బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
డిగ్రీ పూర్తయ్యిందా? మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? భద్రమైన కొలువు, భరోసానిచ్చే జీతభత్యాలతో కూడిన ఉద్యోగం కావాలా? పదోన్నతులతో ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉన్న జాబ్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే… ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా ఉన్న 11 జాతీయ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు, పరీక్ష విధానం, ముఖ్యతేదీలు వంటి సమాచారం ‘నిపుణ’ పాఠకుల కోసం…
ఐబీపీఎస్
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (ఎస్బీఐ మినహా) క్లర్క్, పీవో/ మేనేజ్మెంట్ ట్రెయినీ, స్పెషలిస్ట్ ఆఫీసర్, ఆర్ఆర్బీ (క్లర్క్స్, ఆఫీసర్లు) పోస్టుల భర్తీకి ప్రతి ఏడాదిఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ప్రస్తుతం 11 జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6035 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (సీఆర్పీ–XII) విడుదల చేసింది.
పోస్టు పేరు : క్లర్క్ (క్లరికల్ కేడర్)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా
తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనేనాటికి విద్యార్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం (ఏదైనా సంస్థ నుంచి కంప్యూటర్ సర్టిఫికెట్/డిప్లొమా, డిగ్రీ (కంప్యూటర్ ఆపరేషన్స్/లాంగ్వేజ్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సర్టిఫికెట్) ఉండాలి.
కేంద్రపాలిత/రాష్ట్ర స్థాయి అధికార భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం రావాలి.
వయస్సు : 2022, జూలై 1 నాటికి కనిష్ఠంగా 20 ఏండ్ల నుంచి గరిష్ఠంగా 28 ఏండ్లకు మించరాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు సడలింపు ఉంటుంది.
మొత్తం పోస్టులు 6305
తెలంగాణలో: బ్యాంక్ ఆఫ్ ఇండియా-1, పంజాబ్&సింధ్ బ్యాంక్-1, పంజాబ్ నేషనల్ బ్యాంక్-1, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-96 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఎస్సీ-17, ఈడబ్ల్యూఎస్-6, జనరల్-76 పోస్టులు ఉన్నాయి. ఏపీలో 209 ఖాళీలు ఉన్నాయి.
పాల్గొనే బ్యాంకులు
బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్&సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఎంపిక విధానం
ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష ద్వారా చేస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామ్: మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు. కాలవ్యవధి 60 నిమిషాలు.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ- 30, రీజనింగ్ ఎబిలిటీ-30 ప్రశ్నలు ఇస్తారు.
మెయిన్ ఎగ్జామ్
మొత్తం 190 ప్రశ్నలు. 200 మార్కులు. పరీక్ష కాలవ్యవధి 160 నిమిషాలు.
పరీక్షలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 50, జనరల్ ఇంగ్లిష్- 40, రీజనింగ్ ఎబిలిటీ&కంప్యూటర్ ఆప్టిట్యూడ్-50, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?