లౌక్యంతో చదవాలి.. లీనమై రాయాలి! ( జనరల్ స్టడీస్ )
– సివిల్స్ప్రత్యేకం
సివిల్ సర్వీసెస్ 2022కు సంబంధించి ప్రథమఘట్టం ప్రిలిమినరీ ముగిసి ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇక ద్వితీయ ఘట్టమైన మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. మెయిన్స్ పరీక్షలో అర్హతకి సంబంధించి రెం లాంగ్వేజీ పేపర్లు, మెరిట్‌కు సంబంధించి మార్కులను పరిగణనలోకి తీసుకునే జనరల్ స్టడీస్‌లో ఐదు పేపర్లు, అభ్యర్థి ఎంచుకున్న ఆప్షనల్‌కు సంబంధించి రెం పేపర్లు ఉంటాయి. రానున్న సివిల్స్ మెయిన్స్‌ను దృష్టిలో ఉంచుకొని పరీక్ష విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
అర్హత పరీక్ష
1. పేపర్- A (300 మార్కులు)
# రాజ్యాంగంలోని VIIIవ షెడ్యూల్లో పేర్కొన్న భాషల్లో నచ్చిన భారతీయ భాషలో పరీక్ష రాయాలి. ఇది అర్హతకు సంబంధించిన పరీక్ష మాత్రమే. ఇందులో ప్యాసేజ్(Passage)పై అవగాహన, కచ్చితమైన రచన (Precis Writing), చిన్న వ్యాసాలు, ఇంగ్లిష్ నుంచి భారతీయ భాషలోకి అనువాదం తదితర అంశాలకు సంబంధించి ప్రశ్నపత్రం ఉంటుంది. ఈ ప్రశ్నపత్రంలో సమాధానాలను అభ్యర్థి ఎంచుకొన్న భారతీయ భాషలో మాత్రమే రాయాలి. ప్రశ్నపత్రంలో 600 పదాల్లో వ్యాసరచన (100 మార్కులు), 60 మార్కు లకు ప్రస్తావిక (Passage) ఇస్తారు.
# సొంత వాక్యాలు 10 మార్కులు, సమానార్థక పదాలు 10 మార్కులు, వ్యతిరేకార్థక పదాలు 10 మార్కులు, పదాల్లో తప్పులు సవరించడం 10 మార్కులకు సమాధానాలు రాయాలి. ఇంగ్లిష్ ప్రస్తావికను తెలుగు భాషలోకి అనువాదం 20 మార్కులు, ప్రిసైస్ రైటింగ్ 60 మార్కులకు ఇస్తున్నారు.
2. పేపర్- B (300 మార్కులు):
ఇది ఇంగ్లిష్ భాషకు సంబంధించిన పరీక్ష. ఈ ప్రశ్నపత్రానికి సంబంధించి సమాధానాలు ఇంగ్లిష్‌లో రాయాలి. దీనిలో వ్యాసరచనకు సంబంధించి నాలుగు ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు సంబంధించిన వ్యాసం రాయాలి. తర్వాత ప్యాసేజ్‌కు 75 మార్కులు, ప్రిసైస్ రైటింగ్‌కు 75 మార్కులు, మిస్సింగ్ వర్డ్, వ్యతిరేకపదాలు, ఖాళీలను వూరించడం వంటివి ఉంటాయి. ఇది కూడా అర్హత పరీక్ష మాత్రమే.
# జనరల్ స్టడీస్‌కు సంబంధించి ఐదు పేపర్లు ఉంటాయి. అవి..
పేపర్- 1: జనరల్ ఎస్సే (250 మార్కులు)
# ఈ ప్రశ్నపత్రంలో రెం సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్లో నాలుగు వ్యాసాలు ఇస్తారు. మొత్తం రెం వ్యాసాలు రాయాలి. వాటిలో ఒక వ్యాసాన్ని 1000 నుంచి 1200 పదాల్లో రాయాలి.
2021లో ఇచ్చిన ప్రశ్నలు
సెక్షన్- A
# The real is rational and the rational is real;
# Philosophy of wantlessness is Utopian, while materialism is a chimera;
# ఇలాంటి వాక్యాలను పేర్కొని ప్రశ్నలను అగుతున్నారు. ఇవేగాక నిగూఢ అర్థం వచ్చే విధంగా ఉండే ప్రముఖుల కొటేషన్స్ వ్యాస రూపంలో వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థి వ్యాసం రాసేటప్పు స్పష్టంగా తన అభిప్రాయాన్ని పొందికగా రాయాలి.
# సెక్షన్- Bలో రాజ్యాంగపరమైనటువంటి పాలిటీకి సంబంధించిన ప్రశ్న ఉంటుంది. అంతేగాక ఆర్థిక రంగంలో సంభవించిన మార్పులకు సంబంధించి తప్పనిసరిగా ఒక వ్యాసం ఉంటుంది.
# ఏదైనా అంశానికి సంబంధించి వ్యాసం రాసేటప్పు ఆ అంశానికి సంబంధించిన చరిత్ర, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో వివిధ రంగాలపై ప్రభావం, లాభనష్టాల బేరీజు, వాటిని అధిగమించడానికి అనుసరించాల్సిన మార్గాలను అభ్యర్థి అభిప్రాయంతో చక్కని ముగింపు ఇవ్వాలి. ఇవేగాక న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల వివాదం, రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవస్థ, భారతదేశానికి, ఇతర దేశాలతో సంబంధాలు ముఖ్యంగా అమెరికా, రష్యా వంటి దేశాలతో సంబంధాలు, అలాగే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వ అంశం, పర్యావరణానికి సంబంధించి గ్లాస్గో సదస్సు వంటి అంశాలను జనరల్ స్టడీస్ పేపర్-2, 3లతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి.
# ఈ వ్యాసరూప ప్రశ్నపత్రంలో సమాధానాన్ని ఒక క్రమపద్ధతిలో ప్రణాళికాబద్ధంగా విభజన చేసుకొని చక్కని పదాలు, మంచి కొటేషన్లు, సామరస్య వూరితమైన ముగింపు ఇస్తే మంచి మార్కులు సాధించవచ్చు. ఈ పేపర్‌కు సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులు జాతీయ, తెలుగు దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, మ్యాగజీన్లు చదవాలి.
పేపర్-2 (జనరల్ స్టడీస్-1) (250 మార్కులు)
# ఈ పేపర్ భారత దేశ చారిత్రక వారసత్వం, సంస్కృతి, చరిత్రకు సంబంధించి ఆధునిక భారత దేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర, సమాజానికి సంబంధించిన ప్రశ్నలతో పాటు భారతదేశ, ప్రపంచ భౌగోళిక శాసా్త్రనికి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. భారత దేశ చారిత్రక వారసత్వం, సంస్కృతికి సంబంధించి సుమారు 2 ప్రశ్నలు (25 మార్కులు) ఉంటాయి. దీనిలో వైదిక నాగరికత, బౌద్ధ, జైన మతానికి సంబంధించిన కళలు, వాస్తుశిల్పి వైభవానికి చెందిన అంశాలు, భక్తి ఉద్యమ సాహిత్యం, సంఘ సంస్కరణ ఉద్యమాలు ఉదాహరణకు బ్రహ్మ సమాజం వంటి వాటికి సంబంధించిన ప్రశ్నలిస్తారు.
# వీటితోపాటు ప్రాచీన, మధ్యయుగ భారతదేశానికి సంబంధించిన ప్రముఖ రాజవంశాలు లేదా రాజుల కాలం నాటి కళలు, సాహిత్యంపై ప్రశ్నలు అగుతారు. దీనికి సంబంధించి ఎన్సీఈఆర్టీ పుస్తకాలు సమగ్రంగా చదివి, సమాధానాలు రాయడం బాగా ప్రాక్టీస్ చేయాలి. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ పుస్తకాలు చదవాలి.
# ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు ముఖ్యంగా 1857 తిరుగుబాటు ఏ విధంగా బ్రిటిష్ విధానాల్లో మార్పునకు కారణమైంది. స్వాతంత్య్ర సమయంలో ముఖ్యంగా గాంధేయ కాలంలో స్త్రీ పాత్ర ఏమిటి? స్వాతంత్య పోరాటంలో మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్ దృక్పథాల్లో తేడా ఏమిటి? వంటి ప్రశ్నలు, స్వాతంత్య్రోద్యమంలో మితవాదుల పాత్ర ఏమిటి వంటి ప్రశ్నలు గతంలో అడిగారు.
# స్వాతంత్య్రానంతర కాలానికి సంబంధించి భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలు భారతదేశ ఏకత్వం బలపడటానికి కారణం అయ్యాయా వంటి ప్రశ్నలు, న్యాయ వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై గత మెయిన్స్ పరీక్షల్లో అడిగారు. దీనికి సంబంధించి పాత ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవడం మంచిది.
# తెలుగు మీడియం అభ్యర్థులు ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి డిగ్రీ, పీజీ పుస్తకాలు చదివితే సరిపోతుంది. ప్రపంచ చరిత్రకు సంబంధించి పశ్చిమ ఆఫ్రికాకు చెందిన వలస వాద వ్యతిరేక ఉద్యమాలకు సంబంధించిన అంశాలు, ప్రపంచ యుద్ధాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. తెలుగు మీడియం వారు ఆధునిక ప్రపంచ చరిత్ర, అకాడమీ పుస్తకాలు చదవాలి.
# సమాజానికి సంబంధించి భారతదేశ సాంస్కృతిక వైవిధ్యంపై ప్రపంచీకరణ ప్రభావం, పేదరికం, షెడ్యూల్డ్ తెగలు, స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ వంటి అంశాలు చదివితే ఉపయుక్తంగా ఉంటుంది. భారత దేశ సమాజశాస్త్రం పుస్తకంతోపాటు పాలిటీ, ఎకానమీలతో అనుసంధానం చేస్తూ చదవాలి.
# భౌగోళిక శాస్త్రానికి సంబంధించి హిమాలయాలు, దీనిలో ఎయిర్ మాస్ కాన్సెప్ట్ గురించి, హిమాలయాలు-కొండచరియలు విరిగిపడటం వంటి భౌగోళిక పశ్చిమ కనుమల్లో కొండ చరియలు విరిగి పడటం- ప్రభావం, అగ్ని పర్వతాల విస్ఫోటనం- స్థానిక వాతావరణంపై ప్రభావం, అసలు భారత ఉపఖండం అని ఎందుకు పిలుస్తారు?, పర్వత శ్రేణులు వంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలతోపాటు భూమి, దక్షిణ చైనా సముద్రం భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యత, భారత దేశంలో నగరాలకు సంబంధించి పరిస్థితులు, సింధూ నీటి ఒప్పందానికి సంబంధించి ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పులు, వాటి ప్రభావం వంటి ప్రశ్నలు గతంలో ఇచ్చారు.
# ఈ విభాగానికి సంబంధించి ఎన్సీఈఆర్టీ 11, 12వ తరగతి పుస్తకాలు చదవాలి. తెలుగు మీడియం అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పుస్తకాలు చదవాలి. దీనిలో 2-3 ప్రశ్నలు భౌగోళిక శాస్త్రంలో స్పష్టమైన పరిజ్ఞానం ఉన్నవారు మాత్రమే రాసేవిధంగా ఉంటాయి. మిగిలినవి సాధారణ పరిజ్ఞానంతో పాటు ఇతర విభాగాలతో అనుసంధానం చేసుకొని చదవాలి.
# ఈ ప్రశ్నపత్రంలో 150-180 మార్కులు సాధించే అవకాశం ఉంది.
పేపర్-3 (జనరల్ స్టడీస్-2) (250 మార్కులు)
# ఈ పేపర్‌కు సంబంధించి పరిపాలన, రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. దీనిలో గతేడాది కాలంలో దేశంలో జరిగిన రాజ్యాంగపరమైన అంశాలు, న్యాయ, పరిపాలన, సంక్షేమానికి సంబంధించిన అంశాలతో సంబంధం కలిగిన ప్రాథమిక అంశాలను (బేసిక్స్) లింక్ చేస్తూ ప్రశ్నలు అగుతారు. ఇటీవల వార్తల్లో నిలిచిన అంశాలు, వివాదాలను కేంద్రంగా చేసుకొని రాజ్యాంగ సవరణలు, వివాదాస్పదమైన చట్టాలు, రాజ్యాంగ మౌలిక స్వరూపం, రాష్ట్రపతి ఎన్నిక వీటిపై ప్రత్యేకంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
# అంతర్జాతీయ సంబంధాల నుంచి అంతర్జాతీయ వాణిజ్యంలో WTO పాత్ర, భారత దేశం యాక్ట్- ఈస్ట్ పాలసీ, బ్రిక్స్, భారత్ – ఆసియాన్ సంబంధాలు, ప్రస్తుత ప్రపంచంలో NATO యునెస్కోకు సంబంధించిన అంశాల గురించి అడిగే అవకాశం ఉంది. ఈ అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన అంశాలు చదివేటప్పు భారత దేశాన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకొని చదవాలి. దీనికి సంబంధించి అంతర్జాతీయ సంబంధాల కోసం అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు అకాడమీ మూడో ఏడాది డిగ్రీ పుస్తకం చదవాలి. ఇవి చదివేటప్పు దినపత్రికలను అనుసంధానం చేసుకోవాలి. ఈ పేపర్లో పట్టుసాధిస్తే మంచి మార్కులు సాధించవచ్చు.
పేపర్-4 (జనరల్ స్టడీస్-3) (250 మార్కులు)
# దీనికి సంబంధించి సాంకేతిక విజ్ఞానం, ఆర్థికాభివృద్ధి, జీవవైవిధ్యం, పర్యావరణం, భద్రత, విపత్తు యాజమాన్యం అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
#ఆర్థికాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.
#మహిళా సాధికారత సాధించడానికి జెండర్ బడ్జెటింగ్, స్మార్ట్ సిటీస్ అంటే ఏమిటి? పట్టణాభివృద్ధిలో దీని సంబంధం, ఇది గ్రామీణ-పట్టణాల మధ్య అంతరాలను పెంచుతుందా? స్మార్ట్ విలేజెస్ వంటి ప్రశ్నలు గతంలో ఇచ్చారు.
# దేశాభివృద్ధిలో ఎఫ్‌డీఐల ఆవశ్యకత, ఎఫ్‌డీఐలు పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలు, సమర్థనీయమైన నీటి వినియోగంలో మైక్రో ఇరిగేషన్ పాత్ర, అల్లోపతి అంటే ఏమిటి? నీటి సౌకర్యం ఉన్న వ్యవసాయంలో మేజర్ క్రాపింగ్ సిస్టమ్స్ పాత్ర, వ్యవసాయాభివృద్ధిలో భూ సంస్కరణల పాత్ర, భూ సంస్కరణలు విజయవంతం కావడానికి ఏ కారకాలు తోడ్పతాయి? వంటి ప్రశ్నలు ఇస్తున్నారు.
#పీఎంఎఫ్‌బీవై (ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన) ముఖ్య లక్షణాలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి, ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ప్రత్యేకంగా చదవాలి. తెలుగు మీడియానికి సంబంధించి అకాడమీ వారి భారత దేశ ఆర్థిక వ్యవస్థ పుస్తకం బాగా ఉపయోగపతుంది. దీంతోపాటు ప్రభుత్వ వెబ్సైట్లను ఉపయోగించుకోవాలి.
# సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రెన్యువబుల్ ఎనర్జీ (పునరుత్పాదక వనరులు), స్పేస్ (అంతరిక్ష) సైన్స్ అండ్ టెక్నాలజీ విజయాలు, పీఎస్ఎల్వీ సీ-52, ఇన్‌స్పేస్ టెక్నాలజీని భారతదేశ సామాజిక-ఆర్థికాభివృద్ధిలో ఎలా ఉపయోగించుకోవాలి లాంటి అంశాలతోపాటు నానో టెక్నాలజీకి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఇస్రో ప్రయోగాలు, ఎనర్జీ, డిఫెన్స్‌కు సంబంధించిన అంశాలు చదవాలి. జాతీయ పత్రికల్లో ఏడాదికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్‌లో పేజీల్లో వచ్చిన అంశాలు క్రమపద్ధతిలో చదివితే ఉపయుక్తంగా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలు విదల చేసే వార్షిక నివేదికలు చదవాలి.
#విపత్తు యాజమాన్యానికి సంబంధించి ఎన్డీఎంఏ గైడ్‌లైన్స్, పట్టణ వరదలు, రిహాబిలిటేషన్స్ వంటి అంశాల కోసం ఎన్సీఈఆర్టీ, ఎన్ఎండీఏ రిలీజ్ చేసిన పుస్తకాలు చదవాలి.
#సెక్యూరిటీ అంశాలకు సంబంధించి సరిహద్దు సమస్యలు, ఉగ్రవాద దాలు, ఉగ్రవాదం, భద్రతా వ్యవస్థలో ఇంటర్నెట్, సోషల్ మీడియా పాత్రల గురించి చదవాలి. దీనికి పేపర్ పఠనంతోపాటు సొంత నోట్స్ తయారు చేసుకొని చదివితే మంచి మార్కులు సాధించవచ్చు.
పేపర్-5 (జనరల్ స్టడీస్-4) (250 మార్కులు)
# నైతిక విలువలు, సమగ్రత, ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన అంశాలపై ఉంటుంది. దీనిలో నైతికత, మానవ విలువలు, వైఖరి, పౌరసేవలో ప్రాథమికమైన విలువలు, ఉద్వేగవూరిత ప్రజ్ఞకు సంబంధించిన అంశాలతోపాటు నైతికపరమైన విషయాలకు సంబంధించి తత్వవేత్తల భాగస్వామ్యం (ప్రపంచం, ఇండియాకు సంబంధించినవారు) వంటి అంశాలుంటాయి.
# ప్రభుత్వ పాలనలో నైతికత, ప్రజాసేవలో సివిల్ సర్వీస్ అధికారులకు సంబంధించిన నియమాలు, చట్టాలకు సంబంధించిన అంశాలుంటాయి. సమాచార హక్కు చట్టం, నైతికతకు సంబంధించిన నియమావళి, ప్రవర్తనా నియమావళి, సిటిజన్ చార్టర్, పని సంస్కృతి, ప్రభుత్వ ధనం సద్వినియోగం, అవినీతికి సంబంధించిన సమస్యలు వంటి అంశాల్లో ప్రశ్నలు, కేస్ స్టడీస్ ఉంటాయి.
# సామాజిక, మానవీయ వికాసంలో నైతిక పాత్ర, ప్రస్తుత సామాజిక – రాజకీయ పరిస్థితులు పబ్లిక్ సర్వీస్‌లో ప్రాథమిక విలువలను ఉదాహరణలతో వివరించండి? గవర్నెన్స్ (పరిపాలన), గుడ్ గవర్నెన్స్ (సుపరిపాలన), ఎథికల్ గవర్నెన్స్ (నైతిక పాలన) వివరణ, మహాత్మా గాంధీ పేర్కొన్న సెవెన్ సెన్స్, భారతదేశ దృక్పథంలో రాల్స్ థియరీ ఆఫ్ సోషల్ జస్టిస్ వంటి అంశాలు ఇచ్చే అవకాశం ఉంది.
#అవినీతిపై కౌటిల్యుని దృక్పథం, కేస్ స్టడీస్‌కు సంబంధించి ఉద్యోగ జీవితంలో వ్యక్తి ఎదుర్కొనే సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారనే దృక్పథంలో కేస్ స్టడీస్ ఇస్తారు. ఉదాహరణకు ‘నీవు వృద్ధులకు సంబంధించి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వగల అధికారివి. ఒక నిరక్షరాస్యురాలైన వృద్ధురాలు నిన్ను కలిసి తన బాధలు చెప్పుకొన్నది. నీ అభిప్రాయంలో ఆమె పెన్షన్ పొందడానికి అర్హురాలు. కానీ ఆమె దగ్గర డాక్యుమెంట్స్ ఏమీ లేవు. నీవు ఒక అధికారిగా ఎలా స్పందిస్తావు?’ ఇలాంటి ప్రశ్నలు అగుతారు. ఈ కేస్ స్టడీస్‌కు పరిష్కార వూరితమైన సమాధానం రాసేటప్పు ఆ అధికారిగా ఉన్నట్టు ఊహించుకుని ఆ సమయంలో ఎలా స్పందిస్తావో రాయాలి. అప్పుడే స్పష్టమైన సమాధానం రాయగలరు.
# ఈ పేపర్ బాగా ప్రిపేరైతే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది.
# జనరల్ స్టడీస్ పేపర్లు రాసేటప్పు ఒక పేపర్‌కు ఇంకో పేపర్‌ను కోరిలేట్ చేసుకుంటూ రాయాలి. అలా చేసినప్పుడే అత్యధిక మార్కులు వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజూ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. మాక్ ఎగ్జామ్స్ బాగా రాయాలి. అప్పుడే ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా ప్రశ్నలు అడిగినా సంకోచం లేకుండా సమాధానాలు రాయవచ్చు.
# ఈ ప్రిపరేషన్ ఇంటర్వ్యూకు కూడా ఉపయోగపతుంది.
మల్లవరపు బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?