ఉత్పత్తి మదింపు పద్ధతికి మరోపేరు? ( పోటీ పరీక్షల ప్రత్యేకం)
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/06/iStock-587191498-f.jpg)
భారత ఆర్థికవ్యవస్థ (Indian Economy)
జాతీయాదాయం – మదింపు పద్ధతులు
– సమస్యలు – ప్రాధాన్యత
(National Income – Evalution Methods – Problems – Importance)
జాతీయదాయంలో వివిధ రంగాల వాటా (Contribution of National Income)
# ఒక దేశంలో నిర్ణీత కాలంలో సాధారణ నివాసితుల చేత/ఉత్పత్తి కారకాల చేత ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల మొత్తం మార్కెట్ విలువను ద్రవ్య రూపంలో తెలియజేయగా వచ్చేదాన్ని జాతీయాదాయం అంటారు.
#జాతీయాదాయాన్ని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతులను జాతీయాదాయ మదింపు పద్ధతులు అంటారు.
# ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఆదాయం, వ్యయం సమానంగా ఉంటాయి. కాబట్టి జాతీయాదాయాన్ని మూడు పద్ధతుల్లో గణిస్తారు. అవి..
1. ఉత్పత్తి మదింపు పద్ధతి
2. ఆదాయ మదింపు పద్ధతి
3. వ్యయాల మదింపు పద్ధతి
ఉత్పత్తి మదింపు పద్ధతి (Net Product Method)
# దీన్నే ఉత్పత్తి పద్ధతి (Product Method) అంటారు. అంతేగాక విలువ కూర్పు పద్ధతి (Value added Method), సమగ్ర జాబితా పద్ధతి (Inventory Method), వస్తు, సేవల పద్ధతి (Goods and Services Method), గణన పద్ధతి (Census Method), నికర ఉత్పత్తి పద్ధతి (Net output Method), పరిశ్రమ ఆధారిత పద్ధతి (Industrial Origin Method) అని కూడా పిలుస్తారు.
# ఉత్పత్తి మదింపు పద్ధతిని, ఉత్పత్తి సేవా పద్ధతి (Product Service Method) అని సైమన్ కుజునెట్స్ పేర్కొన్నారు.
# ఆర్థిక వ్యవస్థలో ఒక ఏడాది కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల ఉత్పత్తిని చేరిస్తే నికర ఉత్పత్తి వస్తుంది.
# ఈ పద్ధతిలో జాతీయాదాయాన్ని లెక్కించడానికి ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలుగా విభజించారు.
# ఈ పద్ధతిలో జాతీయాదాయాన్ని లెక్కించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ వస్తువు విలువను రెండుసార్లు లెక్కించగూడదు. మాధ్యమిక వస్తువు విలువను లెక్కల్లోకి తీసుకోకూడదు. అంతిమ వస్తుసేవల విలువలను మాత్రమే లెక్కల్లోకి తీసుకోవాలి.
N1 = P1Q1 + P2 Q2 …… PnQn + నికర విదేశీ ఆదాయం
l N1 = జాతీయాదాయం, P = ధర,
Q = పరిమాణం, n = వస్తు సేవలు
ఆదాయ మదింపు పద్ధతి (Income Method)
# ఆదాయ మదింపు పద్ధతిని ఉత్పత్తి కారకాల చెల్లింపు పద్ధతి (Factor payment method), వాటాల పంపిణీ పద్ధతి (Distributed share Method), పంపిణీ పద్ధతి (Distributed Method), ఆదాయ చెల్లింపు పద్ధతి (Income paid Method), ఆదాయం పొందే పద్ధతి (Income received Method) అని కూడా పిలుస్తారు.
# ఈ పద్ధతిలో జాతీయాదాయాన్ని పంపిణీ వైపు నుంచి లెక్కిస్తారు.
# ఒక ఏడాది కాలంలో దేశంలోని ప్రజలకు, సంస్థలకు, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని తెలుసుకుని కూడితే జాతీయాదాయం తెలుస్తుంది.
# ఒక ఏడాది కాలంలో వివిధ ఉత్పత్తి కారకాలకు లభించే ఆదాయాన్ని తెలుసుకుని కూడితే జాతీయాదాయం తెలుస్తుంది.
# N1 = R + W + 1 + P + (X-M) + (R-P)
# జాతీయాదాయం = బాటకం + వేతనం + వడ్డీ + లాభం + నికర ఎగుమతులు + నికర విదేశీ ఆదాయం.
# ఈ పద్ధతిలో జాతీయాదాయాన్ని లెక్కించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తుల, సంస్థల నికర ఆదాయాలను మాత్రమే తీసుకోవాలి.
వ్యయాల మదింపు పద్ధతి
(Expenditure Method)
# దీన్నే వినియోగం, పెట్టుబడి పద్ధతి (Cons umption and Investment Met hod), ఆదాయం పారవేయడం పద్ధతి (Income disposal Method) అంటారు.
# ఈ పద్ధతిలో జాతీయాదాయాన్ని వ్యయాల వైపు నుంచి లెక్కిస్తారు.
# ఒక ఏడాది కాలంలో అంతిమ వస్తుసేవలపై చేసే అంతిమ వ్యయం ద్వారా అంతిమ N…1 లెక్కిస్తారు.
# జాతీయాదాయాన్ని లెక్కించడంలో ఈ పద్ధతిని పాక్షికంగా ఉపయోగిస్తారు.
# అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ పద్ధతిని పాక్షికంగా ఉపయోగిస్తారు.
# అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.
# N1 = EH + EF + EG + నికర విదేశీ ఆదాయం
# N1 = జాతీయాదాయం, EH = గృహస్తుల వ్యయం, EF = సంస్థల వ్యయం, EG = ప్రభుత్వ వ్యయం
# జాతీయాదాయాన్ని లెక్కించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతిమ వస్తు సేవలపై చేసిన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. నికర విదేశీ పెట్టుబడిని పరిగణనలోకి తీసుకోవాలి. బాండ్లు, షేర్లు, బదిలీ చెల్లింపులపై చేసే వ్యయాన్ని లెక్కించరాదు.
# ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి, ఆదాయ, వ్యయాల మదింపు పద్ధతులను ఉపయోగిస్తున్నారు.
# జాతీయాదాయంలో ఎక్కువ భాగం వ్యవసాయ రంగం నుంచి వస్తుంది.
# జాతీయాదాయంలో ఎక్కువ భాగం ప్రైవేటు రంగం నుంచి వస్తుంది.
# ప్రపంచంలో అధిక జాతీయాదాయం నమోదవుతున్న దేశం అమెరికా.
# ప్రపంచంలో అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం తువాలు.
జాతీయాదాయం మదింపులో దేశంలో అనుసరించే పద్ధతులు
# స్వాతంత్య్రానికి ముందు దేశంలో జాతీయాదాయాన్ని గణించడానికి ప్రొఫెసర్ వీకేఆర్వీ రావు ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతిని ప్రవేశపెట్టాడు.
# దేశంలో కచ్చితమైన దత్తాంశాలు అందుబాటులో లేకపోవడంవల్ల ఏ ఒక్క పద్ధతిని ఉపయోగించి సరైన జాతీయాదాయాన్ని లెక్కించలేము. అందువల్ల మన దేశంలో జాతీయాదాయ గణనను మిశ్రమ పద్ధతిలో లెక్కిస్తున్నారు.
1. ఉత్పత్తి మదింపు పద్ధతి
ఎ. ప్రాథమిక రంగం
బి. తయారీ రంగం (రిజిస్టర్ అయినవి)
సి. నిర్మాణ రంగం (పట్టణ ప్రాంతం)
2. ఆదాయ మదింపు పద్ధతి
ఎ. తయారీ రంగం (రిజిస్టర్ కానివి)
బి. విద్యుత్, గ్యాస్, నీటి పారుదల
సి. తృతీయ రంగం
3. వ్యయ మదింపు పద్ధతి
ఎ. నిర్మాణ రంగం (గ్రామీణ ప్రాంతం)
# అంటే ప్రస్తుతం దేశంలో జాతీయాదాయ గణనలో మూడు పద్ధతులను ఉపయోగిస్తున్నారు.
# భారతదేశంలో NSO, Department of ministry of planning and progra mme implementation వారు జాతీయాదాయ అంచనాలను చేపడుతున్నారు.
వ్యయాల మదింపు పద్ధతి (Expenditure Method)
సేవలు: సేవల విలువలను ద్రవ్యరూపంలో లెక్కగట్టలేకపోతున్నాం.
ఉదా: ఒక వ్యక్తి తన కుటుంబానికి చేసిన సేవలను ద్రవ్యరూపంలో విలువ కట్టలేకపోతున్నాం. కాబట్టి ఈ సేవలను ఏ విధంగానూ జాతీయాదాయంలో చేర్చలేక పోతున్నాం.
సొంత వినియోగం: సొంత వినియోగానికి ఉపయోగించిన ఉత్పత్తిని జాతీయాదాయంలోకి తీసుకోలేకపోతున్నాం.
ఉదా: ఒక వ్యవసాయదారుడు తాను ఉత్పత్తి చేసిన మొత్తం ఉత్పత్తిలో కొంత సొంత వినియోగానికి ఉపయోగిస్తే దాన్ని జాతీయాదాయంలో కలుపలేకపోతున్నాం.
వస్తు మార్పిడి పద్ధతి: వెనుకబడిన దేశాల్లో వస్తుమార్పిడి పద్ధతి అమల్లో ఉంటుంది. అలాంటి ఆర్థిక వ్యవస్థలో కచ్చితమైన జాతీయాదాయాన్ని లెక్కించలేకపోతున్నాం.
మాధ్యమిక వస్తువులు: జాతీయాదాయ లెక్కింపులో అంతిమ వస్తువులనే తీసుకుంటారు. మధ్యంతర వస్తువులను తీసుకోరు. అయితే ఏది అంతిమ వస్తువో, ఏది మధ్యంతర వస్తువో తెలుసుకోవడం కష్టం.
ఉదా: బొగ్గు
# బొగ్గును వంటకు వాడితే అంతిమ వస్తువు.
# కరెంట్ ఉత్పత్తికి వాడితే మాధ్యమిక వస్తువు.
గణాంక సమాచారం లేకపోవడం: వెనుకబడిన దేశాల్లో సరైన గణాంక సమాచారం లభించదు.
ఉదా: ఈ దేశాల్లో వ్యవసాయదారులు ఎక్కువ మంది నిరక్షరాస్యులు. వీరు వ్యవసాయ ఉత్పత్తి, వ్యయం, ఆదాయ వివరాలను తయారు చేయరు.
ప్రభుత్వ పాలన: ప్రభుత్వం అందించే సేవలు, పాలనా వ్యయంలో ఎంతమేర జాతీయోత్పత్తికి దోహదపడునో కచ్చితంగా చెప్పలేం.
ఉదా: శాంతిభద్రతలు, పార్కులపై చేసే వ్యయం
ఆధార సంవత్సరాల్లో లేని ఉత్పత్తి: ఆధార సంవత్సరంలో లేకుండా తర్వాత కాలంలో నూతన వస్తువుల ఉత్పత్తి జరిగితే వాటిని స్థిర ధరల్లో లెక్కించేటప్పుడు సమస్యలు ఎదురవుతాయి.
తరుగుదల అంచనా: తరుగుదల విలువను యంత్రం ఒరిజినల్ ధరపై అంచనా వేయాలా లేదంటే రీప్లేస్మెంట్ కాస్ట్ ఆధారంగా గణించాలా అనేది మరో సమస్య.
ఆదాయ మదింపు సమస్యలు: పన్ను భారం నుంచి తప్పించుకునేందుకు తప్పుడు లెక్కలు చూపుతున్నారు.
వ్యయ మదింపు సమస్యలు: ఒక వ్యక్తి అనేక వస్తు, సేవలపై ఖర్చు చేస్తాడు. మంచి అలవాట్లపై చేసిన ఖర్చు లెక్కల్లో చూపిస్తాడుగానీ, చెడు అలవాట్లపై చేసిన ఖర్చును చూపించడు.
జాతీయాదాయ మదింపు – ప్రాధాన్యత
# జాతీయాదాయ అంచనాలు ఆర్థిక పురోభివృద్ధికి సూచికగా పనిచేస్తాయి.
# జాతీయాదాయం ఆర్థిక విధాన రూపకల్పనకు ఉపయోగపడుతుంది.
# జాతీయాదాయ లెక్కలు బడ్జెట్ తయారీ, కేటాయింపులకు ఉపయోగపడుతాయి.
# జాతీయాదాయ లెక్కలు తలసరి ఆదాయం లెక్కించడానికి ఉపయోగపడుతాయి.
# ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల పనితీరు తెలుసుకోవడానికి ఉపయోగపడుతాయి.
# ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల పనితీరు తెలుసుకోవడానికి ఉపయోగపడుతాయి.
# జాతీయాదాయ లెక్కల్లో ప్రభుత్వ-ప్రైవేటు రంగాల పాత్రను తెలుసుకోవచ్చు.
# జాతీయాదాయ లెక్కలవల్ల వివిధ వర్గాల మధ్య ఆదాయ పంపిణీ తెలుస్తుంది.
# జాతీయాదాయ మదింపు వల్ల ప్రజల కొనుగోలు శక్తి, ప్రజల జీవన ప్రమాణస్థాయి తెలుస్తుంది.
# జాతీయాదాయ మదింపు వ్యాపార సంస్థలు, తమ ఉత్పత్తి, మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకునేందుకు దోహదపడుతాయి.
భారత జాతీయాదాయంలో వివిధ రంగాల వాటా
# రంగాల వారిగా జాతీయాదాయ అధ్యయనం అనేది ఆర్థికవ్యవస్థ స్వరూప స్వభావాన్ని తెలియజేస్తుంది.
# జాతీయాదాయ ధోరణులు ఎలాంటి ప్రాధాన్యం కలిగి ఉన్నాయో, జాతీయాదాయ వివిధ రంగాల వాటా విశ్లేషణ కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంది.
# ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగాలుగా గానీ, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగాగానీ విభజించవచ్చు.
# ఒక దేశం వెనుకబడి ఉన్నప్పుడు జాతీయాదాయంలో (GDPలో) వ్యవసాయరంగం వాటా అధికంగా ఉండి, పారిశ్రామిక, సేవారంగాల వాటాలు తక్కువగా ఉంటాయి.
జాతీయాదాయంలో (GDP) వివిధ రంగాల వాటాలు శాతాల్లో..
రంగం – 1950-51 2020-21
వ్యవసాయ – 53.1 20.19
పారిశ్రామిక – 16.6 25.92
సేవారంగం – 30.3 53.89
# ఒక దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు జాతీయాదాయంలో వ్యవసాయరంగం వాటా తగ్గుతూ పారిశ్రామిక, సేవారంగాల వాటాలు పెరుగుతూ ఉంటాయి.
# ఒక దేశం అభివృద్ధి చెందినప్పుడు జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా తగ్గి సేవారంగం వాటా అధికంగా ఉంటుంది.
# 1950-51 సంవత్సరంలో జాతీయాదాయంలో వ్యవసాయరంగం వాటా సగానికంటే ఎక్కువగా ఉండేది. అంటే మొదటి స్థానంలో ఉండేది. రెండో స్థానం సేవారంగం, చివరి స్థానంలో పారిశ్రామిక రంగం ఉండేది. అంటే ఆనాడు మన దేశ ఆర్థికవ్యవస్థ వెనుకబాటుతనంలో ఉందని చెప్పవచ్చు.
# క్రమక్రమంగా జాతీయాదాయంలో వ్యవసాయరంగం వాటా తగ్గుతూ పారిశ్రామిక, సేవారంగం వాటాలు పెరుగుతూ వచ్చాయి.
సేవారంగం—– పారిశ్రామిక రంగం—— వ్యవసాయ రంగం
# 2021-22 సంవత్సరంలో జాతీయాదాయంలో సేవారంగం వాటా సగానికంటే ఎక్కువగా ఉంది. తర్వాత పారిశ్రామిక రంగం ఉండి, చివరిస్థానంలో వ్యవసాయ రంగం ఉంది. అంటే జాతీయాదాయంలో వివిధ రంగాల వాటా అవరోహణా క్రమంలో ఉంది.
# ప్రస్తుతం జాతీయాదాయంలో అధిక వాటాగల రంగం – సేవారంగం (54 శాతం)
# ప్రస్తుతం జాతీయాదాయంలో తక్కువ వాటాగల రంగం
– వ్యవసాయం (20 శాతం)
మాదిరి ప్రశ్నలు
1. జాతీయాదాయాన్ని ఎన్ని పద్ధతుల ద్వారా లెక్కిస్తారు? (సి)
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
2. ఉత్పత్తి మదింపు పద్ధతికి మరోపేరు? (డి)
ఎ) విలువ కూర్పు పద్ధతి
బి) వస్తుసేవల పద్ధతి
సి) నికర ఉత్పత్తి పద్ధతి డి) పైవన్నీ
3. జాతీయాదాయాన్ని పంపిణీ వైపు నుంచి లెక్కించే పద్ధతి ఏది? (బి)
ఎ) ఉత్పత్తి మదింపు పద్ధతి
బి) ఆదాయ మదింపు పద్ధతి
సి) వ్యయాల మదింపు పద్ధతి డి) పైవన్నీ
4. జాతీయాదాయంలో ఎక్కువ భాగం ఏ రంగం నుంచి వస్తుంది? (బి)
ఎ) ప్రభుత్వ రంగం బి) ప్రైవేటు రంగం
సి) మిశ్రమ రంగం డి) పైవన్నీ
పానుగంటి కేశవ రెడ్డి
లెక్చరర్
గోదావరిఖని
పెద్దపల్లి జిల్లా
9949562008
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?