ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్‌పర్సన్‌గా నియమితులైన తొలి మహిళ ? (వార్తల్లో వ్యక్తులు) 22-06-2022
జెన్నిఫర్ లార్సన్
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కాన్సుల్ జనరల్‌గా జెన్నిఫర్ లార్సన్ జూన్ 14న నియమితులయ్యారు.

ఆమె గతంలో భారత్ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా, ముంబైలోని అమెరికా కాన్సులేట్ జనరల్ ఆఫీస్ లో డిప్యూటీ ప్రిన్సిపల్ ఆఫీసర్‌గా పనిచేశారు.
రబాబ్ ఫాతిమా

ఐక్యరాజ్యసమితిలో బంగ్లాదేశ్ శాశ్వత ప్రతినిధి రాయబారి రబాబ్ ఫాతిమా ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ జనరల్‌గా జూన్ 12న నియమితులయ్యారు. ఈ పదవికి బంగ్లాదేశ్ నుంచి నియమితులైన మొదటి మహిళా దౌత్యవేత్త.
వీఎస్కే కౌముది

కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ సెక్రటరీ (సెక్యూరిటీ)గా వీఎస్కే కౌముది జూన్ 13న నియమితులయ్యారు. ఈయన 1986 బ్యాచ్ ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి.
ప్రమోద్ మిట్టల్

సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) కొత్త చైర్మన్‌గా ప్రమోద్ కే మిట్టల్ జూన్ 14న నియమితులయ్యారు. ఈయన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.
ఆరతి ప్రభాకర్

అమెరికాలోని వైట్‌హౌస్ ‘ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ (ఓఎస్టీపీ)’ హెడ్‌గా భారత సంతతి వ్యక్తి ఆరతి ప్రభాకర్‌ను అధ్యక్షుడు జో బైడెన్ జూన్ 15న నామినేట్ చేశారు. ఆమె గతంలో బిల్ క్లింటన్ ప్రభుత్వంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఎస్టీ)కి నాయకత్వం వహించారు. బరాక్ ఒబా మా ప్రభుత్వంలో డిఫెన్స్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ (డార్పా)లో పనిచేశారు. ఓఎస్టీపీ అధిపతిగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా రికార్డులకెక్కనున్నారు.
గోపీచంద్ నారంగ్

ప్రముఖ ఉర్దూ రచయిత, సాహిత్య విమర్శకుడు గోపీచంద్ నారంగ్ జూన్ 15న మరణించారు. సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో పద్మభూషణ్ అందుకున్నారు.
రాధా అయ్యంగార్

అమెరికా రక్షణ శాఖ ఉప సహాయ మంత్రిగా భారత సంతతి వ్యక్తి రాధా అయ్యంగార్ ప్లంబ్‌ను అధ్యక్షుడు జో బైడెన్ జూన్ 15న నామినేట్ చేశారు. ఆమె ప్రస్తుతం చీఫ్ ఆఫ్ స్టాఫ్ టు ది డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
జస్టిస్ రంజనా దేశాయ్

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్‌పర్సన్‌గా జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌ను నియమిస్తూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జూన్ 17న ఉత్తర్వులు జారీచేసింది. ఈమె సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ పదవిలో నియమితులైన తొలి మహిళ.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






