రాష్ట్రంలో జాతీయ పరిశోధనా సంస్థలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ (NIN)
-1919లో ప్రారంభమైన ఎన్ఐఎన్ ICMR ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. మెటెర్నల్ అండ్ చైల్డ్ న్యూట్రీ షన్ డైట్, మైక్రో న్యూట్రీషన్, న్యూట్రీషనల్ బయోకెమిస్ట్రీలపై పరిశోధనలు నిర్వహిస్తుంది. National Nutrition Monitoring Bureau (NNMB) ఆధ్వర్యంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో అప్లయిడ్ న్యూట్రీషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
CDFD
-సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నస్టిక్స్ (CDFD)ను 1990లో స్థాపించారు. స్వతంత్ర ప్రతిపత్తి గల ఈ సంస్థ DBT ఆధ్వర్యంలో, MS & T పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఇది బ్యాక్టీరియల్ జెనెటిక్స్, మాలిక్యులర్ ఆంకాలజీ, క్రోమాటిన్ బయాలజీ ఎఫిజెనిటిక్స్, కంప్యూటేషనల్ ఫంక్షనల్ జీనోమిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్ మీద పరిశోధనలు నిర్వహిస్తుంది.
CCMB
-సెంటర్ ఫర్ సెల్యూలర్ మాలిక్యులర్ బయాలజీ (CCMB)ని 1977లో CSIR ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో స్థాపించారు. DNA Micro Array, Transgenic Technology, Bio informatics, Spectroscopy, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెసోనెన్సింగ్లపై పరిశోధనలు నిర్వహిస్తుంది. ఆధునిక జీవశాస్త్ర రంగాల్లో పరిశోధనలు నిర్వహిస్తుంది.
LaCONES
-అంతరించిపోయే ప్రమాదం ఉన్న జీవ జాతుల సంరక్షణకు చర్యలుచేపట్టే Laboratory for the Conservation of Endagered species (LaCONES)ను 1998లో ప్రారంభించారు. దీన్ని సీసీఎంబీ ఆధ్వర్యంలో అత్తాపూర్‌లో ఏర్పాటు చేశారు.
IICT
-ఇది CSIR ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీన్ని 1983లో స్థాపించారు. అప్లయిడ్ కెమిస్త్రీ, బయోకెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్, పాలీమర్స్, ఆర్గానిక్ కోటింగ్స్, డ్రగ్స్, పెస్టిసైడ్స్ అన్ని రకాల రసాయనిక అణువులపై పరిశోధనలు నిర్వహిస్తుంది.
నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ
-ఇది సికింద్రాబాద్‌లోని హకీంపేట్‌లో ఉంది. భారీ పరిశ్రమలకు సెక్యూరిటీ నిర్వహణ, విపత్తు నిర్వహణలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. CISFకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. దీనిని 1990లో స్థాపించారు.
NIFT
-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)ని కేంద్ర ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1986లో ప్రారంభించారు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో, వస్త్రాలంకరణలో సర్టిఫికెట్ కోర్సులను అందిస్తుంది.
SVPNPA
-సర్దార్ వల్లభబాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)ని 1948లో స్థాపించారు. ఇది దేశంలో IPSలకు శిక్షణను ఇస్తున్న ఒకే ఒక్క జాతీయ సంస్థ. ఇది కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రస్తుతం దీని డైరెక్టర్ జనరల్ అరుణబహుగుణ.
NICMAR
-1984లో స్థాపించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (NICMAR) సంస్థ నిర్మాణ రంగంలో, ప్రాజెక్టుల నిర్మాణంలో రియల్ ఎస్టేట్స్‌లో, అనేక మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పీజీ కోర్సులను, అనేక ప్రాజెక్టు ఇంజినీరింగ్, మేనేజ్మెంట్లలో శిక్షణ కార్యక్రమాలు సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నది.
C-DAC
-సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) సెంటర్‌ను 1999లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. నూతన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ టెక్నాలజీల్లో పరిశోధన అభివృద్ధి e-security, cyber security & cyber forensics, health informatics, e-learning, ICT for Rural developmentల్లో, R& Dలలో కృషి చేస్తుంది.
కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ (CDM)
-దీనిని 1970లో సైనిక్‌పురి (సికింద్రాబాద్)లో ఏర్పాటు చేశారు. భారతదేశ భద్రతా బలగాలు, సైన్యానికి చెందిన మేనేజ్మెంట్ స్కిల్స్, నాయకత్వ లక్షణాల పెంపుకోసం CDM కృషిచేస్తుంది. ఇది ఆసియాలో ఆర్మ్డ్ ఫోర్సెస్‌కు మేనేజ్మెంట్ రంగంలో శిక్షణను అందించే ఏకైక కాలేజ్.
NFDB
-National Fishery Development Board (NFDB)ను 2006లో ఏర్పాటుచేశారు. ఇది ఫిషరీస్, ఆక్వాకల్చర్ అభివృద్ధికి కృషి చేస్తుంది. భారతదేశ నీలి విప్లవం అభివృద్ధికి ఇది కీలకం. చేపల ఉత్పత్తిని 6.4 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 10.57మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తికి చేర్చడం దీని లక్ష్యం.
ICAR ఆధ్వర్యంలోని సంస్థలు
CRIDA
-దీనిని 1985లో ఏర్పాటు చేశారు. ఇది ICAR ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మెట్టప్రాంతాల వ్యవసాయంపై, ఆగ్రోమెట్రాలజీ, రెయిన్‌ఫెడ్ వ్యవసాయంపై, NICRA (National Initiative on Climate Resilient Agriculture)పై పరిశోధనలు నిర్వహిస్తుంది.
డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (DRR)
-1965లో హైదరాబాద్‌లో ప్రారంభమైన DRR ICAR ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది దేశంలో వరి ఉత్పాదనను పెంచడానికి, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరగగల వరి వంగడాల ఉత్పత్తిపై కృషిచేస్తుంది. దేశ ప్రజల ముఖ్య ఆహారం వరి కాబట్టి ఆహార, పోషకాహార భద్రతపై DRR కీలక పరిశోధనలు నిర్వహిస్తుంది.
MANAGE
-ఇది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీనిని 1987లో స్థాపించారు. అగ్రి క్లీనిక్స్, అగ్రిబిజినెస్ సెంటర్లను, PGDAEM కోర్సులను, ICT Agricultureను, క్షేత్రస్థాయిలో సుస్థిర వ్యవసాయాభివృద్ధిపై పరిశోధనలు నిర్వహిస్తుంది. అగ్రికల్చర్ ఎకానమీపై, మేనేజీరియల్, ఎక్సోటెన్షనల్ స్కిల్స్‌ను, వ్యవసాయాధికారులను అందిస్తున్నది.
DSR
-Directorate of Sorghum Researchను ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో స్థాపించారు. ఇది స్వీట్ జొన్నపై పరిశోధన, సీడ్ టెక్నాలజీ, జొన్న పాథాలజీపై పరిశోధనలు నిర్వహిస్తుంది.
నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్
-దీనిని 1999 హైదరాబాద్‌లో ICAR స్థాపించింది. ఇది పశుసంపద, మేకలు, గొర్రెలు వంటి మాంసం ఇచ్చేజంతువులపై పరిశోధనకు, నాణ్యమైన మాంసం ఉత్పత్తికోసం పరిశోధనలు వెటర్నరీ, యానిమల్ హజ్బెండరీ రంగాలపై పరిశోధనలు నిర్వహిస్తుంది.
NAARM
-ICAR ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (NAARM)ను 1976లో ఏర్పాటు చేశారు. ఇది వ్యవసాయ పరిశోధనలు, విద్యా మేనేజ్మెంటుల్లో, అగ్రిబిజినెస్ పబ్లిక్ పాలసీలను, NAS(National Agricultural System)ను రూపొందిస్తుంది. PGDMA, PGDTMA కోర్సులను అందిస్తుంది.
DOR
-డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ (DOR)ను 1977లో రాజేంద్రనగర్‌లో స్థాపించారు. క్యాస్టర్, safflo -wer, sunflower, లిన్సీడ్, వేరుశనగ, ర్యాప్సిడ్ మస్టర్, సోయాబీన్ వంటి నూనె పంటలపై పరిశోధనలు నిర్వహిస్తుంది.
DPR
-డైరెక్టరేట్ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ (DPR)ను 1988లో హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. వాణిజ్య, గ్రామీణ పౌల్ట్రీ ఉత్పత్తులపై పరిశోధనలు నిర్వహిస్తుంది. గ్రామప్రియ, వనరాజ వంటి సంకర కోళ్లను అభివృద్ధి చేసింది.
NMDC
-నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) 1958లో స్థాపించారు. దీనిని కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. ఇది దేశంలోని ఖనిజవనరులు ముడి ఇనుము, రాగి, డోలమైట్, టంగ్స్టన్ వంటి ఖనిజాలను వెలికితీయడానికి, ముడి ఖనిజాలను వేరు చేయడానికి కావల్సిన సాంకేతిక సహాయాన్ని, ఖనిజవనరులపై పరిశోధనా కార్యక్రమాలు చేపడుతుంది.
DRDO
-డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రక్షణ మంత్రిత్వ శాఖ విభాగంలో పనిచేస్తుంది. ఇది ప్రపంచ స్థాయి ఆయుధాల తయారీలో, దేశీయ పరిజ్ఞానం ద్వారా సైన్యానికి కావల్సిన ఆయుధ సంపత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి సాంకేతికతను సహాయాన్ని అందిస్తుంది. దీనిని 1958ఏర్పాటు చేశారు.
CITD
-1968 లో UNDP, ILO సహకారంతో బాలానగర్ (హైదరాబాద్)లో స్థాపించారు. MSME ల్లో పనిచేసే కార్మికులకు పారిశ్రామిక శిక్షణ కార్యక్రమాలను రూపొందించి అమలు పరుస్తుంది. Central Institute of Tool Design టూల్స్ డిజైన్, మెకట్రానిక్స్ మీద శిక్షణ, సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది.
రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI)
-DRDO ఆధ్వర్యంలోని ప్రముఖ ల్యాబొరేటరీ. 1988లో కాంచన్ బాగ్ (హైదరాబాద్)లో స్థాపించారు. క్షిపణి వ్యవస్థల రూపక్పన, అభివృద్ధి, క్షిపణి ఏవియోనిక్స్లో పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది.
నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI)
-దీనిని CSIR ఆధ్వర్యంలో 1961లో స్థాపించారు. ఇది భూగర్భ శాస్త్రాల్లో భూ అంతర్భాగం నిర్మాణాలపై పరిశోధనలు, సెస్మాలజీ, జియోడైనమిక్స్, జియోక్రోనాలజీ మినరల్స్, ఇంజినీరింగ్, జియో ఫిజిక్స్‌ల్లో పరిశోధనలు నిర్వహిస్తుంది.
INCOIS
-సముద్ర ఉపరితల వాతావరణ పరిస్థితుల అధ్యయనం కోసం ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS)ను 1999లో ఏర్పాటు చేశారు. ఇది కేంద్ర భూ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయింది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాల్లో ఏర్పడే తుపాన్లు, సునామీలపై అధ్యయనం చేసి IMO ఆధ్వర్యంలో హెచ్చరికలు జారీ చేస్తుంది.
NIRDPR
-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR)ను 1964లో రాజేంద్రనగర్‌లో స్థాపించారు. ఇది కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. PGDRMలో కోర్సులను అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
TIFR
8 టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR)ను 2010 లో హైదరాబాద్‌లో స్థాపిం చారు. భౌతిక, రసాయన శాస్ర్తాల్లో, బయాలజీలో పరిశోధనలు నిర్వహిస్తుంది. (బాంబే, హైదరాబాద్, బెంగళూరు)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?