మొదటి ప్రజాస్వామ్య పాలకులు
తెలుగు ప్రజలను ఒకే తాటిపైకి తెచ్చి పాలించిన కాకతీయులు స్థానిక ప్రజల సంప్రదాయాలను, సంస్కృతిని గౌరవించారు. ప్రజాస్వామ్యయుత న్యాయబద్ధపాలన సాగించారు. శైవమత పోషకులైనప్పటికీ అన్ని మతాలను సమానంగా ఆదరించారు. మతాలకు ఆతీతంగా పాలన అందించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయాలు, కట్టడాలు వారి అద్భుత వాస్తు శిల్ప శైలికి నిదర్శనంగా ఈనాటికి నిలుస్తున్నాయి. వీరి కాలంలో సాహిత్య, నృత్య, శిల్పకళలు విలసిల్లాయి. వీరి పన్నుల విధానం, భాషా సాహిత్యానికి చేసిన సేవను పరిశీలిద్దాం.
పన్నులు
# కాకతీయుల కాలంలో విధించే పన్నుల పేర్లు శాసనాల్లో, సాహిత్యంలో పేర్కొన్నారు. వీటిని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు.
# భూమి పన్ను, పారిశ్రామిక పన్ను, వృత్తిపన్ను, వ్యాపార పన్ను
# భూములపై వసూలు చేసే పన్నులు పంగము, కానిక, దరిశనము, సిద్ధాయం వంటి పన్నులను ధనరూపంలో వసూలు చేసేవారు.
# పరిశ్రమల పన్నులు: అరి సుంకం, పన్ను, కానిక, పుట్టిమానిక నేత మగ్గాలవారు, నూనె గానుగల వారు వంటి పారిశ్రామిక పన్నులు వసూలు చేసేవారని దుర్గి శాసనం వెల్లడిస్తుంది.
# శ్రీమంగలి, నేతవారు గొల్లవారి దగ్గర నుంచి వృత్తి పన్నును వసూలు చేసేవారు.
# అడ్డగట్టు, లేదా అంగడి సుంకం, మడిగ సుంకం, కొలగసుంకం నూనెపై, ఉప్పు సంచులపై చెల్లించే మందార పన్ను వంటి వర్తక సంబంధ పన్నులు వసూలు చేసేవారు.
# ఇల్లరి అనే ఇంటిపై పన్ను, పుల్లరి అనే ఆస్తి పన్నును కూడా వసూలు చేసేవారు.
# ఈ పన్నులను వసూలు చేయడానికి అంగడి అధికారులుండేవారు. వీరు ముఖ్యంగా అమ్మకం, కొనుగోలు వ్యవహారాలు జరిగే అంగడిలో ఉండేవారు. వీరిలో సుంకమాన్యగాడు, తీర్పరి, కొలగాడు, కరణం ముఖ్యులు.
# కాకతీయుల కాలంనాటి కొన్ని శాసనాలు బుర సుంకం, మడిగ సుంకం, పెళ్ళిపన్ను, గాండి సుంకం (మోట బావిమీద), పుట్టుపేరు సుంకం (పుట్టిన బిడ్డకు నామకరణం చేసే సందర్భంలో) రేవు సుంకం, అలము (కూరగాయల మీద పన్ను), అంతరాయం (పోకతోటల మీద), కిళరము (గొరెల మందల మీద) మొదలైన పన్నులు, సుంకాలను పేర్కొన్నాయి.
మతం
# కాకతీయులు శైవ మతాన్ని ఆదరించారు. గణపతి దేవుడి ఆధీనంలో ఉన్న త్రిపురాంతకం, బట్టిప్రోలు, ఏలేశ్వరం(నల్లగొండ), మంథెన, మందడం, కాళేశ్వరం (కరీంనగర్), మల్కాపురం (గుంటూరు), సోమశిల మహబూబ్ నగర్ ప్రాంతాల్లో విశ్వేశ్వర శివదేశికుడు శైవగోళకీ మఠాలను స్థాపించి, రాజగురువు స్థానం పొందాడు.
# కాకతీయులు వారి రాజ్యంలో ప్రజానికానికి పూర్తి మతస్వేచ్ఛ ఇచ్చారు. కాకతీయుల కాలంలో తెలుగునాట సింహాచలం, సర్పవరం, మాచర్ల, అహోబిలం, ధర్మపురి, తిరుపతి, శ్రీకూర్మం, మంగళగిరి, పొన్నూరు, నెల్లూరు, నందలూరు, కొప్పారం, కారెంపూడి, కాల్వకొలను, మునిగడప, గొడలపర్తి, కొండపాక మొదలైన చోట్ల అనేక విష్ణుమూర్తి ఆలయాలు నిర్మించారు.
కాకతీయుల భాషా సేవ
# కాకతీయులు వారి మంత్రులు, అధికారులు సంస్కృత, తెలుగు భాషల వికాసానికి కృషిచేశారు. ప్రతాప రుద్రుని ఆస్థాన కవి అయిన విద్యానాథుడు గొప్ప సంస్కృత పండితుడు. ఇతని రచన ప్రతాపరుద్రీయం. శాలక్య మల్లకవి మరోగొప్పకవి. ఇతని రచనలు ఉదాత్త రాఘవం, నిరోష్ఠ్య రామాయణం. గణపతిదేవుడి కొలువులో గజసాహిణిగా ఉన్న జాయప గొప్ప సంస్కృత పండితుడు. ఇతడు నృత్యరత్నావళి రచించాడు. ఇది అనేక భాషల్లోకి నేడు అనువాదం జరిగింది. పాలంపేటలోని రామప్పగుడి గోడలపై అణువు అణువు నా గ్రంథంలోని నృత్యరీతులు చెక్కబడ్డాయి. ప్రజల భాషగా గుర్తింపుపొందిన జానతెలుగులో శైవ, వైష్ణవ పండితులు రచనలు చేశారు.
ఈ కాలానికి చెందిన తెలుగు కవుల్లో తిక్కన సోమయాజి, పాల్కురికి సోమనాథుడు, బద్దెన, కొలను గణపతిదేవుడు, రుద్రదేవుడు, ఏకామ్రనాథుడు, కాసెసర్వప్ప ముఖ్యులు. ఆంధ్రమహాభారతం, నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర దశకుమార చరితం, పురుషార్థ సారం, జైనేంద్ర కళ్యాణాభ్యుదయం, పండితారాధ్య చరితం, బసవ పురాణం, శివయోగసారం, నీతిసారం, నీతిసార ముక్తావళి, ప్రతాప చరిత్ర , సిద్ధేశ్వర చరిత్ర, క్రీడాభిరామం ముఖ్య రచనలు.
వాస్తుశిల్పం- కట్టడాలు
# రాష్ట్రకూట, కళ్యాణి చాళుక్యుల వారసులుగా కాకతీయులు తెలంగాణ, ఆంధ్రప్రాంతంలో అద్భుత దేవాలయాలను, కోటలను, తోరణాలను కట్టించారు. వారి సామంతులు, మంత్రులు, అధికారులు సైతం తమ యాజమానులను స్ఫూర్తీగా తీసుకొని అనేక దేవాలయాలను నిర్మించారు. కాకతీయుల నాటి కోటల్లో గోల్కొండ, ఓరుగల్లు, దేవరకొండ, రాచకొండ, భువనగిరి పేర్కొదగినవి. ఓరుగల్లు కోటకు మూడు గోడలు ఉండేవి. కాకతీయులు చాళుక్యుల వాస్తుశైలిని అనుసరించారు
కాకతీయుల వాస్తు శిల్పకళ ప్రధాన లక్షణాలు
1) ఎత్తైన అధిష్ఠానం
2) వివిధ శిల్పాలతో చెక్కిన స్తంభాలు
3) జలాలంకృతాలైన పిట్టగోడలున్న మండపాలు
4) తోరణ స్తంభాలు
5) ఎత్తైన విమానాలు
6) రంగమంటపాలు
7) ముఖ మంటపాలు
కాకతీయుల నాటి ముఖ్యమైన దేవాలయాలు
1) అనుమకొండ వేయిస్తంభాల గుడి
2) పాలంపేట రామప్పగుడి/ రుద్రేశ్వరాలయం
3) గణపురం కోటగుడి -వరంగల్
4) నాగులపాడు త్రికూటాలయం, కామేశ్వరాలయం
5) స్వయంభూలింగ దేవాలయం – వరంగల్ కోట
6) పిల్లలమర్రి ఏరకేశ్వరాలయం – నల్లగొండ
7) సౌమ్యనాథాలయం -నందలూరు
8) పచ్చల సోమేశ్వరాలయం- పానగల్లు
# పిల్లల మర్రిదేవాలయంలో కాకతీయుల కాలంనాటి చిత్రకళ విశేషాలు గోచరిస్తాయి. కాకతీయులు ఎక్కువగా శివాలయాలు నిర్మించారు. పద్మాక్షి దేవాలయం ఇండో ఇస్లామిక్ పద్ధతిలో నిర్మించారు.
#కాకతీయులు ఆలయాలను రెండు రకాల పద్ధతుల్లో నిర్మించారు.
1) త్రికూట ఆలయాలు
2) ఏకతల ఆలయాలు
# పిల్లలమరి, అనుమకొండ, పానగల్లులో త్రికూట ఆలయాలను నిర్మించారు. వీటన్నిం టిలో ప్రధానమైనది వేయిస్తంభాల గుడి.
# పాలంపేటలోని రామప్ప దేవాలయం ఏకతల ఆలయాల్లో ముఖ్యమైనది. కాకతీయుల వాస్తురీతికి తలమానికమైనది. చతురస్రాకారంలో అధిష్ఠ్టానంపై నిర్మించారు. ఆలయ వేదిక నక్షత్రాకారంలో ఉంటుంది. సుందర శిల్పాలకు నిలయం. ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు నీటి లో తేలుతాయి. ఎటువైపు నుంచి చూసినా ప్రేక్షకులను చూడటం నంది ప్రత్యేకత.
# ఈ కాలంలో వివిధ కులాలవారు వర్తకులు తమ వృత్తుల మీద వచ్చిన ఆదాయంలో కొంత వాటాను దేవాలయాలకు దానంగా ఇచ్చేవారు. దేవాలయ భూములకు పన్ను మినహాయింపు ఉండేది.
# కాకతీయుల కాలంనాటి చిత్రకళ పేరు నవకాశి. వీరు కాన్వాసుపై పురాణ, రామాయణ, మహాభారత గాథలను అత్యంత కళాత్మకంగా చిత్రీకరించేవారు.
# వీరికాలంలో ప్రసిద్ధి చెందిన నృత్యం పేరిణి నృత్యం. తెలంగాణ ప్రజల శాస్త్రీయ నృత్యం.
ప్రాక్టీస్ బిట్స్
1. కాకతీయులు నిర్మించిన ఆలయాలు ఎన్ని రకాలు?
1) త్రికూట ఆలయాలు
2) ఏకతల ఆలయాలు
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) 1, 2 సరైనవి కాదు
2. కాకతీయుల కాలంనాటి ఏ త్రికూటాలయంలో రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యదేవుడి మందిరాలు ఉంటాయి?
ఎ) వేయిస్తంభాల గుడి
బి) రామప్ప గుడి
సి) పిల్లలమరి దేవాలయం
డి) స్వయం భూ ఆలయం
3. కిందివాటిని జతపరచండి?
1) ప్రసన్న కేశవాలయం a) మొదటి ప్రోలరాజు
2) వేయిస్తంభాల గుడి b) రెండో ప్రోలరాజు
3) రామప్ప దేవాలయం c) రుద్రదేవుడు
4) స్వయంభూ దేవాలయం d) రేచర్ల రుద్రుడు
ఎ) 1- d, 2-c, 3-b, 4-a
బి) 1- b, 2-c, 3-d, 4-a
సి) 1- a, 2-b, 3-c, 4-d
డి) 1- c, 2-a, 3-d, 4-b
4. కాకతీయుల కాలంనాటి ముఖ్య ఎగుమతులు ఏవి?
1) సుగంధ ద్రవ్యాలు, పగడాలు
2) వజ్రాలు, వసా్త్రలు, దంతాలు
3) తైలం, కర్పూరం 4) చందనం
ఎ) 1, 2, బి) 1, 3, 4
సి) 3, 4 డి) 1, 2, 3, 4
5. కాకతీయుల కాలంనాటి ముఖ్య కొలతలు ఏవి?
1) కేసరిపాటి గడ 2) కేసరి మానిక
3) కేసరి పుట్టి 4) కేసరి కుంచం
5) కేసరిగడ
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 3, 4,5 డి) 1, 2, 3, 4, 5
6. కాకతీయుల కాలంలో సంచులను మోసే ఎడ్ల బండ్లపై విధించే సుంకాన్ని ఏమని పిలిచేవారు?
ఎ) అమ్ముబడి సుంకం బి) ఫలధారు
సి) పెరిక ఎడ్ల సుంకం
డి) మడిగ సుంకం
7. సుంక నిర్థారణ కోసం వ్యవసాయోత్పత్తి విలువను అంచనా వేసేవాడు?
ఎ) ఫలదారు బి) కాలగాడు
సి) తీర్పరి డి) పై ఎవరూకాదు
8. కాకతీయుల కాలంనాటి ముఖ్య పరిశ్రమలు-ప్రసిద్ధి చెందిన ప్రాంతాలతో జతపరచండి?
1) వరంగల్ a) బొమ్మలు, కత్తులు
2) నిర్మల్ b) ఇనుప పరిశ్రమ
3) గోల్కొండ c) రత్న కంబళ్లు,సన్నని వసా్త్రలు
4) గుత్తి కొండ, పల్నాడు d) వజ్రాలు
ఎ) 1- d, 2-c, 3-a, 4-b
బి) 1- c, 2-a, 3-d, 4-b
సి) 1- a, 2-b, 3-c, 4-d
డి) 1- b, 2-d, 3-a, 4-c
9. కాకతీయుల కాలంలో బంగారం, రత్నాలను తూయడానికి ఉపయోగించే తూనికల్లో సరైనది గుర్తించండి?
1) 4 గురిగింజలు – 1 సిన్నం
2) 30 సిన్నాలు – 1 తులం
3) 3 తులాలు – 1 పలం
4) 20 పలాలు – 1 వీశ
5) 2 వీశలు – 1 ఎత్తు
ఎ) 2, 3, 5 బి) 1, 2, 3
సి) 1, 2, 3, 4, 5 డి) 3, 4, 5
10. కింది వాటిలో కాకతీయుల కాలంలో శైవమతంలో ఏర్పడిన చీలికల్లో సరైనవి ఏవి?
1) కాలముఖ శైవం 2) కాపాలిక శైవం
3) పాశుపత శైవం 4) ఆరాధ్య శైవం
5) వీరశైవం
ఎ) 3, 4, 5 బి) 2, 3, 4,
సి) 1, 2, 3, 4, 5, డి) 1, 4, 5
11. స్వదేశీ, విదేశీయులు అందరూ అన్ని రకాల వసా్త్రలను అమ్మే అంగడి / సంత/ పెంటలను ఏమని పిలిచేవారు?
ఎ) చీరెమరేయ బి) పోక మఠీయ
సి) నూలు మాలిగ డి) పైవేవీకాదు
12. రంగమంటపం, సుందరంగా చెక్కిన స్తంభాలతో లంకలో రావణ సభ దృశ్యాలతో మనోహరంగా ఉండే త్రికూటాలయం ఏది?
ఎ) పిల్లలమర్రిఏరకేశ్వరాలయం
బి) స్వయంభూలింగ దేవాలయం
సి) నాగులపాడు త్రికూటాలయం
డి) పచ్చల సోమేశ్వరాలయం
13. కాకతీయుల కాలంలో వర్తక సంబంధ పన్నులను ఏమని పిలిచేవారు?
ఎ) అడ్డగట్టు బి) మడిగ సుంకం
సి) ఇల్లరి పన్ను డి) పుల్లరి పన్ను
14. కాకతీయుల కాలంలో వర్తకుడిని ఏమని పేర్కొన్నారు?
ఎ) బేహరి బి) పెక్కండ్రు
సి) వ్యవహారం డి) పరదేశి
15. వ్యాపారాలు స్వదేశీ, పరదేశి అని రెండు రకాలుగా ఉండేవి. వాటిని ఏమని పిలిచేవారు?
1) స్వదేశీని ‘నకరం’ అనేవారు
2) పరదేశీని నానాదేశి, పెక్కండ్రు ఉభయ నానాదేశీ పెక్కండ్రు అనేవారు
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి
డి) 1, 2 రెండూ సరికాదు
సమాధానాలు
1-సి 2-ఎ 3-బి 4-డి 5-డి 6-సి 7-ఎ 8-బి 9-సి 10-సి 11-ఎ 12-సి 13-ఎ 14-ఎ 15-సి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు