డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
డిగ్రీ ప్రవేశాలంటే ఒకప్పుడు అంతా గందరగోళం, ఆందోళనకరం. మెరిట్‌తో సంబంధం లేకుండా ఎవరైనా ఏ కాలేజీలో అయినా చేరే పరిస్థితి ఉండేది. కాలేజీల మోసపూరిత ప్రకటనలు, వేలకువేల ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెట్టేవి. ఇంకా వీటితో పాటు ప్రైవేటు కాలేజీల అక్రమ అడ్మిషన్ల దందా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఎంతో తతంగం ఉండేది. ఇదంతా గతం.. ఇప్పుడా పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క నిర్ణయంతో అన్నింటికి చెక్ పెట్టింది. డిగ్రీ ప్రవేశాలను విద్యార్థులకు ‘దోస్త్’ (DOST) మయం చేసింది. ఐదేండ్లుగా ‘దోస్త్’ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్) ప్రక్రియ ఏటా పలు మార్పులు చేస్తూ.. కొత్తగా మరింత టెక్నాలజీని జోడిస్తూ విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న డిగ్రీ సీట్ల సంఖ్య, కాలేజీలు, కోర్సులు, ప్రవేశాలతో పాటు మరిన్ని విషయాలను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొ. లింబాద్రి ‘నిపుణ’తో పంచుకున్నారు.
ఈ ఏడాది ఎన్ని సీట్లు నింపనున్నారు. ఎన్ని కాలేజీలు అందుబాటులో ఉన్నాయి?
రాష్ట్రవ్యాప్తంగా దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను 5 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నాం. 947 కాలేజీలు డైరెక్ట్‌గా దోస్త్ ద్వారా అడ్మిషన్లు జరుపుతుండగా.. 53 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు దోస్త్ ఇంటిగ్రేటేడ్, మిగిలిన 65 కాలేజీలు ఓటు ద్వారా, మైనారిటీ స్టేటస్ ద్వారా అడ్మిషన్లు జరుపుతున్నాయి. 1080 కాలేజీల్లో అడ్మిషన్లు నిర్వహిస్తున్నాం. మొత్తంగా రాష్ట్రంలో 1065 డిగ్రీ కాలేజీలకు 15 టెక్నికల్ బోర్డుకు సంబందించినటువంటి కోర్సులకు దోస్త్ ద్వారా అడ్మిషన్లు నిర్వహిస్తున్నాం. గతంలో 2లక్షల 57 మంది విద్యార్థులు డిగ్రీలో చేరారు. ఈ సారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
షెడ్యూల్స్..
ఈ ఏడాది అడ్మిషన్లకు జూలై 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. జూలై 7 నుంచి వెబ్ ఆప్షన్స్ విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. మొత్తం వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్ మెంట్ ప్రాసెస్‌కు సంబంధించిన షెడ్యూల్ సెప్టెంబర్ 22 వరకు పూర్తవుతుంది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు ఓరియంటేషన్ కోర్సెస్ నిర్వహిస్త్తాం. అక్టోబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయి.
ఎంసెట్‌కు ఇంకా సమయం ఉన్నది. దోస్త్ ప్రక్రియ ఆ సమయానికి ముగిస్తే ఎంసెట్ విద్యార్థులకు అవకాశం ఉంటుందా?
తప్పకుండా ఉంటుంది. ఎంసెట్‌కు, డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థికి ఎలాంటి నష్టం జరగకుండా కోఆర్డినేట్ చేసుకొని ప్రక్రియ చేపడుతాం. సెకండ్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్, డిగ్రీ అడ్మిషన్స్ కలిపి చేస్తాం. విద్యార్థులు రెండు వైపులా ఆప్షన్స్ ఎంచుకునే అవకాశం ఉంది. సీటు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పొందవచ్చు. మిగతాది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫీజు కూడా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ సమయంలో విద్యార్థులకు ఇంజినీరింగ్ సీటు కావాలంటే అక్కడ, డిగ్రీ కావాలంటే దోస్త్‌లో సీటు ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
డిగ్రీ చదువుతున్నప్పుడే సంబంధిత సెక్టార్‌లోని సంస్థల్లో అప్రెంటిస్లాగా పనిచేసే విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంది. ఇక్కడ అలాంటి విధానాన్ని అమలు చేస్తున్నారా?
డిగ్రీలో అంప్రెంటిషిప్స్, ఇంటర్న్షిప్స్ విధానం ఉన్నది. ప్రయత్నం చేశాం. డాటా సైన్స్ కోర్స్ ఇంటర్డ్యూస్ చేశాం. దీని ద్వారా విద్యార్థులు కోర్సు డిజైనింగ్‌లోనే పరిశ్రమల సహకారంతో చేయడం జరిగింది. టీచింగ్‌లో కూడా ఇండస్ట్రీ అనుభవం ఉన్న ఫ్యాకల్టీ ద్వారా టీచింగ్ చేయిస్తున్నాం. టీఎస్ ఆన్లైన్లో ఇంటర్న్‌షిప్ ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నాం. జాబ్ చేసే స్థాయికి వచ్చేసరికి కావాల్సిన స్కిల్స్ విద్యార్థులు పొందుతారు. ఇలా కొన్ని కోర్సుల్లో తీసుకువచ్చాం. అయితే అన్ని కోర్సుల్లో ఇది సాధ్యం కాదు.
డిగ్రీలో చేరేందుకు పాలిటెక్నిక్ విద్యార్థులకు అవకాశం కల్పించారు కదా! రెస్పాన్స్ ఎలా ఉంది? ఎంత మంది పాలిటెక్నిక్ నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు.
మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒకేషనల్ కోర్సు చేసిన విద్యార్థులే కాదు అందరూ కూడా డిగ్రీలో భారీగా జాయిన్ అవుతున్నారు. డిగ్రీ కోర్సులకు గత వైభవం వచ్చింది. ప్రతి ఏడాది డిగ్రీలో చేరేవారి సంఖ్య 10 వేల నుంచి 20వేలు పెరుగుతుంది. 2017లో 2లక్షల పదివేలు ఉంటే గతేడాది 2 లక్షల 57 వేల మంది డిగ్రీలో జాయిన్ అయ్యారు. కొత్త రకమైన కోర్సులు తీసుకురావడం కూడా డిగ్రీకి డిమాండ్ పెరుగుతుంది.
సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ సెంటర్ల ఏర్పాటు..
స్టూడెంట్ ఫ్రెండ్లీ సాఫ్ట్ట్‌వేర్‌ను తీసుకువచ్చాం. హెల్ప్లైన్ల సెంటర్లలో దోస్త్ ప్రతి ఏడాది కొత్త సౌకర్యాన్ని కల్పిస్తుంది. దోస్త్ అంటేనే స్టూడెంట్స్ ఫెండ్లీ. విద్యార్థులకు కావాల్సిన సహాయ సహాకారాలు వివిధ రూపాల్లో అందాలనేది దోస్త్ ఉద్దేశం. హెల్ప్‌లైన్ సెంటర్స్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఏర్పాటు చేశాం. వీటితో పాటుగా ఈ సారి కాల్ సెంటర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చాం. 24/7 ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూడా కొత్త విధానాన్ని ఫేషియల్ ద్వారా (ఫేస్ అతో) తీసుకువచ్చాం. l వాట్సాప్ చాట్‌బోట్ అటో రెస్పాండర్ సౌకర్యాన్ని కల్పించాం. విద్యార్థులు 7901002200 నెంబర్‌కు దోస్త్‌తో అనుసంధానించిన మొబైల్ నెంబర్‌తో చాటింగ్‌చేసి సందేహాలు తీర్చుకోవచ్చు. అంతేకాకుండా ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌ల్లో దోస్త్ సమాచారాన్ని వీడియోల రూపంలో పొందవచ్చు.
బకెట్ సిస్టమ్ ద్వారా ఉపయోగాలు ఉన్నాయా?
బకెట్ సిస్టమ్ అనేది గొప్ప ప్రయత్నం. దీని వల్ల ఎంతో ప్రయోజనం. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. బీఏ, బీఎస్సీ, బీకాంలో సంప్రదాయంగా ఉండే సబ్జెక్టులనే విద్యార్థులు చదివేందుకు వీలుండేది. బకెట్ విధానంలో విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునే వీలుంది.
ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులు అర్హులేనా..
అర్హులే. ఈ ఏడాది మంచి నిర్ణయం తీసుకున్నాం. 20 శాతం నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా తీసుకువచ్చాం. ఇతర రాష్ర్టాల్లో చదివిన విద్యార్థులు దోస్త్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్స్ పొందవచ్చు. ఇందుకోసం సూపర్ న్యూమరరీ సీట్స్ క్రియేట్ చేశాం. ఉన్న సీట్లను డిస్టర్బ్ చేయకుండా అదనంగా 20 శాతం సీట్స్ అందుబాటులోకి తెచ్చాం. దీని వల్ల కాలేజీల్లో అన్ని రాష్ర్టాల విద్యార్థులు ఉంటారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ
విద్యార్థి స్వయంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్‌కార్డు నెంబర్, తమ నెంబర్ లేదా కుటుంబ సభ్యలు మొబైల్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకు దోస్త్ వెబ్సైట్ https://dost.cgg.gov.inలో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. విద్యార్థి తమ వివరాలు నమోదుచేయాలి. ఆధార్, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి.
ఫ్రీ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాతే దోస్త్ ఐడీని పొందవచ్చు. ఒకవేళ ఆధార్‌కార్డ్‌తో మొబైల్ నెంబర్ అనుసంధానం లేకపోతే మీ సేవ కేంద్రాలు/దోస్త్ హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా బయోమెట్రిక్ ఆథరైజేషన్ ద్వారా దోస్త్ ఐడీని పొందవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీ యాప్ ఫోలియో ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు.
ఎడిట్ చేసుకోవచ్చా..?
లాగిన్ అయిన తర్వాత విద్యార్థులు సబ్మిట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్‌లో వివరాలు నమోదు చేయాలి. ఈ వివరాలను వెబ్ ఆప్షన్లు ఇచ్చే వరకు ఎడిట్ చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పించిన తర్వాత ప్రింట్ తీసుకుని దగ్గరుంచుకోవాలి.
కాలేజీ, కోర్సుల సమాచారం..
దోస్త్ హోం పేజీలో సెర్చ్ బై కాలేజీ/ కోర్సుపై క్లిక్ చేసి ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. నచ్చిన కోర్సు, కాలేజీలో సీటు రాకపోతే సీటును రిజర్వ్ చేసుకుని, ైస్లెడింగ్కు వెళ్లవచ్చు. ఇందుకు ప్రభుత్వ విశ్వవిద్యాలయ కాలేజీల్లో సీట్లు పొంది, ఫీజు రియింబర్స్‌మెంట్ అర్హత ఉన్న విద్యార్థులు సెల్ఫ్‌రిపోర్టింగ్ కోసం ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. అదే ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పొందిన వారు, అన్ని రకాల కాలేజీల్లో సీట్లు పొంది పీజు రీయింబర్స్మెంట్ అర్హత లేని వారు సెల్ప్ రిపోర్టింగ్ డబ్బులు చెల్లించాలి.
సర్టిఫికెట్లు అప్లోడ్ ఎలా…
సర్టిఫికెట్ల అప్లోడ్ అవసరం లేదు. ఇన్‌కం, క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్లను అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా సర్టిఫికెట్ అప్లోడ్ అవుతుంది.
దోస్త్ లక్ష్యం నెరవేరిందా?
100 శాతం నెరవేరింది. దేశానికే మనం మోడల్‌గా నిలిచాం. మన విధానాన్ని చూసి దేశంలోని ఇతర రాష్ర్టాల్లో కూడా అమలుచేస్తున్నారు.
- సత్యం గౌడ్ సూదగాని
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు