నోబుల్ పీపుల్ – నోబెల్ విన్నర్స్
నోబెల్ ప్రైజ్ ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం. స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఆల్ఫెడ్ నోబెల్ 1895లో తన యావదాస్తి 90 లక్షల డాలర్లను నోబెల్ బహుమతి కోసం దానం చేస్తున్నట్లు వీలునామా రాశారు. ఈ ఆస్తిపై వచ్చే ఆదాయంతో ఏటా తన పేరిట బహుమతులను ప్రదానం చేయాలని ఆ వీలునామాలో పేర్కొన్నారు. ఆ తర్వాత 1896లో ఆయన మరణించగా.. 1901 నుంచి ఆయన పేరిట నోబెల్ బహుమతుల ప్రదానం ప్రారంభించా రు. పోటీ పరీక్షల్లో అవార్డులపై పలు ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో నిపుణ పాఠకుల కోసం నోబెల్ పురస్కారంపై సమగ్ర సమాచారం…
– మొదట నోబెల్ బహుమతిని సాహిత్యం, శాంతి, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం వంటి ఐదు రంగాల్లో ఇచ్చేవారు. 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తున్నారు. ఇప్పు మొత్తం ఆరు రంగాల్లో నోబెల్ ప్రైజ్ అందజేస్తున్నారు.
-నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో, మిగిలిన ఐదు బహుమతులను స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో ప్రదానం చేస్తారు. నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న ఈ బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ అవార్డును ఒక విభాగంలో గరిష్ఠంగా ముగ్గురికి ప్రదానం చేస్తారు.
– ఆరు రంగాల్లో నోబెల్ విన్నర్స్‌ను ఐదు వేర్వేరు సంస్థలు ఎంపిక చేస్తాయి. శాంతి, సాహిత్యం, వైద్యం, అర్థశాస్త్రం ఈ నాలుగు విభాగాల్లో నాలుగు వేర్వేరు సంస్థలు.. ఫిజిక్స్, కెమిస్టీ రెండు విభాగాలకు కలిపి స్వీడన్‌కు చెందిన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గ్రహీతలను ఎంపిక చేస్తుంది.
నోబెల్ గ్రహీతలు – ప్రత్యేకతలు
-నోబెల్ బహుమతి పొందిన తొలి ముస్లిం మహిళ – షరిన్ ఎబాది (ఈమెకు 2003లో నోబెల్ శాంతి బహుమతి లభించింది)
-నోబెల్ బహుమతి పొందిన తండ్రీకొకులు – జేఆర్ విన్ఫీల్డ్, జేఆర్‌ఎన్ ఫీల్డ్ (వీళ్లిద్దరికీ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది)
– నోబెల్ బహుమతి పొందిన అతిపెద్ద వయస్సువ్యక్తి – జాన్ బి గుడ్ ఎనఫ్ (ఈయన 97 సంవత్సరాల వయస్సులో నోబెల్ బహుమతి అందుకున్నా. 2019లో రసాయన శాస్త్రంలో ఈయనకు నోబెల్ పురస్కారం దక్కింది.)
-నోబెల్ బహుమతి పొందిన అతిపిన్న వయస్సు వ్యక్తి – మలాలా యూసఫ్ జాయ్ (పాకిస్థాన్‌కు చెందిన ఈమెకు 17 ఏండ్ల వయస్సులో నోబెల్ బహుమతి దక్కింది. భారత్‌కు చెందిన కైలాస్ సత్యార్థితో కలిసి 2014లో ఈమె నోబెల్ శాంతి బహుమతి అందుకుంది.)
-నోబెల్ బహుమతి పొందిన తొలి అరబ్ మహిళ – తవక్కల్ కర్మాన్ (ఈమె 2011లో నోబెల్ బహుమతి అందుకుంది)
– కొంతమందికి రెంసార్లు నోబెల్ పురస్కారం దక్కింది.
-యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యుజీస్ సంస్థ కూడా రెండు సార్లు (1954, 1981) నోబెల్ పీస్ ప్రైజ్ అందుకుంది. ఇక రెడ్‌క్రాస్ సంస్థకైతే ఏకంగా మూడుసార్లు (1917, 1944, 1963) నోబెల్ శాంతి బహుమతి దక్కింది.
నోబెల్ పొందిన భారతీయులు
1. రవీంద్రనాథ్ ఠాగూర్ (1913): ఠాగూర్‌కు సాహిత్యం విభాగంలో నోబెల్ పురస్కారం లభించింది. 1913లో దక్కిన ఈ అవార్డుతో ఈయన భారతదేశంలోనేగాక ఆసియా ఖండంలోనే నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు.
2. సీవీ రామన్ (1930): రామన్ ఎఫెక్ట్‌ను కొనుగొన్నందుకుగాను ఈయనకు భౌతికశాస్త్రం విభాగంలో 1930లో నోబెల్ బహుమతి దక్కింది. సైన్స్ రంగంలో నోబెల్ బహుమతి పొందిన తొలి శ్వేతజాతీయేతరు ఈయనే.
3. మదర్ థెరిసా (1979): భారతగడ్డను సేవా కేంద్రంగా ఎంచుకున్న మానవాళి మాతృమూర్తి ఈమె. అల్బేనియాలో జన్మించినప్పటికీ 1948లో భారత పౌరసత్వం తీసుకున్నందున ఈమెను భారతీయురాలిగానే పరిగణిస్తున్నారు. ఈమెకు 1979లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
4. అమర్త్యసేన్ (1998): వెల్ఫేర్ ఎకనామిక్స్‌లో విశేష కృషి చేసినందుకు అమర్త్యసేన్ 1998లో అర్థశాస్త్ర నోబెల్ పురస్కారం అందుకున్నారు. ప్రాథమిక విద్య అభివృద్ధికి ఈయన ప్రతీచి ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు.
5. కైలాస్ సత్యార్థి (2014): మదర్ థెరిసా తర్వాత నోబెల్ శాంతి బహుమతి పొందిన రెండో భారతీయు ఈయన. జన్మతః భారతీయుడై నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి వ్యక్తి. ఈయనకు 2014లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
భారత్‌లో జన్మించి విదేశాల్లో స్థిరపడ్డ నోబెల్ గ్రహీతలు
6. హర్గోవింద్ ఖొరానా (1968): ఈయనకు వైద్య విభాగంలో నోబెల్ బమతి దక్కింది. జన్యు సంకేతం, ప్రొటీన్ సింథసిస్‌లో దాని విధులకు సంబంధించి చేసిన పరిశోధనకుగాను ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఈయన రాయ్‌పూర్‌లో జన్మించి, అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు.
7. సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ (1983): భౌతికశాస్త్ర విభాగంలో ఈయన నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. నక్షత్రాలపై చేసిన పరిశోధనకుగాను ఈయనకు ఈ అవార్డు దక్కింది. దేశ విభజనకు ముందు లాహోర్‌లో ఈయన జన్మించారు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు.
8. వెంకటరామన్ రామకృష్ణన్ (2009): ఈయనకు రసాయనశాస్త్ర విభాగంలో నోబెల్ పురస్కారం లభించింది. రైబోజోమ్‌ల నిర్మాణం, విధులపై చేసిన పరిశోధనకుఈయనకు 2009లో ఈ అవార్డు దక్కింది. చిదంబరంలో జన్మించిన ఈయన తర్వాత కాలంలో విదేశాలకు వెళ్లి యూకే, అమెరికా పౌరసత్వాలు తీసుకుని అక్కడే స్థిరపడ్డారు.
9. అభిజిత్ బెనర్జి (2019): ఈయనకు అర్థశాస్త్రంలో నోబెల్ బమతి దక్కింది. ప్రపంచ పేదరికాన్ని తగ్గించడం కోసం ఈయన చేసిన ప్రయోగాత్మక ప్రయత్నానికి నోబెల్ అవార్డు లభించింది. కలకత్తాలో జన్మించిన ఈయన ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు.
భారత్‌తో సంబంధాలున్న విదేశీ నోబెల్ గ్రహీతలు
1. రొనాల్డ్ రాస్ (1902): మలేరియా వ్యాధిపై చేసిన పరిశోధనలకుగాను ఈయనకు వైద్య విభాగంలో నోబెల్ పురస్కారం దక్కింది. యూకే సంతతికి చెందిన ఈయన బ్రిటిష్ ఇండియా కాలంలో అల్మోరాలో జన్మించారు.
2. రుద్యార్డ్ కిప్లింగ్ (1907): సాహిత్య రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఈయనకు 1907లో సాహిత్య విభాగంలో నోబెల్ బమతి లభించింది. ఈయన కూడా యూకే సంతతి వ్యక్తే. బ్రిటిష్ ఇండియా కాలంలో బాంబేలో జన్మించారు.
3. దలైలామా (1989): టిబెట్ జాతీయుడైన ఈయన ప్రస్తుతం భారత్‌లో స్థిరపడ్డారు. టిబెట్‌లో దశాబ్దాలుగా స్వేచ్ఛ పునరుద్ధరణ కోసం జరుగుతున్న పోరాటంలో హింసను ఈయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హింసకు వ్యతిరేకంగా ఈయన నిలకడగా కొనసాగిస్తున్న ప్రతిఘటనకు గుర్తింపుగా 1989లో నోబెల్ పీస్ ప్రైజ్ దక్కింది.
నోబెల్ గ్రహీతల సంఖ్య
– 1901 నుంచి 2021 వరకు 120 ఏండ్లలో ఆరు విభాగాల్లో కలిపి 609 నోబెల్ బమతులను మొత్తం 975 మంది వ్యక్తులు, 28 సంస్థలకు ప్రదానం చేశారు. రెండు సార్లు, మూడు సార్లు నోబెల్ అందుకున్న వ్యక్తులు, సంస్థలను ఒక్కోసారి మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఇప్పటివరకు 943 మంది వ్యక్తులతోపాటు 25 సంస్థలు నోబెల్ బమతి అందుకున్నాయి. అయితే, నోబెల్ ప్రైజ్‌లు అందుకున్న మొత్తం 25 సంస్థలు ఒక్క శాంతి విభాగంలోనే ఆ పురస్కారం దక్కించుకున్నాయి. మొత్తం 943 మంది నోబెల్ గ్రహీతల్లో మేరీ క్యూరీ సహా 58 మంది మహిళలు ఉన్నారు.
– 120 ఏండ్లలో 115 సార్లు భౌతికశాస్త్ర నోబెల్ బమతిని ప్రదానం చేశారు. మొత్తం 219 మంది ఈ అవార్డును అందుకున్నారు. జాన్ బర్టీన్ రెండు సార్లు ఫిజిక్స్ నోబెల్ అందుకున్నందున ఆయన పేరును ఒక్కసారి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 218 మంది ఫిజిక్స్ విభాగంలో నోబెల్ ప్రైజ్ పొందారు.
-రసాయనశాస్త్ర నోబెల్ బమతిని 113 సార్లు ప్రదానం చేయగా.. 188 మంది అందుకున్నారు. రెండు సార్లు నోబెల్ పొందిన ఫ్రెడరిక్ సాంగర్ పేరును ఒక్కసారి మాత్రమే లెక్కలోకి తీసుకుంటే కెమిస్ట్రీ నోబెల్ గ్రహీతల సంఖ్య 187.
– వైద్య విభాగంలో 112 సార్లు నోబెల్ బమతులను ప్రదానం చేయగా.. 224 మంది తీసుకున్నారు. సాహిత్య విభాగంలో 114 సార్లు నోబెల్ ప్రైజ్ ప్రదానం చేయగా.. 118 మంది అందుకున్నారు.
– నోబెల్ శాంతి బమతిని 102 సార్లు ప్రదానం చేయగా.. 109 మంది వ్యక్తులతో పాటు 28 సంస్థలు అవార్డు అందుకున్నాయి. రెడ్ క్రాస్ సంస్థ మూడు సార్లు, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యుజీస్ సంస్థ రెండుసార్లు అవార్డు తీసుకున్నందున ఆ సంస్థలను ఒక్కోసారే పరిగణలోకి తీసుకుంటే మొత్తం 25 సంస్థలు నోబెల్ శాంతి బమతి పొందినట్లు.
– ఇక 1969 – 2021 వరకు 53 ఏండ్లలో 53 సార్లు అర్థశాస్త్ర నోబెల్ బమతిని ప్రదానం చేయగా.. మొత్తం 89 మంది ఈ అవార్డును అందుకున్నారు.
– అంటే అన్ని విభాగాల్లో కలిపి 945 మంది వ్యక్తులు నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. మేరీ క్యూరీకి, లీనస్ పాలింగ్ రెండేసి నోబెల్ బమతులను వేర్వేరు విభాగాల్లో అందుకున్నారు. కాబట్టి వారి పేర్లు రెండు వారి పేర్లను ఒక్కోసారి మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఇప్పటివరకు మొత్తం 943 మంది నోబెల్ బమతి అందుకున్నారు.
వివిధ విభాగాల నోబెల్ బహుమతులు, వాటిని అందుకున్న తొలి గ్రహీతల వివరాలు
నోబెల్ బహుమతి తొలి గ్రహీత
శాంతి (1901) హెన్రీ డ్యూనాంట్ (స్విట్జర్లాండ్), ఫెడ్రిక్ ప్యాసీ (ఫ్రాన్స్)
సాహిత్యం (1901) సూలి వూదోమి (ఫ్రాన్స్)
ఫిజిక్స్ (1901) విల్హెల్మ్ కోనార్డ్ రాంట్జన్ (జర్మనీ)
కెమిస్టీ (1901) హెన్రీకస్ వాంట్ హాఫ్ (నెదర్లాండ్స్)
వైద్యం (1901) అడాల్ఫ్ వోన్ బెహరింగ్ (జర్మనీ)
అర్థశాస్త్రం (1969) రగ్నార్ ఫ్రిష్ (నార్వే), జాన్ టింబెర్జిన్ (నెదర్లాండ్స్)
రెండుసార్లు నోబెల్ బహుమతి
మేరీ క్యూరీ ఫిజిక్స్ (1903), కెమిస్టీ (1911)
లీనస్ పాలింగ్ కెమిస్టీ (1954), శాంతి (1962)
జాన్ బర్టీన్ ఫిజిక్స్ (1956), ఫిజిక్స్ (1972)
ఫ్రెడరిక్ సాంగర్ కెమిస్టీ (1958), కెమిస్ర్టీ(1980)
2021 నోబెల్ గ్రహీతలు
శాంతి మరియా రెస్సా (ఫిలిప్పైన్స్), దిమిత్రి మురటోవ్ (రష్యా)
సాహిత్యం – అబ్దుల్ రజాక్ గుర్నా (టాంజానియా సంతతికి చెందిన బ్రిటిషర్)
వైద్యం -డేవిడ్ జూలియస్ (అమెరికా), ఆర్డెమ్ పాటపౌతియన్ (లెబనాన్)
భౌతిక శాస్త్రం -సియుకురో మనాబె (జపాన్), క్లౌస్ హస్సెల్మాన్ (జర్మనీ),జార్జియో పారిసి (ఇటలీ)
రసాయన శాస్త్రం -బెంజామిన్ లిస్ట్ (జర్మనీ), డేవిడ్ W.C. మెక్‌మిలన్ (యూకే)
అర్థశాస్త్రం -డేవిడ్ కార్డ్ (కెనడా), జోషువా డి ఆంగ్రిస్ట్ (అమెరికా), గ్విడో డబ్ల్యూ ఇంబెన్స్ (నెదర్లాండ్స్)
నోబెల్ బహుమతి విలువ ఎంత?
నోబెల్ బహుమతితో చెల్లించే నగదును స్వీడిష్ క్రోనార్లలో ఇస్తారు. ప్రస్తుతం పూర్తి ప్రైజ్ మనీ విలువను 10 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లకు పెంచారు. అంటే మన భారత కరెన్సీలో ఇది సుమారుగా రూ.7.22 కోట్లు. అంటే ఒక విభాగంలో బమతిని ఒకే వ్యక్తి ప్రకటిస్తే అతను రూ.7.22 కోట్ల నగదు పొందుతాడు. ఇద్దరు లేదా ముగ్గురికి ఉమ్మడిగా ఈ బమతిని ఇస్తే.. వారివారి వాటాల ప్రకారం ప్రైజ్ మనీని పంచి ఇస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?