ఆహార భద్రతా చట్టం ప్రవేశపెట్టిన సంవత్సరం? (పోటీ పరీక్షల ప్రత్యేకం)
1. సుస్థిరాభివృద్ధి నివేదిక -2021 ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 165లో భారతదేశం పొందిన ర్యాంకు?
1) 131 2) 120
3) 110 4) 67
2. ప్రకృతి, సహజ వనరుల రక్షణకు సంబంధించిన అంతర్జాతీయ సంఘం ప్రపంచ వ్యాప్తంగా సుస్థిరాభివృద్ధి భావనను ఎప్పుడు తెలియజేసింది?
1) 1980 2) 1981
3) 1982 4) 1983
3. ‘మన ఉమ్మడి భవిష్యత్తు’ (our common Future) నివేదిక ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1985 2) 1986
3) 1987 4) 1988
4. ‘ప్రస్తుత ప్రజల కనీస అవసరాలను తీరుస్తూ, భవిష్యత్ తరాల వారికి వనరులను మిగిల్చే విధంగా వాటిని వివేకవంతంగా వినియోగిం చుకోవడం ద్వారా సాధించే అభివృద్ధి సుస్థి రాభివృద్ధి’ అని ఎవరు నిర్వచించారు?
1) ఎర్నెస్ట్ హెకెల్ 2) బ్రంట్‌ల్యాండ్
3) మిశ్రా 4) క్రెబ్స్
5. ‘ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకుంటూనే భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని మరింతగా మెరుగుపరచటమే సుస్థిరాభి
వృద్ధి’ అని ఎవరు భావించారు?
1) మైఖేల్ థామస్ నీథం
2) బ్రంట్‌ల్యాండ్
3) మైఖేల్ మాథ్యూస్
4) రాబర్ట్ వాట్సన్
6. సుస్థిరాభివృద్ధి అనేది వేటి కలయిక?
1) పర్యావరణం
2) ఆర్థిక వ్యవస్థ
3) సమాజం, పరిపాలన
4) పైవన్నీ
7. ఐక్యరాజ్యసమితి ఏ దశాబ్దాన్ని ‘సుస్థిరాభివృ ద్ధికోసం విద్య’ (Decade of Education for Sustainable Development)గా ప్రకటించింది?
1) 2000-2010 2) 2005-2015
3) 2004-2014 4) 2010-2020
8. 1990లో సుస్థిరాభివృద్ధి మూడు నియమా లను తెలియజేసిన వారు?
1) డాలీ 2) బ్రంట్‌ల్యాండ్
3) రాల్ఫ్ రూక్వుడ్ 4) రాబర్ట్వాట్సన్
9. 1992లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన ‘పర్యావరణం అభివృద్ధి’ సదస్సులో సుస్థిరాభివృద్ధికి సంబంధించి ఎన్ని నియమాలను రూపొందించారు?
1) 30 2) 29 3) 28 4) 27
10. ‘సుస్థిరాభివృద్ధి’ అనే భావనను ఆమోదిం చిన సంవత్సరం?
1) 1986 2) 1987
3) 1988 4) 1989
11. 1990 నుంచి ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదల ఎన్ని రెట్లు పెరిగింది?
1) 56 2) 46
3) 36 4) 26
12. 2000వ సంవత్సరంలో సెప్టెంబర్ 6-8 తేదీల మధ్య ‘సహస్రాభివృద్ధి లక్ష్యాలు’ అనే సదస్సు ఎక్కడ జరిగింది?
1) న్యూయార్క్ 2) శాన్ఫ్రాన్సిస్కో
3) వియత్నాం 4) నార్వే
13. ‘సహస్రాభివృద్ధి లక్ష్యాలు’ సదస్సులో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి?
1) 175 2) 103
3) 189 4) 190
14. ‘ఎజెండా 2030’ అని దేన్ని పిలుస్తారు?
1) సహస్రాభివృద్ధి లక్ష్యాలు
2) UNO సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు
3) ఐక్యరాజ్య సమితి అభివృద్ధి లక్ష్యాలు
4) పర్యావరణాభివృద్ధి లక్ష్యాలు
15. 2015, సెప్టెంబర్ 25న న్యూయార్క్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో సహస్రాభివృద్ధి లక్ష్యాల స్థానంలో వేటిని ప్రవేశపెట్టారు?
1) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు
2) అభివృద్ధి లక్ష్యాలు
3) పర్యావరణాభివృద్ధి లక్ష్యాలు
4) ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు
16. 2015-2030 మధ్య ప్రపంచదేశాలు సాధించాల్సిన లక్ష్యాలను ఏ పేరుతో విడుదల చేశారు?
1) డెవలప్మెంట్ అండ్ సస్టెయిన్‌బిలిటీ
2) ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్ 2015-2030 ఫర్ డెవలప్మెంట్
3) ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్-ది 2030 అజెండా ఫర్ సస్టెయిన్‌బుల్ డెవలప్మెంట్
4) ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్-2030 ఎజెండా
17.‘Transforming our world-the 2030 Agenda for Sustainable Development’లో భాగంగా ఎన్ని లక్ష్యాలను, ఉద్దేశాలను UNO సాధారణ సభ ఆమోదించింది?
1) 17 లక్ష్యాలు, 170 ఉద్దేశాలు
2) 17 లక్ష్యాలు, 150 ఉద్దేశాలు
3) 17 లక్ష్యాలు, 160 ఉద్దేశాలు
4) 17 లక్ష్యాలు, 169 ఉద్దేశాలు
18. 2013లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల రూపకల్పనలో భాగంగా 30 మంది సభ్యులతో ఏర్పాటైన కమిటీ ఏది?
1) Open Market Group (OMG)
2) Open Development Group (ODG)
3) Open Working Group (OWG)
4) Total Working Group (TWG)
19. UNO సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ఏ సంవత్సరం నాటికి ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించాలి?
1) 2020 2) 2025
3) 2028 4) 2030
20. దేశంలో సాంఘిక భద్రతను అందించేందుకు 2015, మే 9న ప్రవేశపెట్టిన పథకాలు?
1) అటల్ పెన్షన్ యోజన
2) ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన
3) వనబంధూ కళ్యాణ యోజన
4) పైవన్నీ
21. కింది వాటిలో 2015-30 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ?
1) పేదరికాన్ని రూపుమాపడం
2) ఆకలిని రూపుమాపడం, లింగసమాత్వాన్ని సాధించడం
3) దేశాల మధ్య, దేశీయంగానూ అసమానతలను తగ్గించడం 4) పైవన్నీ
22. ఆహార భద్రతా చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
1) 2012 2) 2013
3) 2014 4) 2015
23. ఏ సంవత్సరంలో ‘జాతీయ ఆహార భద్రతామిషన్’ను ఏర్పాటుచేశారు?
1) 2009 2) 2008
3) 2007 4) 2006
24. సుస్థిరాభివృద్ధికి సంబంధించిన అంశాలను పరిశీలించండి?
ఎ. వనరులను వాటి పునరుత్పాదక శక్తికి మించి వినియోగించరాదు
బి. పర్యావరణం విలీనం చేసుకోగలిగిన సామర్ధ్యం కంటే ఎక్కువ పరిమాణంలో కాలుష్య పదార్థాలను పర్యావరణంలోకి విసర్జించరాదు
సి. పునరుత్పత్తి చెందని ఇంధన వనరుల స్థానంలో పునరుత్పత్తి చెందేటటువంటి కాలుష్యరహితమైన ఇంధన వనరులను వినియోగించాలి
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) ఎ 4) సి
25. ఏ రంగంలో వృద్ధి పెంచేందుకు ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టారు?
1) సాంకేతిక రంగం 2) ప్రభుత్వ రంగం
3) ప్రైవేటు రంగం 4) వ్యవసాయ రంగం
26. 1998లో వ్యవసాయానికి సంబంధించి ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు?
1) కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్
2) క్రెడిట్ కార్డ్ స్కీమ్
3) విత్తన పథకం
4) ఎరువుల పథకం
27.‘జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని’ ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు?
1) 1998-1999 2) 1999-2000
3) 2000-2001 4) 2001-2002
28. నీటి సంరక్షణకు, కొనసాగించదగిన వ్యవసాయాభివృద్ధికి ఏ పథకాన్ని ప్రవేశ-పెట్టారు?
1) సాయిల్ హెల్త్ కార్డ్
2) ప్రధానమంత్రి కృషి సించయ్ యోజన
3) విత్తన పథకం
4) (1), (2)
29. సుస్థిరాభివృద్ధి లక్ష్యం ప్రకారం 2030 నాటికి ప్రపంచ ‘మాతృ మరణాల రేటు’ను ప్రతి లక్ష జననాలకు ఎంత తగ్గించాలి?
1) 80 2) 70
3) 90 4) 100
30. ఆరోగ్యకర జీవనాన్ని అందించడానికి 2005 లో భారతదేశంలో ప్రారంభించిన పథకం ఏది?
1) జననీ సురక్ష యోజన
2) జాతీయ ఆయుష్ మిషన్
3) ఇంద్రధనుష్
4) జననీ శిశు సురక్ష యోజన
31. సుస్థిరాభివృద్ధి అనే భావన అమల్లోకి వచ్చిన సంవత్సరం
1) 1985 2) 1986
3) 1987 4) 1988
32. ‘జాతీయ ఆయుష్ మిషన్’ ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 2014 2) 2015
3) 2016 4) 2017
33. UNO సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నాల్గవ లక్ష్యం?
1) అందరికీ ఆరోగ్యం
2) అందరికీ సమ్మిళిత విద్యను అందించడం
3) వ్యవసాయ రంగ అభివృద్ధి
4) లింగ సమానత్వం
34. ‘Skill India’ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2015, జూలై 15
2) 2016, జూలై 15
3) 2017, జూలై 15
4) 2017, జనవరి 15
35. కింది వాటిలో సుస్థిరాభివృద్ధిని పెంపొందించని అభివృద్ధి కార్యక్రమం?
1) పునరుత్పత్తి చెందే ఇంధన వనరుల వినియోగం
2) వాటర్‌షెడ్ నిర్వహణ
3) సేంద్రీయ వ్యవసాయం
4) రసాయన ఎరువుల వినియోగం
36. సుస్థిరాభివృద్ధి అంటే ‘ఏ అభివృద్ధి అయినా ప్రస్తుత ప్రజల కనీస అవసరాలకు అనుగుణంగా వనరులను వివేకంగా వినియోగించుకుంటూ, అదే రేటులో వాటిని పునరుత్పత్తి చెందించడం ద్వారా భవిష్యత్ తరాల అవసరాలకు కూడా వాటిని మిగిల్చే విధంగా సాధించే అభివృద్ధి’ అని నిర్వచనం ఇచ్చింది?
1) బ్రంట్‌ల్యాండ్ కమిషన్
2) యు.ఎన్.ఓ
3) ప్రపంచ బ్యాంకు
4) ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు
37.భారత ప్రభుత్వం బాలికల సంరక్షణ, విద్య ను అందించేందుకు 2015, జనవరి 22న ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1) మహిళా సాధికారత మిషన్
2) బేటీ బచావో-బేటీ పఢావో
3) సబల 4) స్కిల్ ఇండియా
38. శీతోష్ణస్థితి మార్పులపై, సుస్థిరాభివృద్ధి సాధనకు భారత ప్రభుత్వం మొదటి కార్యాచరణ ప్రణాళికను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 2008, జూన్ 30
2) 2007, జూన్ 30
3) 2006, జూన్ 30
4) 2005, జూన్ 30
39. స్త్రీలలో నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం ప్రవేశపెట్టిన పథకం?
1) మహిళా సాధికారత 2) ఉజ్వల
3) ఇంద్రధనుష్ 4) సబల
40. ‘స్వచ్ఛ భారత్’ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టాడు?
1) 2013, అక్టోబర్ 2
2) 2014, అక్టోబర్ 2
3) 2015, అక్టోబర్ 2
4) 2016, అక్టోబర్ 2
41. 2009-10లో నీటి నిర్వహణకు భారత ప్రభుత్వం చేపట్టిన పథకం?
1) swachh water
2) swachh Bharat
3) Water Management Programme
4) Integrated Water Shed Man agement Programme
42. ఆధునిక శక్తి వనరులను అందించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన పథకాలు?
1) దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన
2) నేషనల్ సోలార్ మిషన్
3) రెన్యూవబుల్ ఎనర్జీ విజన్ 4) పైవన్నీ
43. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పథకాలు?
1) PMEGP
2) Mudra Bank
3) Micro & Small Enterprises clu ster Development programme
4) Make in India
44. ‘నేషనల్ మాన్యుఫ్యాక్చర్ పాలసీ’ ను ఎప్పుడు ప్రకటించారు?
1) 2012 2) 2011
3) 2010 4) 2009
45. తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం?
1) మేక్ ఇన్ ఇండియా
2) స్కిల్ ఇండియా
3) ముద్రా బ్యాంక్ 4) ఇంద్రధనుష్
46. భారతదేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సమన్వయం చేసే సంస్థ?
1) ప్రణాళికా సంఘం
2) నీతిఆయోగ్
3) అంతరాష్ట్ర మండలి
4) జాతీయాభివృద్ధి మండలి
47. దేశంలో ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి ‘రాష్ట్రీయ సమవికాస్ యోజన’ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 1999 2) 1998
3) 2001 4) 2002
48. పట్టణ జీవన విధానాన్ని మెరుగు పరచడానికి భారత ప్రభుత్వం చేపట్టిన పథకాలు?
1) అమృత 2) స్మార్ట్ సిటీస్
3) (1),(2) 4) ఏదీకాదు
49. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకాలు సమ్మిళిత సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగపడతాయి?
1) స్వచ్ఛ భారత్ మిషన్
2) NRDWP, ICDS
3) MGNREGS 4) పైవన్నీ
50. ప్రపంచంలో సంక్షేమాన్ని గణించడానికి ఎక్కువగా ఉపయోగించే కొలమానం?
1) control self-anchoring striv ing scale
2) ricter scale
3) foriegn heet scale
4) normal scale
విజేత కాంపిటీషన్స్ సౌజన్యంతో
సమాధానాలు
1.2 2.1 3.4 4.2 5.1 6.4 7.2 8.1 9.4 10.2 11.2 12.1 13.3 14.2 15.1 16.3 17.4 18.3 19.4 20.4 21.4 22.2 23.3 24.1
25.4 26.1 27.2 28.4 29.2 30.1 31.4 32.1 33.2 34.1 35.4 36.1 37.2 38.1 39.4 40.2 41.4 42.4 43.3 44.2 45.1 46.2 47.4 48.3 49.4 50.1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?