-స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్ర రాజ్యం అనే అంశాలను ఫ్రెంచి రాజ్యాంగం నుంచి స్వీకరించారు.
-సాంఘిక ఆర్థిక, రాజకీయ న్యాయం అనే అంశాలు రష్యా రాజ్యాంగం నుంచి స్వీకరించాం.
స్వేచ్ఛ: స్వేచ్ఛ అనగా ఇతరుల స్వేచ్ఛకు ఇబ్బంది కలుగకుండా తనకు నచ్చిన విధంగా వ్యవహరించడం.
-స్వేచ్ఛ అంటే ఎలాంటి పరిమితులు లేకుండా, నిర్బంధం లేకుండా సంపూర్ణంగా వ్యక్తి వికాసానికి అవసరమైన పరిస్థితులు కల్పించడం.
-ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించడానికి భారత రాజ్యాం గం అవకాశం కల్పిస్తుంది. ప్రతి భారతీయ పౌరుడి ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసం, ఆరాధనలో స్వతంత్రంగా వ్యవహరించడమే స్వేచ్ఛ.
ఉదా॥ రాజకీయ స్వేచ్ఛ, జాతీయ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, కుటుంబ స్వేచ్ఛ.
సమానత్వం: ప్రతి భారతీయ పౌరుడికి రాజ్యాంగం ద్వారా ఎలాంటి విచక్షణలు లేకుండా, ప్రతి వ్యక్తి తనకు తాను సంపూర్ణ అభివృద్ధి సాధించడానికి అవకాశం కల్పించడం.
సౌభ్రాతృత్వం (fraternity): సౌభ్రాతృత్వం అంటే సోదరభావం అని, సమాన హోదా అని అర్థం. ప్రజల మధ్య పరస్పర గౌరవం ఉన్నప్పు డు, ద్వేషం, అసూయ లేనప్పుడు సోదరభావం పెంపొందుతుంది.
– సౌభ్రాతృత్వం అనే పదం రాజ్యాంగంలో చేర్చాలని డా. బీఆర్. అంబేద్కర్ ప్రతిపాదించాడు.
న్యాయం: వివక్షత లేని మంచి సమాజాన్ని నిర్మించడం కోసం ఈ పదాన్ని ప్రవేశికలో పొందుపర్చారు.
న్యాయాన్ని మూడు విధాలుగా విభజించారు. అవి..
-ఎ) సామాజిక న్యాయం: సమాజంలో పౌరులందరూ సమానులే అని అర్థం. జాతి, కుల, మత, లింగ ప్రాంతీయ విచక్షణ లేకుండా అందరికీ సమాన హోదా, గౌరవం లభించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, మైనారిటీలు, వికలాంగులకు సమాన అవకాశాలు కల్పించాలి.
-బి) ఆర్థిక న్యాయం: స్త్రీ- పురుషులందరికీ ఎలాంటి వ్యత్యాసం లేకుండా సమానమైన పనికి సమానమై వేతనం కల్పించాలి. ఆర్థిక అసమానతలు తొలగించి జాతీయ సంపద, ఉత్పత్తి పంపిణీలో సమాన అవశాలు కల్పిస్తూ పేదరిక నిర్మూలన కోసం కృషిచేయడం.
-సి) రాజకీయ న్యాయం: భారతీయ పౌరులందరికీ ఏ విధమైన జాతి, కుల, మత, లింగ విచక్షణలు లేకుండా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేవిధంగా అవకాశం కల్పించడం.
-ఉదా॥ ఎన్నికల్లో పోటీచేయడం, ఓటును వినియోగించుకోవడం, ప్రభుత్వ పదవులను పొందడం.
సమగ్రత లేదా ఏకత(Integrity): భారతదేశ ప్రజలందరిలో జాతీయ సమైక్యత అనే భావన పెంపొందించడానికి సమగ్రత అనే పదం 1976 సంవత్సరంలో 42వ రాజ్యాం గ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు.
-దేశంలో విభిన్న మతాలు, కులాలు, భాషలు ప్రాంతాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలందరూ ఒకటనే భావన పెంపొందిండటం.
-మనది భారత జాతి, మనమందరం భారతీయులమనే భావన కల్పించడం. భిన్నత్వంలో ఏకత్వం సాధించడమే ముఖ్య ఆశయం.
ప్రవేశిక ప్రాధాన్యత – ప్రముఖుల వ్యాఖ్యానాలు
-ప్రవేశిక రాజ్యాంగ మౌలిక లక్షణాల సారం అంటారు.
-రాజ్యాంగ ప్రవేశిక సూచనాత్మకమైనది. కానీ దానికి చట్టబద్ధత లేదు. న్యాయబద్ధత లేదు.
-భారతరాజ్యాంగానికి అవతారిక సారాంశం వంటిది
– మశేల్కర్
-ప్రవేశిక రాజ్యాంగానికి గుర్తింపు పత్రం
– ఎంఏ నానిపాల్కివాలా
-ప్రవేశిక Political Hero Scope – కేఎం మున్షీ
-ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మవంటిదని, తాళం చెవి లాంటిది, బంగారు ఆభరణం లాంటిది – ఠాగూర్దాస్ బార్గవ
-ప్రవేశిక అధికారానికి మూలం ప్రజలు అని, సార్వభౌమాధికారానికి మూలం ప్రజలు అని తెలియజేస్తుంది.
-ప్రవేశిక భారత ప్రభుత్వ స్వరూపం అనగా సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం అని, భారత రాజకీయ వ్యవస్థ లక్షణాలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృ త్వం అనే అంశాలతోపాటు రాజ్యాం గం అమలులోనికి వచ్చిన తేదీ గురిం చి అంటే 1949 నవంబర్ 26 అని తెలియజేస్తుంది.
ప్రవేశిక రాజ్యాంగంలో భాగమా? కాదా?..
-మొదట ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పరిగణించలేదు.కాలక్రమంలో సుప్రీంకోర్టు తీర్పులు రాజ్యాంగంలో భాగం అని, ప్రవేశిక పవిత్రమైన ఆంశం అని ప్రకటించాయి.
-ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని రాజ్యాంగ పరిషత్ సభ్యుడు మహావీర్త్యాగి పేర్కొన్నాడు.
-1960 సంవత్సరంలో సుప్రీంకోర్టు బెరుబెరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు ప్రకటిస్తూ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని ప్రకటించింది.
-1967 సంవత్సరంలో గోలక్‌నాథ్ వర్సెస్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని ప్రకటించింది.
-1973 సంవత్సరంలో సుప్రీంకోర్టులో కేశవానంద భారతి వర్సెస్ కేరళ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని ఈ కేసు తీర్పులో ప్రధాన న్యాయమూర్తి ఎన్.ఎం.సిక్రీ ప్రవేశికను అత్యంత పవిత్రమైన అంశం అని ప్రవేశికను భూమిక అని పేర్కొన్నారు.
-1980 సంవత్సరంలో మినర్వామిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు పీఠికను రాజ్యాంగంలో భాగం అని, సామ్యవాదానికి నిర్వచనం అని ప్రకటించింది.
-1994 సంవత్సరంలో ఎస్ఆర్ బొమ్మయ్ వర్సెస్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు లౌకికతత్వం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుందని ప్రకటించింది.
-1995 సంవత్సరంలో సుప్రీంకోర్టు LIC of India కేసులో ప్రవేశికను రాజ్యాంగంలో సమైక్య భాగం అని ప్రకటించింది.