అశ్విక దళాన్ని ఎవరి సైన్యానికి వెన్నెముకగా చెప్తారు?
ఆధునిక భారతదేశ చరిత్ర -2
గత తరువాయి…
60. ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రదేశంలో డచ్ తూర్పు ఇండియా వర్తక సంఘం తన మొదటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది?
1) పులికాట్ 2) మచిలీపట్నం
3) నర్సాపూర్ 4) భీమునిపట్నం
61. మిసిలీలు అంటే ?
1) సిక్కు నివాస స్థానం
2) సిక్కుల సమాఖ్య
3) బృందంగా ఏర్పడిన సిక్కు యోధుల సమూహం
4) మొగలులకు మిత్రులైన సిక్కులు
62. సిక్కు సైన్యానికి వెన్నెముకైన విభాగం ?
1) పదాతిదళం 2) అశ్విక దళం
3) ఫిరంగి దళం 4) పైవన్నీ
63. సట్లెజ్ నది ఉత్తర ప్రాంతాలను ఆక్రమించుకునే స్వేచ్ఛను ఇచ్చిన లాహోర్ ఒప్పందాన్ని రంజిత్‌సింగ్ ఎవరితో కుదుర్చుకున్నారు?
1) రెండవ పీష్వా బాజీరావు
2) ఇండోర్ హోల్కర్
3) గ్వాలియర్ సింధియా
4) తూర్పు ఇండియా వర్తక సంఘం
64. రంజిత్‌సింగ్ పరిపాలనలో ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగి భూమి శిస్తు అధికారిగా, అకౌంటెంట్‌గా, న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించింది ఎవరు?
1) నిజాం 2) కర్దర్
3) దివాన్ 4) కానుంగో
65. రంజిత్‌సింగ్ సైన్యంలో అత్యున్నత శిక్షణ పొంది ‘మోడల్ బ్రిగేడ్’గా పేరుపొందిన సైనిక విభాగం పేరు?
1) ఫౌజ్ ఇ ఆమ్ 2) ఫౌజ్ ఇ ఖాస్
3) ఫౌజ్ ఇ బి కవైడ్ 4) ఫౌజ్ ఇ హింద్
66. మొదటి ఆంగ్లో, సిక్కు యుద్ధంలో లాహోర్ ఒప్పందానికి దారితీసిన చివరి యుద్ధం ఎక్కడ జరిగింది?
1) ముద్కి 2) ఫిరోజ్‌పూర్
3) ఆలివాల్ 4) సబ్రోన్
67. మొదటి ఆంగ్లో, సిక్కు యుద్ధంలో సిక్కుల ఓటమికి ప్రధాన కారణం ?
1) వనరులు లోపించడం
2) సరైన శిక్షణ లేకపోవడం
3) సిక్కు సైనిక నాయకుల నమ్మక ద్రోహం
4) అధునాతనమైన ఇంగ్లిష్ ఫిరంగి దళం
68. రెండో ఆంగ్ల, సిక్కు యుద్ధంలో కీలకమైన పోరు ఎక్కడ జరిగింది?
1) బుందేవాల్ 2) చిలియన్‌వాలా
3) రామ్‌నగర్ 4) గుజరాత్
69. ‘ఆదిగ్రంథ్’ను చివరిసారి ప్రస్తుతం ఉన్న రూపంలో సంకలనం చేసిన గురువు?
1) గురు అర్జున్దేవ్ 2) గురు హరగోవింద్
3) గురు గోవింద్‌సింగ్
4) గురు తేజ్‌బహదూర్
70. క్రీ.శ. 1800 సంవత్సరంలో అఫ్గనులతో కలిసి నెపోలియన్ భారత్‌పై దండయాత్ర చేస్తాడనే భయంతో ఆంగ్ల ప్రభుత్వం రంజిత్‌సింగ్ సహాయం కోరడానికి అతని ఆస్థానానికి ఎవరిని పంపింది?
1) యూసఫ్ అలీ 2) చార్లెస్ మెట్కాఫ్
3) యశ్వంత్ రావ్ హోల్కర్
4) పైవేవీ కాదు
71. కింది వారిలో ఆంగ్లేయులకు తమ స్థావరాలను అమ్మి వెళ్లిపోయిన ఐరోపా వర్తకులు ఎవరు?
1) ఫ్రెంచ్ 2) డేన్స్
3) పోర్చుగీస్ 4) డచ్
72. భారతదేశంలో పోర్చుగీసుల ప్రథమ రాజధాని?
1) గోవా 2) కొచ్చిన్
3) కాలికట్ 4) కన్ననూర్
73. తూర్పు తీరంలో పోర్చుగీసు వారి ఏకైక వర్తక స్థలం ?
1) శాంథోమ్ 2) అర్మగాన్
3) కరైకల్ 4) పులికాట్
74. పోర్చుగీసు నుంచి మరాఠాలు క్రీ.శ. 1739లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు ?
1) చాల్, బెసిన్
2) బొంబాయి, చాల్
3) సాల్సెట్టి, బెస్సిన్
4) చాల్, సాల్సెట్టి
75. క్రీ.శ. 1690లో సూతవాతి దగ్గర ఫ్యాక్టరీని నెలకొల్పింది?
1) జాబ్ చార్నాక్
2) సర్ జాన్ చైల్డ్
3) సర్ విలియం కోర్టిన్
4) ఐర్‌కూట్
76. జెయింట్ జార్జికోట, విలియం కోట గల ఆంగ్ల స్థావరాలను గుర్తించండి
1) ముంబై, మద్రాసు
2) ముంబై, కోల్‌కతా
3) మద్రాసు, కోల్‌కతా
4) కోల్‌కతా, మద్రాసు
77. చైనాతో మాత్రమే వర్తక కార్యకలాపాలను నిర్వహించిన యూరోపియన్ వర్తకులు?
1) స్వీడ్స్ 2) బ్రిటిష్
3) స్పానియార్డ్ 4) డేన్స్
78. భారతదేశంలో ఏ ప్రాంతం నుంచి యూరోపియన్లు ఉత్తమ నాణ్యతగల సూరేకారం, నల్లమందులను పొందారు?
1) కోరమండల్ 2) గుజరాత్
3) బీహార్ 4) మలబార్
79. స్వాతంత్య్రం వచ్చే వరకు ఎటువంటి సరిహద్దు మార్పు లేకుండా ఉన్న ‘మద్రాసు ప్రెసిడెన్సీ’ని సృష్టించింది?
1) సర్ థామస్ మున్రో
2) లార్డ్ కారన్వాలిస్
3) లార్డ్ హేస్టింగ్స్
4) లార్డ్ వెల్లస్లీ
80. పోర్చుగీసు వారు ఏ రాజ్యంలో మొట్టమొదటిసారిగా తమ స్థావరాన్ని స్థాపించారు?
1) కాలికట్ 2) కొచ్చిన్
3) డామన్ 4) బీజపూర్
81. భారతదేశంలో పోర్చుగీసువారు ప్రవేశపెట్టిన పంట?
1) కాఫీ 2) పచ్చిమిరప
3) పొగాకు 4) వేరుశనగ
82. కింది వాటిలో ఇంగ్లిష్ వారు ఏ ఫ్యాక్టరీకి ప్రథమంగా రక్షణ దుర్గాన్ని నిర్మించారు?
1) బొంబాయి 2) సూరత్
3) మద్రాసు 4) మచిలీపట్నం
83. ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రాంతంగా (ఏలూరు, ముస్తఫానగర్, రాజమండ్రి, చికాకోల్) పేరుగాంచిన ప్రదేశాన్ని ఫ్రెంచి వారికి ధారాదత్తం చేసినది?
1) అన్వరుద్దీన్ 2) అసఫ్ జా
3) ముజఫర్ జంగ్ 4) సలబత్ జంగ్
84. మధ్యయుగాలలో భారత్, యూరప్‌ల మధ్య జరిగిన వ్యాపారంలో ఏకస్వామ్య ఆధిపత్యాన్ని చెలాయించింది?
1) స్పెయిన్, పోర్చుగల్
2) పర్షియా, అరేబియా
3) జెనీవా, వెనిస్
4) ఆర్మీనియా, అఫ్గనిస్థాన్
85. తూర్పు ఆసియా దేశాలలో సుగంధ ద్రవ్యాలకు ప్రతిగా డచ్ వర్తకులు ఏ భారతీయ వస్తువును ఇచ్చేవారు?
1) నల్లమందు 2) ఇండిగో
3) సూరేకారం 4) నూలు వస్త్రం
86. ప్రారంభంలో పూర్తిగా వ్యాపారంపై మాత్రమే తమ దృష్టిని కేంద్రీకరించిన ఫ్రెంచి వారు ఏ గవర్నర్ కాలంలో భారతదేశంలో ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని కలలు కన్నారు?
1) డ్యూమాస్ 2) ఫ్రాన్సిస్ మార్టిన్
3) లినాయిర్ 4) డూప్లెక్స్
87. భారత్‌లో పోర్చుగీసు సంతతిని పెంచడానికి పోర్చుగీస్లు, భారత జాతీయుల మధ్య వివాహాలను ప్రోత్సహించిన గవర్నర్?
1) క్లెవ్ 2) అల్బూకర్క్
3) జమోరిన్ 4) ఇమాన్యుయెల్
88. భారతదేశంలో పోర్చుగీసు ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది?
1) స్థానికులు 2) హిందువులు
3) అరబ్బులు 4) జమోరిన్
89. పోర్చుగీసు భారతదేశంలో ప్రవేశించే సమయానికి ఢిల్లీని ఎవరు పాలిస్తున్నారు?
1) సికిందర్ లోడి 2) ఇబ్రహిం లోడి
3) బలాల్ లోడి 4) బాబరు
90. డచ్‌వారు తమ మొదటి ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించారు?
1) సూరత్ 2) కాలికట్
3) మచిలీపట్నం 4) కరైకల్
91. క్రీ.శ 1498లో ప్రప్రథమంగా భారతదేశంలో అడుగుపెట్టిన వాస్కోడిగామా, రెండవసారి ఏ సంవత్సరంలో తిరిగి భారత్ వచ్చారు?
1) 1501 2) 1499
3) 1504 4) 1532
92. పోర్చుగీస్ వారు డామన్‌ను ఏ సంవత్సరంలో ఆక్రమించారు?
1) 1530 2) 1538
3) 1545 4) 1560
93. కెప్టెన్ హాకిన్స్ భారత్‌కు వచ్చిన నౌక పేరు?
1) హెక్టర్ 2) వాయేజ్
3) ది కాంక్వరర్ 4) ది ఆర్మిడా
94. టిప్పు సుల్తాన్‌తో మంగుళూరు ఒప్పందాన్ని కుదుర్చుకున్న మద్రాసు గవర్నర్?
1) లార్డ్ హారిస్ 2) లార్డ్ హామిల్టన్
3) లార్డ్ మెకార్ట్ని 4) లార్డ్ స్టీఫెన్సన్
95. రెండవ ఆంగ్ల, మైసూరు యుద్ధ సమయంలో ఆంగ్ల గవర్నర్ జనరల్ ?
1) వారన్‌హేస్టింగ్స్
2) లార్డ్ కారన్‌వాలీస్
3) సర్ జాన్ షోర్
4) లార్డ్ వెల్లస్లీ
96. కింది వారిలో ఎవరు బెనారెస్ హిందూ యూనివర్సిటీ స్థాపనతో సంబంధం కలిగి
ఉన్నారు?
1) బాలగంగాధర్ తిలక్
2) గోపాలకృష్ణ గోఖలే
3) మదన్మోహన్ మాలవీయ
4) మోతీలాల్ నెహ్రూ
97. 18వ శతాబ్దం స్థితిగతులను వర్ణించిన ‘సయూర్ ఉల్ ముతకరీం’ను రచించింది?
1) గులాం స్సేన్ 2) నాసిర్ స్సేన్
3) ఆరీఫ్ మహ్మద్ 4) షిహబుద్దీన్
98. హైదరాబాద్‌ను పాలించిన చివరి నిజాం ఎవరు?
1) ఉస్మాన్ అలీఖాన్
2) మహబత్ అలీఖాన్
3) సికిందర్ జీ
4) నాసిర్ ఉద్దౌలా
99. కింది వాటిలో టిప్పు సుల్తాన్ ప్రవేశపెట్టిన సంస్కరణను గుర్తించండి?
1) బాల్య వివాహాల నిషేధం
2) అనవసర వివాహ ఖర్చులను తగ్గించడం
3) మద్యపాన నిషేధం
4) వ్యభిచార నిషేధం
100. జాట్ అధికారం ఎవరి కాలంలో అత్యున్నత శిఖరాన్ని అందుకుంది?
1) గోకుల్ 2) రాజారాం
3) సూరజ్మల్ 4) చుర్మన్
101. మధుర పరిసరాల్లో నివసించే జాట్లు ఎవరి నాయకత్వంలో మొగలులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు?
1) సూరజ్మల్ 2) గోకుల్
3) రాజారాం 4) చురమన్
102. డూప్లెక్స్ నాయకత్వంలోని ఫ్రెంచివారికి, కర్ణాటక నవాబు అన్వరుద్దీన్‌కు క్రీ.శ. 1746లో యుద్ధం ఎక్కడ జరిగింది?
1) శాంథోమ్ లేక అడయార్
2) మద్రాసు
3) కోరమండల్ తీరం
4) తంజావూర్
103. ఆంగ్లేయులకు, ఫ్రెంచి వారికి జరిగిన మొదటి కర్ణాటక యుద్ధం (1746-48) ఏ సంధితో ముగిసింది?
1) శ్రీరంగపట్నం 2) సెరంపూర్
3) ఎక్స్ లా ఛాపెల్ 4) మాల్వా
104. ఆగస్టు 1747లో జరిగిన ఎక్స్ లా ఛాపెల్ సంధి ప్రకారం మద్రాసును ఎవరికి అప్పగించారు?
1) ఫ్రెంచ్ 2) బ్రిటిష్
3) పోర్చుగీసు 4) కొట్టాయం రాజు
105. జనవరి 1760లో జరిగిన నందవాసి యుద్ధంలో కౌంట్ డి లాలీ నాయకత్వంలోని ఫ్రెంచి సైన్యాలను ఓడించిన ఇంగ్లిష్ జనరల్ ఎవరు?
1) క్లెవ్ 2) సర్ ఐర్‌కూట్
3) కౌంట్ డి ఆల్వో 4) కల్నల్ హెరోన్
106. శ్రీరంగపట్నం ఒప్పందం ప్రకారం టిప్పు సుల్తాన్ అప్పగించిన భూభాగాన్ని ఇంగ్లిష్‌వారు నిజాంతో పాటు ఎవరు పంచుకున్నారు?
1) ఫ్రెంచ్ 2) మొగలులు
3) మరాఠాలు 4) అహ్మద్‌షా అబ్దాలీ
107. బెంగాల్లో ఫ్రెంచ్ వారికి ఉన్న ఏకైక ఫ్యాక్టరీ చంద్రవాగోర్ను 1757లో నిర్మించింది?
1) ఇంగ్లిష్‌వారు 2) మొగలులు
3) బెంగాల్ నవాబు 4) పైవేవీ కాదు
108. ప్రధానంగా చైనాతో వ్యాపారం చేసిన స్వీడిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1725 2) 1731
3) 1741 4) 1700
109. 1706లో భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి క్రిస్టియన్ మత ప్రచారకుడు ?
1) థామస్ రో 2) గాబ్రియేల్
3) జిజెన్బాల్గ్ 4) ఫ్రానిస్ డే
110. 1746లో బ్రిటిష్ ముఖ్యవర్తక స్థావరమైన మద్రాసును పట్టుకున్న ఫ్రెంచ్ సేనాని ఎవరు?
1) లా బోర్డ్నాయిస్ 2) కౌంట్ డీ లాలీ
3) డూప్లెక్స్ 4) పైవేవీ కాదు
111. 1758లో మచిలీపట్నాన్ని ఆకమించిన ఫ్రెంచ్ సేనాని ?
1) డీ లాలీ 2) లూయి
3) డూ ప్లెక్స్ 4) ఫోర్డ్
112. మొదటి మైసూరు యుద్ధంలో (1767-1769) హైదరాలీకి వ్యతిరేకంగా పీష్వా సహాయం పొందడానికి ఇంగ్లిష్ ప్రభుత్వం పూణె ఆస్థానానికి ఎవరిని రాయబారిగా పంపింది?
1) థామస్ మోస్టెన్ 2) జోసెఫ్స్మిత్
3) సర్ రాబర్ట్ ఫ్లీచర్ 4) పైవేవీకాదు
113. ‘యద్గిర్’ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది?
1) మరాఠా, నిజాం 2) మరాఠా, ఇంగ్లిష్
3) నిజాం, ఇంగ్లిష్ 4) నిజాం, హైదరాలీ
114. ఫ్రెంఛ్ సహాయంతో 1755 లో దిండిగల్ దగ్గర ఆయుధ కర్మాగారాన్ని స్థాపించిన మైసూరు పాలకుడు ఎవరు?
1) దేవరాజ్ 2) కృష్ణరాజ్
3) హైదరాలీ 4) టిప్పుసుల్తాన్
115. ఎవరి పాలనా కాలంలో కంపెనీ కర్నాటక రాజ్యాన్ని తన ప్రత్యక్ష పాలనలోకి తెచ్చుకుంది?
1) నవాబ్ మహ్మద్ ఆలీ
2) టిప్పు సుల్తాన్ 3) ఉమదత్ ఉల్ ఉమ్రా
4) హైదరాలీ
116. 18వ శతాబ్దంలో సంస్కృత విద్యకు కేంద్రంగా మారిన ట్రావెన్కోర్ రాజ్య రాజధాని ?
1) క్విలన్ 2) త్రివేండ్రం
3) కొజికోడ్ 4) ఇడుక్కి
117. 18వ శతాబ్దంలో ఆధునిక నౌకాదళాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నించిన భారతీయ పాలకుడు ?
1) కృష్ణరాజ్ 2) దేవరాజ్
3) హైదరాలీ 4) టిప్పుసుల్తాన్
జవాబులు
60.2 61.2 62.2 63.4 64.2 65.2 66.4 67.3 68.4 69.3 70.1 71.2 72.2 73.1 74.2 75.1
76.3 77.4 78.3 79.4 80.2 81.3 82.3 83.2 84.3 85.4 86.4 87.2 88.3 89.1 90.3 91.1
92.2 93.1 94.3 95.1 96.3 97.1 98.1 99.1 100.3 101.2 102.1 103.3 104.2 105.2 106.3 107.1
108.2 109.3 110.1 111.4 112.1 113.1 114.3 115.3 116.2 117.4
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు