2001 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏ గుర్తుపై పోటీ చేసింది?
1. దోఖా తిన్న తెలంగాణ సదస్సు ఎక్కడ జరిగింది?
1) సూర్యాపేట 2) ఖమ్మం
3) వరంగల్ 4) నిజామాబాద్
2. 1997లో జరిగిన తెలంగాణ మహాసభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టినది?
1) చెరుకు సుధాకర్ 2) వీ ప్రకాశ్
3) మారోజు వీరన్న 4) కాళోజీ
3. కింది వాటిలో సరైనవి?
1) తెలంగాణ కోసం పనిచేసే 28 సంఘాలు కలిసి 1997, అక్టోబర్ 10న ఓయూ లైబ్రరీలో తెలంగాణ ఐక్యవేదికను ఏర్పాటు చేసుకున్నాయి
2) 1997, నవంబర్ 1న తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజాం కాలేజీ నుంచి సికింద్రాబాద్‌లోని క్లాక్‌టవర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు
3) 1 4) 1, 2
4. ఎవరి అధ్యక్షతన ‘ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష’ పేరుతో బహిరంగ సభ జరిగింది?
1) ఆకుల భూమయ్య
2) చెరుకు సుధాకర్
3) సాయిబాబా 4) బెల్లయ్య నాయక్
5. తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం ఏర్పడిన ‘తెలంగాణ మహాసభ మాస పత్రిక’కు ఎడిటర్‌గా వ్యవహరించింది?
1) ప్రభాకర్ 2) వీ ప్రకాశ్
3) కాళోజీ 4) సాయిబాబా
6. 2001, జూలైలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏ గుర్తుపై పోటీ చేసింది?
1) కారు 2) పార
3) రైతు నాగలి 4) చక్రం
7. టీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత మొదటి సభను కేసీఆర్ నాయకత్వంలో ‘సింహగర్జన’ పేరుతో ఎక్కడ నిర్వహించారు?
1) కరీంనగర్ 2) హన్మకొండ
3) హైదరాబాద్ 4) ఖమ్మం
8. 1997లో ‘ప్రాంతీయ అసమానతలు, అభివృద్ధి ప్రత్యామ్నాయాలు’ అనే అంశంపై రెండురోజుల సదస్సును ఓయూలో నిర్వహించినది?
1) ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు
2) ప్రొ. జయశంకర్ 3) ప్రొ. సింహాద్రి
4) 1, 3
9. తెలంగాణ మహాసభలో 17 డిమాండ్లతో సూర్యాపేట డిక్లరేషన్‌ను ప్రతిపాదించింది?
1) జయశంకర్ 2) బీ జనార్దనరావు
3) చెరుకు సుధాకర్ 4) కేశవరావు జాదవ్
10. గిర్గ్లానీ కమిషన్ తన తుది నివేదికను సమర్పించింది?
1) 2004, సెప్టెంబర్ 30
2) 2004, అక్టోబర్ 30
3) 2004, నవంబర్ 30
4) 2004, డిసెంబర్ 30
11.టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం కోసం తన ఇల్లు అయిన జలదృశ్యంను ఇచ్చిన నాయకుడు?
1) కొండా లక్ష్మణ్ బాపూజీ
2) కెప్టెన్ లక్ష్మీకాంతరావు
3) ఆలె నరేంద్ర 4) విద్యాసాగర్ రావు
సమాధానాలు
1-1, 2-2, 3-4, 4-3, 5-2, 6-3, 7-1, 8-4, 9-3. 10-1,11-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు