాయి
సి. రిపబ్లిక్ పార్టీ 3. టి. మదన్ మోహన్
డి. తెలంగాణ ఉద్యమ సమన్వయ సంఘం 4. రామానంద తీర్థ
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-4, బి-2, సి-1, డి-3
193. ప్రతిపాదన (ఎ) : ఆంధ్ర మహాసభ 1930వ సంవత్సరంలో స్థాపించారు.
కారణం (ఆర్ ) : ఆ సంస్థ అన్ని రంగాల్లో తెలుగు వారి అభివృద్ధికి కృషి చేసింది
1) (ఎ), (ఆర్ ) సరైనవి, (ఆర్ ), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్ ) సరైనవి, (ఆర్ ), (ఎ)కు సరైన వివరణ
3) (ఎ) సరైనది కాని (ఆర్ ) తప్పు
4) (ఎ) తప్పు కాని (ఆర్ ) సరైనది
194. ఎక్కడ బౌద్ధ స్తూపం లేని ప్రదేశాలు?
1) ధూళికట్ట 2) ఫణిగిరి
3) భావనకుర్తి 4) నేలకొండపల్లి
195. జతపరచండి
ఎ. దొమ్మరాట. 1.సంగీతం, నృత్యం, గానంతో కూడిన జానపద కళ
బి. యక్షగానం 2. కర్ర ఆట
సి. కాటి పాపలు 3. డోలు వాయిద్యం
డి. కోలాటం 4. చనిపోయిన వారికి చేసే మతపరమైన మంత్ర విద్య వేడుక
1) ఎ-2, బి-1, సి-3, డి-4 2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-3, బి-4, సి-1, డి-2 4) ఎ-1, బి-4, సి-2, డి-3
196. కింది అంశాల్లో సరైనవి?
ఎ. కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆదాయాలను మించి భారీగా ఖర్చు చేశాయి. దీంతో 2019తో పోలిస్తే 2020లో ప్రపంచ అప్పు దాదాపు 35 శాతం పెరిగి, 2021 నాటికి 226 లక్షల కోట్ల డాలర్లకు చేరిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్ ) వెల్లడించింది
బి. 2007 నాటికి అభివృద్ధి చెందిన దేశాల రుణభారం జీడీపీలో 70 శాతం ఉంది. 2021 నాటికి ఇది భారీగా పెరిగి 135 శాతానికి చేరింది
సి. ప్రపంచవ్యాప్తంగా లేదా దేశీయంగా జీడీపీలో 77 శాతం కంటే ఎక్కువ రుణం ఉంటే ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నట్లే అని ఐఎంఎఫ్ వెల్లడించింది
డి. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం దేశంలో 2022, జనవరి నాటికి అధిక రుణాలతో (జీఎస్డీపీలో అప్పుల శాతం ప్రకారం) సతమతమవుతున్న రాష్ట్రాల్లో పంజాబ్ (53.3%) అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (39.8%), పశ్చిమ బెంగాల్ (38.8%), కేరళ (38.3%), ఆంధ్రప్రదేశ్ (37.6%) ఉన్నాయి. తెలంగాణ 8వ స్థానంలో (25.27%) నిలిచింది
1) ఎ 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) పైవన్నీ
197. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్ పర్సన్ గా రెండోసారి నియమితులైనవారు?
1) మహేశ్ శ్రీవాస్తవ 2) విజయ్ సాంప్లా
3) గోపాల్ మంత్రేకర్
4) వినయ్ కశ్యప్
198. బీసీసీఐ దేశవాళీ అండర్ -25 టోర్నీ (కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ) విజేతగా నిలిచిన జట్టు?
1) విదర్భ 2) ముంబై
3) కర్ణాటక 4) తెలంగాణ
199. కింది అంశాల్లో సరైనవి?
ఎ. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు
బి. దేశ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో నాయకుడిగా మెక్రాన్ నిలిచారు
సి. 2022, ఏప్రిల్ 24న జరిగిన ఎన్నికల్లో మరీన్ లీ పేన్ పై మెక్రాన్ విజయం సాధించారు
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) పైవన్నీ
200. జాతీయ సీనియర్ మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తెలంగాణ క్రీడాకారిణి ఎవరు? (మహిళల డబుల్స్ విభాగంలోనూ ఈమె టైటిల్ గెలిచింది. జాతీయ సీనియర్ మహిళల టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచిన తొలి తెలంగాణ ప్లేయర్ ఈమె.)
1) ఆకుల శ్రీజ
2) మౌమా దాస్
3) అహిక ముఖర్జీ 4) ప్రాప్తి సేన్
సమాధానాలు
182.3 183.3 184.4 185.2 186.3 187.1 188.3 189.2 190.4 191.2 192.2 193.1 194.3 195.2 196.4
197.2 198.2 199.4 200.1
టాపర్స్ ఇన్ స్టిట్యూట్ ,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?