భారత్.. ప్రపంచ జీవవైవిధ్య కేంద్రం
భారతదేశం ప్రపంచంలోని అరుదైన జీవజాతులకు నిలయం. మనదేశంతో పాటు చాలా దేశాల్లోని అరుదైన జీవులు పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామీకరణ వల్ల అంతరించే ప్రమాదంలో పడ్డాయి. వాటిని రక్షించడానికి ప్రపంచ దేశాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
అతిపెద్ద వైవిధ్య దేశంగా భారతదేశం
(India as a Mega-Diversity Nation)
-భారతదేశం వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, అటవీ రంగాల్లో అధిక వైవిధ్యాన్ని కలిగి ఉంది. స్వదేశీ వైవిధ్యంలో ఉపయోగపడే మొక్కల గురించి ఆయుర్వేదం, ఇతర ప్రాచీన గ్రంథాల్లో ఎక్కువగా పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని జీవవైవిధ్యం మన దేశంలో ఉండి ప్రపంచంలో అధిక వైవిధ్యాన్ని కలిగి ఉన్న 17 అతిపెద్ద దేశాల్లో ఒకటిగా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది.
– విపరీతంగా పెరుగుతున్న జనాభా అవసరాల కోసం జీవ వనరులను విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల ఇప్పటికే మన దేశం 2.5 లక్షల జాతులను కోల్పోయింది. వేలకొద్ది జాతులు అంతరించే దశలో ఉన్నాయి.
– పుష్పించే మొక్కల్లో 35 శాతం జాతులు స్థానీయ జాతులు (Exdemic Species) గా ఉన్నాయి. వరి, చెరుకు, జనపనార, మామిడి, నిమ్మ, అరటి, చిరుధాన్యాలు, ఆర్కిడ్ మొక్కలు మన దేశంలోనే ఉత్పత్తి అయి ప్రపంచమంతా విస్తరించాయి.
-భారతదేశంలో కనిపించే 1/3వ వంతు జంతు రకాలు కేరళలోని పడమటి కనుమల్లోనే ఉన్నాయి. కోస్తా తీరం వెంబడే అనేక మాంగ్రూవ్ మొక్కలు, మొసళ్లు, 26 జాతుల మంచినీటి తాబేళ్లు, 5 జాతుల ఉప్పునీటి తాబేళ్లు మొదలైన జంతువులు కనిపిస్తాయి.
– ప్రపంచంలో వృక్ష సంపదను ఎక్కువగా కలిగి ఉండే దేశాల్లో 10వ దేశంగా, ఆసియాలో 4వ దేశంగా భారత్ ఉంది. అదేవిధంగా క్షీరదాలు ఎక్కువగా ఉండే దేశాల్లో భారతదేశం 10వ స్థానంలో ఉంది.
– జన్యు ఇంజినీరింగ్ ప్రక్రియను ఉపయోగించి వివిధ జాతుల మధ్య జన్యు మార్పిడి అందుబాటులోకి రావడంవల్ల పంట మొక్కల్లో అధిక దిగుబడినిచ్చే కొత్త రకాల సంఖ్య పెరిగింది. దీని ఫలితంగా వ్యవసాయోత్పత్తి పెరిగింది.
– మనదేశంలోని పశుసంపదలో కూడా వైవిధ్యం కనిపిస్తుంది. మనదేశంలో 27 జాతుల పశువులు, 40 జాతుల గేదెలు, 22 జాతుల మేకలు విస్తరించి ఉన్నాయి.
పర్యావరణ సదస్సులు లేదా కార్యాచరణ పథకాలు
సంవత్సరం సదస్సు లేదా కార్యాచరణ పథకాలు
1972 పర్యావరణ హక్కుల పరిరక్షణ కోసం మొదటిసారిగా స్టాక్ హోమ్‌లో ఐక్యరాజ్య సమితి సదస్సును నిర్వహించింది.
1992 బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో ధరిత్రీ సదస్సు
1993 దక్షిణ భారతదేశంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది.
1994 పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ కార్యాచరణ పథకాన్ని ప్రారంభించింది.
1997 179 దేశాలు జపాన్‌లో క్యోటో ప్రొటోకాల్‌ను రూపొందించాయి. క్యోటోలో జరిగిన సదస్సులో గ్లోబల్ వార్మింగ్, గ్రీన్హౌస్ వాయువులను నిరోధించడంపై చర్చించారు. క్యోటో ప్రొటోకాల్ ప్రకారం పారిశ్రామిక దేశాలు 2008 నుంచి 2012 నాటికి గ్రీన్హౌస్ వాయువులను 1990 స్థాయి కంటే సగటున 5.2 శాతం తగ్గించాలి. ఈ ప్రొటోకాల్‌పై ఇంతవ రకు 170 దేశాలు సంతకాలు చేశాయి. వాటిలో మన దేశంతోపాటు జపాన్, ఐరోపా మొదలైనదేశాలున్నాయి. అమెరికా మాత్రం దీన్ని వ్యతిరేకించింది.
2001 పర్యావరణ పరిరక్షణ కోసం మొరాకోలోని మారకేష్ నగరంలో ఐక్యరా జ్యసమితి ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో క్యోటో ప్రొటో కాల్‌కు చట్టబద్ధత కల్పించారు.
2001 జూలై పర్యావరణ పరిరక్షణ కోసం బాన్‌లో సదస్సు నిర్వహించారు.
2002 ఓజోన్ పొరను బలహీనపరిచే వాయువుల వినియోగం, ఉత్పత్తి సంస్థలను దశల వారీగా తొలగించే ఉద్దేశంతో భారతదేశం ఆరు ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది.
2002 జూలై ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరరిక్షణ కోసం జూలై నివేదికను విడుదల చేసింది.
2002 ఆగస్టు 26 దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లో ధరిత్రీ సదస్సు జరిగింది. ఈ సదస్సులో నీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ఆరోగ్యం, వ్యవసాయం, జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ అనే అంశాల గురించి చర్చించారు.
అంతర్జాతీయ ఒప్పందాలు
1. బాన్ కన్వెన్షన్: దీన్ని Bonn Conservation on Migratory Species (CMS) అంటారు. వలస జంతువులు, ముఖ్యం గా వలస పక్షుల కోసం ఉద్దేశించిన ఒప్పందం. 1983 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది.
2. స్టాక్ హోం కన్వెన్షన్: పర్యావరణంలోకి మనిషి చర్యల ద్వారా చేరే స్థిరమైన కర్బన కాలుష్య కారకాలను నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందం. ఇది 2004 మే 17న అమల్లోకి వచ్చింది.
3. బాసెల్ కన్వెన్షన్: దేశాల మధ్య జరిగే హానికర, ప్రమాద వ్యర్థాల రవాణాను నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందం. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ వ్యర్థాలను అభివృద్ధి చెందుతున్న పేద దేశాలకు చేరవేస్తున్నాయి. ఇలాంటి రవాణాను
నియంత్రించే ఒప్పందం. 1992 మే 5న అమల్లోకి వచ్చింది.
4. రామ్సర్ కన్వెన్షన్: ప్రపంచ వ్యాప్తంగా చిత్తడి నేలల సంరక్షణకు ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందం. 1971లో ఈ ఒప్పందం జరిగింది. 1975 డిసెంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చింది.
నోట్: జీవ వైవిధ్య పరిరక్ష ణకు 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (National Green Tribunal)ను ఏర్పాటు చేశారు.
మీకు తెలుసా..?
కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19 పాండమిక్ దృష్ట్యా అంటువ్యాధుల చట్టం -1897ను దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. ఈ చట్టం ప్రకారం పౌరులందరూ కొవిడ్ ప్రబలకుండా, ప్రజారోగ్యం దెబ్బతినకుండా విధిగా మాస్కులు ధరించాలి, భౌతికదూరం పాటించాలి. ఇందుకోసం కేంద్రం ప్రత్యేక నిబంధనలు రూపొందించి అమలు చేస్తుంది.
ప్రాక్టీస్ బిట్స్
1. మాస్టర్ గ్లాండ్ అని ఏ గ్రంథిని పిలుస్తారు?
1) పిట్యూటరీ 2) థైరాయిడ్
3) అడ్రినల్ 4) పాంక్రియాస్
2. ‘O’ రక్తం గ్రూపు ఉన్నవారు ఏ రక్త గ్రూపు వారికి దానం చేయవచ్చు?
1) కేవలం O గ్రూపు వారికి
2) అన్ని గ్రూపుల వారికి
3) A, B గ్రూపుల వారికి
4) కేవలం A గ్రూపు వారికి
3. కణ శక్తి కేంద్రం కిందివాటిలో ఏది?
1) క్లోరోఫాస్ట్ 2) గాల్జీ సంక్లిష్టం
3) మైటోకాండ్రియా 4) ప్లాస్టిడ్
4. DNAలో లేకుండా RNAలో ఉండేది?
1) ఎడినిన్ 2) సైటోసిన్
3) థయమిన్ 4) యురాసిల్
5. ఆధునిక కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) రాబర్ట్ క్ 2) థియోడార్ ష్వాన్
3) రాబర్ట్ బ్రౌన్ 4) ష్లీడన్, ష్వాన్
6. కణాన్ని మొదటిసారిగా కనుగొన్నది ఎవరు?
1) రాబర్ట్ క్ 2) జాన్ డగ్లస్
3) ఎల్వీస్ ప్రీస్టీ 4) థియోడార్ ష్వాన్
7. సైకిల్ మీద వేగంగా వెళ్తున్న వ్యక్తి మలుపు తిరగుతున్నప్పుడు ముందుకు వంగడానికి గల కారణం ఏమిటి?
1) గురుత్వ కేంద్రం మారిపోవడం వల్ల
2) అభికేంద్ర బలాన్ని సమకూర్చడం వల్ల
3) అపకేంద్ర బలం లేని కారణంగా
4) పైవేవీ కావు
8. రైలు పట్టాలను వంపుల వద్ద ఎత్తుగా అమర్చడానికి కారణం ఏమిటి?
1) తగిన అభికేంద్ర బలాన్ని సమకూర్చడం కోసం
2) తగిన అపకేంద్ర బలాన్ని సమకూర్చడం కోసం
3) తగినంత ఘర్షణని అందించడం కోసం
4) పైవేవీ కావు
9. సుడిగాలులు వీచినప్పుడు కొన్ని పూరి ఇండ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోతాయి. ఇవి ఏ సూత్రానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు?
1) బెర్నౌలి సిద్ధాంతం
2) అర్కిమెడీస్ సిద్ధ్దాంతం
3) పాస్కల్ సిద్ధ్దాంతం
4) టారిసెల్లి సిద్ధాతం
10. ఆవుపాలు కొంచెం పచ్చ రంగులో ఉండటానికి కారణం?
1) జాంతోఫిల్ 2) రైబోఫ్లావిన్
3) రిబ్యులోస్ 4) కెరోటిన్
11. వర్ణ అంధత్వం కలిగిన స్త్రీ సాధారణ పురుషుడిని వివాహం చేసుకుంటే వారి సంతానంలో ఏ లక్షణాలు ఉంటాయి?
1) వర్ణ అంధత్వమున్న కుమారులు, వాహక కుమార్తెలు
2) వర్ణ అంధత్వమున్న కలిగిన కుమారులు, కుమార్తెలు
3) సాధారణ కుమారులు, వాహక కుమార్తెలు
4) సాధారణ కుమారులు, కుమార్తెలు
12. వజ్రం కింది వాటిలో దేని అల్లోట్రోపిక్ రూపం?
1) జెర్మేనియం 2) సిలికాన్
3) కర్బనం 4) గంధకం
13. ఎనిమియా వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది?
1) విటమిన్-ఎ 2) విటమిన్-బి12
3) ఐరన్, ఫోలిక్ ఆమ్లం 4) ఏదీకాదు
14. యాపిల్‌లోని ఏ భాగాన్ని మనం ఆహారంగా తీసుకుంటాం?
1) అండాశయం 2) ఫలం
3) పుష్పాసనం 4) విత్తనం
సమాధానాలు
1.1 2.2 3.3 4.4 5.4 6.1 7.3 8.3 9.1 10.2 11.1 12.3 13.3 14.3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు