జాతీయం 08-06-2022
డ్రోన్ పోస్టల్
దేశంలోనే తొలిసారిగా గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో పోస్టల్ శాఖ మే 29న డ్రోన్‌ను ఉపయోగించి పోస్టల్ డెలివరీ చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ ప్రయోగంలో 46 కి.మీ. దూరాన్ని 25 నిమిషాల్లో డ్రోన్ చేరుకున్నది. భుజ్ తాలూకాలోని హాబే గ్రామం నుంచి భచావూ తాలూకాలోని నేర్ గ్రామానికి ఈ పోస్ట్ ను పంపారు.
అస్త్ర ఎంకే-1
అస్త్ర ఎంకే-1 క్షిపణుల కొనుగోళ్లపై రక్షణ మంత్రిత్వ శాఖ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)తో మే 31న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.2,971 కోట్లు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బీడీఎల్ డైరెక్టర్ (ప్రొడక్ట్) పీ రాధాకృష్ణ, కేంద్ర రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ సింగ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇవి బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు. అస్త్ర ఆధునిక గైడెన్స్, నావిగేషన్ టెక్నిక్‌లతో 100 కి.మీ. పరిధిని కలిగి ఉంది.
మహా అధివేషన్
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆలిండియా ఆయుర్వేద మహా సమ్మేళనం 59వ మహా అధివేషన్ను జూన్ 1న ప్రారంభించారు. ‘ఆయుర్వేద డైట్-ది ఫౌండేషన్ ఆఫ్ ఏ హెల్తీ ఇండియా’ అనే అంశంపై దీనిని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నిర్వహిం చారు. 2014లో ప్రత్యేక ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు.
భారత్-ఇజ్రాయెల్
భారత్, ఇజ్రాయెల్‌లు దీర్ఘకాలిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి జూన్ 2న ‘విజన్ స్టేట్మెంట్’పై సంతకం చేశాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇజ్రాయెల్ కౌంటర్ పార్ట్ బెన్నీ గాంట్జ్ సంతకాలు చేశారు. ఇరుదేశాల మధ్య 30 సంవత్సరాల స్నేహసంబంధాలకు గుర్తుగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?