సుప్రీంకోర్టు ప్రారంభ విచారణాధికార పరిధిలోకి వచ్చే అంశం? (ఇండియన్ పాలిటీ)
సుప్రీంకోర్టు
1. కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ. భారత్‌లో న్యాయవ్యవస్థను ప్రవేశపెట్టింది – వారన్ హేస్టింగ్స్
బి. భారత్‌లో న్యాయవ్యవస్థను అభివృద్ధి పరిచింది – కారన్ వాలిస్
సి. భారత్‌లో ఏకీకృత సమీకృత న్యాయవ్యవస్థ అమల్లో ఉంది
డి. భారత న్యాయవ్యవస్థ నిర్మాణం ఫ్రాన్స్ దేశ న్యాయవ్యవస్థను పోలి ఉంది
ఎ) ఎ, సి, డి బి) ఎ, బి, సి
సి) ఎ, బి, డి డి) ఎ, బి, సి, డి
2. రెగ్యులేటింగ్ చట్టం 1773 ప్రకారం 1774లో దేశంలో తొలి సుప్రీంకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) కలకత్తాలోని పోర్ట్విలియం
బి) పశ్చిమ బెంగాల్‌లోని హౌరా
సి) మద్రాసు సమీపంలోని ఆవడి
డి) మహారాష్ట్రలోని వార్థా
3. కింది అంశాల్లో సరైన దాన్ని గుర్తించండి?
1. మన దేశ న్యాయవ్యవస్థ నిర్మాణం బ్రిటన్ న్యాయవ్యవస్థను పోలి ఉంది
2. మనదేశ న్యాయవ్యవస్థ పనివిధానం అమెరికా దేశ న్యాయవ్యవస్థను పోలి ఉంది
3. మన దేశ న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని కలిగి ఉంది
4. మన దేశంలో కార్యనిర్వాహకశాఖ నుంచి న్యాయశాఖను వేరుచేశారు
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1 , 2, 4 డి) 1, 2, 3, 4
4. ఒక దేశ ఔన్నత్యాన్ని, నాగరికతను ఆ దేశం న్యాయవ్యవస్థ పనితీరులో చూడవచ్చును అని పేర్కొన్నది ఎవరు?
ఎ) మహావీర్త్యాగి బి) రాబర్ట్ చాంబర్స్
సి) లార్డ్ బ్రైస్ డి) మారిస్ జోన్స్
5. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1. 1774లో ఏర్పడిన సుప్రీంకోర్టుకు తొలి ప్రధాన న్యాయయూర్తి- సర్ ఎలిజా ఇంఫే
2. ఢిల్లీలో ఏర్పడిన ‘ఫెడరల్ కోర్టు’కు తొలి ప్రధాన న్యాయమూర్తి- సర్ మారిస్ గ్వేయర్
3. సుప్రీంకోర్టు భవన నిర్మాణ రూపకర్త- గంగేశ డియోల్కర్
4. ఫెడరల్ కోర్టును 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు
ఎ) 1, 2, 4 బి) 1, 3, 4
సి) 1, 2, 3 డి) 1, 2, 3, 4
6. 1774లో కలకత్తాలో ఏర్పాటైన తొలి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో లేనివారిని గుర్తించండి?
ఎ) రాబర్ట్ చాంబర్స్ బి) సీజర్ లైమెస్టర్
సి) బార్నెస్ పీకాక్ డి) జాన్ హైడ్
7. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అనంతరం ప్రస్తుత సుప్రీంకోర్టు ఢిల్లీ కేంద్రంగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 1950 జనవరి 26
బి) 1950 జనవరి 27
సి) 1950 జనవరి 28
డి) 1950 జనవరి 29
8. ‘సుప్రీంకోర్టు’ గురించి రాజ్యాంగంలో వివరణ ఎక్కడ ఉంది?
ఎ) 5వ భాగం, ఆర్టికల్ 123 నుంచి 146
బి) 5వ భాగం, ఆర్టికల్ 124 నుంచి 147
సి) 5వ భాగం, ఆర్టికల్ 125 నుంచి 148
డి) 5వ భాగం, ఆర్టికల్ 122 నుంచి 145
9. సుప్రీంకోర్టుకు సంబంధించి సరైన ఆర్టికల్స్‌ను జతపర్చండి?
ఎ. ఆర్టికల్ 124 1. న్యాయమూర్తుల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది
బి. ఆర్టికల్ 125 2. భారతదేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుంది
సి. ఆర్టికల్ 126 3. తాత్కాలిక న్యాయ మూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు
డి. ఆర్టికల్ 127 4. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు
ఎ) ఎ-2, బి-1, సి-4, డి-3
బి) ఎ-1, బి-2, సి-4, డి-3
సి) ఎ-2, బి-1, సి-3, డి-4
డి) ఎ-3, బి-4, సి-1, డి-2
10. రాజ్యాంగ నిర్మాతలు సుప్రీంకోర్టును ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు?
1.పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించడం
2. భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని కాపాడటం
3. రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటం
4. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం, రాజ్యాంగానికి అర్థవివరణ ఇవ్వడం
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
11. రాజ్యాంగంలోని ఆర్టికల్ 128 ప్రకారం పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సేవలను ఎవరి అనుమతి ద్వారా ప్రధాన న్యాయమూర్తి తిరిగి సుప్రీంకోర్టులో వినియోగించుకొనే వీలుంది?
ఎ) పార్లమెంటు బి) రాష్ట్రపతి
సి) అటార్ని జనరల్
డి) అంతర్రాష్ట్రమండలి
12. కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
1. ఆర్టికల్ 129- సుప్రీంకోర్టు ‘కోర్ట్ ఆఫ్ రికార్డ్’
2. ఆర్టికల్ 130- సుప్రీంకోర్టు ప్రధాన కేంద్రం ‘ఢిల్లీ’లో ఉంది
3. ఆర్టికల్ 131 సుప్రీంకోర్టు క్రిమినల్ అప్పీళ్ల పరిధి
4. ఆర్టికల్ 132 రాజ్యాంగపరమైన అప్పీళ్ల పరిధి
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
13. సుప్రీంకోర్టు ప్రాథమిక/ప్రారంభ/ ఒరిజినల్ విచారణాధికార పరిధి గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వివరిస్తుంది?
ఎ) ఆర్టికల్ 130 బి) ఆర్టికల్ 131
సి) ఆర్టికల్ 133 డి) ఆర్టికల్ 134
14. సుప్రీంకోర్టుకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
1. ఆర్టికల్ 133- సివిల్ అప్పీళ్ల విచారణాధికార పరిధి
2. ఆర్టికల్ 134- క్రిమినల్ అప్పీళ్ల విచారణాధికార పరిధి
3. ఆర్టికల్ 135- ఫెడరల్ కోర్టువలే సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది
4. ఆర్టికల్ 136- స్పెషల్ లీవ్ పిటిషన్
ఎ) 1, 2, 4 బి) 1, 3, 4
సి) 1, 2, 3 డి) 1, 2, 3, 4
15. 1950లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను గుర్తించండి?
ఎ) ఒక ప్రధాన న్యాయమూర్తి+ ఆరుగురు ఇతర న్యాయమూర్తులు
బి) ఒక ప్రధాన న్యాయమూర్తి+ ఏడుగురు ఇతర న్యాయమూర్తులు
సి) ఒక ప్రధాన న్యాయమూర్తి+ 8 మంది ఇతర న్యాయమూర్తులు
డి) ఒక ప్రధాన న్యాయమూర్తి + 9మంది ఇతర న్యాయమూర్తులు
16. 2019వ సంవత్సరంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఎంతగా నిర్ణయించారు?
ఎ) ఒక ప్రధాన న్యాయమూర్తి + 30 మంది ఇతర న్యాయమూర్తులు
బి) ఒక ప్రధాన న్యాయమూర్తి + 31 మంది ఇతర న్యాయమూర్తులు
సి) ఒక ప్రధాన న్యాయమూర్తి + 32 మంది ఇతర న్యాయమూర్తులు
డి) ఒక ప్రధాన న్యాయమూర్తి + 33 మంది ఇతర న్యాయమూర్తులు
17. కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంటు నిర్ణయిస్తుంది
2. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు
3. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కావాలంటే ఉండాల్సిన కనీస వయస్సు 35 సంవత్సరాలు
4. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు
ఎ) 1, 2, 3 బి) 1, 2, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 3, 4
18. సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు రాష్ట్రపతి సమక్షంలో చేసే ప్రమాణ స్వీకారం ఎలా ఉంటుంది?
1. శాసనం ద్వారా ఏర్పడిన భారత రాజ్యాంగం పట్ల శ్రద్ధానిష్టలను కలిగి ఉంటాను
2. రాజ్యాంగ శాసనాన్ని సంరక్షిస్తాను
3. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను సంరక్షిస్తాను
4. పదవీ బాధ్యతలను ఎలాంటి పక్షపాతం, రాగద్వేషాలు లేకుండా నిర్వహిస్తాను
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 2, 3 డి) 1, 2, 3, 4
19. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం పొందాలంటే ఉండవలసిన అర్హతలను గుర్తించండి?
1. ఏదైనా హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి
2. ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి
3. రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయకోవిదుడై ఉండాలి
4. 60 సంవత్సరాల వయస్సు నిండి ఉండరాదు
ఎ) 1, 2, 3 బి) 1, 2, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 3, 4
20. ఆర్టికల్ 124 (4) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అసమర్థత, దుష్ఫ్రర్తన అనే కారణాలచేత ఎవరు తొలగించగలరు?
ఎ) రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీచేయడం ద్వారా
బి) కేంద్ర మంత్రి మండలి ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా
సి) పార్లమెంటు 2/3 ప్రత్యేక తీర్మానం ఆమోదం ద్వారా
డి) పార్లమెంటు ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా
21. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే తీర్మానానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1. ఈ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు
2. ఈ తీర్మానాన్ని ఉభయసభలు విడివిడిగా ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది
3. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మొదటి సభ తిరస్కరిస్తే రెండో సభలో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు
4. ఈ తీర్మానం ఆమోదం విషయమై పార్లమెంటు ఉభయసభల మధ్య అభిప్రాయ బేధాలు వస్తే ఉభయసభల సంయుక్త సమావేశం స్పీకర్ అధ్యక్షతన జరుగుతుంది
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
22. 1991లో సుప్రీంకోర్టులో ఏ న్యాయమూర్తిపై పార్లమెంటులో తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టారు?
ఎ) జస్టిస్ రంగనాథ్ మిశ్రా
బి) జస్టిస్ అధీర్ రంజన్ హాన్
సి) జస్టిస్ వీ రామస్వామి
డి) జస్టిస్ ఎన్‌కేపీ సాల్వే
23. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు తీర్మానానికి సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
1. ఈ తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టా
లంటే కనీసం 100 మంది లోక్‌సభ సభ్యుల
సంతకాలు అవసరం
2. ఈ తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది రాజ్యసభ సభ్యుల సంతకాలు అవసరం
3. ఈ తీర్మానాన్ని ముందుగా ఏ సభలో ప్రవేశపెడతారో ఆ సభ ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది
4. న్యాయమూర్తుల తొలగింపు తీర్మానాన్ని బ్రిటన్ నుంచి గ్రహించారు
ఎ) 1, 2, 4 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి) 1, 2, 3, 4
24. సుప్రీంకోర్టు ప్రారంభ విచారణాధికార పరిధిలోకి వచ్చే అంశాన్ని గుర్తించండి?
1. లోక్‌సభ ఎన్నికల వివాదాలు
2. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు
3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివాదాలు
4. దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలు
ఎ) 1, 2, 4 బి) 2, 3, 4
సి) 1, 2, 3 డి) 1, 2, 3, 4
25. 1961లో ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తొలిసారిగా ప్రారంభ/ ఒరిజినల్ విచారణాధికార పరిధిని వినియోగించినది?
ఎ) భారత ప్రభుత్వం Vs స్టేట్ ఆఫ్ పశ్చిమ బెంగాల్
బి) భారత ప్రభుత్వం Vs స్టేట్ ఆఫ్ కేరళ
సి) భారత ప్రభుత్వం Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు
డి) భారత ప్రభుత్వం Vs స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్
26. కింది ఏ అంశం సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణాధికార పరిధి నుంచి మినహాయించబడింది?
1.ఆర్టికల్ 253 ప్రకారం అంతర్జాతీయ ఒప్పందాలు
2. ఆర్టికల్ 262 ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదంపై వివిధ ట్రిబ్యునల్స్ ఇచ్చిన అవార్డుల ఆధారంగా పార్లమెంటు రూపొందించిన చట్టాలు
3. ఆర్టికల్ 275 ప్రకారం కేంద్ర రాష్ట్రాలకు ఇచ్చే సహాయక గ్రాంట్లు
4. ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషనర్ నియామకం
ఎ) 1, 2, 4 బి) 1, 3, 4
సి) 1, 2, 3 డి) 1, 2, 3, 4
27. 1957లో భారత ప్రభుత్వం అనుసరించిన ఏ చర్యను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది?
ఎ) బొగ్గు గనుల జాతీయీకరణ
బి) సహాయక గ్రాంట్లు నిలుపుదల
సి) నూతన పారిశ్రామిక విధానం
డి) నూతన వ్యవసాయ విధానం
28. కింది ఏ అంశం సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణాధికార పరిధి నుంచి మినహాయించబడింది?
1. ఆర్టికల్ 280- కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసులు
2. ఆర్టికల్ 290- కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరే ఆర్థికపరమైన ఒప్పందాలు
3. ఆర్టికల్ 304- అంతర్రాష్ట్ర వర్తక
వాణిజ్యానికి సంబంధించిన అంశాలు
4. ఆర్టికల్ 82- నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశాలు
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
29. న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి కొలీజియంను సంప్రదించాల్సిన అవసరం లేదని 1982లో ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువ రించింది?
ఎ) జేకే ఛటర్జీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) ఎస్సీ గుప్తా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సి) పంకజ్ ద్వివేది Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) రవీంద్ర నాయక్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
30. న్యాయమూర్తులను నియమించే సందర్భంలో రాష్ట్రపతి తప్పనిసరిగా ‘కొలీజియం’ను సంప్రదించాలని 1993 లో ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది?
ఎ) సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) కొలీజియం కూటమి Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సి) కామేశ్వరిసింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) ఏకే సింఘాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
జవాబులు
1-బి, 2-ఎ, 3-డి, 4-సి, 5-డి, 6-సి, 7-సి, 8-బి, 9-ఎ, 10-డి, 11-బి, 12-సి, 13-బి, 14-డి, 15-బి, 16-డి, 17-బి, 18-డి, 19-ఎ, 20-సి, 21-ఎ, 22-సి, 23-బి, 24-బి, 25-ఎ, 26-సి , 27-ఎ, 28-డి, 29-బి, 30-ఎ.
సత్యనారాయణ,
విషయనిపుణులు, ఏకేఆర్ స్టడీసర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు