భారత్-చైనా సరిహద్దు
– భారత్-చైనా సరిహద్దుల్లో గస్తీ కాసే భారత సైన్యం- ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)
– భారత్-చైనా సరిహద్దుల్లోని మొత్తం బోర్డర్ అవుట్ పోస్టులు- 173
-భారత్, చైనాల మధ్యగల సరిహద్దు పొడవు- 3488 కి.మీ.
– భారత్, చైనాల మధ్యగల ఊహాజనిత సరిహద్దు రేఖ పేరు- వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ-లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్)
-అరుణాచల్‌ప్రదేశ్, చైనాల మధ్యగల సరిహద్దు రేఖ పేరు- మెక్‌మోహన్ రేఖ
-ఆక్సాయ్‌చిన్, చైనాల మధ్యగల విభజన రేఖలు- జాన్సన్ లైన్, మెక్‌డొనాల్డ్ లైన్

తూర్పు సెక్టార్
– పొడవు- 1140 కి.మీ.
-సరిహద్దు రాష్ట్రాలు- సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్
తూర్పు సెక్టార్‌లోని వివాదాస్పద ప్రాంతాలు
-సిక్కిం- 1) ఉత్తర సిక్కిం (North Sikkim)
2) చుంబి లోయ (Chumbi Valley)- ఇది భారత్, చైనా, భూటాన్‌ల మధ్య ట్రై జంక్షన్. ఇక్కడే ‘డోక్లాం’ ప్రాంతం ఉంది.
అరుణాచల్‌ప్రదేశ్
1) నామ్కాచు (Namka Chu)
2) సమ్దొరోంగ్చు (Sumdorong Chu)
3) అసఫిలా (Asaphila)
4) లాంగ్జు (Longju)
5) డిచు (Dichu)
6) యాంగ్త్సే (Yongtse)
7) ఫిష్‌టెయిల్-1, 2 (Fish Tail-1, 2 Dibong Valley)
8) లమాంగ్ (Lamng)
– చైనాతో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు– హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్
– చైనాతో సరిహద్దును పంచుకునే యూటీ (UT)- లఢక్
1) లఢక్- 1597 కి.మీ. (అత్యధికం)
2) హిమాచల్‌ప్రదేశ్- 200 కి.మీ. (అత్యల్పం)
3) ఉత్తరాఖండ్- 345 కి.మీ.
4) సిక్కిం- 220 కి.మీ.
5) అరుణాచల్‌ప్రదేశ్- 1126 కి.మీ.
మొత్తం- 3488 కి.మీ.
మెక్‌మోహన్ రేఖ (Mc Mahon Line)
-ఎక్కడ ఉంది- అరుణాచల్‌ప్రదేశ్, చైనా మధ్య
-పొడవు- 890 కి.మీ.
-నిర్ణయించిన వ్యక్తి- బ్రిటిష్ ప్రభుత్వ విదేశాంగ కార్యదర్శి సర్ హెన్రీ మెక్‌మోహన్
-నేపథ్యం- 1914, జూలై 3న సిమ్లా సమావేశంలో భారత బ్రిటిష్ ప్రభుత్వం, అప్పటి టిబెట్ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఈ రేఖను నిర్ణయించారు. ఈ ఒప్పందం ప్రకారం తవాంగ్ ప్రాంతం, టిబెట్ దక్షిణ భాగం బ్రిటిష్ ఇండియాలో భాగంగా పరిగణించారు.
– 1950లో టిబెట్‌ను చైనా ఆక్రమించుకోవడం వల్ల ప్రస్తుతం అది చైనా, అరుణాచల్‌ప్రదేశ్ మధ్య విభజన రేఖగా ఉంది.
– మెక్‌మోహన్ రేఖలో ఉన్న చివరి భారతీయ గ్రామం- బిషింగ్. ఇక్కడ మెంబా తెగవారు నివసిస్తున్నారు.
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ), మెక్‌మోహన్ రేఖ మధ్యగల తేడాలు
– వాస్తవాధీన రేఖ, లఢక్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో భారత్, చైనా మధ్యగల సరిహద్దు రేఖ. దీనిని 1962 భారత్-చైనా యుద్ధం తరువాత నిర్ణయించారు.
-మెక్‌మోహన్ రేఖ భారత్, ఒకప్పటి టిటెట్ (ప్రస్తుత చైనా)ల మధ్య గుర్తించిన విభజన రేఖ. దీనిని 1914లో గుర్తించారు. దీన్ని అరుణాచల్‌ప్రదేశ్‌లో గుర్తించారు.

పశ్చిమ సెక్టార్
– పొడవు- 2152 కి.మీ.
– సరిహద్దును పంచుకునే భారత భూభాగం- లఢక్
-సరిహద్దును పంచుకునే చైనా భూభాగం – జిన్జియాంగ్ ప్రావిన్స్
పశ్చిమ సెక్టార్‌లోని వివాదాస్పద ప్రాంతాలు
1) ఆక్సాయ్‌చిన్- దీనిని చైనా 1962 యుద్ధం ద్వారా ఆక్రమించింది.
2) పాంగాంగ్ త్సో సరస్సు (Pongong Tso Lake)- 2019, 2020లో ఇక్కడ ఘర్షణలు జరిగాయి.
3) గల్వాన్ లోయ (Galwan Valley) – 2020, మేలో ఇక్కడ భారత్, చైనాల మధ్య ఘర్షణలు జరిగాయి.
4) దౌలత్ బేగ్ ఓల్డి (Daulat Beg Oldi-DBO)
5) హాట్‌స్ప్రింగ్-గోగ్రా ప్రాంతం (The Hot Spring-Gogra Area)
6) డెమ్చోక్ (Demchok)
7) చుషుల్ (Chushul)
8) స్పంగూర్ గ్యాప్ (Spangur Gap)
9) సమర్ లంగ్పా (Samar Lungpa)
10) ట్రిగ్ హైట్స్ (Trig Heights)
11) చుమార్ (Chumar)
12) డంచెలే (Dumchele)
13) కొంగ్కా లా (Kongka La)
పశ్చిమ సెక్టార్‌లోని విభజన రేఖలు
1) జాన్సన్ లైన్ (1865)- దీని ప్రకారం ఆక్సాయ్‌చిన్ ప్రాంతం జమ్ముకశ్మీర్‌కు చెందుతుంది.
2) మెక్‌డొనాల్డ్ లైన్ (1893)- దీని ప్రకారం ఆక్సాయ్‌చిన్ చైనా భూభాగం పరిధిలోకి వస్తుంది. దీనిని 1959 వరకు చైనా ఆమోదించింది.
పై రెండు రేఖలను బ్రిటిష్ కాలంలో గుర్తించారు.
మిడిల్ సెక్టార్
– పొడవు- 625 కి.మీ.
-సరిహద్దు రాష్ట్రాలు- హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్
మిడిల్ సెక్టార్‌లోని వివాదాస్పద ప్రాంతాలు
-హిమాచల్ ప్రదేశ్- 1) కౌరిక్ (Kaurik) 2) షిప్కిలా (Shipki La)
-ఉత్తరాఖండ్- 1) పులం సుమ్దా (Pulam Sumda) 2) బారహోతి మైదానాలు (Barahoti Plains)
ఘర్షణలు
1) భారత్-చైనా యుద్ధం
– ప్రారంభం- 1962, అక్టోబర్ 20
-ముగింపు- 1962, నవంబర్ 21
– కారణం- జమ్ముకశ్మీర్ (ప్రస్తుత లఢక్)లోని ఆక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ దురాక్రమణ చేయడం.
-ఫలితం- చైనా సైన్యం విజయం. ఆక్సాయ్‌చిన్ ఆక్రమణ. ఈ యుద్ధం తరువాత రెండు దేశాల మధ్య ఊహాజనిత సరిహద్దు రేఖగా వాస్తవాధీన రేఖ (Line of Actual Control)ను ఏర్పాటు చేశారు.
2) నాథులా వివాదం
-దీనినే భారత్, చైనా యుద్ధం-1967 అని పిలుస్తారు.
– 1967, ఆగస్ట్ లో చైనా సైన్యం నాథులా పాస్ వద్ద చొరబడింది. దీంతో ఘర్షణ ప్రారంభమై 1967, సెప్టెంబర్ 15 వరకు కొనసాగింది. సుమారు 400 మంది చైనా సైనికులు ఈ ఘర్షణలో చనిపోయారు.
-ఇది చైనాకు పెద్ద ఎదురుదెబ్బ.
3) చో లా వివాదం
-చో లా పాస్ సిక్కిం రాష్ట్రాన్ని చైనాలోని టిబెట్ ప్రాంతంలో కలుపుతుంది.
– 1967, అక్టోబర్ 1న చైనా దళాలు చో లా కనుమ ప్రాంతాన్ని తమ ప్రాంతంగా క్లెయిమ్ చేసి ఘర్షణలకు దిగింది.
– ఈ సంఘటనలో 83 మంది భారత సైనికులు చనిపోయారు.
4) అరుణాచల్‌ప్రదేశ్ వివాదం-1987
-1986లో అరుణాచల్‌ప్రదేశ్‌కు భారత్ రాష్ట్రహోదా ఇచ్చినప్పుడు చైనా నిరసన వ్యక్తం చేసింది.
– అరుణాచల్‌ప్రదేశ్ తమ భూభాగం అని వాదిస్తూ అరుణాచల్‌ప్రదేశ్‌లోని సమ్డోరాంగ్ చు లోయలోకి ప్రవేశించి హెలిప్యాడ్లు, శాశ్వత నిర్మాణాలు నిర్మించడం ప్రారంభించింది.
-ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి భారతసైన్యం ‘ఆపరేషన్ ఫాల్కన్ (Ope ration Falcon)ను ప్రారంభించింది.
-చైనా సైన్యం వెనక్కి తగ్గేంతవరకు భారతసైన్యం సరిహద్దుల్లోనే మోహరించింది.
-ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య మొదటి అధికారిక సమావేశం జరిగింది.
-చర్చలకు రెండు దేశాలూ అంగీకరించాయి.
– ఈ ఘటన 1993 ఒప్పందానికి దారితీసింది.
1993 ఒప్పందం
-అప్పటి భారత ప్రధాని పీవీ నర్సింహారావు, చైనా అధ్యక్షుడు లీ పెంగ్‌ల మధ్య 1993, సెప్టెంబర్ 7న ‘సరిహద్దు శాంతి, ప్రశాంతత ఒప్పందం (Border Peace and Tranquility Agreement)’ జరిగింది.
-ఈ ఒప్పందం ప్రకారం ఎల్ఏసీ పశ్చిమ, తూర్పు, మధ్య సెక్టార్ల కచ్చితమైన స్థానాలు గుర్తించారు.
-ఇరుపక్షాలు 15,000 మంది కంటే ఎక్కువ మందితో సైనిక విన్యాసాలు నిర్వహించకూడదు.
భారత్-చైనా ఒప్పందం-1996
– అప్పటి చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది.
-ఇది చైనా అధ్యక్షుడి తొలి భారత పర్యటన.
-ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మ్యాపుల పరస్పర మార్పిడికి అంగీకారం కుదిరింది.
5) డెప్సాంగ్ ఘర్షణలు (Depsang Disputes) -2013
-ఈ ఘర్షణలు లఢక్ ప్రాంతంలోని దౌలత్ బేగ్ ఓల్డీ (డీబీవో) వద్ద జరిగాయి.
– 2013, ఏప్రిల్ 15న డీబీవో సమీపంలోని రాఖీనులా ప్రాంతం వద్ద శాశ్వత శిబిరాలను చైనా సైన్యం నిర్మించడంతో ఘర్షణలు జరిగాయి.
6) చుమార్ ఘర్షణ (Chumar Dispute)- 2014
-చుమార్ ప్రాంతం వద్ద చైనా ఒక హైవేను నిర్మించడానికి ప్రయత్నించడంతో ఘర్షణ ప్రారంభమయ్యింది.
-భారత్ తీవ్రంగా ప్రతిఘటించడంతో చైనా హైవే నిర్మాణాన్ని నిలిపివేసింది.
7) డోక్లాం ఘర్షణ (Doklam Dispute)- 2017
– డోక్లాం అనేది భూటాన్‌లోని ఒక పీఠభూమి ప్రాంతం.
-ఇది భారత్, చైనా, భూటాన్‌లకు అత్యం త వ్యూహాత్మక ప్రదేశం.
-ఇది భారతదేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే సిలిగురి ప్రాంతం (Chicken Neck)ను రక్షించే ప్రధాన భూభాగం.
-చైనా ప్రతిష్ఠాత్మక వన్ బెల్ట్ వన్ రోడ్ కార్యక్రమంలో భాగంగా, డోక్లాం మీదుగా రోడ్డు నిర్మాణాలను చేపట్టింది చైనా.
-దీంతో భారత్ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో 73 రోజుల పాటు ప్రతిష్టంభన జరిగింది.
8) 2020- గల్వాన్ లోయ, పాంగాంగ్ త్సో సరస్సు ఘర్షణలు (Galwan Valley Disputes)
-పాంగాంగ్ త్సో సరస్సు (గల్వాన్ లోయ) వద్ద ఇరుదేశాల సైనికులు పరస్పరం ఘర్షణలకు దిగడంతో (2020, మే 5) యుద్ధ వాతావరణం నెలకొంది.
– భారత సైనికులు 20 మంది, చైనా సైనికులు 40 మంది మరణించినట్లు అంచనా.
-2020, జూన్ 16 వరకు ఈ ఘర్షణలు కొనసాగాయి.
9) అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు చైనా నామకరణం
-2020, డిసెంబర్ 30న అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు చైనా తమ పేర్లను పెట్టింది.
– అరుణాచల్‌ప్రదేశ్ తమ భూభాగమంటూ, దానిని ‘జన్‌గ్నాన్’ పేరుతో పిలుస్తున్నట్లు చైనా వాదిస్తుంది.
– ఈ 15 ప్రాంతాల్లో 8 నివాస ప్రాంతాలున్నాయి. అవి.. 1) సెంగ్కెజాంగ్ 2) దాగ్లుంగ్ జాంగ్, 3) మునిగాంగ్ 4) డుడింగ్, 5) మిగ్‌పెయిన్
6) గోలింగ్, 7) డంబా 8) మెజాగ్
-నాలుగు పర్వతాలకు వామో రి, డు రి, లన్‌జుబ్ రి, కున్మింగ్ జింగ్ పెంగ్ అని పేర్లు పెట్టింది.
– రెండు నదులకు జెన్యోగ్మీ, దులైని అని, ఒక పర్వత మార్గానికి ‘సె లా’ అని పేరు పెట్టింది.
-గతంలో 2017లోనూ అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలకు తమ పేర్లను పెట్టింది చైనా.
పీ శ్రీరామ్‌చంద్ర
గ్రూప్స్ మెంటార్
హైదరాబాద్
8008356825
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






