ఎస్ఐ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పేపర్ -2022 (5)
133. ఒక పదార్థం ఆక్సిజన్‌తో చర్య జరపటం వల్ల ఉష్ణం ఏర్పడే ప్రక్రియను ఏమంటారు?
1) దహనం
2) వికిరణం / రేడియేషన్
3) ఫ్లేమింగ్ / జ్వలనం
4) దహనం కానిది
134. అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది?
1) ఫైరోస్కోప్ 2) ఫైరో మీటర్
3) సీస్కోగ్రాఫ్ 4) క్సైలోమీటర్
135. కిందివాటొలో సరైన ప్రవచనం ఏది?
1) ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు
2) ధ్వని తరంగాలు అనుధైర్ఘ్యతరంగాలు
3) యాంత్రిక తరంగాలు శూన్యంలో ప్రయాణించలేవు 4) అన్నీ సరైనవే
136. కిందివాటిలో సరికానిది ఏది?
1) భూమిపై తక్కువ అయస్కాంత తీవ్రత గల ఖండం దక్షిణ అమెరికా
2) భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత భూమధ్యరేఖ దగ్గర ఎక్కువగా ఉంటుంది
3) భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత ధ్రువాల దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది
4) పరమ శూన్య ఉష్ణోగ్రతను కొలవడానికి అయస్కాంత ఉష్ణమాపకాలను వాడతారు.
137. నీటిని 0oC నుంచి 10 వరకు వేడి చేసినప్పుడు ఇలా జరుగుతుంది?
1) వ్యాకోచిస్తుంది 2) సంకోచిస్తుంది
3) మొదట సంకోచించి తరువాత వ్యాకోచిస్తుంది
4) మొదట వ్యాకోచించి తరువాత సంకోచిస్తుంది
138. వేసవిలో నల్లటి రోడ్డుపై నీరు ఉన్నట్లనిపించడానికి కారణం ఏది?
1) సంపూర్ణ పరావర్తనం 2) వివర్తనం
3) సంబద్ధత 4) వ్యతికరణం
139. భూగోళ దూరదర్శినిలో మధ్యలో ఉండే మూడో కటకం పని ఏమిటి?
1) ప్రతి బింబాన్ని కటక దోషం లేకుండా చూపిస్తుంది
2) తలకిందులుగా ఉన్న ప్రతిబింబాన్ని నిలువుగా చేస్తుంది
3) దూరంగా ఉన్న ప్రతిబింబాన్ని నిలువుగా చేస్తుంది
4) పైవన్నీ
140. ఒక తటస్థ వస్తువు నుంచి ఎలక్టాన్లను తొలగిస్తే దానిపై
1) ధనావేశం ఏర్పడుతుంది
2) రుణావేశం ఏర్పడుతుంది
3) ఆ వస్తువు ఆవేశం సున్నా అవుతుంది
4) 1 లేదా 2
141. ఇండ్లలో వినియోగించే బుల్బుల్‌లో 60 w, 100 w సామర్థ్యం గల రెండు బల్బులను శ్రేణిలో కలిపితే ఏమవుతుంది?
1) 60w బల్బు, 100w బల్బు కంటే ప్రకాశ వంతంగా వెలుగుతుంది
2) 100 w బల్బు, 60 w బల్బు కంటే ప్రకాశవంతంగా వెలుగుతుంది
3) రెండూ ఒకే ప్రకాశవంతంతో వెలుగుతాయి
4) రెండింటిలో ఏదో ఒకటి మాడిపోతుంది.
142. జతపరచండి.
ఎ. కెపాసిటర్ 1. ఫారడే
బి. విద్యుచ్ఛాలక బలం 2. వోల్ట్
సి. విద్యుత్ వాహకత 3. సీమెన్
డి. విశిష్ట నిరోధం 4. ఓమ్-మీటర్
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-4, సి-1, డి-3
143. ఒక లోహగోళానికి కొంత అవేశాన్ని ఇచ్చినప్పుడు ఆ ఆవేశం
1) గోళం అంతటా ఏకరీతిగా విస్తరిస్తుంది
2) గోళం మధ్యభాగంలో కేంద్రీకరించ బడుతుంది
3) గోళం ఉపరితలంపై ఏకరీతిగా విస్తరిస్తుంది
4) ఇచ్చిన ప్రాంతంలో కేంద్రీకృతం అవుతుంది
144. సైకిల్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి ముందుకు, వెనుకకు ఊగడం చేస్తే సైకిల్ వేగం?
ఎ) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) మారదు
4) సైకిల్ కంటే వ్యక్తి బరువు ఎక్కువగా ఉంటే పెరుగుతుంది
145. ఇసుకలోకి దూకినప్పుడు గాయాలు కావు కానీ కాంక్రీట్ నేలపై దూకినప్పుడు గాయాలు కావడానికి కారణం
1) కాంక్రీట్ నేల తక్కువ ప్రచోదనాన్ని కలిగిస్తుంది
2) కాంక్రీట్ నేల అధిక ప్రచోదనాన్ని కలిగిస్తుంది
3) ఇసుక అధిక ప్రచోదనాన్ని కలిగిస్తుంది
4) రెండూ ఒకే ప్రచోదనాన్ని కలిగిస్తాయి
146. కింది హార్మోన్లలో ఉద్వేగంలో ఉన్నప్పుడు అధిక మోతాదులో ఉత్పత్తి అయ్యే హార్మోను ఏది?
1) అడ్రినలిన్ 2) నారడ్రినలిన్
3) కార్టిజోన్ 4) థైరాక్సిన్
147. కిందివాటిని జతపరచండి.
వ్యాధి కారణభూత సూక్ష్మజీవి
ఎ. కలరా 1. శిలీంధ్రం
బి. అమ్మోరు 2. వైరస్
సి. మలేరియా 3. బ్యాక్టీరియా
డి. గోధుమ పొట్టు 4. ప్రోటోజోవా
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1
149. పర్యావరణ వ్యవస్థలో ప్రధానంగా శిథిలం (డీకంపోజ్) చేసేవి ఏవి?
ఎ) శిలీంధ్రాలు (ఫంగి) 1) ఎ, బి మాత్రమే
బి) కీటకాలు 2) ఎ, సి మాత్రమే
సి) ప్రోకారియోట్స్ 3) బి, సి మాత్రమే
– —– 4) ఎ, బి, సి
150. ఫినైల్ కీటోన్యూరియా వ్యాధిలో మూత్రంలో ఏమి గుర్తించవచ్చు?
1) ఫినైల్ కీటోన్ 2) యూరియా
3) నత్రజని 4) రక్తం
151. సమ విభజనలోని DNA ప్రతికృతి ఏ దశలో జరుగుతుంది?
1) G1 దశ 2) S దశ
3) M దశ 4) G0 దశ
152. జతపరచండి.
ఎ. వేరు నుంచికాండానికి నీటి ప్రసరణ 1. స్థానాంతరణ
బి. పత్రరంధ్రాల ద్వారా నీటిని కోల్పోవడం 2. ద్రవాభిసరణ
సి. పదార్థాల సమూహ 3. ద్రవోద్గమం ప్రవాహం
డి. అర్ధ పారగమ్యత్వచం 4. బాష్పోత్సేకం ద్వారా నీటి వ్యాపనం
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-2, బి-3, సి-4, డి-1
153. లవంగం ఏ కోవకు చెందుతుంది?
ఎ. గింకో బైలోబా ఒక సజీవ శిలాజ మొక్క. ఇది ఇండియా హిమాలయ ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది
బి. టాక్సస్ అనే వివృత బీజ మొక్క కాండం నుంచి ‘టాక్సాల్’ అనే యాంటీ క్యాన్సర్ పదార్థం లభిస్తుంది
సి. సైకస్ను ‘సాగోఫామ్’ అంటారు. దీని ఎండు విత్తనాల (చిల్గోజా)ను కాల్చుకొని తింటారు
1) ఎ, బి 2) బి, సి
3) బి 4) ఎ, బి, సి
155. కింది వాటిలో సరైనది ఏవి?
1. ‘రానికేట్’ అనే వ్యాధి పశువుల్లో వైరస్ ద్వారా సంభవించే వ్యాధి
2. ‘రింగ్వార్మ్’ అనేది ఒక శిలీంధ్రపు వ్యాధి
1) 1 2) 2 3) 1, 2
4) పైవేవి కావు
156. కింది వాటిలో ఆర్ఎన్ఏలో ఉండి, డీఎన్ఏలో లేని పదార్థం ఏది?
1) థైమిన్ 2) సైటోసిన్
3) యురాసిల్ 4) అడినిన్
157. కింది అంశాలు అధ్యయనం చేయండి
ఎ. లోపలిచెవి దేహాన్ని సమతాస్థితిలో ఉంచుతుంది
బి. స్వేదగ్రంథులు దేహ ఉష్ణోగ్రత నియంత్రణలో తోడ్పడతాయి
సి. నాలుకపై రుచి గుళికలు ఉంటాయి
డి. చర్మస్రావ గ్రంథులు విసర్జనలో తోడ్పడతాయి
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి, ఎ 4) ఎ, బి, డి
158. చాలక ప్రమాణం అంటే
1) చాలకనాడి సార్కొలెమ్మా మధ్యగల సంధితలం
2) T- నాళిక దాని సన్నిహితంగా ఉన్న సిస్టర్నేలు
3) 1, 2
4) చాలక నాడీకణం ఏక్జాన్ టీలో డెండ్రైట్లు అంతమయ్యే కండర తంతువు భావం
159. కంటి వెనుక కణజాలంలో ద్రవం సంచితం కావడం వల్ల కళ్లు ఉబ్బి ముందుకు పొడుచుకొని వచ్చేటట్టు కనపడతాయి. ఆ వ్యాధి ఏ హార్మోన్ ప్రభావం వల్ల కలుగుతుంది
1) ఎక్జాప్తాల్మిక్ గాయిటర్, థైరోకాల్సిటోనిన్
2) గ్జీరాప్తాల్మియా, థైరాక్సిన్
3) ఎక్జాప్తాల్మిక్ గాయిటర్, థైరామిక్
4) గ్జీరాప్తాల్మియా, థైరోకాల్సిటోనిన్
160. సహానుభూతి నాడీ తంతువులు అంత్యభాగాలు స్రవించేది
1) సింపతిన్ 2) కోలిన్ ఎస్టరేజ్
3) కార్టిసోన్ 4) అడ్రినలిన్
161. గాలిలో కార్బన్డయాక్సైడ్ గాఢత అధికమవటం వల్ల ఏమి జరుగుతుంది?
1) ఆమ్ల వర్షం 2) అటవీ నిర్మూలన
3) గ్లోబల్ వార్మింగ్ 4) జ్వలనీకరణం
162. బేకింగ్ సోడాకి రసాయనిక పేరు?
1) సోడియం బైకార్బొనేట్
2) సోడియం హైడ్రాక్సైడ్
3) కాల్షియం కార్బొనేట్
4) సోడియం క్లోరైడ్
163. వాయుస్థితిలో ఒక ఒంటరి తటస్థ పరమాణువు బాహ్యకక్ష్య నుంచి ఎలక్టాన్ను తీసివేయడానికి కావాల్సిన శక్తిని ఏమంటారు?
1) అయనీకరణ శక్తి 2) ఎలక్టాన్ ఎఫినిటీ
3) రుణ విద్యుదాత్మకత 4) ఏదీకాదు
164. నైట్రోజన్ (Z=7) సరైన ఎలక్టాన్ విన్యాసం 1s2, 2s2, 2p1x, 2p1y, 2p1z. ఇది కింది ఏ నియమానికి అనుకూలంగా రాశారు?
1) ఆఫ్‌బౌ నియమం 2) పౌలీ సూత్రం
3) ండ్ నియమం
4) పౌలింగ్ సూత్రం
165. K,L,M,N అనే నాలుగు మూలకాల ఎలక్టాన్ విన్యాసాలు వరుసగా K=1s2, 2s2 2p1; L=1s2 2s2 2p61 ; M= 1s2 2s2 2p4; N=1s2 2s2 2p3. వీటిలో ద్విబంధం ఏర్పరచగల ద్విపరమాణుక అణువు
1) K 2) L 3) M 4) N
166. క్షారలోహం కానిది ?
1) లిథియం 2) సోడియం
3) పొటాషియం 4) కాల్షియం
167. నేలకోతను అదుపు చేయడం కోసం ఏర్పాటు చేసిన Central Soils Conse- rvation Institute ఎక్కడ ఉంది?
1) బెంగళూరు 2) ఢిల్లీ
3) పుణె 4) కోల్‌కతా
168. లోహాలకు సంబంధించిన సరైన వాక్యం
1. లోహబంధాన్ని స్వేచ్ఛా ఎలక్టాన్ సిద్ధాంతం వివరిస్తుంది
2. తాంతవత, అఘాత వర్ధీనీయత
3. అయానిక సమ్మేళనాలను, క్షారాలను ఏర్పరుస్తాయి
4. తళతళా మెరుస్తాయి
1) 1, 2 2) 1, 2, 3
3) 2, 3 4) అన్నీ
169. నిశ్చితం (A) : డిటర్జెంట్లు కఠిన జలంలో నురగనిస్తాయి
కారణం (R) : డిటర్జెంట్లు Ca2+, Mg2+ అయాన్లలో అవక్షేపాన్ని ఏర్పరచవు
1) (A), (R) రెండూ సరైనవి (A)కు (R) సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి కానీ (A)కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైనది కానీ (R) సరైనది కాదు
4) (A) సరైనది కాదు కానీ (R) సరైనది
171. ప్రతిపాదన (ఎ): ట్రాన్స్ హిమాలయ మండలం అనేక ప్రముఖ నదులకు జన్మస్థానం
కారణం (ఆర్): ‘మానససరోవరం’ హిమాద్రి శ్రేణుల్లో ఉంది
1) (ఎ), (ఆర్) సరైనవే (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ సరైనవే (ఆర్) (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కాని (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు కాని (ఆర్) నిజం
172. జతపరచండి
ఎ. సెంట్రల్ రైస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1. అరుణాచల్‌ప్రదేశ్
బి. కోర్బా బొగ్గు గనులు 2. ఛత్తీస్‌గఢ్
సి. మిష్మీ హిల్స్ 3. జార్ఖండ్
డి. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 4. ఒడిశా
—————— 5. పశ్చిమ బెంగాల్
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-5, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-3, సి-1, డి-5
4) ఎ-1, బి-5, సి-2, డి-3
173. కింది జతలను పరిశీలించండి
ఎ. ఉకై జల విద్యుత్ ప్రాజెక్టు 1. రాజస్థాన్
బి. కొయలి చమురు శుద్ధి కర్మాగారం 2. గుజరాత్
సి. భారతదేశంలోని ప్రథమ జల విద్యుత్ కర్మాగారం 3. తమిళనాడు
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
174. సియాచిన్ హిమానీనదం వద్ద భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దు గల పర్వతాలు ఏవి?
1) హిందూకుష్ 2) సాల్టోర్
3) హరియత్ 4) జస్కార్
175. దేశంలో మొట్టమొదటి టైగర్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు?
1) చంద్రప్రభా నేషనల్ పార్కులో
2) జిం కార్బెట్ నేషనల్ పార్కులో
3) కజిరంగా నేషనల్ పార్కులో
4) ఘనా పక్షి సంరక్షణ కేంద్రంలో
176. కింది వాటిని జతపరచండి
1. అత్యధిక వర్షపాత ప్రాంతం ఎ. పశ్చిమ రాజస్థాన్‌లో
2. అధిక వర్షపాత ప్రాంతం బి. దక్కన్ పీఠభూమి లోపలి భాగం
3. అల్ప వర్షపాత ప్రాంతం సి. అండమాన్ నికోబార్ దీవులు
4. అత్యల్ప వర్షపాత ప్రాంతం డి. పశ్చిమ కనుమలు
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
177. కింది జతలను పరిశీలించి సరికాని జతలను ఎంపిక చేయండి
వ్యవసాయ యోగ్యమైన కమాండ్ ప్రాంతం ప్రాజెక్టు/పథకం
ఎ. 10,000 హెక్టార్లకు
మించి సాగు చేయగల భూమి 1. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు
బి. 10,000 నుంచి 25,000 ఎకరాల 2. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు
వరకు సాగు చేయగల భూమి
సి. 10,000 ఎకరాల వరకు సాగు చేయగల భూమి 3. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు
1) ఎ 2) బి 3) బి, సి 4) ఎ, సి
178. టేకు, సాల్, చందనం ఏ అడవులకు సంబంధించిన ముఖ్యమైన వృక్ష జాతులు?
1) ఉష్ణ మండల ముండ్ల అడవులు
2) మోంటనే అడవులు
3) ఉష్ణ మండల సతత హరితారణ్యాలు
4) ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
179. భాక్రా-నంగల్ ఏ రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టు
ఎ. పంజాబ్ బి. హర్యానా
సి. రాజస్థాన్ డి. ఉత్తరప్రదేశ్
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) బి, సి, డి
180. బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ రాష్ట్రాల నుంచి ప్రవహిస్తుంది?
1) అసోం, మేఘాలయ
2) అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం
3) అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ
4) అసోం, అరుణాచల్‌ప్రదేశ్
181. చంబల్ ప్రాజెక్టులో భాగం కాని ప్రాజెక్టులు ఏవి?
ఎ. జవహార్ సాగర్ బి. గాంధీ సాగర్
సి. ఇందిరా సాగర్ డి. రాణా ప్రతాప్ సింగ్
1) ఎ, బి 2) సి, డి
3) సి 4) డి
సమాధానాలు
133-1 134-2 135-4 136-2 137-3 138-1 139-2 140-1 141-2 142-3 143-3 144-3 145-2 146-1 147-1 148-4
149-4 150-1 151.2 152.2 153.3 154.3 155.2 156.3 157.1 158.4 159.3 160.1 161.3 162.1 163.1 164.3
165.3 166.4 167.2 168.4 169.1 170.1 171.3 172.1 173.2 174.2 175.2 176.2 177.3 178.4 179.3 180.4 181.3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?