ప్రపంచ శరణార్థులదినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? (అంతర్జాతీయం)
చైనా ఏబీఎం
మిడ్కోర్స్ (మధ్యంతర దశ)లో శత్రు దేశాల బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసే యాంటీ బాలిస్టిక్ మిసైల్ (ఏబీఎం)కి చెందిన టెక్నాలజీ పరీక్షను జూన్ 20న చైనా విజయవంతంగా నిర్వహించింది.
వరల్డ్ రెఫ్యూజీ డే
ప్రపంచ శరణార్థుల (వరల్డ్ రెఫ్యూజీ) దినోత్సవాన్ని యూఎన్ ఆధ్వర్యంలో జూన్ 20న నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా శరణార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెలుగులోకి తెచ్చేందుకు ఈ దినోత్సవాన్ని 2001 నుంచి యూఎన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది దీని థీమ్ ‘హూఎవర్, వాటెవర్, వెనెవర్. ఎవ్రీవన్ హ్యాజ్ ఏ రైట్ టు సీక్ సేఫ్టీ’.
నూరి రాకెట్
దక్షిణకొరియా దేశీయంగా అభివృద్ధి చేసిన ‘నూరి’ అనే తొలి అంతరిక్ష రాకెట్ను విజయంతంగా జూన్ 21న ప్రయోగించింది. దీంతో స్వీయ సామర్థ్యంతో ఉపగ్రహాన్ని ప్రయోగించిన 10వ దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. ఈ రాకెట్ సాయంతో ఒక ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపింది. ఈ రాకెట్ 47 మీటర్ల (154 అడుగులు) కంటే ఎక్కువ పొడవు, 200 టన్నుల బరువు ఉంటుంది.
ఖువ్స్గుల్ సరస్సు
మంగోలియాలోని ఖువ్స్గుల్ సరస్సును ‘వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్ ఆఫ్ యునెస్కో’లో జూన్ 21న చేర్చారు. 34వ ‘ఇంటర్నేషనల్ కో ఆర్డినేటింగ్ కౌన్సిల్ ఆఫ్ ది మ్యాన్ అండ్ ది బయోస్ఫియర్ ప్రోగ్రామ్’ పారిస్లో నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్లో ఖువ్స్గుల్ సరస్సును ఈ జాబితాలో చేర్చారు
గోల్డ్ రీసైక్లింగ్
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక జూన్ 21న విడుదలైంది. ప్రపంచంలో బంగారం రిఫైనింగ్, రీసైక్లింగ్ చేసే దేశాలను ఈ సూచికలో వెల్లడిస్తారు. ఈ నివేదిక ప్రకారం చైనా 168 టన్నుల బంగారాన్ని రీసైక్లింగ్ చేసి మొదటిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో వరుసగా ఇటలీ (80 టన్నులు), యూఎస్ (78 టన్నులు)నిలిచాయి.
భారత దేశం (75 టన్నులు) నాలుగో స్థానంలో ఉంది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది. దీనిని 1987లో స్థాపించారు. దీని సీఈవో డేవిడ్ టైట్, ఇండియా సీఈవో సోమసుందర్.
ఇండో-జర్మన్
జర్మనీలోని దోర్త్మండ్లో ఇండో-జర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సమావేశం జూన్ 21న నిర్వహించారు. ‘ఆర్బిట్రేషన్ ఇన్ ఏ గ్లోబలైజ్డ్ వరల్డ్-ది ఇండియన్ ఎక్స్పీరియన్స్’ అనే అంశంపై చర్చించారు. ఈ సదస్సుకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఒలింపిక్ డే
ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేని జూన్ 23న నిర్వహించారు. ఆధునిక ఒలింపిక్ క్రీడల పుట్టుకకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1948లో స్టాక్హోం (స్వీడన్)లో 41వ సెషన్లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) చెక్ రిపబ్లిక్ సభ్యుడు గ్రూస్.. ఒలింపిక్ దినోత్సవం గురించి ప్రతిపాదించారు. దీంతో ఐవోసీని స్థాపించిన 1894, జూన్ 23న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీని థీమ్ ‘టుగెదర్ ఫర్ ఏ పీస్ఫుల్ వరల్డ్’.
యూఎన్ పబ్లిక్ సర్వీస్ డే
యునైటెడ్ నేషన్స్ (యూఎన్) పబ్లిక్ సర్వీస్ దినోత్సవాన్ని జూన్ 23న నిర్వహించారు. ప్రభుత్వ సంస్థలు, సేవకుల విలువను గుర్తించే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని ఏటా ఐక్యరాజ్యసమితి 2003 నుంచి నిర్వహిస్తుంది. ఈ ఏడాది దీని థీమ్ ‘బిల్డింగ్ బ్యాక్ బెటర్ ఫ్రం కొవిడ్-19: ఎన్హాన్సింగ్ ఇన్నోవేటివ్ పార్ట్నర్షిప్ టు మీట్ ది సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’.
డెవలప్మెంట్ – నరహరి చాపల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?