సమాచార సాధనం..తెలివితేటల నిలయం! ( పోటీ పరీక్షల ప్రత్యేకం)
మానవ శరీరంలోని అన్ని వ్యవస్థలకు జ్ఞాన సమాచారా న్ని చేరవేసేది నాడీవ్యవస్థ. మానవ నాడీవ్యవస్థ మెదడు, వెన్నుపాము, నాడులు అనే భాగాలుగా విభజించి ఉంటుంది. నాడీ వ్యవస్థ క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలైన నాడీ కణాలు శరీర అవయవాలను సమన్వయం చేస్తూ సమాచారాన్ని ఒకచోటు నుంచి మరోచోటుకు చేరవేస్తాయి. నాడీ వ్యవస్థ, అందులోని అంశాల గురించి తెలుసుకుందాం..
నాడీ వ్యవస్థ
నాడీకణం (న్యూరాన్)
#దేహంలోని అతిపొడవైన కణాలు నాడీ కణాలు.
#నాడీ కణానికి కణదేహం (సైటాన్), తంత్రికాక్షం (ఆక్సాన్)/నాడీ తంతువు ఉంటాయి.
# కణదేహంలో జీవ పదార్థం, కేంద్రకం, నిస్సల్ రేణువులు (రైబో న్యూక్లియో ప్రొటీన్లు) ఉంటాయి. కణదేహ ఉపరితలం నుంచి అనేక సన్నని తంతువులు ఏర్పడతాయి. వీటిని డెండ్రైట్లు అంటారు.
#కణదేహం నుంచి ఏర్పడిన తంత్రికాక్షం (నాడీ తంతువు) చాలా పొడవుగా ఉంటుంది. ఇది అంత్య తంతువులు/ టెలిడెండ్రైట్లతో అంతమవుతుంది.
#తంత్రికాక్షాన్ని ఆవరించి మైలిన్ అనే కొవ్వు పదార్థ కవచం (మైలినేటెడ్ నాడీ కణాల్లో మాత్రమే), దాన్ని ఆవరించి న్యూరిలెమ్మా లేదా ష్వాన్ తొడుగు ఉంటుంది. దీనిపై రాన్వియర్ కణుపులు ఉంటాయి.
#రెండు నాడీ కణాలు కలిసే సంధి భాగాన్ని (ఒక నాడీ కణం అంత్య తంతువులు, తరువాత నాడీ కణం డెండ్రైట్లు కలిసే భాగం) సైనాప్స్ అంటారు.
నాడీ కణాలు మూడు రకాలు
1. జ్ఞాన నాడీ కణాలు: జ్ఞానాంగాల నుంచి కేంద్ర నాడీ వ్యవస్థకు ప్రచోదనాలను ప్రసారం చేస్తాయి.
2. చాలక నాడీ కణాలు: కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి ప్రభావిత అంగాలకు ప్రచోదనాలను ప్రసారం చేస్తాయి.
3. మిశ్రమ నాడీ కణాలు: ఇవి జ్ఞాన, చాలక నాడులు చేసే రెండు విధులను నిర్వర్తిస్తాయి.
కేంద్ర నాడీ వ్యవస్థ (మెదడు, వెన్నుపాము)
మెదడు
#మెదడు పురెలోని కపాలంలో ఇమిడి ఉంటుంది. మెదడును ఆవరించి మూడు పొరలుంటాయి. వీటిని మెనింజస్ అంటారు. అవి వెలుపలి డ్యురామేటర్, మధ్యలోని అరాక్నాయిడ్ పొర, లోపలి పయామేటర్.
# మానవుడి మెదడు పరిమాణం సుమారు 1350 గ్రాములు.
# మస్తిష్కం ఉపరితలంపై అనేక ముడతలు ఉంటాయి. వీటని గైరీ అని, వాటి మధ్య గల గాడులను సల్సీ అని అంటారు.
# మధ్య మెదడులో నాలుగు దృష్టి లంబికలు ఉంటాయి. వీటిని కార్పోరా క్వాడ్రిజెమినా అంటారు.
వెన్నుపాము/ కశేరు నాడీదండం
#మధ్య మెదడు, పాన్స్ వెరోలీ, మజ్జాముఖాలను కలిపి మెదడు కాండం అంటారు.
#మెదడు మజ్జాముఖం పరభాగం వెన్నుపాముగా మారుతుంది.
# వెన్నెముకలోని నాడీ కుల్యలో వెన్నుపాము ఇమిడి ఉంటుంది.
# వెన్నుపాము అసంకల్పిత ప్రతీకార చర్యలను నియంత్రిస్తుంది.
పరధీయ నాడీ వ్యవస్థ
# మెదడు, వెన్నుపాములకు సంధించబడి ఉన్న నాడులన్నీ కలిసి పరధీయ నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది.
# మెదడుకు సంధించబడిన నాడులను కపాల నాడులు అని, వెన్నుపాముకు సంధించబడిన నాడులను వెన్నునాడులు లేదా కశేరు నాడులు అని అంటారు.
#మానవుడిలో 12 జతల కపాలనాడులు, 31 జతల వెన్నునాడులు ఉంటాయి.
# కపాల నాడుల్లో I, II, VIII జ్ఞాననాడులు కాగా, V, VII, IX, X మిశ్రమ నాడులు, మిగిలిన III, IV, VI, XI, XII నాడులు చాలక నాడులు.
# కశేరు నాడులు (వెన్నునాడులు) అన్నీ మిశ్రమ నాడులే. లంబార్, శాక్రల్, కాక్సిజియల్ నాడులు, వెన్నుపాము పరభాగం (అంత్యతంతువు)లను కలిపి కాడా ఈక్వైనా అంటారు.
మెదడు నిర్వర్తించే విధులు
మెదడు భాగం విధి/ విధులు
1. ఘ్రాణ లంబికలు వాసన గుర్తించడం
2. మస్తిష్కం జ్ఞాపకశక్తి, మేధాశక్తి, సంభాషణలు, నియంత్రిత చర్యలు
3. ద్వారగోర్ధం ద్రవాభిసరణ క్రమత, ఉష్ణోగ్రతా నియంత్రణ, దప్పిక, ఆకలి మొదలైనవి
4. దృష్టి లంబికలు దృష్టి, వినికిడి
5. అనుమస్తిష్కం వివిధ కండరాల సంకోచాలను సమన్వయపరిచి దేహాన్ని సమతాస్థితిలో ఉంచడం
6. పాన్స్ వెరోలీ శ్వాస కేంద్రం
7. మజ్జాముఖం అనియంత్రిత క్రియలైన హృదయ స్పందన, శ్వాసక్రియ మొదలైనవి
మెదడు
——-1———————————-2———————————-3———-
ముందు మెదడు(పురోగోర్ధం) మధ్య మెదడు (మధ్య గోర్ధం) వెనక మెదడు (పశ్చిమ గోర్ధం)
1———-2———–3—- 1 ————–2 1 —- ——-2———3
ఘ్రాణ లంబికలు-మస్తిష్కం-ద్వారగోర్ధం దృష్టి లంబికలు-క్రూరాసెరిబ్రై అనుమస్తిష్కం-పాన్స్వెరోలి- మజ్జాముఖం
ప్రాక్టీస్ బిట్స్
1. జ్ఞాపకశక్తి, నియంత్రిత కదలికలను నియంత్రించే మానవ మెదడు భాగం ఏది?
1) మస్తిష్కం 2) అనుమస్తిష్కం
3) మజ్జాముఖం 4) పాన్స్వెరోలీ
2. శ్వాసక్రియ, హృదయ స్పందన మొదలైన అనియంత్రిత క్రియలను నియంత్రించే మెదడు భాగం?
1) మస్తిష్కం 2) మజ్జాముఖం
3) అనుమస్తిష్కం 4) ఘ్రాణలంబికలు
3. కండరాల సంకోచాలను సమన్వయపరిచి సమతాస్థితిని సాధించే మెదడు భాగం?
1) అనుమస్తిష్కం 2) మస్తిష్కం
3) మజ్జాముఖం 4) క్రూరాసెరిబ్రై
4. మెదడు ఏ రూపంలో సంకేతాలు స్వీకరించి తిరిగి పంపుతూ ఉంటుంది?
1) విద్యుత్ 2) యాంత్రిక
3) రసాయనిక 4) అయస్కాంత
5. నాడీవ్యవస్థకు అవసరమైన మూలకం ఏది?
1) భాస్వరం 2) ఇనుము
3) సోడియం 4) మెగ్నీషియం
6. మానవ మెదడు పరిమాణం సుమారుగా ఎంత?
1) 2000 గ్రాములు 2) 1350 గ్రాములు
3) 1800 గ్రాములు 4) 2500 గ్రాములు
7. మానవ దేహంలో అతిపొడవైన కణం ఏది?
1) అండం 2) శుక్రకణం
3) నాడీకణం 4) తెల్ల రక్తకణం
8. నాడీ ప్రచోదనాలను ప్రసారం చేయడంలో పాత్ర వహించే ముఖ్యమైన అయానులు ఏవి?
1) Ca, Po4 2) N, Po4
3) Ca, Na 4) Na, K
9. సహానుభూత నాడీ తంతువుల అంత్య భాగాలు స్రవించేవి?
1) సింపతిన్ 2) కోలిన్ ఎస్టరేజ్
3) కార్టిసోన్ 4) ఎడ్రినలిన్
10. మానవ దేహంలో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం ఏది?
1) పీనియల్ దేహం
2) హైపోథలామస్
3) అవటు గ్రంథి
4) పీయూష గ్రంథి
11. మెదడులోని మెమరీ హౌస్ ఏది?
1) మజ్జాముఖం 2) మస్తిష్కం
3) అనుమస్తిష్కం 4) పాన్స్వేరోలీ
12. రాన్వియర్ కణుపులు, నిస్సల్ రేణువులు ఏ కణాల ప్రత్యేకత?
1) కాలేయ కణాలు 2) కండర కణాలు
3) మూత్రపిండ కణాలు
4) నాడీ కణాలు
13. మెనింజైటిస్ అనేది దేనికి సంబంధించిన వ్యాధి?
1) కాలేయం 2) క్లోమం
3) ఊపిరితిత్తులు 4) మెదడు
14. కింది వాటిని జతపరచండి.
A. ఘ్రాణ లంబికలు 1. సమతాస్థితి
B. ద్వారాగోర్థం 2. హృదయ స్పందన
C. అనుమస్తిష్కం 3. దృష్టి
D. మజ్జాముఖం 4. ద్రవాభిసరణ క్రమత
5. వాసన
1) A-5, B-4, C-1, 4-D
2) A-5, B-1, C-4, D-2
3) A-5, B-4, C-2, D-1
4) A-1, B-2, C-3, D-4
15. అసంకల్పిత ప్రతీకార చర్యలను నియంత్రించేది ఏది?
1) దృష్టి లంబికలు 2) ఘ్రాణ లంబికలు
3) అనుమస్తిష్కం 4) వెన్నుపాము
16. మానవుడిలోని కపాల నాడుల సంఖ్య ఎంత?
1) 10 జతలు 2) 8 జతలు
3) 16 జతలు 4) 12 జతలు
17. మానవుడిలోని కశేరునాడుల సంఖ్య ఎంత?
1) 12 జతలు 2) 31 జతలు
3) 35 జతలు 4) 10 జతలు
18. మానవుడి కశేరునాడుల స్వభావం?
1) జ్ఞాన 2) చాలక
3) మిశ్రమ 4) ఏదీకాదు
19. మానవ కపాలనాడుల్లో జ్ఞాననాడులు ఏవి?
1) I, II, VIII
2) V, VII, IX
3) III, IV, VI
4) I, III, V
20. అంత్య తంతువు అంటే?
1) మెదడు చివరి భాగం
2) మెదడు కాండం
3) వెన్నుపాము చివరి భాగం
4) వెన్నెముక చివరి భాగం
21. కశేరునాడులు, కపాలనాడులను కలిపి ఏ వ్యవస్థగా పేర్కొంటారు?
1) కేంద్ర నాడీ వ్యవస్థ
2) పరధీయ నాడీ వ్యవస్థ
3) సహానుభూత నాడీ వ్యవస్థ
4) సహసహానుభూత నాడీ వ్యవస్థ
22. దేహ ఉష్ణోగ్రతను నియంత్రించేది?
1) గుండె
2) చర్మస్రావ గ్రంథులు
3) హర్డీరియన్ గ్రంథులు
4) స్వేద గ్రంథులు
23. అయోడాప్సిన్ ఏ నిర్మాణాల్లో ఉంటుంది?
1) దండాలు 2) శంకువులు
3) స్ల్కీరా 4) కంటి కటకం
సమాధానాలు
1. 2 2. 2 3. 1 4. 3 5. 3 6. 2 7. 3 8. 4 9. 1 10. 2 11. 2 12. 4 13. 4 14. 1 15. 4 16. 4
17. 2 18. 3 19. 1 20. 3 21. 2 22. 4 23. 2
తెలుగు అకాడమీ సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?