వన్యప్రాణి సంరక్షకాలు.. పర్యావరణ పరిరక్షకాలు
చిత్తడి నేలలు జీవవైవిధ్యానికి నిలయాలు. భూగర్భజలాల పెరుగుదల, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు మూలాధారాలు. అనేక వన్యప్రాణులు అరుదైన జీవజాతులు ఈ ప్రాంతాల్లో నివశిస్తాయి. వీటిని సంరక్షించడంతో జీవవైవిధ్యాన్ని రక్షించవచ్చు. భారతదేశంలోని చిత్తడి నేలలు, వాటి స్వభావం, ప్రయోజనాలు, రామ్సర్ ఒప్పందం వంటి అంశాల గురించి తెలుసుకుందాం.
చిత్తడి నేలలు (Wet Lands)
సముద్రం, నదీ తీరాల్లోని నీటి వనరులు సమృద్ధిగా లభించే భూములను చిత్తడి నేలలు అంటారు. సరస్సులు, మడ అడవుల తీరప్రాంతాలను కూడా చిత్తడి నేలలుగా పరిగణిస్తారు. సముద్ర, నదీ తీరాల్లో అలలు, నీటి ప్రవాహం తాకిడికి భూక్షయం జరగకుండా ఇవి దోహదపడతాయి. అరుదైన మొక్కలు, పక్షులు, జంతువుల జీవనానికి ఇవి అనువైనవి. సమీప్య నీటి నాణ్యత పెంచడానికి, కాలుష్య కారకాలను గ్రహించడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
– పెరుగుతున్న పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల పర్యావరణానికి పెద్ద ఎత్తున హాని కలుగుతోంది. వ్యవసాయం లోనూ రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడుతుండటం వల్ల నేల తీవ్రమైన కాలుష్యానికి లోనవుతుంది. ఇందులో భాగంగానే వ్యవసాయం, నివాసాలకు చిత్తడి నేలలను ఆక్రమించడం వల్ల విధ్వంసానికి గురవుతున్నా యి. ప్రభుత్వాలు పరిశ్రమలు నెలకొల్పడానికి చిత్తడినేలలనే కేటాయించడం వల్ల మరింత విధ్వంసానికి లోనవు తున్నాయి. వీటి పరరిక్షణ కోసమే రామ్సర్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించి 164 దేశాలు ఉమ్మడి ఒప్పందం చేసుకున్నాయి. దీన్నే రామ్సర్ ఒప్పందం అంటారు. చిత్తడి నేలల పరిరక్షణకు ఈ ఒప్పందంలో కొన్ని ప్రమాణాలు పాటించేలా నిర్దేశించారు. ఇందులో భారతదేశం కూడా భాగసామ్యమైంది.
– ప్రపంచవ్యాప్తంగా రామ్సర్ ఒప్పందం ప్రకారం గుర్తించిన చిత్తడి నేలలను రామ్సర్ సైట్స్ అంటారు.
– చిత్తడినేలల సంరక్షణ, స్థిర వినియోగంపై అంతర్జాతీయ సదస్సును యునెస్కో ఆధ్వర్యంలో 1971 ఫిబ్రవరి 2న ఇరాన్‌లోని రామ్సర్ నగరంలో నిర్వహించారు.
– ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన చిత్తడి నేలలను రామ్సర్ సైట్లుగా గుర్తించాలని ఈ సదస్సు నిర్ణయించింది. దీన్ని 1975లో ఆమోదించారు.
-ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2400 రామ్సార్ సైట్లను గుర్తించారు. ఇవి 2.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి.
-1974లో ఆస్ట్రేలియాలోని కౌబర్గ్ పెనిన్సులా చిత్తడి నేలలను ప్రపంచంలోనే మొట్టమొదట గుర్తించారు.
– యునైటెడ్ కింగ్డమ్ 175 చిత్తడి నేలలతో ప్రపంచంలోనే ఎక్కువ రామ్సర్ సైట్లున్న దేశంగా గుర్తింపు పొందింది.
– ఫిబ్రవరి 2వ తేదీని అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకొంటారు.
– భారతదేశంలో 1982 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రామ్సర్ సైట్లను గుర్తిస్తున్నారు.
– భారతదేశంలో ఇప్పటి వరకు 49 చిత్తడి నేలలను గుర్తించారు. దీంతో దక్షిణ ఆసియాలోనే ఎక్కువ రామ్సర్ సైట్లు కలిగిన ప్రాంతంగా నిలిచింది.
-2022లో నూతనంగా రెండు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను రామ్సర్ సైట్లుగా గుర్తించారు. అవి గుజరాత్‌లోని ఖిజాడియా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఉత్తరప్రదేశ్‌లోని బఖిరా వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం.
– దేశంలోని 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 10,936 చదరపు కిలోమీటర్లలో ఇవి విస్తరించి ఉన్నాయి.
-ఒడిశాలోని చిలికా సరస్సు, రాజస్థాన్‌లోని కియోలడియో నేషనల్ పార్క్‌లను భారతదేశంలోని మొట్టమొదటి రామ్సర్ సైట్స్‌గా పేర్కొంటారు.
-ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 10 రామ్సర్ సైట్లున్నాయి.
– భారత్‌లోని అతిపెద్ద రామ్సర్ సైట్ సుందర్బన్. హిమాచల్ ప్రదేశ్‌లోని రేణుక చిత్తడి నేలలు అతిచిన్నవి.
రామ్సార్ కన్వెన్షన్ కింది సంస్థలతో కలిసి పనిచేస్తుంది.
1. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN)
2. బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్
3. ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ (IWMI)
4. వెట్‌ల్యాండ్స్ ఇంటర్నేషనల్
5. వైల్డ్ఫోల్ అండ్ వెట్లాండ్స్ ట్రస్ట్ (WWT)
6. WWF ఇంటర్నేషనల్
7. రామ్సర్ సైట్స్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (RSIS)
భారతదేశంలోని రామ్సర్ సైట్స్
1. హైదర్‌పూర్ చిత్తడి నేలలు – ఉత్తరప్రదేశ్
2. సుల్తాన్పూర్ జాతీయ పార్కు – హర్యానా
3. భిందావాస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం – హర్యానా
4. థోల్ సరస్సు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం – గుజరాత్
5. వాద్వానా చిత్తడి నేలలు – గుజరాత్
6. అష్టముది చిత్తడి నేలలు – కేరళ
7. బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్ – పంజాబ్
8. భితర్కనిక మడ అడవులు – ఒడిశా
9. భోజ్ చిత్తడి నేలలు – మధ్యప్రదేశ్
10. చంద్ర టాల్ – హిమాచల్ ప్రదేశ్
11. చిలికా సరస్సు – ఒడిశా
12. దీపోర్ బీల్ – అసోం
13. తూర్పు కలకత్తా చిత్తడి నేలలు – పశ్చిమబెంగాల్
14. హరికే చిత్తడి నేలలు – పంజాబ్
15. హొకేరా చిత్తడి నేలలు – జమ్ముకశ్మీర్
16. కంజ్లీ చిత్తడి నేలలు – పంజాబ్
17. కియోలాడియో జాతీయ పార్కు – రాజస్థాన్
18. కేశోపూర్-మైనీ కమ్యూనిటీ రిజర్వ్ – పంజాబ్
19. కొల్లేరు సరస్సు – ఆంధ్రప్రదేశ్
20. లోక్తక్ సరస్సు – మణిపూర్
21. నల్సరోవర్ పక్షి సంరక్షణ కేంద్రం – గుజరాత్
22. నండూర్ మధమేశ్వర్ – మహారాష్ట్ర
23. నంగల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం – పంజాబ్
24. నవాబ్‌గంజ్ పక్షి సంరక్షణ కేంద్రం – ఉత్తరప్రదేశ్
25. పార్వతి ఆగ్రా పక్షి సంరక్షణ కేంద్రం – ఉత్తరప్రదేశ్
26. పాయింట్ కాలిమెర్ వన్యప్రాణి,
పక్షి సంరక్షణ కేంద్రం – తమిళనాడు
27. పోంగ్ డ్యామ్ సరస్సు – హిమాచల్ ప్రదేశ్
28. రేణుక సరస్సు – హిమాచల్ ప్రదేశ్
29. రోపర్ చిత్తడి నేలలు – పంజాబ్
30. రుద్రసాగర్ సరస్సు – త్రిపుర
31. సమన్ పక్షి సంరక్షణ కేంద్రం – ఉత్తరప్రదేశ్
32. సమస్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం – ఉత్తరప్రదేశ్
33. సాంబర్ సరస్సు – రాజస్థాన్
34. సంది పక్షి సంరక్షణ కేంద్రం – ఉత్తరద్రేశ్
35. సర్సాయి నవర్ జీల్ – ఉత్తరప్రదేశ్
36. శస్తంకొట్ట సరస్సు – కేరళ
37. సురినసర్-మన్సర్ సరస్సులు – జమ్ముకశ్మీర్
38. సొమరిరి – లఢక్
39. అప్పర్ గంగా నది – ఉత్తరప్రదేశ్
40.వెంబానంద్ కోల్ చిత్తడి నేలలు – కేరళ
41. ఉలర్ సరస్సు – జమ్ముకశ్మీర్
42. సుందర్బన్ చిత్తడి నేలలు – పశ్చిమబెంగాల్
43. అసన్ బ్యారేజీ – ఉత్తరాఖండ్
44. కన్వర్ సరస్సు లేదా కబల్ టాల్ – బీహార్
45. లోనర్ సరస్సు – మహారాష్ట్ర
46. సుర్ సరోవర్ – ఉత్తరప్రదేశ్
47. సో కర్ చిత్తడి నేలల సమూహం – లఢక్
48. ఖిజాడియా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం – గుజరాత్
49. బఖిరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం – ఉత్తరప్రదేశ్
ప్రాక్టీస్ బిట్స్
1. తెలంగాణలో అధికంగా విస్తరించిన నేలలు?
1) నల్లరేగడి నేలలు 2) ఎర నేలలు
3) ఒండ్రు నేలలు 4) లాటరైట్ నేలలు
2. తెలంగాణలో తక్కువగా విస్తరించిన నేలలు?
1) నల్లరేగడి నేలలు 2) ఎర నేలలు
3) ఒండ్రు నేలలు 4) లాటరైట్ నేలలు
3. పత్తి సాగుకు అత్యంత అనుకూలమైన నేలలు?
1) నల్లరేగడి నేలలు 2) ఎర నేలలు
3) ఒండ్రు నేలలు 4) లాటరైట్ నేలలు
4. రాష్ట్ర విస్తీర్ణంలో నల్లరేగడి నేలల శాతం ఎంత?
1) 25 శాతం 2) 20 శాతం
3) 30 శాతం 4) 35 శాతం
5. నేలల స్వభావం గురించి వివరించే శాస్త్రం ఏది?
1) జియాలజీ 2) పెడాలజీ
3) లిథాలజీ 4) ఆర్నిథాలజీ
6. మృత్తిక ఏర్పడే ప్రక్రియను ఏమంటారు?
1) మినరోజెనిసిస్ 2) లిథోజెనిసిస్
3) పీడోజెనిసిస్ 4) క్రయోజెనిసిస్
7. జేగురు నేలలు అని వేటిని పిలుస్తారు?
1) నల్లరేగడి నేలలు 2) ఎర నేలలు
3) ఒండ్రు నేలలు 4) లాటరైట్ నేలలు
8. జలధాన శక్తి అధికంగా ఉండే నేలలు ఏవి?
1) ఎర నేలలు 2) ఒండు నేలలు
3) నల్లరేగడి నేలలు 4) లాటరైట్ నేలలు
9. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఎక్కడ ఉంది?
1) డెహ్రాడూన్ 2) హైదరాబాద్
3) నాగ్‌పూర్ 4)భోపాల్
10. కింది వాటిలో ఏ భూమికి అతి తక్కువ ఎరువులు అవసరం?
1) నల్లరేగడి మృత్తికలు
2) ఒండ్రు మృత్తికలు
3) ఎర మృత్తికలు
4) లాటరైట్ మృత్తికలు
11. కింది వాటిని జతపరచండి.
నేల పంటలు
ఎ. ఒండ్రు మట్టి 1. నూనె గింజలు
బి. ఎర మట్టి 2. గోధుమ, వరి
సి. నల్లమట్టి 3. తేయాకు,పోక చెక్క/వక్క
డి. లాటరైట్ మట్టి 4. పత్తి
1) ఎ-3, బి-2, సి-4, డి-1
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-2, బి-1, సి-4, డి-3
12. కింది వాటిలో సరికానిది ఏది?
1) లాటరైట్- ఆమ్ల నేలలు
2) నల్లరేగడి – క్షార నేలలు
3) చల్క – ఇసుకతో కూడిన నేలలు
4) దుబ్బ- కాల్షియం అధికంగా ఉన్న నేలలు
13. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. ఒండ్రు నేలలు- ఖమ్మం
బి. నల్లరేగడి నేలలు- నిజామాబాద్
సి. లాటరైట్ నేలలు- సంగారెడ్డి
డి. దుబ్బ నేలలు- రంగారెడ్డి
1) ఎ, బి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, డి
14. నల్ల మృత్తికల్లో తెలంగాణ అంతటా విస్తరించి ఉన్న మృత్తికలు ఏవి?
1) లోతైన నల్ల మృత్తికలు
2) మధ్యస్థ నల్ల మృత్తికలు
3) వర్గీకరించని నల్ల మృత్తికలు
4) పైవన్నీ
15. బంగ్లా పెంకు తయారీలో ఏ మట్టిని ఉపయోగిస్తారు?
1)లాటరైట్ 2) నల్లరేగడి
3) ఒండ్రు మట్టి 4) ఎర మట్టి
16. తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది?
1) వేప 2) రావి
3) జమ్మి 4) తంగేడు
17. భారతదేశ అటవీ విస్తీర్ణపరంగా తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
1) 9 2) 10 3) 11 4) 12
18. ప్రాంతీయ అటవీ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది?
1) కేసముద్రం (మహబూబాబాద్)
2) ధూళపల్లి (మేడ్చల్-మల్కాజిగిరి)
3) ములుగు (సిద్దిపేట)
4) లక్సెట్టిపేట (మంచిర్యాల)
19. రాష్ట్రంలో అధికంగా విస్తరించి ఉన్న అడవులు?
1) ఆర్థ, ఆకురాల్చు అడవులు
2) చిట్టడవులు
3) ముళ్ల పొదలు
4) అనార్థ, ఆకురాల్చు అడవులు
20. రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా?
1) ఆదిలాబాద్ 2) నల్గొండ
3) భద్రాద్రి కొత్తగూడెం
4) జోగులాంబ గద్వాల
సమాధానాలు
1. 2 2. 4 3. 1 4. 1 5. 2 6. 3 7. 4 8. 3 9. 4 10. 2 11. 4 12. 4 13. 3 14. 2 15. 1 16. 3
17. 4 18. 3 19. 4 20. 3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు