ఈ ఏడాది జాతీయ పఠన దినోత్సవ థీమ్..? (జాతీయం)
పుస్తకం విడుదల
‘భారతీయ సంవిధాన్: అన్కహి కహాని’ పుస్తకాన్ని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూన్ 19న విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని రామ్ బహదూర్ రాయ్ రచించారు.
పఠన దినోత్సవం
జాతీయ పఠన దినోత్సవాన్ని జూన్ 19న నిర్వహించారు. కేరళ లైబ్రరీ ఉద్యమ పితామడు, ఉపాధ్యాయుడు అయిన పుతుల్ నారాయణ (పీఎన్) పణికర్ గౌరవార్థం ఈ దినోత్సవాన్ని 1996 నుంచి నిర్వహిస్తున్నారు. పణికర్ 1995, జూన్ 19న మరణించారు. ఈ ఏడాది దీని థీమ్ ‘ రీడ్ అండ్ గ్రో’.
20వ జానపద ఉత్సవం
ఒడిశా, పూరీలోని శారదాబలిలో 20వ జానపద ఉత్సవం, 13వ కృషి ఫెయిర్-2022ను కేంద్ర గిరిజన వ్యవహారాలు, జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు జూన్ 20న ప్రారంభించారు. గిరిజన సంస్కృతిని పరిరక్షించడం, ప్రాముఖ్యతను వివరించడం జానపద ఉత్సవం, వ్యవసాయంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, సమస్యల పరిష్కారం లక్ష్యంగా కృషి ఫెయిర్‌ను జూన్ 24 వరకు నిర్వహించారు.
అస్సాంలో వన్ నేషన్ వన్ రేషన్
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ (వోఎన్వోఆర్సీ)’ కార్యక్రమాన్ని అస్సాంలో జూన్ 21న ప్రారంభించారు. దీంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్న 36వ రాష్ట్రంగా అస్సాం నిలిచింది. ఈ వోఎన్వోఆర్సీ పథకాన్ని 2019, ఆగస్ట్ లో ప్రారంభించారు.
యోగా దినోత్సవం
8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న నిర్వహించారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం కోసం దీనిని 2014 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీని థీమ్ ‘యోగా ఫర్హ్యుమానిటీ’.
భారత్-నేపాల్ రైలు
భారత్ నుంచి నేపాల్ వరకు మొదటి టూరిజం రైలును ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్లో జూన్ 21న ప్రారంభించారు. భారత్ గౌరవ్లో భాగంగా 500 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ రైలు జూన్ 23న నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ స్టేషన్‌కు చేరింది.
జీశాట్-24
ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 రాకెట్ ద్వారా జీశాట్-24 ఉపగ్రహాన్ని జూన్ 22న రోదసీలోకి ప్రవేశపెట్టారు. కమ్యూనికేషన్ కోసం ఈ శాటిలైట్‌ను కేంద్ర ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ (డీవోఎస్), న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) సంయుక్తంగా రూపొందించాయి. నాలుగు వేల కిలోలపైన బరువు కలిగిన భారీ శాటిలైట్లను కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడంలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
సూర్య నూతన్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) పేటెంట్ పొందిన స్వదేశీ సోలార్ కుక్ టాప్ సూర్య నూతన్‌ను జూన్ 22న ఆవిష్కరించింది. దీనిని ఐవోసీ ఫరీదాబాద్ ఆర్ అండ్ డీ సెంటర్ అభివృద్ధి చేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?