స్వాతంత్య్రానంతర దళిత ఉద్యమాలు -తెలంగాణ
తెలంగాణలో దళిత ఉద్యమం మొదట వెట్టిచాకిరీ, ఆస్పృశ్యతకు వ్యతిరేకంగా సాంఘిక సంస్కరణ ఉద్యమంగా ప్రారంభమైంది. క్రమేనా జాగీర్ధార్ వ్యవస్థకు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొనసాగింది. స్వాతంత్య్రానంతర హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, సాధికారత కోసం జరిగిన దళిత ఉద్యమాన్ని మూడు దశల్లో అవగాహన చేసుకోవచ్చు.
మొదటి దశ (1950-80)
ఈ దశల్లో వివిధ రాజకీయ పార్టీలు దళితుల సమస్యలపై పోరాటం చేశాయి. ఫలితంగా అనేక మంది దళితోద్యమ నాయకుల్ని ఈ దశ అందించింది. టి.ఎన్. సదాలక్ష్మి, కె. ఈశ్వరీబాయి, డి. వెంకటస్వామి వంటివారు ప్రముఖులు. తెలంగాణలో వెట్టిచాకిరీ అస్పృశ్యత, జోగిని వ్యవస్థ వంటి సామాజిక రుగ్మతలను తొలగించాలనే డిమాండ్ ఈ దశలోనే ప్రారంభమైంది.
రెండోదశ (1980-90)
దళితుల పట్ల ఆకృత్యాలు, కులహింస వంటి అంశాలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు ఈ దశలో పోరాటం చేశాయి. గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ వరకు నూతన దళిత నాయకత్వం ఈ దశలో ఆవిర్భవించింది.
మూడోదశ (1990- తర్వాత)
-ఈదశలో జరిగిన పోరాటాలు అనేక సంస్థల ఆవిర్భావానికి కారణమయ్యాయి. రిజర్వేషన్లలో భాగంగా దళితుల్లో ఉపకులాల వర్గీకరణ చేపట్టాలనే లక్ష్యంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) ఏర్పాటయింది. దళిత హక్కుల సాధన కోసం దళిత హక్కుల పోరాట సమితి (DHPS) ఏర్పడింది. కులనిర్మూలన పోరాట సమితి, కుల వివక్ష పోరాట సంఘం, అంబేద్కర్ యువజన సంఘం వంటి అనేక సంఘాలు దళితుల్లో చైతన్యాన్ని నింపడంతోపాటు సంఘటితానికి దోహదం చేశాయి. ఈ చైతన్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన ఉద్యమంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
– తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం ప్రవేశ పెడుతున్న దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు, సాంఘిక సంక్షేమ గురుకులాల పెంపు వంటి అనేక పథకాలకు మూలాలు తెలంగాణ దళితోద్యమంలో చూడవచ్చు.
-స్వాతంత్య్రానంతరం తెలంగాణలో దళితుల, సామాజిక సాంఘిక అభివృద్ధి కోసం జరిగిన ఉద్యమాలు దళితుల స్థితిగతులను గణనీయంగా మెరుగుపర్చాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
1. హైద్రాబాద్ అంబేద్కర్గా, రావూసాహెబ్ గా ఎవరు సుపరిచితులు?(బి)
ఎ) భాగ్యరెడ్డి వర్మ
బి) అరిగె రామస్వామి
సి) లక్ష్మయ్య డి) బి.ఎస్. వెంకట్రావ్
2. ఆది హిందూ గ్రంథాలయాన్ని స్థాపించింది ఎవరు?(ఎ)
ఎ) భాగ్యరెడ్డి వర్మ బి) హరిశ్చంద్ర హేడ
సి) శ్యామ్ కుమార్ డి) రామస్వామి
3. తెలంగాణ దళిత ఉద్యమానికి మూల పురుషుడిగా ఎవరు ప్రసిద్దులు?(బి)
ఎ) ఘనశ్యామ్ బి) భాగ్యరెడ్డి వర్మ
సి) బి.ఎస్.వెంకట్రావ్ డి) రాఘవయ్య
4. దళితులకు రాష్ట్ర శాసన సభలో కేంద్ర శాసన సభల ప్రాతినిధ్యం ఉండాలని భాగ్యరెడ్డి వర్మ ఏ సమావేశంలో తీర్మానించారు?(ఎ)
ఎ) అఖిల భారత హిందూ మహాసభ (అలహాబాద్ సమావేశంలో)
బి) అఖిల భారత హిందూ మహాసభ (లక్నో సమావేశంలో)
సి) నిజాం రాష్ట్ర ఆది హిందూ సదస్సు (హైదరాబాద్ సమావేశంలో
డి) ఆది హిందూ యూత్ సమావేశం (సికింద్రాబాద్ సమావేశంలో)
ఎం. ప్రవీణ్ కుమార్
విషయ నిపుణులు
21st సెంచరీ అకాడమీ
హైదరాబాద్
9704686009
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు