రెండు సంఖ్యలను కలిపే హార్డ్ వేర్ ఏది?
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
డిజిటల్ రూపంలోగానీ, ఆడియో లేదా వీడియో రూపంలోగానీ, లేదా ఇతర రూపాల్లోగానీ ఉన్న సమాచారాన్ని విశ్లేషించడానికి, సరఫరా చేయడానికి competitive exams, ఉపయోగపడుతాయి. సమాచార శాసా్త్రనికి ప్రధానంగా డేటాను సేకరించడం, నిలువ చేయడం, విశ్లేషించడం, వ్యవస్థాపన చేయడం అనేవి సవాళ్లు.
ఐటీలో వినియోగించే ప్రాథమిక పదజాలం
1. నెట్వర్క్ (Network)
#సమాచారాన్ని పంచుకోవడానికి లేదా పరస్పర సమాచార మార్పిడికి ఒక క్రమపద్ధతిలో అనుసంధానించిన కంప్యూటర్ల సమూహాన్ని నెట్వర్క్ అంటారు.
2. నోడ్ (Node)
#నెట్‌వర్క్‌కు అనుసంధానించిన వేర్వేరు విభాగాలు వివిధ ఫైళ్లను, ఇతర వనరులను పంచుకోగలవు. కంప్యూటర్ నెట్‌వర్క్‌లో నోడ్ అంటే కంప్యూటరే.
3. సర్వర్ (Server)
# క్లయింట్‌కు సంబంధించిన సాఫ్ట్వేర్ కంప్యూటర్లలో రన్ అయ్యేలా ఒక ప్రత్యేక విధమైన సేవను అందించే వ్యవస్థను లేదా ప్రోగ్రామ్‌ను సర్వర్ అంటారు. ఇది క్లయింట్లకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన వ్యవస్థ.
4. ఇంటర్నెట్ (Internet)
# కొన్ని కంప్యూటర్ల అనుసంధానం నెట్వర్క్ అయితే, కొన్ని నెట్‌వర్క్‌ల అనుసంధానాన్ని ఇంటర్నెట్ అంటారు. అంటే ఇంటర్నెట్లో కంప్యూటర్లు భారీ సంఖ్యలో అనుసంధానమై ఉంటాయి. ప్రస్తుతం కంప్యూటర్ల అనుంసధానం అనేది ప్రపంచస్థాయిలో కనిపిస్తున్నది.
5. ఇంటర్నెట్ ప్రొటోకాల్ (Internet Protocol)
#ఇంటర్నెట్ అడ్రస్ లెవల్లో మెసేజ్‌లు పంపడానికి, స్వీకరించడానికి సంబంధించిన నియమనిబంధనల సముదాయాన్నే ఇంటర్నెట్ ప్రొటోకాల్ అంటారు. ఇంటర్నెట్లో ఒక కంప్యూటర్ మరో కంప్యూటర్‌తో డేటాను పంచుకునేటప్పుడు ఈ ప్రొటోకాల్‌ను పాటించాలి.
6. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రొటోకాల్ (Transm ission Control Protocol)
# కంప్యూటర్ల అనుసంధానానికి సంబంధించిన ప్రొటోకాల్‌ను ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రొటోకాల్ అంటారు.
7. WWW
# ఇది ఇంటర్నెట్లోని ఇంటర్‌కనెక్టెడ్ కంప్యూటర్ ఫైళ్లను ఒకదానితో మరోదాన్ని లింక్ చేసే ప్రపంచస్థాయి వ్యవస్థ. దీన్ని టిమ్ బెర్నర్స్ లీ డెవలప్ చేశారు. ఈయన ప్రస్తుతం WWW కన్సార్టియం డైరెక్టర్‌గా ఉన్నారు.
8. HTTP
# HTTP అంటే హైపర్ టెక్ట్ ట్రాన్స్ఫర్ ప్రొటోకాల్. ఇది కంప్యూటర్లు రిమోట్ సర్వర్ నుంచి టెక్ట్వల్ డేటాను తిరిగి పొందే నియమాల సముదాయం.
9. HTTPS
# HTMLను స్కాన్ చేయడానికి, విశ్లేషించడానికి HTTPS అనే ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేశారు. సెక్యూర్ సాకెట్ లేయర్ (SSL) అనే క్రిప్టోగ్రాఫిక్ సెక్యూరిటీ మెజర్ ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇంటర్నెట్లోని సున్నితమైన డేటాకు ఈ సెక్యూర్ సాకెట్ లేయర్ రక్షణ కల్పిస్తుంది.
10. URL (Uniform Resource Locator)
# ఇది ఒక యూనివర్సల్ నేమింగ్ కన్వెన్షన్. దీన్ని ఇంటర్నెట్ ద్వారా వనరులను గుర్తించడానికి, పొందడానికి వినియోగిస్తారు.
11. మాల్వేర్ (Malware)
#వైరస్లు, వార్మ్, ట్రోజన్‌హార్స్ రూపంలో కంప్యూటర్లకు హాని తలపెట్టే సాఫ్ట్వేర్లను మాల్వేర్ అంటారు. ఈ సాఫ్ట్వేర్లు ఒక కంప్యూటర్లో లేదా ప్రత్యేకించి ఒక నెట్‌వర్క్‌లో రన్ అవుతున్న ప్రోగ్రామ్స్‌ను మార్చివేయగలవు, ప్రభావితం చేయగలవు. కొన్ని తీవ్రతర సందర్భాల్లో ప్రోగ్రామ్స్‌ను పూర్తిగా షట్‌డౌన్ కూడా చేయగలవు. ఈ సాఫ్ట్వేర్లు ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్‌కు వేగంగా విస్తరిస్తాయి. అందుకే వీటిని వైరస్లు అంటారు.
12. ట్రోజన్ లేదా ట్రోజన్ హార్సెస్ (Trojan or Trojan horses)
#ఈ ట్రోజన్ లేదా ట్రోజన్ హార్సెస్ అనేవి హానికర సాఫ్ట్వేర్లు. ఉపయోగకరమైన ఆప్లికేషన్ ప్రోగ్రామ్స్ రూపంలో ఇవి ఉంటాయి. ఈ ట్రోజన్ స్టార్ట్‌ను ఓపెన్ చేస్తే కంప్యూటర్ల పైన ఉన్న ఫైళ్లు ధ్వంసమవుతాయి.
సైబర్ వార్ఫేర్ (Cyber Warfare)
# సైబర్ గూఢచర్యం అనేది 2007 నుంచి బాగా విస్తరించింది. 2007లోనే ROCRA పేరుతో ఒక క్యాంపెయిన్ మొదలైంది.
స్టక్స్నెట్ వైరస్ (STUXNET Virus)
– ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఈ సాఫ్ట్వేర్ వైరస్‌ను అభివృద్ధి చేశాయి. ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలను, ప్రత్యేకించి ఇరాన్ న్యూక్లియర్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ఫలితంగా ఇరాన్ న్యూక్లియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రెండేండ్లకు పైగా ఆలస్యమైంది.
ఫ్లేమ్ వైరస్ (Flame Virus)
-ఈ ఫ్లేమ్ వైరస్‌నే ఫ్లేమర్ లేదా స్కైవైపర్ అంటారు. ఈ వైరస్ విండోస్‌ను రన్ చేసే కంప్యూటర్లపై దాడి చేస్తుంది. ఇరాన్‌కు చెందిన నేషనల్ CERT పరిధిలోని మహెర్ సెంటర్, కాస్పర్‌స్కై ల్యాబ్ ఈ వైరస్‌ను 2012లో కనిపెట్టాయి.
రెడ్ అక్టోబర్ విక్టిమ్స్ (Red October Victims)
-కాస్పర్‌స్కై ల్యాబ్ హానికర సాప్ట్‌వేర్‌లతో పొంచి ఉన్న ముప్పుపై ఇటీవల నూతన పరిశోధన చేసి ఒక నివేదికను రూపొందించింది. రెడ్ అక్టోబర్ విక్టిమ్స్‌గా పిలిచే ఒక భారీ సైబర్ గూఢచర్య నెట్వర్క్ గురించి ఆ నివేదికలో వెల్లడించింది.
– ఈ మధ్యకాలంలో దౌత్యపరమైన, ప్రభుత్వ, శాస్త్రీయ పరిశోధన విభాగాలపై వరుసగా సైబర్ దాడులు జరుగుతున్నాయని కాస్పర్‌స్కై ల్యాబ్ పేర్కొన్నది. ఈ కాస్పర్‌స్కై ల్యాబ్ నివేదిక సైబర్ దాడులకు ఎక్కువగా గురవుతున్న దేశాల జాబితాలో భారత్‌కు ఐదో స్థానాన్ని ఇచ్చింది. ఈ జాబితాలో రష్యా మొదటి స్థానంలో ఉన్నది.
– సైబర్ దాడులను చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల హాకర్లు కమాండ్ అండ్ కంట్రోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తున్నది. కమాండ్ అండ్ కంట్రోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అనేక సర్వర్ల చెయిన్. ఇది మదర్షిప్ కంట్రోల్ సర్వర్ లోకేషన్‌ను దాచి ఉంచుతుంది.
ప్రాక్టీస్ బిట్స్
1. సమాచార సాంకేతిక విజ్ఞానం కింది వాటిలో వేటి గురించిన అధ్యయనం?
1) కంప్యూటర్లు 2) టీవీలు
3) టెలిఫోన్లు 4) పైవన్నీ
2. 1642లో మొట్టమొదటి మెకానికల్ కాలిక్యు లేటర్‌ను కనుగొన్నది ఎవరు?
1) పాస్కల్ 2) మోర్స్
3) లెమ్నాండ్ 4) మార్కొని
3. మనం రేడియోలో రోజూ వినే FM పూర్తి రూపం?
1) ఫ్రీక్వెన్సీ మెషిన్
2) ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్
3) మెటా ఫిజిక్స్
4) ఫ్రీక్వెన్సీ మానిపులేషన్
4. GPSను విస్తరించండి..
1) గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్
2) గ్లోబల్ పర్సనల్ సెక్యూరిటీ
3) జియోగ్రాఫికల్ ప్రైమ్ స్పేస్
4) జియోలాజికల్ పొజిషనింగ్ సిస్టమ్
5. ఆధునిక కంప్యూటర్ పితామడిగా ఎవరిని పరిగణిస్తారు?
1) బ్లెయిసీ పాస్కల్ 2) టిమ్ బెర్నర్స్‌లీ
3) స్టీవ్ జాబ్స్ 4) చార్లెస్ బాబేజ్
6. కంప్యూటర్లలో వాడే సంఖ్యామానం?
1) దశాంశ సంఖ్యామానం (డెసిమల్ సిస్టమ్)
2) ద్విసంఖ్యామానం (బైనరీ సిస్టిమ్)
3) గ్రీకు సంఖ్యామానం
4) అరబిక్ సంఖ్యామానం
7. 1969 అక్టోబర్ 29న ఇంటర్నెట్ ద్వారా పంపిన తొలి సందేశం? (3)
1) మెరీ క్రిస్టమస్ 2) హ్యాప్పీ బర్త్‌డే
3) LOG 4) Log out
8. CPU ను విస్తరించండి..
1) సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్
2) కంట్రోల్ ప్యానెల్ యూనిట్
3) సెంట్రల్ ప్రోగ్రామ్ యుటిలిటీ
4) కంట్రోల్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్
9. ఒక టెలిఫోన్ లైన్ ద్వారా రెండు కంప్యూటర్ లను కలిపే సాధనాన్ని ఏమంటారు?
1) మాడ్యులేటర్ 2) ఫ్లగ్ బాక్స్
3) మోడెమ్ 4) యూసీబీ హబ్
10. అనలాగ్ సిగ్నల్స్‌ను డిజిటల్ రూపంలోకి మార్చే కంప్యూటర్ను ఏమంటారు?
1) పర్సనల్ కంప్యూటర్
2) మాక్ కంప్యూటర్
3) డిజిటల్ కంప్యూటర్
4) హైబ్రిడ్ కంప్యూటర్
11. అమెరికాలో తయారైన మొట్టమొదటి వాణిజ్య కంప్యూటర్ ఏది?
1) ENIAC 2) UNIVAC
3) MENIAC 4) NEROLAC
12. WWW దేనికి సంక్షిప్త రూపం?
1) World Wide Wiki
2) Western Wide Web
3) Western Wide Wiki
4) World Wide Web
13. కింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది?
1) డాస్ (Dos) 2) ఒరాకిల్
3) లైనక్స్ 4) విండోస్
14. రెండు సంఖ్యలను కలిపే హార్డ్ వేర్ ఏది?
1) కంట్రోల్ యూనిట్
2) సీపీయూ రిజిస్టర్
3) అర్థమెటిక్ లాజిక్ యూనిట్
4) మదర్బోర్డ్
15. మొట్టమొదటి కంప్యూటర్ మౌస్‌ను తయారు చేసినది ఎవరు?
1) డగ్లస్ ఎంగెల్బార్ట్
2) విలియం ఇంగ్లిష్
3) డేనియల్ కేగర్
4) రాబర్ట్ జవాకి
16. GUI ని విస్తరించండి..
1) Grid User Interface
2) Graphical User Interface
3) Good User Interface
4) పైవేవీకాదు
17. ఇంటర్నెట్ పితామడిగా ఎవరిని పరిగణిస్తారు?
1) చార్లెస్ బాబేజ్ 2) వింట్ సెర్ఫ్
3) మార్క్ అండర్సన్ 4) టిమ్ బెర్నెర్స్ లీ
18. కింది వాటిలో భిన్నమైనది ఏది?
1) ఇంటర్నెట్ 2) లైనక్స్
3) యూనిక్స్ 4) విండోస్
19. కింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది?
1) విండోస్ 98
2) విండోస్ 8
3) మైక్రోసాఫ్ట్ ఆఫీస్
4) Red Hat Linux
20. కంప్యూటర్‌కు మెదడు వంటిది అని దేనిని అంటారు?
1) సీపీయూ 2) ఫ్లాపీ డిస్క్
3) మెగాబైట్ 4) కాంపాక్ట్ డిస్క్ (సీడీ)
21. LAN అంటే ఏమిటి?
1) ఒక ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్
2) ఒక ఆపరేటింగ్ సిస్టమ్
3) ఒక కంప్యూటర్ లాంగ్వేజ్
4) ఒక రకం నెట్వర్క్
22. LAN ను విస్తరించండి..
1) Link Access Network
2) Local Area Network
3) Linux Application Network
4) Local Access Network
23. మొదటి తరం కంప్యూటర్లు వేటితో తయారయ్యాయి?
1) ట్రాన్సిస్టర్లు
2) వాక్యూమ్ ట్యూబ్‌లు
3) మాగ్నెటిక్ చిప్‌లు 4) సిలికాన్ చిప్‌లు
24. ట్రాన్సిస్టర్లు ఏ తరం కంప్యూటర్లకు సంబంధించినవి?
1) మొదటి తరం 2) రెండో తరం
3) మూడో తరం 4) ఏదీకాదు
25. దేశంలో సిలికాన్ వ్యాలి ఎక్కడున్నది?
1) డెహ్రాడూన్ 2) హైదరాబాద్
3) కొచ్చి 4) బెంగళూరు
26. URL ను విస్తరించండి..
1) Uniform Resource Locator
2) United Resource Link
3) Uniform Resource Link
4) United Resource Locator
27. కింది వాటిలో ఏ సంస్థకు బిగ్ బ్లూ అనే మారు పేరు ఉన్నది?
1) టీసీఎస్ 2) ఐబీఎం
3) మైక్రోసాఫ్ట్ 4) మహీంద్రాసత్యం
28. కంప్యూటర్లలో నిక్షిప్తంచేసే సమాచారానికి అతిచిన్న ప్రమాణం ఏది?
1) బిట్ 2) బైట్
3) న్యూటన్ 4) మెగాబైట్
29. MS-Word అనేది ఒక..
1) అప్లికేషన్ సాఫ్ట్వేర్
2) సిస్టమ్ సాఫ్ట్వేర్
3) ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ 4) స్కానర్
30. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పితామడు ఎవరు?
1) బిల్ బోర్డ్ 2) జేమ్స్ గోస్లింగ్
3) జేమ్ స్మిత్ 4) సబీర్ భాటియా
31. కింది వాటిలో మాడ్యులేషన్, డీ మాడ్యులేషన్ విధులను నిర్వహించేది?
1) ఉపగ్రహం 2) స్విచ్
3) ఆప్టికల్ ఫైబర్ 4) మోడెమ్
32. కింది వాటిలో మొట్టమొదటి వెబ్ ఆధారిత ఈ మెయిల్ సర్వీస్ ఏది? (3)
1) జీ మెయిల్ 2) యాహూ మెయిల్
3) హాట్ మెయిల్ 4) రెడిఫ్ మెయిల్
33. పాంటియమ్ (Pontium) దేనికి సంబంధించినది?
1) మౌస్ 2) హార్డ్ డిస్క్
3) మైక్రోప్రాసెసర్ 4) డీవీడీ
34. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పితామడిగా ఎవరిని పరిగణిస్తారు?
1) అలన్ మాతిసన్ టురింగ్
2) బిల్ మోగ్రిడ్జ్
3) సెర్జీబ్రిన్ 4) జుకర్‌బర్గ్
35. చేతితో రాసిన సందేశాన్ని ప్రపంచంలోని ఏ మూలకైనా వెంటనే చేరవేయగలిగేది?
1) స్పీడ్ పోస్ట్ 2) టెలెక్స్
3) ఈ-మెయిల్ 4) ఫ్యాక్స్
36. టీవీల్లో శ్రవణ సంకేతాలను ప్రసారం చేయడానికి వాడే సాంకేతికతను ఏమంటారు?
1) ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్
2) ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్
3) పల్స్ కోడ్ మాడ్యులేషన్
4) టైమ్ డివిజన్ మల్టీ ప్లెక్సింగ్
జవాబులు 1. 4 2. 1 3. 2 4. 1 5. 4 6. 2 7. 3 8. 1 9. 3 10. 4 11. 2 12. 4 13. 2 14. 3 15. 1 16. 2 17. 2 18. 1 19. 3 20. 1
21. 4 22. 2 23. 2 24. 2 25. 4 26. 1 27. 3 28. 1 29. 1 30. 2 31. 4 32. 3 33. 3 34. 1 35. 4, 36-3.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు