అసఫ్‌జాహీ వంశీకుల పూర్వీకులు ఏ దేశానికి చెందినవారు?
తెలంగాణ భావన (1948-1970)
-చారిత్రక నేపథ్యం
తెలంగాణ ప్రాంతానికి మహోన్నతమైన చారిత్రక నేపథ్యం ఉంది. ఎంతో మంది రాజ వంశీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించి అనేక సంస్కరణలు చేపట్టారు. వారి పరిపాలనకు సంబంధించిన ఆనవాళ్లు రాష్ట్రవ్యాప్తంగా నేటికీ దర్శనమిస్తున్నాయి. అన్ని పోటీ పరీక్షల్లో తెలంగాణ చరిత్రపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ చరిత్ర నుంచి ప్రాక్టీస్ బిట్లు నిపుణ పాఠకుల కోసం…
1. తెలంగాణలో వలస పాలనకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1) క్రీస్తు శకం 1323లో కాకతీయ రాజు రెండో ప్రతాపరుద్రుడిని ఢిల్లీ సుల్తాన్ మహ్మద్‌బీన్ తుగ్లక్ జయించడంతో తెలంగాణ ప్రాంతంలో వలస పాలన ప్రారంభమైంది
2) క్రీస్తు శకం 1687లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను జయించడంతో తెలంగాణలో వలస పాలన ప్రారంభమైంది
3) 1724లో అసఫ్‌జాహీల రాకతో తెలంగాణలో వలస పాలన ప్రారంభమైంది.
కింది సంకేతాల ఆధారంగా సరైన జవాబును గుర్తించండి.
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 3 మాత్రమే డి) ఏదీ కాదు
2. తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల పాలన ఎంతకాలం కొనసాగింది?
ఎ) సుమారు 400 సంవత్సరాలు
బి) సుమారు 300 సంవత్సరాలు
సి) సుమారు 100 సంవత్సరాలు
డి) సుమారు 200 సంవత్సరాలు
3. తెలంగాణను పాలించిన వంశాలనకు సంబంధించిన కింది వాటిని జతపరచండి.
వంశం పాలనా కాలం
1. కాకతీయులు ఎ. క్రీ.శ 1000-1323
2. కుతుబ్‌షాహీలు బి. క్రీ.శ 1518- 1687
3. అసఫ్జాహీలు సి. క్రీ.శ 1724- 1948
4. మొగలులు డి. క్రీ.శ 1526- 1724
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
సి) 1-ఎ, 2-డి, 3- బి, 4-సి
డి) 1-డి, 2-సి, 3-బి, 4- ఎ
4. అసఫ్‌జాహీల కాలంలో 1884 వరకు తెలంగాణలో అధికార భాష ఏది?
ఎ) ఉర్దూ బి) హిందీ
సి) పార్శీ డి) అరబ్బీ
5. నిజాం ఉల్‌ముల్క్ కు ‘అసఫ్ జా’ అనే బిరుదును ఇచ్చిన మొగల్ చక్రవర్తి ఎవరు?
ఎ) మహ్మద్ షా రంగీలా
బి) ఔరంగజేబు
సి) షాజహాన్ డి) బాబర్
6. కింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి?
ఎ) గోల్కొండను రాజధానిగా చేసుకొని నిజాం ఉల్‌ముల్క్ దక్కన్ ప్రాంతాన్ని పాలించాడు
బి) ఔరంగాబాద్‌ను రాజధానిగా చేసుకుని నిజాం ఉల్‌ముల్క్ దక్కన్ ప్రాంతాన్ని పాలించాడు
సి) దోమకొండను రాజధానిగా చేసుకుని నిజాం ఉల్‌ముల్క్ దక్కన్ ప్రాంతాన్ని పాలించాడు
డి) పై వాటిలో ఏదీ సరైన వ్యాఖ్య కాదు
7. ఏ సంవత్సరం నుంచి నిజాం ఉల్‌ముల్క్ దక్కన్ ప్రాంతాన్ని స్వతంత్రంగా పాలించాడు?
ఎ) 1624 బి) 1824
సి) 1724 డి) 1734
8. జతపరచండి.
పాలకుడు పాలనా కాలం
1) నిజాం ఉల్‌ముల్క్ ఎ) 1803-1829
2) నిజాం అలీఖాన్ బి) 1724-1748
3) సికిందర్ జా సి) 1761-1803
4) నసీరుద్దౌలా డి) 1829-1857
ఎ) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-డి, 2-పి, 3-బి, 4-ఎ
డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
9. సరైన వ్యాఖ్యను గుర్తించండి.
ఎ) వహాబీ ఉద్యమం: ముస్లిం సానుకూల ఉద్యమం
బి) వహాబీ ఉద్యమం: బ్రిటిష్ సానుకూల ఉద్యమం
సి) వహాబీ ఉద్యమం: ముస్లిం వ్యతిరేక ఉద్యమం
డి) వహాబీ ఉద్యమం: బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం
10. సాలార్జంగ్ బిరుదుతో దివాన్ పదవిని అలంకరించిన వారు ఎవరు?
ఎ) గులాంఖాన్
బి) మీర్ తురాబ్ అలీఖాన్
సి) సిరాజ్-ఉల్‌ముల్క్
డి) ఎవరూ కాదు
11. తూర్పు ఇండియా వర్తక సంఘంతో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరిస్తూ మొట్టమొదట సంతకం చేసిన స్వదేశీ సంస్థానం ఏది?
ఎ) అవధ్ బి) తంజావూర్
సి) మైసూర్ డి) హైదరాబాద్
12. తెలంగాణ ఎటువంటి సంస్కృతి కలిగింది?
ఎ) దక్కన్ సంస్కృతి
బి) వైదిక సంస్కృతి
సి) గిరిజన సంస్కృతి
డి) మిశ్రమ సంస్కృతి
13. నిజాం (హైదరాబాద్) సంస్థానానికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. నిజాం రాజ్యాన్ని 1724-1948 మధ్య అసఫ్‌జాహీ వంశీకులు పాలించారు
2. నిజాం సంస్థానంలో తెలంగాణ, మరాఠ్వాడా, కన్నడ ప్రాంతాలు అంతర్భాగంగా ఉండేవి
3. నిజాం సంస్థానంలో తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ భాషలు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండేవారు
కింది సంకేతాల ఆధారంగా సరైన జవాబు గుర్తించండి.
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 3 మాత్రమే
డి) మూడూ సరైన వ్యాఖ్యలే
14. 1857 వరకు హైదరాబాద్ సంస్థానంలో చెలామణిలో ఉన్న ద్రవ్యం (కరెన్సీ) ఏది?
ఎ) హాలి సిక్కా బి) మొగల్ సిక్కా
సి) రుపయా డి) వరహా
15. నిజాం కాలంలో స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థానాలు ఎన్ని ఉండేవి?
ఎ) 5 బి) 7
సి) 14 డి) 18
16. హైదరాబాద్ (నిజాం) సంస్థానంలో ఎన్ని జిల్లాలు ఉండేవి?
ఎ) 10 బి) 16
సి) 18 డి) 12
17. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఎన్ని సుభాలుగా విభజించారు?
ఎ) 10 బి) 8 సి) 5 డి) 12
18. అసఫ్‌జాహీ పాలకులను ఎవరి కాలం నుంచి నిజాములుగా పిలిచారు?
ఎ) రెండో అసఫ్ జాహీ పాలకుడు అలీఖాన్ నుంచి
బి) ముజఫర్ జంగ్ పాలన నుంచి
సి) మూడో అసఫ్‌జాహీ సికిందర్ జా నుంచి
డి) నసీరుద్దౌలా పాలనా కాలంలో
19. అసఫ్‌జాహీల మొదటి అధికార భాష?
ఎ) ఉర్దూ బి) అరబ్బీ
సి) పార్శీ డి) హిందీ
20. అసఫ్జాహీలు ఏ సంవత్సరం నుంచి ఉర్దూను అధికార భాషగా మార్చారు?
ఎ) 1884 బి) 1864
సి) 1874 డి) 1854
21. దక్కనీ చిత్రకళకు ఆద్యుడు ఎవరు?
ఎ) మీర్ అబ్బాసీ బి) మీర్ హషీం
సి) మహ్మద్ జమాన్ డి) ఎవరూ కాదు
22. కింది వాటిలో సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి?
1. సర్వాయి పాపన్న తెలంగాణలో ముస్లిం పాలకుల నిరంకుశత్వాన్ని ఎదిరించిన తెలంగాణ తొలి విప్లవ వీరుడు
2. సర్వాయి పాపన్న వరంగల్ జిల్లా, తాటికొండ పక్కన లింగంపల్లి గ్రామానికి చెందినవాడు
3. పాపన్న గౌడ (కల్లు గీత) కులానికి చెందినవాడు
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 3 మాత్రమే
డి) మూడు వ్యాఖ్యలు సరైనవే
23. హైదరాబాద్ (నిజాం) రాజ్యం విస్తీర్ణం ఎంత?
ఎ) 80,798 చదరపు మైళ్లు
బి) 72, 698 చదరపు మైళ్లు
సి) 82,698 చదరపు మైళ్లు
డి) 62,698 చదరపు మైళ్లు
24. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకముందు (1956) తెలంగాణ భూభాగంలో ఎన్ని జిల్లాలు ఉండేవి?
ఎ) 9 బి) 10 సి) 8 డి) 7
25. దేవదాసీలు చేసే ఏ నృత్యాన్ని సంస్కరించి భరతనాట్యంగా మార్చారు?
ఎ) పేరిణి బి) రేలాట నృత్యం
సి) చుట్టకాముడు నృత్యం
డి) సదిర్
26. సరికాని జతను గుర్తించండి.
ఎ) కొల్లాపూర్ సంస్థానం- సురభి వంశం
బి) పాల్వంచ సంస్థానం- మాచిరాజు వంశం
సి) దోమకొండ సంస్థానం- కామినేని వంశం
డి) వనపర్తి సంస్థానం- జనుంపల్లి వంశం
27. మొదటి సాలార్జంగ్ అసలు పేరేంటి?
ఎ) మీర్ మహ్మద్ అలీ
బి) తురాబ్ అలీఖాన్
సి) లాయక్ అలీ
డి) నిజాం అలీఖాన్
28. అసఫ్‌జాహీ వంశీకుల పూర్వీకులు ఏదేశానికి చెందినవారు?
ఎ) టర్కీ బి) తుర్క్మెనిస్థాన్
సి) అఫ్గానిస్థాన్ డి) ఇరాన్
29. నిజాం రాజులు హైదరాబాద్‌ను ఎన్ని సంవత్సరాలు పాలించారు?
ఎ) 224 బి) 324
సి) 124 డి) 294
30. కింది వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి.
1. దక్కన్లో తొలిసారిగా పీర్ల పండుగను కుతుబ్ షాహీలు ప్రారంభించారు
2. కుతుబ్ షాహీలు పరమత సహనం పాటించారు
3. కులియత్ కులీ గీతాలను మహ్మద్ కులీ కుతుబ్ షా రచించాడు
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 3 మాత్రమే
డి) పై మూడు వ్యాఖ్యలు సరైనవే
31. కుతుబ్ షాహీల కాలంలో బాగా అభివృద్ధి చెందిన నాట్య రీతి ఏది?
ఎ) కూచిపూడి బి) భరతనాట్యం
సి) పేరిణి డి) ఏదీకాదు
32. అసఫ్‌జాహీ వంశానికి సంబంధించి కింది వాటిని జతపరచండి.
1. మూల పురుషుడు ఎ) ఖ్వాజా అబిద్
2. రాజ్యస్థాపకుడు బి) మీర్ కమ్రుద్దిన్ (నిజాం ఉల్ ముల్క్)
3. రెండవ రాజధాని సి) ఔరంగాబాద్
4. మొదటి రాజధాని డి) హైదరాబాద్
ఎ) 1.ఎ, 2.బి, 3.సి, 4.డి
బి) 1.ఎ, 2.బి, 3.డి, 4.సి
సి) 1.బి, 2.ఎ, 3.సి, 4.డి
డి) 1.బి, 2.ఎ, 3.డి, 4.సి
33. 1వ నిజాం మీర్ కమ్రుద్దీన్ బిరుదులు, ఇచ్చిన వారిని సరిగా జతపరచండి.
1. నిజాం ఉల్ ముల్క్ ఎ) ఔరంగజేబు
2. చిన్ ఖిలిచ్ ఖాన్ బి) మొదటి బహదూర్ షా
3. అసఫ్‌జా సి) ఫరూక్ సియర్
4. ఫతేజంగ్ డి) మహ్మద్ షా రంగీలా
ఎ) 1.డి, 2.ఎ, 3.డి, 4.సి
బి) 1.డి. 2.సి, 3.బి, 4.ఎ
సి) 1.సి, 2.ఎ, 3.బి, 4.డి
డి) 1.ఎ, 2.బి, 3.సి, 4.డి
34. నిజాం హోదా లేని తెలంగాణ పాలకుడు ఎవరు?
ఎ) సికిందర్ జా బి) సలాబత్ జంగ్
సి) నసీరుద్దౌలా డి) అఫ్జలుద్దౌలా
35. హోలీ సిక్కా పేరుతో ప్రత్యేక నాణేలు ముద్రించింది ఎవరు?
ఎ) మొదటి సాలర్జంగ్ బి) నసీరుద్దౌలా
సి) నిజాం మీర్ కమ్రుద్దీన్ డి) అఫ్జలుద్దౌలా
జవాబులు
1. ఎ 2. బి 3. ఎ 4. సి 5. ఎ 6. బి 7. సి 8. ఎ 9. డి 10. బి 11. డి 12. డి 13. డి 14. బి 15. సి 16. బి
17. సి 18. ఎ 19. సి 20. ఎ 21. బి 22. డి 23. సి 24. ఎ 25. డి 26. బి 27. బి 28. ఎ
29. ఎ 30. బి 31. ఎ 32. బి 33. ఎ 34. బి 35. డి
ఏకేఆర్ పబ్లికేషన్స్
వికారాబాద్, 9441022571
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు