దేశంలో అత్యంత పొడవైన సాగునీటి కాలువ ఏది?
1. కింది వాటిలో సరికానిది ఏది?
జలపాతం నది
1) జోగ్ జలపాతం శరావతి
2)హుంద్రు జలపాతం సుబర్నరేఖ
3) కుంతాల జలపాతం కడెం
4) కెల్వి జలపాతం కావేరి
2. జతపర్చండి
నది జన్మస్థలం
ఎ. సట్ల్లెజ్ 1. రోహతంగ్ కనుమ
బి. రావి 2. రాకస్ సరస్సు
సి. బియాస్ 3. బాల్లాన్ చెలా కనుమ
డి. చీనాబ్ 4. రోహతంగ్ కనుమ
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-4, బి-3, సి-2, డి-1
3. కింది వాటిలో భిన్నమైనది ఏది?
1) శబరి 2) సీలేరు
3) ప్రాణహిత 4) కోయన
4. అతి ఎత్తయిన జన్మస్థానం కలిగి భారత్ గుండా ప్రవహిస్తున్న నది?
1) గండక్ 2) గంగా
3) యమున 4) సట్లెజ్
5. కింది వాటిలో తప్పు జత ?
1) గోదావరి-శబరి
2) పెన్నా -ఇంద్రావతి
3) కృష్ణా- కోయన
4) కావేరి- హేమావతి
6. జతపర్చండి
ఎ. కావేరి 1. నంది దుర్గ
బి. పెన్నా 2. వరహగరి
సి. తుంగభద్ర 3. మహాబలేశ్వర్
డి. కృష్ణా 4. బ్రహ్మగిరి
1) ఎ-2, బి-3, సి-1, డి-4
2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-3, 2-3, సి-4, డి-1
7. ప్రవాహం ఆధారంగా కింది ఏ నదుల వరుస సరైనది గుర్తించండి.
1) గోదావరి, మహానది, పెన్నా, కావేరి
2) మహానది, గోదావరి, కావేరి, పెన్నా
3) కావేరి, గోదావరి, పెన్నా, మహానది
4) మహానది, గోదావరి, పెన్నా, కావేరి
8. జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది?
1) కర్ణాటక 2) మహారాష్ట్ర
3) కేరళ 4) తమిళనాడు
9. జువారీ నది ఏ రాష్ట్రంలో ఉంది?
1) కర్ణాటక 2) గోవా
3) మహారాష్ట్ర 4) రాజస్థాన్
10. కింది వాటిలో పశ్చిమానికి ప్రవహించే నది?
1) హేమావతి 2) ఇంద్రావతి
3) నేత్రావతి 4) చిత్రావతి
11. దిండి నది ఏ కొండల్లో జన్మించింది?
1) నల్లమల్ల కొండలు
2) ఎరమలై కొండలు
3) పాల కొండలు
4) షాబాద్ కొండలు
12. ఎలమంచిలి ఏ నది ఒడ్డున ఉంది?
1) వరాహ నది 2) గోదావరి నది
3) కృష్ణా నది 4) పెన్నా నది
13. జతపర్చండి.
నది పట్టణం
ఎ. పెన్నా 1. కుందేరు
బి. నర్మద 2. బంజర్
సి. తపతి 3. పూర్ణా
డి. మహానది 4. జంకే
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
14. కింది వాటిలో సరైనది?
ఎ. భారత్‌లో అతిపెద్ద అంతర్భూభాగ నదీ వ్యవస్థ గల రాష్ట్రం రాజస్థాన్
బి. అతి పెద్ద అంతర్భూభాగ నది ఘగ్గర్
సి. సాల్ట్ రివర్ అని ‘లూనీ’ నదికి పేరు
1) 1 2) 1, 2
3) 1, 3 4) 1,3, 2
15. రాగుల పంట విస్తీర్ణం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది?
1) తమిళనాడు 2) కర్ణాటక
3) మహారాష్ట్ర 4) ఆంధ్రప్రదేశ్
16. కింది వాటిలో సరికానిది?
1) భారత్‌లో బ్రహ్మపుత్రనది వల్ల ఎక్కువ వరదలు వస్తాయి
2) వరదల వల్ల చెరువుల నుంచి నీరు పైకి వచ్చి ప్రవహిస్తాయి
3) భారతదేశ మొత్తం భూభాగంలో 20 శాతం వరదలు సంభవించే అవకాశం కలదు
4) వరదలు సంభవించడానికి కారణం భారీ వర్షపాతం
17. బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదికి పేరు?
1) దామోదర్ 2) యమున
3) గంగా 4) కోసి
18. కింది వాటిలో అరేబియా సముద్రంలో కలిసే నది?
1) బ్రహ్మపుత్ర 2) గంగా
3) సింధూ 4) గండక్
19. నేత్రావతి అని ఏ నదిని పిలుస్తారు?
1) గండక్ 2) కోసి
3) గంగా 4) బెట్వా
20. సింధూ నది ఉపనది కానిది?
1) రావి 2) సోన్
3) బియాస్ 4) గిల్గిత్
21. ఉత్తర దిశలో ప్రవహించి గంగానదితో కుడివైపు నుంచి కలిసే ఉపనది ఏది?
1) గండక్ 2) రామ్‌గంగా
3) సోన్ 4) కోసి
22. ఒకే భౌగోళిక ప్రాంతంలో జన్మించి ఒక దానితో ఒకటి వ్యతిరేక దిశలో ప్రవహించే నదుల జత ఏది?
1) సింధూ- గంగా 2) నర్మద- తపతి
3) తపతి- గోదావరి 4) నర్మద- సోన్
23. నదులు-ఉపనదులకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
1) రామ్‌గంగా-గంగా
2) వెన్‌గంగా- గోదావరి
3) పెన్‌గంగా- కావేరి
4) దూద్‌గంగా-కృష్ణా
24. పెన్నా నది కింది జిల్లాల్లో ప్రవహిస్తుంది. ఇందులో సరికానిది గుర్తించండి?
1) అనంతపురం 2) నెల్లూరు
3) కడప 4) చిత్తూరు
25. దేశంలో అత్యంత పొడవైన సాగునీటి కాలువ ఏది?
1) ఇందిరాగాంధీ కాలువ
2) బకింగ్‌హాం కాలువ
3) ఆగ్రా కాలువ
4) కోల్లీ కాలువ
26. జతపర్చండి?
ఎ. హైదరాబాద్ 1. సబర్మతి
బి. లక్నో 2. తుంగభద్ర
సి. అహ్మదాబాద్ 3. మూసీ
డి. కర్నూలు 4. గోమతి
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-3, బి-4, సి-1, డి-2
27. థార్ ఎడారిలోని కొంత భాగాన్ని సారవంతమైన భూమిగా మార్చింది?
1) సర్హింద్ కాలువ
2) శారద కాలువ
3) తవా కాలువ
4) ఇందిరాగాంధీ కాలువ
28. భారత్‌లో ఏ నదిని ‘సాంగు’ అని కూడా పిలుస్తారు?
1) బ్రహ్మపుత్ర 2) గంగా
3) లూనీ 4) సింధూ
29. సింధూ (ఇండస్) నది ఉపనదులు?
ఎ. జీలం బి. సట్లెజ్
సి. చీనాబ్ డి. రావి
ఉత్తరం నుంచి దక్షిణానికి సింధూనది ఉపనదుల సరైన క్రమాన్ని ఎంపిక చేయండి?
1) ఎ, సి, డి, బి 2) ఎ, డి, బి, సి
3) బి, ఎ, సి, డి 4) సి, ఎ, డి, బి
30. ఏ రాష్ట్రంలో కావేరి నది ఎక్కువగా ప్రవహిస్తుంది?
1) కేరళ 2) తమిళనాడు
3) మధ్యప్రదేశ్ 4) ఆంధ్రప్రదేశ్
31. జతపర్చండి?
నది అంతర మైదానం నదులు
ఎ. బిస్ట్ 1. రావి, చీనాబ్
బి. బారి 2. చీనాబ్, జీలం
సి. చజ్ 3. బియాస్, రావి
డి. రేచ్నా 4. బియాస్, సట్లెజ్
1) ఎ-1, బి-3, సి-4, డి-2
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
32. కింది వివరణలను చదవండి?
ఎ. నర్మదా నది విదీర్ణదరి గుండా ప్రవహిస్తుంది
బి. నర్మదా నదికి దక్షిణంగా వింధ్య పర్వతాలు ఉన్నాయి
సి. నర్మదా నది పశ్చిమంగా ప్రవహిస్తుంది
వీటిలో సరైన వివరణలు ఏవి?
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
33. ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడు?
1) మార్చి 22 2) ఫిబ్రవరి 10
3) ఏప్రిల్ 24 4) అక్టోబర్ 18
34. ప్రపంచ నదుల దినోత్సవం?
1) డిసెంబర్ 10 2) సెప్టెంబర్ 28
3) మార్చి 8 4) నవంబర్ 14
35. జీలం నదిని సంస్కృతంలో ఏమని పిలుస్తారు?
1) ఇండస్ 2) హిందూ
3) వితస్థ 4) ఏదీకాదు
36. భారత్ తొలి పక్షి సంరక్షణ కేంద్రం ఏది?
1) వేదాంతంగల్ 2) రంగనతిట్టు
3) ఘనా 4) కొల్లేరు
37. ప్రవర ఏ నది ఉపనది?
1) గోదావరి 2) కృష్ణా
3) కావేరి 4) తపతి
38. భారత్‌లో మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారు?
1) చంద్రప్రభా నేషనల్ పార్క్
2) జిమ్‌కార్బెట్ నేషనల్ పార్క్
3) కజిరంగా నేషనల్ పార్క్
4) ఘనా పక్షి సంరక్షణ కేంద్రం
39. తోట పంటలకు ఏ నేల అనుకూలంగా ఉంటుంది?
1) నల్లరేగడి నేల 2) ఎరనేల
3) జేగురు నేల 4) పీట్ నేల
40. అన్ని పంటలకు ఏ రకమైన నేల అనుకూలంగా ఉంటుంది?
1) నల్లరేగడి నేల 2) ఎరనేల
3) లాటరైట్ నేల 4) అల్యూవైల్ నేల
41. సముద్రలోతును ఏ యూనిట్లలో కొలుస్తారు?
1) నాటికల్ మైళ్లు 2) కిలోమీటరు
3) పాథమ్స్ 4) అడుగులు
42. ఈత కొట్టడం ఏ నీటిలో తేలిక?
1) నదీ జలాలు 2) కొలనులు
3) సముద్ర జలాలు 4) కాలువలు
సమాధానాలు
1-4 2-3 3-4 4-1 5-2 6-3 7-4 8-1 9-2 10-3 11-4 12-1 13-1 14-4 15-2 16-3 17-1 18-3 19-4 20-2 21-3 22-4 23-3 24-4 25-1 26-4 27-4 28-1 29-1 30-2 31-4 32-2 33-1 34-2 35-3 36-1 37-1 38-2 39-3 40-4
41-3 42-3
టాపర్స్ ఇన్స్టిట్యూట్, మేడిపల్లి సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?