క్రీడలు 08-06-2022
ఐపీఎల్-2022
15వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. మే 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ప్రైజ్‌మనీ విజేత జట్టుకు రూ.20 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ.13 కోట్లు. ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) రూ.15 లక్షలు (బట్లర్, 863), పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) రూ.15 లక్షలు (చాహల్, 27). ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన ఏడో జట్టు గుజరాత్. రాజస్థాన్ రాయల్స్ (2008), దక్కన్ చార్జర్స్ (2009), చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011, 2018, 2021), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2016), ముంబై ఇండియన్స్ (2013, 2015, 2017, 2019, 2020) విజేతలుగా నిలిచాయి.
డారెన్ సమీ
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డారెన్ సమీకి ‘సితారా-ఐ-పాకిస్థాన్’ అవార్డును మే 30న అందజేశారు. ఇది పాకిస్థాన్ ప్రదానం చేసే మూడో అత్యున్నత పౌర పురస్కారం. పాకిస్థాన్ క్రికెట్‌కు సేవలందించినందుకు సమీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. సమీ 2020లో అత్యున్నత పాకిస్థాన్ పౌర పురస్కారం ‘నిషాన్-ఎ-పాకిస్థాన్’ అందుకున్నాడు.
ఆసియా కప్ హాకీ
పురుషుల హాకీ కప్-2022 టోర్నీలో దక్షిణ కొరియా విజేతగా నిలిచింది. జూన్ 1న జకర్తాలోని జీబీకే స్పోర్ట్ ఎరెనాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణ కొరియా మలేషియాను ఓడించి స్వర్ణం సాధించింది. భారత్ జపాన్ను ఓడించి కాంస్య పతకం గెలుచుకుంది. దక్షిణ కొరియా జట్టు ఆసియా కప్‌ను గెలవడం ఇది ఐదోసారి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?