వార్తల్లో వ్యక్తులు 15-06-2022
బజ్రమ్ బేగాజ్
అల్బేనియా దేశ 8వ అధ్యక్షుడిగా బజ్రమ్ బేగాజ్ సోషలిస్ట్ పార్టీ తరఫున జూన్ 4న ఎన్నికయ్యారు. 140 పార్లమెంట్ సీట్లలో బేగాజ్కు అనుకూలంగా 78, వ్యతిరేకంగా 4 ఓట్లు వేశారు. ఆయన ప్రస్తుతం అల్బేనియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (ఏఏ ఎఫ్) చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. అల్బేనియా రాజధాని టిరానా. కరెన్సీ అల్బేనియన్ లెక్. ప్రధాని ఈది రామ.
ధోని
డ్రోన్ యాజ్ ఏ సర్వీస్ ప్రొవైడర్ (డీఏఏఎస్) అయిన చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్‌కు మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా జూన్ 5న నియమితులయ్యారు. ఈ సంస్థలో ధోని పెట్టుబడులు కూడా పెట్టాడు. గరుడ ఏరోస్పేస్ను 2015లో స్థాపించారు. దీని వ్యవస్థాపకుడు, సీఈవో అగ్నీశ్వర్ జయప్రకాష్.
సతీష్ పాయ్
ఇంటర్నేషనల్ అల్యూమినియం ఇన్స్టిట్యూట్ (ఐఏఐ) కొత్త చైర్మన్‌గా సతీష్ పాయ్ జూన్ 6న నియమితులయ్యారు. ఈయన హిందాల్కో ఎండీగా పనిచేస్తున్నారు. అల్యూమినియం పరిశ్రమల స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం, డిమాండ్‌కు తగ్గట్టు అల్యూమినియం ఉత్పత్తులను పెంచడం ఐఏఐ లక్ష్యం.
అలోక్ కుమార్ చౌదరి
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా అలోక్ కుమార్ చౌదరిని కేంద్ర ప్రభుత్వం జూన్ 7న నియమించింది. ఈయన ఎస్బీఐలో 1987లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఎస్బీఐని 1955, జూలై 1న స్థాపించారు. ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?